కె.వి.సుమలత

wtiter,poet and novelist

స్వీయ పరిచయం

పేరు : కైకాల వెంకట సుమలత

స్వస్థలం : పుట్టినిల్లు తెలంగాణ రాష్ట్రంలోని వేల్పూరు; మెట్టినిల్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుడివాడ

తల్లితండ్రులు : నాన్నగారి పేరు డాక్టర్ పి. వి. సత్యనారాయణ; అమ్మ పేరు పి.వి. సత్యవతి ( గృహిణి)

భర్త పేరు: కైకాల వెంకటేశ్వరరావు (న్యాయవాది)

కూతురు: తోట శ్రీలలిత, అల్లుడు: తోట సాయి కిరణ్ కుమార్, మనవరాలు: పర్ణిక స్వేచ్ఛ

కొడుకు: కైకాల సత్య చైతన్య, కోడలు: కైకాల మోహన ప్రశాంతి, మనవడు: కైకాల అవ్యాన్

నాకు చిన్నప్పటి నుండి సాహిత్యం పట్ల మక్కువ ఎక్కువ. నేనెందుకు వ్రాస్తున్నానని నన్ను నేను ప్రశ్నించుకుంటే ఒకే ఒక సమాధానం వస్తుంది... అదేమిటంటే వ్రాయకుండా ఉండలేక!... కళ్ళ ముందు కనిపించినవి, లోచూపుతో గ్రహించినవి, ఎవరో చెప్తే విన్నవి ఏవైనా సరే మనసును కదిలిస్తే వాటిని అక్షరరూపంలో పెట్టకపోతే మనసు ఊరుకోదు. నా ప్రమేయం లేకుండానే అప్రయత్నంగా నా కలం కదులుతుంది. వాటి ఫలితమే నా కథలు... కవితలు. నిజానికి చదువుకునే రోజుల్లోనే వ్రాయడం మొదలు పెట్టాను. కాలేజ్ సావనీర్ లలో నా కవితలు అచ్చు రూపంలోకి వచ్చాయి. వివాహ అనంతరం ఆంధ్రభూమి, ఆంధ్రప్రభ, ఆంధ్రజ్యోతిలలో సుమారు యాభై కథలు, వంద కవితలు ప్రచురించబడ్డాయి. ఆ తరువాత వ్యక్తిగత కారణాల వల్ల నా కలం ఆగిపోయింది. తిరిగి 2022 మార్చ్ నుండి మళ్ళీ నా రచనలు వెలుగు చూడటం మొదలు పెట్టాక వెనుతిరుగలేదు. ఆరంభంలోనే అనేక కథలు, కవితలు బహుమతులకు కూడా నోచుకున్నాయి. కొన్ని ముఖ్యమైన పురస్కారాలు కూడా అందుకున్నాను.

ప్రముఖ పత్రికలైన ఈనాడు, సాక్షి, ప్రజాశక్తి, వార్త, వెలుగు దర్వాజా, నమస్తే తెలంగాణా, స్వాతి, రవళి, సృజన క్రాంతి, సాహో, సాహితీ కిరణం, విశాఖసంస్కృతి, రమ్యభారతి, నవ తెలంగాణ, విశాలాక్షి, సహరి మొదలగు పత్రికలలో నూట ఎనభై సామాజిక కథలు, రెండు వందలకు చేరువగా కవితలు మరియు శతాధిక బాలల కథలు ప్రచురించబడ్డాయి. స్వాతి కథ కథ కథా పోటీలో పదివేల రూపాయల బహుమతి, స్వాతి పదహారు వారాల సీరియల్ పోటీలో లక్ష రూపాయల బహుమతి లభించాయి. మరో రెండు నవలలు పోటీ పరిశీలనలో ఉన్నాయి. కొన్ని కథలు ఎంపిక కాబడి ప్రచురణకు సిద్ధంగా ఉన్నాయి. ఈనాడులో ఆధ్యాత్మిక వ్యాసాలు అంతర్యామి, వ్యక్తిత్వ వికాసo, మకరందం మొదలగు వ్యాసాలు ప్రచురింపబడటం నాకు అమితానందం కలిగించాయని చెప్పగలను. ఆకాశవాణి రేడియో కేంద్రంలో “ఆలోచనా లోచనం” కార్యక్రమంలో నేను వ్రాసిన బాలల కథలు సుమారు ముప్పై కథలు చదివాను. 2022 లో సాహో పత్రిక వారు నిర్వహించిన ప్రేమ కథల పోటీలో *స్వాతిముత్యం* కథకు ప్రథమ బహుమతి లభించడమే కాకుండా కన్నడ భాషలోకి అనువదించారు. 2023 లో సోమేపల్లి పురస్కారం కథ *ఏది దానం? ఎవరు దాత?* ఇంటర్నేషనల్ మాగజైన్ విమెన్స్ ఎరా లో ఆంగ్ల భాషలోకి అనువదించారు. 2025లో స్వాతి పదివేల రూపాయల బహుమతి కథ *ఓ అమ్మ పోరాటం* కన్నడ భాషలోకి అనువదించారు.

2023 జూలైలో డాక్టర్ సి. నారాయణ రెడ్డి గారి శ్రీమతి సుశీలా నారాయణ రెడ్డి గారి ట్రస్టు నుండి "సుమ సౌరభాలు" అనే మొదటి కథల సంపుటి వెలువడింది.

2024 నవంబర్ లో నవచేతన వారి నుండి "అభినందన",
2025 మే నెలలో ఎమెస్కో వారి సాహితీ ప్రచురణల నుండి "అసలైన బహుమతి" అనే బాలల పుస్తకాలు వెలువడ్డాయి.

ప్రస్తుతం మరో రెండు ప్రముఖ సాహితీ సంస్థల నుండి రెండు బాలల కథలు, మరో రెండు సామాజిక కథలు పుస్తక రూపంలోకి రాబోతున్నాయనీ, విశ్వశాంతికి ఉపయోగపడే సాహితీయాగoలో నేను సైతం ఓ సమిధననీ చెప్పడానికి సంతోషిస్తున్నాను.


2022 మార్చ్ నుండి ప్రచురించబడిన నా రచనల వివరాలు:

కథలు మొత్తం 26.

పెద్ద కథలు 12

1. నువ్వు నేను మనమై - ఈనాడు
2. సుబ్బలక్ష్మి ఉద్యోగం - సహరి
3. క్షమయా ధరిత్రీ - నెచ్చెలి లో
ప్రత్యేక బహుమతి కథ. ( ఇంకాప్రచురించలేదు)
4. దేవుడితో పందెం - సహరి
5. మోహనా ఏమి నీ యోచనా - సహరి
( ఉగాది కథల పోటీలో ప్రత్యేక బహుమతి కథ)
6. బకరా - సహరి
7. భూగోళానికి ఆ వైపు - సహరి
8. అజరామరం - సహరి
9. ఇంతింతై వటుడింతై - హస్యనందం
10. స్వాతి ముత్యం - సాహో
( ప్రేమకథల పోటీలో ప్రథమ బహుమతి కథ)
11. నానో కథలు రెండు - మాధురి
12. సాహితీ కెరటాలు - సహరి

బాలల కథలు 13

1. బుద్ధి కుశలత - సాహో
2. ఎత్తుకి పై ఎత్తు - ప్రజా మంటలు
3. కుందేలు న్యాయం - సాక్షి
4. తెలివైన కోతి - వార్త
5. చిలుకమ్మ తెలివి - ఈనాడు
6. ధైర్యమే విజయానికి మెట్టు - ఈనాడు
7. మాయ కుండ - నవ తెలంగాణ
8. చెరపకురా చెడేవు - ఈనాడు
9. సోమయ్య సోమరితనం - ఈనాడు
10. వింత షరతు - సాక్షి
11. మానవత్వపు సిరులు - మొలక
12. తగిన పాఠం - సహరి
13. దేశమంటే మట్టి కాదోయ్ ( విశాఖ బాలల కథల పోటీలో ప్రోత్సాహక బహుమతి కథ. ఇంకా ప్రచురించలేదు)

కవితలు

1. జీవితం ఒక అద్బుతం - సహరి
2. అక్షరమే ముఖ ద్వారం - సహరి
( ఉగాది కవితల పోటీలలో ప్రత్యేక బహుమతి కవిత)
3. వాదన అనివార్యమైతే -- సహరి
4. కోపం అనంగీకార భాష - సహరి
5. ప్రశాంతత - సహరి ( విజయ దశమి కవితల పోటీలలో ప్రత్యేక బహుమతి కవిత)
6. చదువుల తల్లి - సాహితీ కిరణం
7. సిసింద్రీలు - తపస్వి మనోహరం
8. మొలకలో కొన్ని కవితలు

✍️ 2023 వ సoవత్సరంలో నా సాహితీ ప్రయాణం ఇలా సాగింది.

1. ఈనాడు హాయ్ బుజ్జీలో బాలల కథలు - 33

2. ఇతర పత్రికలలో బాలల కథలు - 14

3. సామాజిక కథలు - 26

4. కవితలు, నానీలు , హైకూలు - 55

5. నానో కథలు - 10

ప్రచురణకు నోచుకున్నాయి.

6. *సుమ సౌరభాలు* అనే కథల సంపుటి Dr. C. నారాయణ రెడ్డి గారి ట్రస్ట్ నుండి ఆవిష్కరింపబడింది. ఈ పుస్తక సమీక్ష చాలా పత్రికలలో వచ్చింది. మంచి స్పందన లభించింది.

7.2023 వెళ్ళిపోతూ ఈ రోజు స్వాతి పత్రికలో నా కథ సాధారణ ప్రచురణతో బహుమతి ఇచ్చింది.

8. కథల పోటీల్లో బహుమతులు వచ్చాయి, జాతీయ స్థాయి పురస్కారాలు అందుకున్నాను.

9. కథా రవళి సమూహంలో రెండు నవలలు రాశాను. నవల అంటేనే అమ్మో అనుకునే నాతో రామశర్మ గారు నవల రాయించారు.

10. తెలంగాణ రాష్ట్ర స్థాయిలో *చెలిమి* పుస్తకంలో నా కథలు రెండు ముద్రించబడ్డాయి.

11. నవచేతన వారి నుండి త్వరలో నా బాలల కథల పుస్తకం రాబోతుంది.

12. *నా కథ స్వాతి ముత్యం* కన్నడ పత్రిక *మంగళ* లోకి అనువదించారు. అది నాకు చాలా సంతోషకరమైన వార్త.

13. సోమేపల్లి పురస్కారం అందుకున్న కథ *ఏది దానం? ఎవరు దాత* ఉమెన్స్ ఎరా మేగజైన్ లో ఆంగ్ల భాష లోకి అనువదించబడుతుంది.

✍️ 2024 లో నా సాహితీ ప్రయాణం ఇలా సాగింది…(ప్రోగ్రెస్ రిపోర్ట్)

ప్రచురించబడిన సామాజిక కథలు - 30

1. సదా మీ సేవలో 12- 1- 2024 సహరి వారపత్రికలో
2. ప్రియసాగరం 19- 1- 2024 సహరి వారపత్రికలో
3.మౌనంగానే ఎదగమని 5- 1- 2024 స్వాతి వారపత్రికలో
4. వీరమాత 22-1-2024 లీడర్ పేపర్లో
5. వధువు కావాలి 12-2-2024 లీడర్ పేపర్లో
6. జ్ఞాపకాల అలలు 17-2-2024 లీడర్ పేపర్లో
7. వీడిన గ్రహణం 18- 2-2024 ప్రజాశక్తి స్నేహాలో
8. కోలమ్ పోడు 25-2-2024 వెలుగు దర్వాజా
9. వరం వర్సెస్ వరం 12-3-2024 లీడర్ పేపర్లో
10. అప్రమత్తత 22-3-2024 లీడర్ పేపర్లో
11. నాణేనికి మరో ప్రక్క 24-3-2024 వార్త ఆదివారం
12. కొత్తనీరు 11-4- 2024 లీడర్ పేపర్లో
13. మనసుకి మరణం 14-4-2924 ఈనాడు ఆదివారం
14. రేపటి సూరీడు 21-4-2024 ప్రజాశక్తి ఆదివారం
15. కోనసీమ నవ్వింది 1-5-2024 ఉషా పక్ష పత్రికలో
16. ఆనందం హసిస్తే 1-5-2024 స్వాతి మాస పత్రికలో (అనిల్ అవార్డు సా ప్ర)
17. అర్ధాంగి భాషలకు అర్థాలే వేరులే 17-5-2024 లీడర్ పేపర్లో
18. పాపం మణి 3-5-2024 లీడర్ పేపర్లో
19. తనదాక వస్తే 27- 5-2024 జాగృతి వారపత్రికలో ( పోటీకి ఎంపికైన కథ)
20. పరిజ్ఞానం ఎక్కువైతే 27-5-2024 లీడర్ పేపర్లో
21. సత్యమేవ జయతే 19-6-2024 క్రైమ్ కథల సంకలనం
22. లకుమాదేవి 2-7-2024 వీధి అరుగు పత్రికలో
23. ప్రేమ రాగం 2-8- 2024 సహరి వార పత్రికలో (బహుమతి)
24. రేపటి ఉదయం 18-8-2024 ప్రజాశక్తి స్నేహలో
25. స్వాతి చినుకు 1-10- 2024 స్వాతి మాస పత్రికలో (అనిల్ అవార్డు సా ప్ర)
26. వెలుగు వైపు పయనం 27- 10-2024 తపస్వి మనోహరంలో( పోటీ ఎంపిక కథ)
27. ఆశ బరువు తూయగలమా 3- 11- 2024 నమస్తే తెలంగాణ (ముల్కనూరు బహుమతి)
28. చట్టానికి సంకెళ్లు 24-11-2024 విమల సాహితీ (పోటీ ఎంపిక కథ)
29. ద సైలెంట్ సేవియర్ 1-12-2024 ఉమెన్స్ ఎరా లో
(అనువాద కథ)

ప్రచురణకి ఎంపికైన రచనలు 14

1. ఆ రెండు కలయికలు 10-7-2024 తెలుగుతల్లి కెనడా (బహుమతి)
2. మజిలీ 29-7-2024 స్నేహ మాధురి (బహుమతి)
3. ప్రణయ ప్రబంధం సరసమైన కథ 28-5- 2024 స్వాతి (సా ప్ర)
4. చిలుకలు చేరిన చెట్టు 6-9-2024 సహారి (సా ప్ర)
5. అమ్మ ప్రేమ అక్షయం సింగిల్ పేజీ కథ సాహితీ కిరణం (బహుమతి)
6. అపరాజిత 28-3- 2024 ఉషా వెలగపూడి పోటీ ( బహుమతి)
7. గాంధీజీ సాక్షిగా 9-11-2024 ఉషా సింగీతం పోటీ (బహుమతి)
8. మొలకెత్తిన నిజం 23-11-2024 సహరి క్రైమ్ కథల పోటీ (సా ప్ర)
9. రేపటి వెలుగు 27-10-2024 వారణాసి వారి ఏకపత్ర పోటీ(ప్రథమ బహుమతి)
10. జననీ జన్మ భూమిశ్చ 28-10-2024 జాగృతి పోటీకి ఎoపికైన కథ
11. అక్షరం అంటే ఆయుధం 30-10-2024 న్యూటన్ పోతుల కథల పోటీ (సా ప్ర)
12. మొదటి అడుగు నీదే 27-12-2024 తపస్వి మనోహరం కథల పోటీ (సా ప్ర)
13. ఆశాదీపం 20-11- 2024 సోమేపల్లి పురస్కారాలు (సా ప్ర)
14. పూల సంకెళ్లు 22-11-2024 తపస్వి మనోహరంలో( పోటీకి ఎంపికైన కథ)
15. శాంతి సమీరం 6-6-2024 సాహితీ కిరణం (బహుమతి)
16. ఓ అమ్మ కథ 29-12-2024 రవళిలో

నవల ప్రక్రియ

1. ఒక నవల ప్రముఖ పత్రిక పోటీ పరిశీలనలో ఉంది.
2. ఒక నవల పూర్తి కావస్తోంది ( రామశర్మ గారి నవల మహోత్సవంలో)

ఈనాడు హాయ్ బుజ్జీలో బాలల కథలు - 18

1. ఎన్నెన్నో వర్ణాలు...
అన్నింటా అందాలు 19-1-2024 ఈనాడు
2. మున్నీ.. బన్నీ.. డాలీ.. చింపూ 5-2-2024 ఈనాడు
3. తాతయ్య మాట బంగారు బాట 20-2- 2024 ఈనాడు
4. కుటిలం చూపిన కుటిల బుద్ధి 29-2- 2024 ఈనాడు
5. పంచితే స్నేహం పెరుగుతుంది 7-3-2024 ఈనాడు
6. పాయసం దొంగని పడదాం 24-3-2024 ఈనాడు
7. ఇష్టపడితే కష్టమవదు 6-4-2024 ఈనాడు
8. చిన్నూ నచ్చని బెండకాయ కూర 16-4- 2024 ఈనాడు
9. వేసవి సెలవుల్లో ఆడుతూ.. పాడుతూ 26-4-2024 ఈనాడు
10. పిల్లలూ మార్పు మంచిదే! 3-5-2024 ఈనాడు
11. అన్నం పరబ్రహ్మ స్వరూపం 10-5-2024 ఈనాడు
12. ఇష్టంతోనే.. కష్టపడు! 18-5-2024 ఈనాడు
13. తాతయ్య నేర్పిన పాఠం 30-5-2024 ఈనాడు
14- విరిగిన విమానం బొమ్మ 21-6-2024 ఈనాడు
15- కుందేలు సమయస్ఫూర్తి 5-7-2024 ఈనాడు
16. కృతజ్ఞతలు చెబుదామా! 5-7-2024 ఈనాడు
17. రాము స్నేహం 26- 7- 2024 ఈనాడు
18. హరివిల్లు అందాలు 4-11-2024 ఈనాడు

ఇతర పత్రికలలో బాలల కథలు - 12

1. జింక ఉపాయం పారిందోచ్ 8-1-2024 ప్రజాశక్తి
2. నీలి తిమింగలం 11-2-2024 ప్రజాశక్తి
3. పెద్దయ్యాక నువ్వేమవుతావు? 17-3-2024 ప్రజాశక్తి
4. గ్రహాల కథ 10-5-2024 చిన్నారి
5. కండబలం కన్నా బుద్ధిబలం గొప్పది19-5-2024 ప్రజాశక్తి
6. ఓర్పు నేర్చుకో.. అమృతఫలం అందుకో 16-5-2024 సాక్షి
7. అంతా మన మంచికే 7-7-2024 సృజన క్రాంతి
8. అసూయ మంచిది కాదు 28-72024 సృజన క్రాంతి
9. చేపలు - తాబేళ్లు - కోతులు 29- 9- 2024 సాక్షి
10. ఆటతో పాఠం 10-10-2024 ప్రజాశక్తి
11. తేనెదొంగ దొరికింది 13- 11- 2024 చిన్నారి
12. సమయోచితo 8-12- 2024 సృజనక్రాంతి
13. ప్రయత్నిస్తే ఫలితం ( తెలంగాణ సారస్వత్తులో బహుమతి కథ సంకలనం)
14. ఊరికి ప్రాణం చెఱువు ( బాల చెలిమి బహుమతి కథ సంకలనం)
15. చదవడం అంటే ఎదగడమే( బాల చెలిమి బహుమతి కథ సంకలనం)
16. సమయోచితo 30-12-2024 చిన్నారిలో

హైకూలు మరియు కవితలు - 21

1. (అందం) నానీలు 5-1-2024 లీడర్ పేపర్లో
2. కనుమరుగు కానీకుమా 12-1-2024 కవన రవళిలో
3. (స్నేహం) హైకూలు 2-2-2024 లీడర్ పేపర్లో
4. నీ కోసమే వేచి ఉన్నా 1-3-2024 రవళి మాస పత్రికలో
5. (కలయిక) హైకూలు 2-3-2024 లీడర్ పేపర్లో
6. (వంచన) హైకూలు 16-3-2025 లీడర్ పేపర్లో
7. ఒక అమృత వాహిక 17-3- 2024 ప్రజశక్తిలో
8. (ఎన్నికలు) హైకూలు 12-4-2024 లీడర్ పేపర్లో
9. (గత స్మృతులు) హైకూలు 16-5- 2024 లీడర్ పేపర్లో
10. (వలపు - అన్వేషణ) హైకూలు 25-5-2024 లీడర్ పేపర్లో
11. పచ్చదనంతో నిండిపోవాలి 5-6- 2024 సాహితీ కిరణం పత్రికలో
12. (అవినీతి) హైకూలు 6-6-2024 లీడర్ పేపర్లో
13. ఆశల ఉదయం 14-6-2024 సహరి పత్రికలో
14. మధురమైన బాల్యం 15-6-2024 విమల సాహితీ పత్రికలో
15. (అసూయ) హైకూలు 8-8-2024 సృజన క్రాంతి పేపర్లో
16. (తెరలు - పొరలు) నానీలు 27-10-2024 సృజన క్రాంతి పేపర్లో
17. ఓం నమః శివాయ 16-11-2024 సృజన క్రాంతి పేపర్లో
18. (నీరు) హైకూలు 8-12-2024 సృజన క్రాంతి పేపర్లో
19. సాగరంలో జాబిల్లి 20-12-2024 సహరి వార పత్రికలో
20. ఓ మనిషీ మేలుకో 20-12-2024 తపస్వి మనోహరం పత్రికలో
21. కోటి ఆశల ఆహ్వానం 28-12-2024 తపస్వి మనోహరం పత్రికలో
22. మధుర ప్రేమ 29-12-2024 సృజన క్రాంతి పేపర్లో

పుస్తక సమీక్షలు 4

1. చెంగల్వ పూలు పుస్తక సమీక్ష 1-6-2024 సృజన క్రాంతి పేపర్లో
2. విరిoచి గారి నా భార్య కింకా పెళ్లి కాలేదు పుస్తక సమీక్ష 1-7-2024
3. రాఘవేంద్ర రావు గారికి అక్షర నీరాజనం 6-8-2024 సాహితీ కిరణం పత్రికలో
4. విరిoచి గారి పుస్తక సమీక్ష 1-9-2024 సాహితీ కిరణం పత్రికలో

ఆకాశవాణి రేడియో కేంద్రంలో 2 సార్లు ప్రసారాలు

మే నెలలో 4 బాలల కథలు
నవంబర్ నెలలో 5 బాలల కథలు
కథ చెప్పుతా రండి 3 బాలల కథలు (జూమ్ మీటింగ్)

నేను సాధించిన వాటిలో ముఖ్యమైనవి

అభినందన అనే బాలల కథల పుస్తకం నవచేతన వారి నుండి నవంబర్ నెలలో వెలువడింది.
త్వరలో ఎమెస్కో వారి నుండి అసలైన బహుమతి అనే బాలల కథల పుస్తకం వెలువడబోతుంది.
మన సమూహ ప్రముఖ రచయిత శ్రీ చరణ్ మిత్ర గారు మంచి రచయితగా సమూహంలో నాకు గుర్తింపు నివ్వడం ఎంతో ఆనందం కలిగించింది.
ఆరవ ప్రపంచ మహా సభలలో అందరికీ బహుకరించిన మార్పు అనే పుస్తకంలో ప్రముఖ రచయిత శ్రీకంఠ స్ఫూర్తి గారు స్ఫూర్తివంతమైన వాక్యాలు చెప్తూ నా పేరు కూడా ఉదహరించారు. ఇది ఈ ఏటికి నాకు అసలైన బహుమతి అని చెప్పడానికి చాలా సంతోషిస్తున్నాను.


నేను పొందిన పురస్కారాలు

తెలంగాణా సారస్వత్తు వారి బాలల పురస్కారం (హైదరాబాద్)
సోమేపల్లి సుబ్బయ్య గారి పురస్కారం (గుడివాడ)
అమ్మ పురస్కారం (గుడివాడ)
వాసా ప్రభావతి సాహితీ కిరణం (హైదరాబాద్)
ముల్కనూరు పురస్కారం ( ముల్కనూరు)
వంశీ సింగిల్ పేజీ సాహితీ కిరణం ( హైదరాబాద్)

✍️2025 జనవరి1st నుండి డిసెంబర్ 31 వరకు నా సాహితీ ప్రయాణం ఇలా సాగింది…

సామాజిక కథల ప్రచురణ:

ప్రణయ ప్రబంధం 24- 1- 2025 స్వాతి వార పత్రిక
శాంతి సమీరం 1- 1- 2025 సాహితీ కిరణం (బహుమతి కథ)
ఇదా సంగతి! 19- 1- 2025 సృజన క్రాంతి పేపర్లో
పూల సంకెళ్లు 25- 1- 2025 తపస్వి మనోహరం
ఓ అమ్మ పోరాటం 14- 2- 2025 స్వాతి వార పత్రిక (9999 రూపాయల బహుమతి కథ)
అమ్మ ప్రేమ అక్షయం 1- 2- 2025 సాహితీ కిరణం (సింగిల్ పేజీ బహుమతి కథ)
అపరాజిత 1- 3- 2025 ఉషా పక్ష పత్రిక ( బహుమతి కథ)
బోల్తా కొట్టిందిలే బుల్ బుల్ పిట్ట 1- 3- 2025 హాస్యానందం ( బహుమతి కథ)
అంతర్యుద్ధం 12- 3- 2025 ఈనాడు ఆదివారం అనుబంధం
భాయ్ దూజ్ 1- 3- 2025 రవళి
అరవైలో ఇరవై 1- 3- 2025 విశాలాక్షి (బహుమతి హాస్యకథ)
ఆ రెండు కలయికలు 16- 3- 2025 తెలుగు తల్లి కెనడా ( బహుమతి కథ)
ఆరు - ముప్పై ఆరు - అరవై ఆరు 30- 3- 2025 ప్రజాశక్తి స్నేహ
మొదటి అడుగు నీదే! 30- 3- 2025 తపస్వి మనోహరం ( మార్చ్ నెలలో మొత్తం 8 కథలు ప్రచురించబడ్డాయి)
అమృత హస్తం మార్చ్ 18 కర్ణాటక తెలుగు రచయితల కథల పోటీలో ప్రోత్సాహక బహుమతి (ప్రచురణ జరగలేదు)
కుడి ఎడమైతే 1- 5- 2025 స్వాతి మాసపత్రిక
అనుభూతుల చెలమ 13 - 4- 2025 వార్త ఆదివారం అనుబంధం
మజిలీ 1- 5- 2025 మాధురి అంతర్జాల పత్రిక (బహుమతి కథ)
మొలకెత్తిన నిజం 2- 5- 2025 సహరి
చేజారనీకు 1- 6- 2025 విశాలాక్షి (బహుమతి కథ)
నేను సైతం 22- 6- 2025 ప్రజాశక్తి స్నేహ
చిలుకలు చేరిన చెట్టు 27- 6- 2025 సహరి వార పత్రిక
జననీ జన్మ భూమిశ్చ 7- 7- 2025 జాగృతి వార పత్రిక (బహుమతి కథ)
ఆపరేషన్ వాడపల్లి 10- 7- 2025 సుమతి సాహితీ స్రవంతి
గాంధీజీ సాక్షిగా 31- 8- 2025 ఉషా పక్ష పత్రిక (బహుమతి కథ)
ఆహుతి 29- 8- 2025 స్వాతి వార పత్రిక
వాడు మగాడే… పాపం! 29- 8- 2025 సహరి వార పత్రిక
అనురాగ సందేశం 28- 9- 2025 తపస్వి మనోహరం
జీవన మాధుర్యం 12- 10- 2025 సాక్షి ఆదివారం అనుబంధం
అదుగో నవలోకం 28- 11- 2025 స్వాతి వార పత్రిక
అమ్మకు ప్రేమతో లేఖ 1- 11- 2025 బృహత్ సంకలనం లో
ఓ అమ్మ పోరాటం 2- 12- 2025 తుషార కన్నడ పత్రికలో అనువాద కథ ప్రచురణ
చరిత్ర చెప్పిన కథలు పుస్తక సమీక్ష 14- 11- 2025 ఉషా పక్ష పత్రిక
మమతల వొడి మల్లె తీగ వారి పోటీలో బహుమతి కథ 22- 11- 2025 మల్లె తీగ వారి సంకలనంలో
మౌనమే నీ భాష ఓ మూగ మనసా! 14- 12- 2025 ప్రజాశక్తి స్నేహ
వికసించిన వివేకం (స్నిగ్ధా రెడ్డి వారి కథల పోటీలో తృతీయ బహుమతి ప్రచురణ జరగలేదు)

ప్రచురణ బాలల కథలు(ఈనాడు):

మహారాజు కనువిప్పు 12- 1- 2025 ఈనాడు సిసింద్రీ
భయమేస్తుందమ్మా! 5- 4- 2025 హాయ్ బుజ్జీ
నువ్వెవరో తెలుసా? 8- 5- 2025 హాయ్ బుజ్జీ
పంచుకుంటేనే ఆనందం 28- 6- 2025 హాయ్ బుజ్జీ
బదులుగా ఏమీ వద్దు 24- 7- 2025 హాయ్ బుజ్జీ
ఓ పిచ్చుక.. రెండు పావురాలు 12- 9- 2025 హాయ్ బుజ్జీ
అర్థమైంది నాన్నా! 28- 11- 2025 హాయ్ బుజ్జీ
ముందే వినాల్సింది! 9- 10- 2025 హాయ్ బుజ్జీ
స్వేచ్ఛంటే.. 8- 12- 2025 హాయ్ బుజ్జీ

ఇతర పత్రికలలో:

బహిరంగ ప్రసంగం 23- 1- 2025 ప్రజాశక్తి చిన్నారి
ఇచ్చుటలో ఉన్న హాయి 6- 4- 2025 ప్రజాశక్తి చిన్నారి
విజయ రహస్యం 13- 7- 2025 ప్రజాశక్తి స్నేహ
విజయ రహస్యం (మే నెల ప్రత్యేక బాలబాట లో కూడా ప్రచురణ జరిగింది)
నిజాయితీ విలువ 13- 7- 2025 వార్త ఆదివారం అనుబంధం
కుయ్ కుయ్ 6 - 7- 2025 సృజన క్రాంతి పేపర్లో
గెలుపుకు కారణం జట్టు 26- 10- 2025 బాల చెలిమి
విద్యకు వినయం తోడైతే 2- 11- 2025 ప్రజాశక్తి స్నేహ
రైతు నిజాయితీ 2- 11- 2025 ఆంధ్రప్రభ పత్రిక
చందమామపై షికారు (బాలచెలిమి పోటీలో బహుమతి కథ ఇంకా ప్రచురణ జరగలేదు)
సూర్యుడి చిరునవ్వు (అక్టోబర్ N.K. బాబు గారి సంకలనంలోకి ఎంపికైంది.) అక్టోబర్ 20
సూర్యుడితో ప్రయాణం (బాలల నేస్తం వారి పోటీలో ఎంపికైంది) అక్టోబర్ 25

ప్రచురణ కవితలు:

1.నూతన వత్సరాన్ని స్వాగతిద్దాం 3- 1- 2025 సహరి వార పత్రిక
2. ఏమని వర్ణించను? 17- 1- 2025 సహరి వార పత్రిక
3. జీవన సాఫల్యమూ నీవే మరి! 9- 2- 2025 తపస్వి మనోహరం
4.ఎటు పోతోంది మీ ప్రగతి? 1- 2- 2025 సాహితీ కిరణం వారి 5.ఎదురు చూపులు సంకలనంలో
6. నిశ్శబ్దరాగం 14- 2- 2025 సహరి వార పత్రిక
7. జీవన సాఫల్యం 25- 4- 2025 సహరి వార పత్రిక (బహుమతి కవిత)
8. ఏమిటీ హేయం? 26- 4- 2025 సృజన క్రాంతి పేపర్లో
9. ప్రకృతి నేర్పిన పాఠం 1- 6- 2025 సహరి వార పత్రిక
10. సద్భావనలు 1- 8- 2025 సహరి మాస పత్రిక
11.రక్షా బంధన్ సిసింద్రీ 3- 8- 2025 తపస్వి మనోహరం
12. నేను ఒంటరిని కాను 14- 11- 2025 సహరి వార పత్రిక

ఆధ్యాత్మిక వ్యాసాలు:

పతనానికి మూలం 16- 5- 2025 సహరి
తొలి గురువు ఆప్తవాక్యం 18- 7- 2025

అంతర్యామి వ్యాసాలు:

నేను లేకపోతే 19- 5- 2025 ఈనాడు
ధర్మనిరతి. 25- 6- 2025 ఈనాడు
తీయని బంధం 3- 8- 2025 ఈనాడు
భారం నీదే! 31- 10- 2025 ఈనాడు
సత్యమేవ జయతే 14- 12- 2025 ఈనాడు

మకరందం వ్యాసాలు:

స్వర్గమా.. నరకమా.. 5- 6- 2025 ఈనాడు
కాళీమాత దీవించింది 12- 6- 2025 ఈనాడు
రాఖీ పౌర్ణమి 8- 8- 2025 ఈనాడు
పరమేశ్వరుడు అనుగ్రహిస్తాడు 5- 11- 2025 ఈనాడు
రాగిపాత్రలో నైవేద్యం 18- 12- 2025 ఈనాడు

వ్యక్తిత్వ వికాస వ్యాసాలు:

ఆనందానికి అడ్రస్ 26- 9- 2025 ఈనాడు
మీ ప్రతిబింబాన్ని మాత్రమే! 27- 10- 2025 ఈనాడు

పాఠకుల వంటలు:

వారేవా ఏమి ఉప్మా! 20- 7- 2025 ఈనాడు
నాన్ వెజ్ పచ్చళ్ళు (అమ్మ పేరుతో) 31- 8- 2025

నవలలు:

నాతిచరామి 3- 3- 2025 (పదహారు వారాల సీరియల్ గా స్వాతి నవలల పోటీలో లక్ష రూపాయల బహుమతిగా ఎంపికైంది)
రెండవ నవల పరిశీలనలో ఉంది.

ఆకాశవాణి కేంద్రంలో:

పది బాలల కథలు రెండు సార్లు ఆలోచనా లోచనం కార్యక్రమంలో చదివాను.

పుస్తకాలు:

“అసలైన బహుమతి” ఎమెస్కో వారి సాహితీ ప్రచురణల నుండి బాలల కథల పుస్తకం 24- 4- 2025
“ఆనందం హాసిస్తే” సురవరపు ప్రతాపరెడ్డి తెలుగు యూనివర్సిటీ నుండి సామాజిక కథల సంపుటి 30- 11- 2025
“హాస విలాసాలు” తపస్వి మనోహరం వారి నుండి హాస్యకథల సంపుటి 19- 12- 2025

పురస్కారాలు:

1.విశాలాక్షి వారి పురస్కారం
2. సాహితీ కిరణం వారి పురస్కారం
3. బెహరా వారి పురస్కారం
4. మల్లెతీగ వారి పురస్కారం
5. బండికల్లు వారి పురస్కారం
6. బాల చెలిమి వారి సాహిత్య పురస్కారం

మరి కొన్ని విశేషాలు:

బాల సాహిత్య సదస్సులో అభినందన, అసలైన బహుమతి రెండు బాలల కథల పుస్తకాలు ఆవిష్కరణ జరిగింది. (మే 25)
ఉషా పక్ష పత్రిక ముఖ చిత్రంలో రెండు సార్లు నా ఫోటో వచ్చింది. (మార్చ్ 1, ఆగస్టు 1)
పత్తిపాక మోహన్ గారు బాల సాహిత్య రచయిత్రిగా నా గురించి అభినందన మందారమాల వ్యాసం వ్రాసారు. ( జూలై 6)
Dr. మూర్తి గారు బాల సాహిత్య రచయిత్రిగా నా గురించి వ్యాసంలో కొన్ని వాక్యాలు వ్రాసారు. (అక్టోబర్ 20)
రవళిలో నా పరిచయం 1st సెప్టెంబర్)
అమ్మిన గారి సమీక్ష (అభినందన పుస్తక సమీక్ష)
ప్రఖ్యాత రచయిత రాజమోహన్ గారి నుండి ప్రశంస పొందడం
కన్నడ భాషలోకి రెండు కథలు అనువదింపబడటం
నా పుస్తకాలు చెన్నై మరియు అమరావతి లైబ్రరీలో రిజిస్టర్ అవడం.
పలు పోటీలలో కథలు బహుమతులు పొందాయి.
కొన్ని కథలు ఎంపికై ప్రచురణకు సిద్ధంగా ఉన్నాయి.
📖 0 రచనలు
📚 0 పుస్తకాలు
✍️ 0 ఇతర రచనలు
👥 1 Followers

సహరి రచనలు

నా పుస్తకాలు

ఇతర రచనలు

ఇంకా ఇతర రచనలు జోడించాలి