వెంకటమణి

రచయిత

విశాఖసిటీలోని అడవివరంలో నివాసం. అమ్మ పేరు మణి, నాన్న పేరు వెంకట్రావు. భార్య పేరు మీనాక్షి, పాప పేరు హేము. వెంకట మణి డిగ్రీవరకు చదివారు. ప్రజాశక్తి జర్నలిజం కాలేజీలో జర్నలిజాన్ని అభ్యసించారు. కొన్నేళ్లు ప్రజాశక్తి దినపత్రికలో ఉప సంపాదకుడిగా పనిచేశారు. అనంతరం 2008లో ‘‘పార్టీరహిత రాజకీయం’’ మాసపత్రికను పెట్టి ఏడేళ్లు నడిపారు. పార్టీరహిత ప్రజాస్వామ్యంకోసం కృషి చేస్తున్నారు. పార్టీరహిత ప్రజాస్వామ్యం ఆవశ్యకతను తెలియజేస్తూ అనేక రాజకీయ వ్యాసాలు రాశారు. అవి ఆంధ్రజ్యోతి, వార్త, ప్రజాశక్తి, నవ తెలంగాణ, స్పెక్ట్‌వాయిస్‌ తదితర పత్రికలలో అచ్చయ్యాయి. రచయితగా ఇప్పటికి 50 కథలవరకు రాశారు. అవి స్వాతి, నవ్యవీక్లీ, జాగృతి, నవ తెలంగాణ, బాలభారతం, మల్లెతీగ, రమ్యభారతి, విశాలాక్షి, నెలవంక, ప్రకాశిక, భూమిక తదితర మేగజైన్లలో ప్రచురితమయ్యాయి. బహుమతి కథలతో ‘అకాలం’ కథా సంపుటినొకటి వెలువరించారు. 2018లో ‘వేయి పున్నములు’ కథకు స్వాతి అనిల్‌ అవార్డు దక్కింది. అలాగే ‘దేవుడి మార్కులు’ కథకు 11వ సోమేపల్లి జాతీయ పురస్కారం, ‘అందరూ శ్రీవైష్ణవులే’ కథకు చరిత్రకారుడు షోయబుల్లాఖాన్‌ స్మారక పురస్కారం, ‘అమావాస్య’ కథకు తొలి తెలుగు రచయిత్రి బండారు అచ్చమాంబ పురస్కారం దక్కాయి. ‘కొత్త రాంబాబు’ కథ ప్రఖ్యాత ఆర్ట్‌ క్రిటిక్‌, ఫిల్మ్‌ హిస్టోరియన్‌ వి.ఎ.కె. రంగారావుగారి ప్రశంస పొందింది.
📖 1 రచనలు
📚 0 పుస్తకాలు
✍️ 0 ఇతర రచనలు
👥 1 Followers

సహరి రచనలు

WEEKLY General
కాకి ముద్ద

నా పుస్తకాలు

ఇతర రచనలు

ఇంకా ఇతర రచనలు జోడించాలి