+91 9553678686

సహరి సమగ్ర వారపత్రిక లో వస్తున్న సీరియల్స్ గురించిన వివరాలు ఉంటాయి ఇక్కడ. ఇప్పటి వరకు జరిగిన కథ తెలుసుకోవాలంటే ఇక్కడ చూడండి


1. నీలిమిన్నాగు - గొర్లి శ్రీనివాస రావు


నగరంలో ప్రముఖ బిజినెస్ మాన్ వివేక్ హఠాత్తుగా చనిపోతాడు. అతని మరణం అనుమానాస్పదంగా ఉన్నా ఆధారాలు దొరకవు. ఆ హత్య కేసు పరిశోధిస్తున్న పోలీసులకు నీలిమ, జైలులో శిక్ష అనుభవిస్తున్న దాసు, ఇంకా కొందరు ఈ కేసుకి సంబంధం ఉన్న వాళ్ళు అని అనుమానం వస్తుంది. పరిశోధన సాగుతూ ఉండగా నమ్మశక్యం కాని కొన్ని మానసిక శక్తుల గురించి తెలుస్తుంది. నీలి మిన్నాగు అనేది నిజంగా ఉన్నదా, లేక అది మనసులో కలిగే ఒక భ్రమా అన్నది తెలుసుకోవాలంటే ఈ ఉత్కంఠభరితమైన సీరియల్ చదవాల్సిందే. 

2. ఔను నిజం...నువ్వంటే నా కిష్టం - పుట్టగంటి గోపీకృష్ణ


తేజ, ఓంకార్ లు పెళ్ళి కాని, ముదిరిపోయే ప్రమాదం లో ఉన్న బ్రహ్మచారులు. వారి అదృష్టం వారిని ఎటు తీసుకువెళ్తుందో, అందులో బామ్మ గారి పాత్ర ఏమిటో తెలుసుకోవాలంటే మీరు పుట్టగంటి గోపీకృష్ణ రచించిన ఈ సీరియల్ చదవాల్సిందే. ఒక పక్క ఊహకు అందని మలుపులు తిరుగుతూనే, మరో పక్క కడుపుబ్బ నవ్విస్తూ ఉషారుగా సాగే రసభరితమైన సీరియల్ ఇది.

3. నీ కోసం - పసుపులేటి  సత్య శ్రీనివాస్


కౌశిక్ ఒక పెద్ద బిజినెస్ మాగ్నేట్. ప్రణతి జైలు శిక్ష అనుభవించి వచ్చిన అమ్మాయి. తల్లిదండ్రులు ఉన్నా ఆమెను దూరం పెడతారు. ఒంటరిగా ఉన్న ప్రణతి కౌశిక్ కంపెనీలోనే ఉద్యోగం కోసం చేరుతుంది. వారి మధ్య పాత పరిచయాలు ఉన్నాయా? అతనికి, ప్రణతి కి మధ్య ఏన్నో రహస్యాలు ఉంటాయి. అవి ఒకటొకటిగా బయట పడుతూ ఉత్కంఠ రేపుతూ ఉంటాయి. మరో వంక సున్నితమైన ఒక ప్రేమ కథ పాఠకుల మనోనేత్రం ముందు ఆవిష్కృతం అవుతూ ఉంటుంది. 

4. సంభవం - సింహప్రసాద్


సహరి పాఠకులకు శుభాభినందనలు. 1973 లో నా సాహిత్యప్రస్థానం మొదలైంది. ఇంతవరకు 64 నవలలు, 394 కథలు, కొన్ని కవితలు ప్రచురింపబడినవి. 17 నవలలకు, 78 కథలకు, ఒక నాటకానికి బహుమతులు లభించాయి. వివాహ వేదం, తిరుమల దివ్యక్షేత్రం, 63 బహుమతి కథలు, స్త్రీ పర్వం, అభయం, ధిక్కారం నాకు బాగా పేరు తెచ్చాయి. 

సంభవం నా 65 వ నవల. ఇది అవినీతికి వ్యతిరేకంగా ఒక IAS అధికారి ఎక్కుపెట్టిన అస్త్రం. మీకు నచ్చుతుందని ఆశిస్తున్నాను.


ఈ  సీరియల్స్ చదవడానికి  సహరి  వీక్లి  కోసం. ఇక్కడ క్లిక్ చేయండి