వారణాసి భానుమూర్తి రావు

Poet cum Writer

రచయిత పరిచయం.
---------------------------------------
వారణాసి భానుమూర్తి రావు గారు , ఆంధ్రప్రదేశ్, చిత్తూరు జిల్లాలోని మహల్ రాజుపల్లె లో 28 వ తేదీ , ఏప్రియల్ నెల , 1956 లో జన్మించారు . తల్లి దండ్రులు శ్రీ కీ.శే వారణాసి కృష్ణ మూర్తి రావు గారు మరియు కీ. శే శ్రీమతి స్వర్ణాంబ గారు. వారి నాన్న గారు ప్రాధమిక పాఠశాలలో ఉపాధ్యాయుడుగా పనచేశారు. వృత్తిరీత్యా ప్రముఖ కార్పొరేట్ కంపెనీలల్లో ముఖ్య ఆర్థిక కార్య నిర్వహణాధికారిగా పనిచేసారు. ప్రవృత్తి రీత్యా కథలు , వచన కవితలు వ్రాస్తున్నారు.‌. ఇంత వరకు 60 దాకా కథానికలు, 600 దాకా వచన కవితలు వ్రాశారు . కథలు ఆంధ్ర జ్యోతి , విజేత , ఆంధ్ర ప్రభ ,జాగృతి మొదలైన పత్రికలలో ప్రచురింపబడ్డాయి. రచయిత రాయలసీమ వ్యవహారిక బాషలో వ్రాయడానికి ఇష్టపడతారు..‌ . ఇతని కథలు , కవితలు ఆన్ లైన్ పత్రికల్లో విరివిగా ప్రచురింప బడుతున్నాయి. ఉష పక్ష పత్రిక, ఉష అంతర్జాల పత్రిక సహరి, కథా మంజరి , సాహిత్య ప్రస్థానం , విమల సాహితీ , సూర్య , రవళి , తెలుగు .కాం మున్నగు అంతర్జాల పత్రికల్లో మరియు ఫేస్ బుక్‌ లోని వివిధ సాహితీ గ్రూపుల్లో ప్రచురించబడినాయి. ' నువ్వే నా పెద్ద కొడుకు సామీ! ' ఉషా కథల పోటీలో బహుమతి పొందినది. . ఇంకా కొన్ని కథలు సాధారణ ప్రచురణకు ఎన్నికయ్యాయి. రెండు వ్యాసాలు , 100 వచన పద్యాలు ఉషా పత్రికలో ప్రచురిత మయి నాయి.

ప్రచురించిన పుస్తకాలు

1. సాగర మథనం ( కవిత్వం)
2. సముద్ర ఘోష ( కవిత్వం)
3. మట్టి వేదం ( కవిత్వం
4. పెద్ద కొడుకు ( కథల సంపుటి)

ఇంత వరకు లభించిన బిరుదులు;

1. ప్రతిలిపి కవితా ప్రపూర్ణ
2. సహస్ర కవి రత్న
3. సాహితీ భూషణ
4. గిడుగు రామమూర్తి వారి సాహిత్య పురస్కారం మట్టి వేదం కవితా సంపుటికి
5. ప్రతిలిపి సాహిత్య అవార్డు
6. కళావేదిక వారి సాహితీ పురస్కారం‌
7. గిడుగు రామమూర్తి వారి సాహిత్య పురస్కారం పెద్ద కొడుకు కథా సంపుటికి


నా కథలకు ప్రేరణ
----------------------

నా చుట్టూ పరిసరాలు , సమాజంలో నిరు పేదలు పడుతున్న కష్టాలు , సమాజంలో జరుగుతున్న అన్యాయాలు , అక్రమాలు , ద్వంద నీతులు , పేద ధనిక తార తమ్యాలు ఇవే నా కథలకు స్ఫూర్తి నిస్తాయి.‌నేను రోడ్డు ప్రక్కన , రైల్వే ప్లాట్ ఫార్మ లలో బ్రతికే నిర్భాగ్యులను నిశితంగా పరిశీలించి , వారి మీద కథలు అల్లుతాను.


వారణాసి భానుమూర్తి రావు
హైదరాబాదు
చరవాణి: 9989073105
📖 0 రచనలు
📚 0 పుస్తకాలు
✍️ 0 ఇతర రచనలు
👥 0 Followers

సహరి రచనలు

నా పుస్తకాలు

ఇతర రచనలు

ఇంకా ఇతర రచనలు జోడించాలి

📚

Follow This Author

రచయితలను Follow చేయడానికి Login లేదా Free Registration అవసరం.

🎁 ప్రత్యేక స్వాగత బహుమతి

మీరు సహరిలో మొదటిసారి ఏ రచయితనైనా అనుసరిస్తే

✅ 7 రోజుల ప్రీమియం యాక్సెస్
📖 సహరి వారపత్రిక అన్ని సంచికలు
📘 సహరి మాసపత్రిక అన్ని సంచికలు
👧 బాలసహరి అన్ని సంచికలు

💳 కార్డు వివరాలు అవసరం లేదు
🆓 ఉచిత సభ్యత్వ నమోదు సరిపోతుంది
Login Register Free