Mavuru.Vijayalakshmi
Writer, youtuber, story teller
అందరికీ నమస్కారం.
ఆలిండియా రేడియోలో బాలల కార్యక్రమంలో ఓ సంగీత ప్రధాన క్విజ్ కార్యక్రమంలో పాల్గొని 25 రూపాయల చెక్ తీసుకోవడంతో నా సాహిత్య ప్రస్థానం మొదలైందని చెప్పొచ్చు
స్వాతి పత్రిక వారు "నేనే ప్రధానమంత్రినైతే" అన్న అంశంపై పెట్టిన శీర్షికలో ప్రచురించబడిన వ్యాసంతో పత్రికలలో నా పేరు చూసుకున్నాను. ఈ మధ్యలో చాలా వ్యాసాలు రాశాను కాలేజీలోను, యూనివర్సిటీ లోను వ్యాసరచన, వక్తృత్వ పోటీల్లో బహుమతులు బాగానే తెచ్చుకున్నాను.
ఆంధ్రభూమిలో మహానటి, కలకంఠీ, రెండు అనుబంధ నవలలు , శ్రీవేంకటేశం పత్రికలో రెండు ఆధ్యాత్మిక సీరియల్ నవలలు ప్రచురించబడ్డాయి. స్వాతి మాస పత్రికలో చీకటి దాటిన నవల ప్రచురించబడింది. ప్రస్తుతం సహరి పత్రికలో తిరుమల వైభవం అధ్యాత్మిక ధారావాహిక వస్తోంది.
ఆంధ్రభూమి, ఆంధ్రప్రభ, ఆంధ్రజ్యోతి, ఈనాడు, సాక్షి, నవ్య, ఋషిపీఠం, జాగృతి, చిత్ర, వనిత, వనితాజ్యోతి, కలువబాల, శ్రీవేంకటేశం, సహరి వంటి పత్రికలలో నా కథలు, వ్యాసాలు... ఆంధ్రభూమి మంచిమాట, ఈనాడు అంతర్యామి సహా ప్రచురించబడ్డాయి.
ఆలిండియా రేడియోలో నేను రచించిన నాటికలు, కథలు, ప్రసంగాలు వివిధ విభాగాలలో బ్రాడ్ కాస్ట్ అయ్యాయి.
Red FM లో రేడియో జాకీగా పదేళ్లపాటు వివిధ రకాల కార్యక్రమాలు నిర్వహించాను. All India Radio లో యువవాణి కార్యక్రమాల వ్యాఖ్యాత్రిగా, రేడియో జాకీగా పనిచేశాను. పలు రేడియో నాటకాలలో, సీరియల్స్ లో ప్రధాన పాత్రలకు డబ్బింగ్ చెప్పాను. ప్రస్తుతం రేడియో నాటకాలలో గాత్ర కళాకారిణిగా కొనసాగుతున్నాను.
ప్రస్తుతం రెండు youtube channels (Vijayamavuru, Vijayamavuru Telugu Audio books), అలాగే 'Vijayamavuru'website నిర్వహిస్తున్నాను.