శైలజ మల్లిక్

స్టోరీ writer

నేను పుట్టి పెరిగింది నెల్లూరులో. నెల్లూరు లో V. R . College లో డిగ్రీ పూర్తి చేసాను. ఆ తరువాత ఆంధ్ర యూనివర్సిటీ లో M. A. ( English Literature) చదివాను . దక్షిణ భారత్ హిందీ ప్రచారం సభ నుంచి ప్రవీణ వరకు చదివాను. అలాగే ఇంగ్లీష్ లో టైపు హై స్పీడ్, షార్ట్ హ్యాండ్ పాస్ అయ్యాను.

నా భర్త పేరు మనోజ్ మల్లిక్. ఆయన వంగ దేశీయుడు ( బెంగాలి). విశాఖపట్నంలో పలు చోట్ల ఉద్యోగం చేసాక, 15 సంవత్సరాలు శివ శివాని పబ్లిక్ స్కూల్ లో టీచర్ గా పనిచేసాను. 2019 లో విరమణ చేసాను.

నాకు ఇద్దరు సంతానం. మా అమ్మాయికి వివాహమైంది. తనకు ఇద్దరు పిల్లలు. అబ్బాయికి వివాహం కాలేదు. అబ్బాయి ఉద్యోగం హైదరాబాద్ లో. ప్రస్తుతం నా నివాసం హైదరాబాదులోనే.

చిన్నప్పటి నుంచీ పుస్తకాలు చదవటం నా హాబీ. స్కూల్ లో, కాలేజీ లో వ్యాస రచన పోటీలలో, వక్త్రుత్వపు పోటీలలో పాల్గొని బహుమతులు పొందాను.

2021 లో కరోనా బారిన పడి మా వారు మృతి చెందారు. విపరీతమైన ఒంటరితనంతో బాధపడుతున్నపుడు, నా స్నేహితురాలు పల్లావఝ్ఝల భారతి నన్ను ప్రతిలిపికి పరిచయం చేసింది. అలా చిన్న కథలతో మొదలైన నా ప్రయాణం సిరీస్ రాయడానికి ప్రేరేపించింది. ప్రతిలిపి సూపర్ రైటర్ సీజన్ 8 లో ప్రథమ బహుమతి పొందిన అయిదు రచనలలో నా రచన " నాతి చరామి" కి ఐదవది గా నిలిచింది. ఇప్పటిదాకా దాదాపు ఏడు సీరియల్స్, రెండు పెద్ద కథలు వ్రాసాను. అవి కాక మరో డజను కథల వరకూ రాసాను. అలాగే కొన్ని కవితలు తపస్వి మనోహరం ఇ-బుక్ లో, కొన్ని తపస్వి మాస పత్రికలో ప్రచురింపబడ్డాయి.

నాకు గురుతుల్యులైనటువంటి శ్రీమతి అవధానుల విజయలక్ష్మి గారి సారథ్యంలో కలగూర గంప అనే అచ్చ తెలుగు కథా సంకలనంలో నా కథ "కాపాడండీ" ప్రచురింపబడింది. వారి సారథ్యం లోనే, "కాదేది కవితకి అనర్హం" అనే సంకలనం లో నా కవితలు ప్రచురింపబడ్డాయి.
📖 0 రచనలు
📚 0 పుస్తకాలు
✍️ 0 ఇతర రచనలు
👥 0 Followers

సహరి రచనలు

నా పుస్తకాలు

ఇతర రచనలు

ఇంకా ఇతర రచనలు జోడించాలి

📚

Follow This Author

రచయితలను Follow చేయడానికి Login లేదా Free Registration అవసరం.

🎁 ప్రత్యేక స్వాగత బహుమతి

మీరు సహరిలో మొదటిసారి ఏ రచయితనైనా అనుసరిస్తే

✅ 7 రోజుల ప్రీమియం యాక్సెస్
📖 సహరి వారపత్రిక అన్ని సంచికలు
📘 సహరి మాసపత్రిక అన్ని సంచికలు
👧 బాలసహరి అన్ని సంచికలు

💳 కార్డు వివరాలు అవసరం లేదు
🆓 ఉచిత సభ్యత్వ నమోదు సరిపోతుంది
Login Register Free