రాయడం ఎప్పుడో మొదలు పెట్టినా ఈ మధ్య ప్రయాణం కొద్దిగా సాగుతోంది..అమ్మవారి అనుగ్రహం!
హైదరాబాద్ ఏ. జి. ఆఫీస్ లో అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్ గా రిటైర్మెంట్. మా ఆఫీస్ లో ఉన్న రంజని సంస్థ తో ప్రత్యేక అనుబంధం.. ఆంధ్రభూమి, ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రభ, బాలజ్యోతి, నవ్య,ఈనాడు ఆదివారం, బాలసహరి, చతుర, ఉషా ఇలా వివిధ పత్రికలలో కథలు వచ్చాయి. ఈ మధ్య ముల్కనూర్ సాహితీ పీఠం, విశాఖ సంస్కృతి, సహరి, రవళి, మల్లెతీగ కథల పోటీలలో బహుమతులు లభించాయి.ఆకాశవాణికి రాసిన 'లేతమనసులు'నాటిక జాతీయస్థాయిలో ప్రసారం అయింది. సాహిత్యం సమాజానికి ఉత్తేజం, వికాసం ఇస్తాయని నమ్మే వాళ్లలో ఒకడిని.శుభాకాంక్షలతో
🙏