డాక్టర్ ఎం సుగుణరావు

Writer

డాక్టర్ ఎమ్ సుగుణ రావు.
పరిచయం:
చదువు.. వెటర్నరీ సైన్స్ లో మాస్టర్స్ డిగ్రీ ‌
ఉద్యోగం.‌భారత ప్రభుత్వరంగ బీమా సంస్థలో స్కేల్ 4 అధికారిగా పదవీ విరమణ.
రాసిన మూడు వందల యాభై కథల్లో నూట యాభై కథలకు బహుమతులు వచ్చాయి . అన్వీక్షికి ఉగాది నవలల పోటీ లో ఫైనల్ డయాగ్నోసిస్అనే నవలకు ప్రోత్సాహక బహుమతి, స్వాతి వీక్లీ నవలల పోటీ లో గతంలో మరుగేలరా అనే నవలకు ,ఈ మధ్య నే ఏడు గుర్రాల సూర్యుడు అనే నవలకు లక్ష రూపాయల బహుమతి లభించింది.
ఆకాశం లో ఒక నక్షత్రం కథ ఇంగ్లీష్ నాటకం గా మలచబడి టాటా లిట్ ఫెస్ట్ సుల్తాన్ పదాంశీ అంతర్జాతీయ నాటక పోటీలలో ద్వితీయ బహుమతి పొందిన ది...ఈ మధ్యనే తానా బాలల నవలల పోటీ లో 'ఆలీబాబా ఐదుగురు స్నేహితులు ' నవలకు బహుమతి వచ్చింది ..
పాంచజన్యం, నిజం అనే నవలలుస్వాతి అనుబంధ నవలలు గా వస్తే...
త్రివేణి నవల మొదట ప్రియదత్త వారపత్రిక లో తర్వాత సహరి అంతర్జాల పత్రిక లో పునః ప్రచురణ ‌
విశ్వ శాంతి నికేతన్ నవల సాహో మాసపత్రిక లో తిరిగి సహరి అంతర్జాల పత్రిక లో పునఃప్రచురణ
జాబిలి మీద సంతకం, నేలకు దిగిన నక్షత్రం,
ఆకాశం లో ఒక నక్షత్రం, సుగుణ కథాభిరామ డాక్టర్ ఎమ్ సుగుణ రావు బహుమతి కథలు అనే నాలుగు కథా సంపుటాలు వెలువడ్డాయి.కథలపై ఆంధ్ర యూనివర్సిటీ లో ఇద్దరు విద్యార్థులు పిహెచ్ డి, ఇద్దరు విద్యార్థులు ఎంఫిల్ సాధించారు..
దండెం రాజు ఫౌండేషన్ కథా మయుడు పురస్కారం., తటవర్తి భారతి సాహితీ పురస్కారం...2020లోస్వాతి అనిల్ అవార్డ్ బహుమతి కథ క్షమాభిక్ష కి ఆ సంవత్సరం కథా సామ్రాట్ గౌరవం
సుమతి సాహితీ సామ్రాట్ పురస్కారం ..ముల్కనూరు కథా పీఠం, నమస్తే తెలంగాణా కథల పోటీ లో నాలుగో సారి బహుమతి.. దాదాపు పాతిక హస్య కథలు రాసాను..
స్వాతి..రచన, ఆంధ్రప్రదేశ్, హాస్యనందం,సహరి, సుమతి పత్రికల్లో కామెడీ కథలకు బహుమతులు వచ్చాయి
నాకు జీవితాన్ని ఇచ్చింది అమ్మ , నాన్నలు శ్రీమతి చక్రమ్మ..శ్రీ మట్టా క్రృపాధానం ఐతే..
సాహితీ జీవితం ఇచ్చింది పెద్దన్నయ్య ఎమ్మెస్ బాబూరావు గారు.
జీవిత స్పర్శ కలిగిన కథలు చదవడం, రాయడం ఇష్టం.
📖 5 రచనలు
📚 0 పుస్తకాలు
✍️ 0 ఇతర రచనలు
👥 0 Followers

సహరి రచనలు

WEEKLY General
తుపాకి
WEEKLY General
గోవు గోపిక గోపాలుడు
WEEKLY General
మిత్రద్రోహం
WEEKLY General
అపరంజి
WEEKLY Romantic
అనగనగా ఒక ప్రేమ కథ

నా పుస్తకాలు

ఇతర రచనలు

ఇంకా ఇతర రచనలు జోడించాలి

📚

Follow This Author

రచయితలను Follow చేయడానికి Login లేదా Free Registration అవసరం.

🎁 ప్రత్యేక స్వాగత బహుమతి

మీరు సహరిలో మొదటిసారి ఏ రచయితనైనా అనుసరిస్తే

✅ 7 రోజుల ప్రీమియం యాక్సెస్
📖 సహరి వారపత్రిక అన్ని సంచికలు
📘 సహరి మాసపత్రిక అన్ని సంచికలు
👧 బాలసహరి అన్ని సంచికలు

💳 కార్డు వివరాలు అవసరం లేదు
🆓 ఉచిత సభ్యత్వ నమోదు సరిపోతుంది
Login Register Free