తిరుమలశ్రీ, విశ్వమోహిని

Author & Novelist

అసలు పేరు- పామర్తి వీర వెంకట సత్యనారాయణ. కలం పేర్లుః ‘తిరుమలశ్రీ’, ‘విశ్వమోహిని’'. విద్యార్హతలుః ఎమ్.ఎ. (సోషియాలజీ), ఎల్.ఎల్.బి., సి.ఎ.ఎస్. జాతీయ పరిశోధనాలయాల ‘చీఫ్ కంట్రోలర్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్’ అండ్ ‘చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్’ గా ఆలిండియా సర్వీసెస్ నుండి పదవీ విరమణ. హైదరాబాదు నివాసం.
చదవడం, రాయడం చిన్ననాటనే అబ్బిన ‘వ్యసనాలు’. 12 ఏళ్ళ వయసులో తొలికథ (‘టోకరా’, చిత్రగుప్త పక్షపత్రిక. మద్రాసు, 1958), 15వ ఏటను తొలి నవల (‘పునర్జన్మ’, భాగ్యశ్రీ పబ్లికేషన్స్, మద్రాసు, 1961) ప్రచురితమయ్యాయి.
తెలుగులో - అన్ని జేనర్స్ లోను, ప్రక్రియలలోను (బాల సాహిత్యంతో సహా) అసంఖ్యాక రచనలు (కవితలు, గేయాలతో సహా) ప్రముఖ పత్రికలన్నిటిలోనూ ప్రచురింపబడ్డాయి… స్పెషలైజ్డ్ ఇన్ క్రైమ్ సస్పెన్స్ ఫిక్షన్ అండ్ స్పై థ్రిల్లర్స్. ఇప్పటివరకు 209 నవలలు పుస్తకరూపంలోను, పత్రికలలోను, సీరియల్స్ గానూ ప్రచురితమయ్యాయి. ఇటీవలి నవలలు- ‘ప్రేమ సంతకం’ (‘ప్రతిలిపి’ బహుమతి నవల, 2022), ‘వల’ (2023-సహరి), ‘సాలెగూడు’ ( ‘అన్వీక్షికి’ బహుమతి నవల, 2024). బాలల నవల ఒకటి సిద్ధంగా వుంది.
పలు కథలు, నాటికలు, నాటకాలు, గేయాలు ఆలిండియా రేడియోలో ప్రసారితమయ్యాయి. కొన్ని నాటికలు దూరదర్శన్ లో ప్రసారం కాగా, మరికొన్ని రంగస్థలం పైన ప్రదర్శింపబడ్డాయి… కొన్ని కథలు ఇతర భాషలలోకి అనువదింపబడగా, కొన్ని నాటకాలుగా మలచబడి పరిషత్తులలో ప్రదర్శింపబడ్డాయి. ‘చందమామ’ పత్రికలో ప్రచురింపబడ్డ బాలల కథ ఒకటి మహరాష్ట్ర ప్రభుత్వం మరాఠీలో పాఠ్యాంశంగా చేర్చడం జరిగింది... స్కూల్ డేస్ లో ఆరంభమైన సుదీర్ఘ సాహితీప్రస్థానంలో పొందిన బహుమతులు, బిరుదులు, సన్మానాలు, సత్కారాలూ ఎన్నో! ‘కలహంస’’ పురస్కార గ్రహీత. ‘కథాకిరీటి’, ‘కథావిశారద’, ‘బాలకథాబంధు’ బిరుదాంకితులు.
చిత్రలేఖనంలో ప్రవేశం. కొన్ని కార్టూన్స్ పత్రికలలో ప్రచురింపబడ్డాయి. రేడియో, రంగస్థల నాటకలకు దర్శకత్వం వహించడం, నటనలో అనుభవమూ కలవు.

స్టోరీమిర్రర్ (మల్టీ-లింగ్యువల్ పోర్టల్) యొక్క ‘లిటరరీ కల్నల్’ మరియు ‘లిటరరీ బ్రిగేడియర్’ బిరుదాంకితులు…‘ఆథర్ ఆఫ్ ద ఇయర్-2019’ నామినీ. ‘ఆథర్ ఆఫ్ ద ఇయర్-2020’ (1st రన్నరప్-రీడర్స్ ఛాయిస్), మరియు (2nd రన్నరప్- ఎడిటర్స్ ఛాయిస్) టైటిల్స్ అండ్ ట్రోఫీస్ గ్రహీతలు. ‘ఆథర్ ఆఫ్ ద మంత్’ (సెప్టెంబర్ 2020) టైటిల్ (& బహుమతి) గ్రహీతలు.
ఆంగ్లంలో - కథలు, వ్యాసాలు వందకు పైగా ప్రముఖ జాతీయ దినపత్రికలలోను, ‘కేరవన్’, ‘విమెన్స్ ఎరా’, ‘ఎలైవ్’ వంటి ప్రముఖ పత్రికలలోనూ ప్రచురితమయ్యాయి. కొన్ని కథలకు బహుమతులు లభించాయి. ఓ ప్రముఖ జాతీయ దినపత్రిక (ఇండియన్ ఎక్స్ ప్రెస్) లో వీక్లీ (లిటరరీ) కాలమ్ కి రాయడం జరిగింది. ఓ జర్మన్ పబ్లిషింగ్ హౌస్ ద్వారా 20 ‘ఇ-బుక్స్’ ప్రచురింపబడ్డాయి.
హిందీలో- అరడజను కథలు ప్రచురితం కాగా, బాలల నాటిక ఒకటి ఆలిండియా రేడియోలో ప్రసారితమయింది.
📖 26 రచనలు
📚 0 పుస్తకాలు
✍️ 0 ఇతర రచనలు
👥 0 Followers

సహరి రచనలు

MONTHLY General
మర్డర్ ప్లాన్
MONTHLY General
సెవెంత్ ఫ్లోర్
WEEKLY General
పచ్చ బొట్టు
WEEKLY General
దట్ గై
WEEKLY General
హంతకుడి ఇస్తోకు
WEEKLY General
ఆ ఒక్కటీ అడక్కు
WEEKLY General
మత్తు వదలరా
WEEKLY General
డాన్ భార్య
WEEKLY General
హిమాలయన్ బ్లండర్
WEEKLY General
కిరాయి హంతకుడు
WEEKLY General
కామిని
WEEKLY General
ఇంటి దొంగలు
WEEKLY Crime
పట్టుకో చూద్దాం
WEEKLY Crime
పెంట్ హౌస్
WEEKLY Crime
అచ్చిరాని అతితెలివి
WEEKLY Crime
శవం చేసిన హత్య
WEEKLY Crime
మోడల్ మరణం
WEEKLY Crime
రెండో హారం
WEEKLY Crime
అతిథి హత్య
WEEKLY Crime
కథలో రాజకుమారుడు
WEEKLY Crime
కిల్లర్
MONTHLY General
కథ వెనుక కథ
MONTHLY General
జననీ జన్మభూమిశ్చ
MONTHLY General
ది కిడ్నాపర్
MONTHLY General
కాకటెయిల్ గాళ్
MONTHLY General
మిస్సింగ్ బుల్లెట్

నా పుస్తకాలు

ఇతర రచనలు

ఇంకా ఇతర రచనలు జోడించాలి