ఆకెళ్ళ నాటక పోటీ ఫలితాలు

Results of Akella Nataka pOTi 2022

ఆకెళ్ళ నాటక పోటీ ఫలితాలు

'ఆకెళ్ళ నాటిక  రచనాపోటీల' ఫలితాలు

'విశ్వశాంతి కల్చరల్ అసోసియేషన్'  హైదరాబాద్ వారు  ప్రముఖ సినీ, నాటక రచయిత శ్రీ ఆకెళ్ళ గారి పేరుమీద  'ఆకెళ్ళ నాటిక రచనాపోటీల' కు రచనలు పంపవలసిందిగా ఉభయ తెలుగు రాష్ట్రాల రచయితలకు ఆహ్వానం పలికారు.

ఈ సంవత్సరం మే నెలలో రవీంద్రభారతిలో జరిగిన "ఆకెళ్ళ 25 నాటికలు" పుస్తకావిష్కరణ సభలో, శ్రీ K.V. రమణాచారి, Retd. ఐ.ఏ.ఎస్. వారి ప్రకటనననుసరించి ఈ పోటీలు నిర్వహించబడ్డాయి.

ఇరు తెలుగు రాష్ట్రాలనుండి ఎంతో ఉత్సాహంగా రచయితలు ఈ పోటీలో పాల్గొన్నారు.

మొత్తం 78 నాటికలు ఈ పోటీకి అందాయి.

శ్రీ K.V. రమణాచారి, Retd. ఐ.ఏ.ఎస్. వారి గౌరవ పర్యవేక్షణలో ఈ నాటికలు పరిశీలించబడ్డాయి.

న్యాయ నిర్ణేతల కమిటీ సభ్యులు,  అందిన ఈ నాటికలన్నీ పరిశీలించి, వాటిలోంచి ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలకు అర్హత కలిగిన మూడు నాటికలతో పాటు, కన్సోలేషన్ బహుమతులు ఇవ్వడానికి మరో మూడు నాటికలను ఎంపిక చేశారు.

బహుమతులు పొందిన నాటికల వివరాలు:

ప్రథమ బహుమతి:  (రూ. 50,000) "గ్రహణం" -- రచన: శ్రీ సింహప్రసాద్.

ద్వితీయ బహుమతి: (రూ. 30,000) "వెండి అంచులు" -- రచన: శ్రీ వల్లూరు శివప్రసాద్

తృతీయ బహుమతి:  (రూ. 20,000) "మరణ వార్త" -- రచన: శ్రీ పెద్దింటి అశోక్ కుమార్

కన్సొలేషన్ బహుమతులు పొందిన నాటికలు

(ఒక్కొక్క నాటికకు రూ. 5000 చొప్పున)

1) "ఆలితో అగచాట్లు" -- రచన: శ్రీ అద్దేపల్లి భరత్ కుమార్

2) "సర్వేజనా...." -- రచన: శ్రీ G. అనంతశయనం

3) "మలి సంధ్య" -- రచన: శ్రీ గోవిందరాజుల నాగేశ్వరరావు