మొండెపు ప్రసాద్

కళారత్న పురస్కారం పొందిన రచయిత

తెలుగు సాహితీ ప్రపంచంలో ఆధ్యాత్మిక, నైతిక, మరియు వ్యక్తిత్వ వికాస రచనలకు విశేష ప్రాచుర్యం తెచ్చిన ప్రముఖ సాహితీవేత్త, కథకుడు మొండెపు ప్రసాద్. ప్రాచీన భారతీయ గ్రంథాలలోని సారాన్ని నేటి తరానికి అర్థమయ్యేలా సులభమైన, ఆకర్షణీయమైన శైలిలో అందించడంలో ఆయన ప్రత్యేక గుర్తింపును పొందారు.

ప్రతిష్టాత్మక అవార్డులు:
(1) మొండెపు ప్రసాద్ గారు 3 సార్లు రాష్ట్రప్రభుత్వ అవార్డులు పొందారు
సాహిత్యం రంగంలో విశిష్టమైన కృషి చేసినందుకు మొండెపు ప్రసాద్ ను అభినందిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, రాష్ట్ర సృజనాత్మకత మరియు సంస్కృతి సమితి, భాషా సాంస్కృతిక శాఖ శ్రీ విశ్వావసు నామ సంవత్సర కళారత్న(హంస) పురస్కారం -2025 బహూకరించారు.
సాహిత్యం రంగంలో విశిష్టమైన కృషి చేసినందుకు మొండెపు ప్రసాద్ ను అభినందిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, భాషా సాంస్కృతిక శాఖ శ్రీ మన్మధనామ సంవత్సర ఉగాది పురస్కారం -2015 బహూకరించారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్పృజనాత్మకత మరియు సంస్కృతి సమితి, అమరజీవి పొట్టి శ్రీరాములు స్మారక భవన నిర్వహణ కమిటీ, చెన్నై “అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం” 21/2/2019 నాడు తెలుగు భాషకు చేసిన సేవకు గుర్తింపుగా మొండెపు ప్రసాద్ కు పురస్కారం అందజేశారు.
(2) తెలుగు కథకు అత్యంత ప్రతిష్టాత్మకమైన - స్వాతి అనిల్ అవార్డు – రెండుసార్లు పొందారు
“అమ్మాయి పెళ్లి” కథకు 2011 అనిల్ అవార్డ్ పొందారు.
“సోషల్ మీడియా ఫాలోయింగ్ –మోనోపొలి ఆటలో డబ్బు” కథకు 2021 అనిల్ అవార్డ్ పొందారు.
(3) గంధం నాగసుబ్రహ్మణ్యం (సమాచారం, తొలి తెలుగు స్థానిక దినపత్రిక) స్మారక అవార్డు – రాజమహేంద్రవరంలో సెప్టెంబరు 15, 2024 నాడు పొందారు
అనేక కథల పోటీలలో బహుమతులు పొందారు.

లిటరరీ ఇంటర్వ్యూలు
(1) మొండెపు ప్రసాద్ గారి రచనలలోని సామాజిక కోణాన్ని గుర్తించిన దూరదర్శన్ సప్తగిరి కేంద్రం వారు (5 అక్టోబర్ 2014) “సాహిత్యంలో సామాజిక విలువలు” అనే 30 నిముషాల కార్యక్రమంలో మొండెపు ప్రసాద్ తో పరిచయం ప్రశారం చేసారు.
(2) “వేమన చెప్పిన సక్సెస్ మంత్ర” రచనపై దూరదర్శన్ సప్తగిరి కేంద్రం వారు (10 ఫిబ్రవరి 2015 మరియు 15 ఫిబ్రవరి 2015) “వేమన చెప్పిన వేదం” అనే 30 నిముషాల కార్యక్రమంలో మొండెపు ప్రసాద్ తో పరిచయం ప్రశారం చేసారు.
(3) మొండెపు ప్రసాద్ గారి లిటరరీ ఇంటర్వ్యూలు ఆంధ్రజ్యోతి డైలీ, నవ్య వీక్లీ, సహరి వీక్లీ, ఉషా వీక్లీలలో కూడా ప్రచురించబడ్డాయి.

మరికొన్ని విశేషాలు
(1) మొండెపు ప్రసాద్ రచించిన “అత్యాచారాల పై అక్షర పోరాటం” నవలను ఆకాశవాణి విజయవాడ కేంద్రం వారు (23 డిసెంబర్ 2013 నుండి 13 జనవరి 2014 వరకు) డైలీ సీరియల్ గా ప్రశారం చేసారు.
(2) తెలుగులో నవలా సాహిత్యం మొదలైననాటి నుండి నేటి వరకూ వచ్చిన నవలల నుండి 50 అద్భుతమైన స్త్రీ పాత్రలను ఎంచుకొని డాక్టర్ ముక్తేవి భారతి గారు రాసిన “ఆ పాత్ర మధురం” సంకలనంలో మొండెపు ప్రసాద్ రాసిన “ఎనిమిదో అడుగు” నవలలోని “సుమతి” పాత్ర కూడా ఉండటం ఆ నవల ప్రత్యేకతను తెలియజేస్తోంది.

పరిశోధనాత్మక రచనలు:
మొండెపు ప్రసాద్ సామాజిక వాస్తవికత ఆధారంగా, సామాజిక ప్రయోజనమే ధ్యేయంగా రచనలు చేస్తారు. ఆయన రచనలు ఆంధ్రభూమి సచిత్ర వార పత్రిక, ఆంధ్రభూమి మాస పత్రిక, ఈనాడు ఆదివారం అనుబంధం, విపుల, నవ్య, జాగృతి, స్వాతి వార పత్రిక, స్వాతి మాస పత్రిక, ఆంధ్రప్రదేశ్ పత్రిక, ఆంధ్రప్రభ ఆదివారం అనుబంధం, సహరి వారపత్రిక, ఉషా పక్ష పత్రిక వంటి ప్రముఖ పత్రికలలో ప్రచురించబడ్డాయి.
రాయడానికి ఏ సబ్జెక్టు తీసుకున్నా దాని గురించి కూలంకషంగా పరిశోధన చేసి, విశ్లేషించి రాయడం ఆయన ప్రత్యేకత. “యువతకు భగవద్గీత చూపించిన దారి” “అవినీతి తంత్రం” “ఉద్యోగపర్వం నుండి సంభాషించే కళ” “సుందరకాండ – విజయసూత్రాలు” “మహాత్ముని ఆత్మకథ నుండి కొన్ని జీవిత పాఠాలు”, “అత్యాచారాలపై అక్షరపోరాటం”, “శతకాలలో స్త్రీల పట్ల వివక్ష” “వేమన చెప్పిన సక్సెస్ మంత్ర” “చరాచరాలు చెబుతున్నాయి” వంటి రచనలు ఆయన పరిశోధన మరియు విశ్లేషణ నైపుణ్యాలకు మచ్చుతునకలు.

యువత కోసం:
ఉపనిషత్తులు, రామాయణం, మహాభారతం వంటి మన భారతీయ ప్రాచీన సాహిత్యం మానవుల సమగ్ర వికాసానికి ఎంతగానో తోడ్పడ్డాయి. ఆకోణంలో విశ్లేషిస్తే మన ప్రాచీన భారతీయ సాహిత్యంలో ఎన్నో గొప్ప వ్యక్తిత్వవికాస సూత్రాలు, విజయసూత్రాలు ఇమిడి ఉన్నాయి. వాటిని యువతకు అందించాలనే అభిప్రాయంతో “యువతకు భగవద్గీత చూపించిన దారి” “ఉద్యోగపర్వం నుండి సంభాషించే కళ” “సుందరకాండ – విజయసూత్రాలు” “వేమన చెప్పిన సక్సెస్ మంత్ర” వంటి రచనలు చేశారు.
మొందేపు ప్రసాద్ గారు తెలుగు సాహిత్యంలో నైతిక, ఆధ్యాత్మిక మరియు సాంస్కృతిక నేపథ్యాల ఆధారంగా కథలను ఎంచుకోవడంలో కథా రచయితగా ఎంతో ప్రసిద్ధి చెందారు. ప్రాచీన విజ్ఞానాన్ని ఆధునిక సామాజిక విలువలతో ముడిపెట్టడం ఆయన ఎంచుకునే ఇతివృత్తాల (themes) యొక్క ప్రత్యేకత.

ఇతివృత్తాల ముఖ్యమైన బలాలు:
• ఆధ్యాత్మిక మరియు నైతిక చైతన్యం: ప్రసాద్ గారు భాగవతం వంటి పురాణ గ్రంథాల నుండి సుభాషితాలను (మంచి మాటలను) సేకరించి, వాటి ద్వారా లోతైన నైతిక, ఆధ్యాత్మిక సత్యాలను వివరిస్తారు.
• సామాజిక స్పృహ: ఆయన కేవలం గత కాలపు విశేషాలకే పరిమితం కాకుండా, సమకాలీన సామాజిక సమస్యలను ప్రస్తావిస్తూ, సాంస్కృతిక గుర్తింపును పెంపొందించేందుకు మరియు న్యాయం కోసం జరిగే పోరాటాలను అద్భుతంగా చిత్రీకరిస్తారు.
• విద్యా మరియు ఆచరణాత్మక మార్గదర్శకత్వం: విద్యార్థులు మరియు సాధారణ పాఠకులు తమ పరీక్షల్లో, నిత్య జీవితంలో ఎదురయ్యే సవాళ్లను అధిగమించడానికి ఉపయోగపడే వ్యక్తిత్వ వికాస రచనలను కూడా ఆయన అందించారు.
ఆయన ఎంచుకునే ఇతివృత్తాలకు అంతటి గుర్తింపు రావడానికి కారణాలు:
• సరళత మరియు సాన్నిహిత్యం: కఠినమైన తత్వశాస్త్ర భావనలను సైతం సామాన్యుడికి అర్థమయ్యేలా, దైనందిన జీవితానికి అన్వయించుకునేలా ఆయన సులభ శైలిలో రాస్తారు.
• సాంస్కృతిక పునాది: నేటి వేగవంతమైన ఆధునిక ప్రపంచంలో జీవిస్తున్న పాఠకులు మన సాంప్రదాయ భారతీయ విలువలను, నైతికతను మర్చిపోకుండా ఉండేందుకు ఆయన రచనలు ఒక వారధిలా ఉపయోగపడతాయి
మొండెపు ప్రసాద్ గారు వివిధ సాహిత్య వేదికలపై జరిగే సభలలో పాల్గొని, సమాజానికి ఉత్తమ సాహిత్యం అవసరాన్ని నొక్కి చెబుతుంటారు
📖 0 రచనలు
📚 0 పుస్తకాలు
✍️ 7 ఇతర రచనలు
👥 0 Followers

గౌరవ పురస్కారాలు & విజయాలు

Achievement కళారత్న పురస్కారం (సాహిత్యంలో) 2025
Achievement అనిల్ అవార్డ్ 2021
Achievement మాతృభాషాదినోత్సవ పూరస్కారం 2019
Achievement ఉగాది పూరస్కారం (సాహిత్యంలో) 2015
Achievement అనిల్ అవార్డ్ 2011

సహరి రచనలు

నా పుస్తకాలు

ఇతర రచనలు

ఆప్తవాక్యం

సహరి • 10 Mar 2023

మానవ సంబంధాలలో దయ, జాలి, కృతజ్నత, ఇతరులకు సహాయం చేయడం వంటి గొప్ప మానవీయ విలువల అవసరాన్ని మనసుకు హత్తుకునే విధంగా వివరించిన రచన

చదవండి →

యువతకు భగవద్గీత చూపించిన దారి

సహరి • 09 Apr 2021

గీతాసారాన్ని ఆధునిక యువతకు అనుగుణంగా, సులభమైన భాషలో అందించిన అత్యధికంగా అమ్ముడుపోయిన పుస్తకం

చదవండి →

చరాచరాలు చెబుతున్నాయి

స్వాతి వార పత్రిక • 30 Oct 2015

జంతువులు మరియు పక్షుల స్వాభావిక ప్రవర్తనల నుండి ఏకాగ్రత, ఉత్సాహం, క్రమశిక్షణ, సాహసం, పట్టుదల, నాయకత్వ లక్షణాలు, విజయసూత్రాలను నేర్చుకోవచ్చని తెలియజేస్తూ రాసిన పుస్తకం

చదవండి →

ఉద్యోగపర్వము – సంభాషించేకళ

స్వాతి వార పత్రిక • 25 Dec 2020

మహాభారతంలోని ఉద్యోగపర్వంలోని రాయభార ఘట్టాలను ఆధునిక మేనేజ్‌మెంట్ సూత్రాలకు, కమ్యూనికేషన్ స్కిల్స్‌కు ముడిపెడుతూ రాసిన రచన

చదవండి →

వేమన చెప్పిన సక్సెస్ మంత్ర

స్వాతి వార పత్రిక • 19 Dec 2014

వేమన శతకంలోని పద్యాలను వ్యక్తిత్వ వికాస కోణంలో విశ్లేషించిన పుస్తకం

చదవండి →

సుందరకాండ – విజయసూత్రాలు

స్వాతి వార పత్రిక • 06 Sep 2019

రామాయణంలోని సుందరకాండ ఘట్టాలను స్ఫూర్తిదాయకంగా మలిచిన పుస్తకం

చదవండి →

భాగవతం నుండి సుభాషితాలు

స్వాతి మాస పత్రిక • 01 Jun 2025

భాగవతంలోని సుభాషితాలను, వాటిలోని నైతిక విలువలను సరళమైన శైలిలో వివరించిన పుస్తకం.

చదవండి →