ఔను నిజం నువ్వంటే నాకిష్టం-1

This is Romedy serial written by Puttaganti Gopikrishna. Part-1

ఔను నిజం నువ్వంటే నాకిష్టం-1

ఔను నిజం... నువ్వంటే నాకిష్టం-1

 

(పుట్టగంటి గోపీకృష్ణ)

 

తెనాలి రైల్వే స్టేషన్

       అర్ధరాత్రికి ఇంకా అయిదు నిమిషాల టైముంది.

       వీపున పది కిలోల బ్యాగులు మోస్తూ, తిరుపతి నుండి రాబోయే నారాయణాద్రి కోసం ఎదురు చూస్తున్నారు ఇద్దరు యువకులు.

       ఇద్దరి డ్రెస్సింగ్మోడ్రన్గా ఉన్నా మొహాల్లో కళ లేదు. జీవితంలో ఏదో కోల్పోయినట్లు దిగులుగా ఉన్నారు. కానీ దిగులును బయట పెట్టుకోకుండా ఉండటానికి విశ్వ ప్రయత్నం చేస్తున్నారు.

       ముందుగా తనే ఓపెన్అయ్యాడు ఓంకార్‍. జరిగిన దాని గురించి బాధ పడకురా తేజా…” అన్నాడు పక్కవాడి భుజం మీద చెయ్యి వేయటానికి ప్రయత్నిస్తూ. పెళ్లి చూపులనేవి బ్యాచిలర్జీవితంలో ఒక ఫేజ్‍. నడవక తప్పని బాటలో దాటక తప్పని స్పీడ్బ్రేకర్లు. ఫేజ్దాటి అన్ని ఆటంకాలు ఎదుర్కొంటే కానీ సంసారం అనే స్వర్గం సాకారం కాదు.

       విషయం ఎవడాలోచిస్తున్నాడెహె…” చేతిని విదిలించి కొడుతూ అన్నాడు తేజ.

       మరెందుకంత దిగులుగా ఉన్నావ్‍?సంభాళించుకుని అడిగాడు ఓంకార్‍.

       నా మూడ్నీకు అలా అర్ధం అయిందా? దీన్ని దిగులుగా ఉండటం అనరు. గంభీరంగా ఉండటం అంటారు.

       పళ్ళూడగొట్టుకోవటానికి పకోడీలో రాయి అయినా, పలావులో రాయి అయినా ఒకటే. మనలో మన మాట గంభీరానికి కారణం మరోసారి పెళ్లి చూపుల్లో ఛీ కొట్టించుకోవటమేగా. కవరింగులు ఆపి ఒరిజినల్తేజని బయట పెట్టరా...

       జీవితంలో ఒక గాఢ నిర్ణయం తీసుకున్నపుడు ఎక్స్ప్రెషన్అలానే ఉంటుంది.

       నిర్ణయం గట్టిగా తీసుకుంటారు. గాఢంగా కాదు. అయినా పిచ్చి ప్రేలాపన ఆపి నువు తీసుకున్న నిర్ణయం ఏమిటో చెప్పు? 

       ఇక జీవితంలో పెళ్ళి చూపులకు అటెండ్కాను.

       తేజ చెయ్యి పట్టుకుని గట్టిగా ఊపుతూ, అదీ మాటంటే! అదే మాట మీద నిలబడు. నీకు తోడు వచ్చీ వచ్చీ నా రెప్యూటేషన్కూడా దెబ్బతింటోంది. అన్నాడు ఓంకార్సంతోషంగా. అప్పటిదాకా అతనిలో గూడు కట్టుకున్న దిగులు ఉఫ్ఫుమని ఊదినట్లు ఎగిరి పోయింది.

       అతని ఉత్సాహం చూసి మండుకొచ్చింది తేజకి. నీ మొహానికి రెప్యుటేషన్కూడానా? అసలు పిల్లిలాగా నిన్ను వెంట పెట్టుకుని వెళ్లటంతోనే నాకీ దరిద్రం అని గాఢంగా డౌటొస్తోంది.

       మళ్లీ గాఢంగా అన్న పదం తప్పుగా వాడావ్…”

       ఇంతలో ఇద్దరి మాటలకీ అంతరాయం కలిగిస్తూ ప్లాట్ఫాం మీదకు వస్తున్న నారాయణాద్రి కనిపించింది.   

       అర్ధరాత్రి కావటంతో రిజర్వేషన్చేయించుకున్న అయిదారుగురు తప్ప పెద్దగా జనాలు లేరు.

       ఇద్దరు తమ S-6 బోగీ ఆగే చోటుకు వెళ్లి నిలబడ్డారు.

       ఆగిన ట్రైన్లోకి ఎక్కారు వారు.

ముందు ఎక్కిన ఓంకార్కంపార్ట్మెంటు లోపలికి నడవబోతూ డోర్దగ్గరే ఆగిపోయిన తేజని చూసి, లోపలకి నడువ్…” అన్నాడు.

ట్రైన్ కదలనియ్యరా...

ఏం లోపు ఏమన్నా స్టేషన్లో అద్భుతం జరుగబోతుందా? సిగ్నల్స్థంభంలాగా నువు ఇక్కడ నిలబడకపోతే జరిగే అద్భుతం ఆగిపోతుందా? వెటకారంగా అన్నాడు.

దిల్వాలే దుల్హనియా లే జాయెంగే సినిమాలో షారుక్నుండి మర్యాద రామన్నలో సునీల్దాకా తమ ఫియాన్సీలని ఇలా కదులబోతున్న రైల్లోనే కలుసుకున్నార్రా…” ఆశగా ప్లాట్ఫాం వైపు చూస్తూ అన్నాడు తేజ.

ఇంతలో గట్టిగా కూత పెట్టిన ట్రైన్మెల్లగా కదిలింది.

అంటే ఇప్పుడు నీకు కూడా ఒక హీరోయిన్ఇక్కడ దొరుకుదంటావా? తేజ పక్కకి వచ్చి ప్లాట్ఫాం మీదకు తొంగి చూశాడు ఓంకార్‍. మన దరిద్రానికి అంత అదృష్టం కూడానా? కలరింగ్కాదు కదా, ఆడ జీవి ఏదీ ప్లాట్ఫాం మీద లేదు…” అనబోయి ఆఖరి మాటను నోట్లోనే మింగేస్తూ ఆగి పోయాడు.

అతని మాటల్లో తేడా గమనించి అతను చూస్తున్న వైపు తను కూడా చూపు సారించాడు తేజ. తెల్ల చీర కట్టుకున్న ఒక డెబ్భై ఏళ్ల బామ్మ అప్పుడే ఓవర్బ్రిడ్జి మీద నుండి ప్లాట్ఫాం మీదకు ఎగిరి దూకింది. ఆమె వెనుక ఒక పోర్టర్‍. అతని చేతిలో రెండు మూడు భారీ లగేజీలు ఉన్నాయి.

చైను లాగుదామా? అన్నాడు తేజ.

ఆవిడకి డెబ్భై పైనే ఉన్నట్లున్నాయిరా…” తేజ వంక అనుమానంగా చూస్తూ అన్నాడు ఓంకార్‍.

ఛీ అందుకు కాదు. పాపం పెద్దావిడకి ట్రైన్మిస్సవుతుందేమో…”

ఇప్పుడావిడ అర్జంటుగా ట్రైన్ఎక్కి దేశాన్ని ఉద్ధరించాలి? దారిన పోయే తద్దినాన్ని పిలిచి నెత్తికెక్కించుకోమాకు…” నిర్దయగా అన్నాడు ఓంకార్‍.

అయితే కదులుతున్న కంపార్ట్మెంట్చూసి బామ్మ ఏమాత్రం బెదర్లేదు. అర క్షణంలో చెప్పులు విప్పి చేత్తో పట్టుకుంది. కుచ్చిళ్లు బొడ్లో దోపింది. తరువాత మాత్రం ఆలస్యం చేయకుండా 400 మీటర్ల రేసులో పిస్టల్మోత విన్న పి.టి.ఉషలా S-6 బోగీ వైపు దూసుకు వచ్చింది. రెండు చేతులూ ఇంజిన్లో పిస్టన్లా చకచక ఊపుతూ ఆమె పరుగెత్తుతుంటే మడి చీర కట్టుకున్న మరమనిషి పరుగెత్తుతున్నట్లుంది. ఆమె వేగానికి ఏమాత్రం సరి తూగని పోర్టర్కనీసం రేసులో ఆఖరి స్థానం అయినా రాక పోతుందా అన్నట్లు నీరసంగా ఆమెను అనుసరిస్తున్నాడు.

వేగానికి అచ్చెరువొందిన ఓంకార్ఆశ్చర్యం నుండి తేరుకోక ముందే ఆమె కంపార్ట్మెంట్డోర్దగ్గరకు వచ్చేసింది. అలా పరుగెత్తుతూనే బోగీ మీద ఉన్న కంపార్ట్మెంట్నెంబర్కన్ఫర్మ్చేసుకుంది. తరువాత కమాన్క్యాచ్…” అంటూ చేతిలో ఉన్న చెప్పులు రెండూ ఓంకార్వైపు విసిరేసింది.

జీవితంలో ఎన్నో క్రికెట్మ్యాచులు ఆడాడు ఓంకార్‍. బ్యాటింగూ, బౌలింగూ బ్రహ్మాండంగా చేసేవాడు. కానీ ఏనాడూ ఒక్క క్యాచ్కూడా పట్టిన పాపాన పోలేదు. ఏంటో ఎప్పుడూ చేతికి అందినట్లే అంది బాల్జారిపోయేది. అందుకే వాడిని ఎవరూ తమ టీములో ఆడనిచ్చే వారు కాదు. అలాంటిది ఇప్పుడు మాత్రం వద్దనుకున్నా చెప్పులు రెండూ సరిగ్గా వచ్చి అతని చేతుల మధ్య ల్యాండయ్యాయి.

కళ్ల ముందు జరుగుతున్న సంఘటనను సినిమా చూసినట్లు చూస్తున్న తేజ, ఏంట్రా బడుద్ధాయ్‍! చెయ్యి అందుకో…” అంటున్న బామ్మ మాటతో లోకంలోకి వచ్చాడు.

తను చెయ్యి ఇవ్వక పోయినా ఆమె లోపలకు వచ్చేటట్లే ఉంది. అందుకే చెయ్యి ముందుకు చాచాడు తేజ.

చెయ్యి అందుకుని చులాగ్గా చెంగుమని ఒక్క గెంతు గెంతి కంపార్ట్మెంట్లోకి వచ్చి పడింది బామ్మ. బామ్మ వెనుక పరుగులు పెడుతున్న పోర్టర్ఆమెను అందుకోలేక పోయినా, వాడి దగ్గరకు కంపార్ట్మెంటే వచ్చింది. బామ్మ లాఘవంగా వాడి చేతుల్లో ఉన్న లగేజీ ఒకొటొకటిగా లాక్కుని వెనక్కి పెట్టెలోకి విసిరేసింది.

బామ్మగోరూ నా డబ్బులండీ. గోల చేస్తున్నాడు పోర్టర్‍.

ఉరేయ్‍! ఒక యాభై వాడికి ఇవ్వు. తేజకి ఆర్డర్వేసి వెనక్కి తిరిగింది బామ్మ.  

ఒక భారీ సూటుకేసు నెత్తి మీద, ఒక బ్యాగు కుడి చంకలో మరో బ్యాగు ఎడమ చేతిలో వేలాడుతూ నిలబడి ఉన్నాడు ఓంకార్‍.

ఎందుకురా అట్టా నేల చూపులు చూస్తూ నిలబడ్డావ్‍. నడువ్‍. 41 నెంబర్బెర్త్దగ్గరకి పద…” అంటూ అతని రియాక్షన్కోసం ఎదురు చూడకుండా తను వెళ్లి పోయింది.

ఇంతలో పోర్టర్కి డబ్బులు ఇచ్చిన తేజ ఓంకార్నెత్తి మీద నుండి భారీ సూట్కేసు దించాడు.

ఇది రైలు కాబట్టి సరిపోయింది అదే విమానమో అయితే సూటుకేసు బరువుకి కూలిపోయి ఉండేది. అంత బరువుందది. పైగా నేల చూపులు చూస్తున్నానని నామీద వెటకారం బాంబు వేస్తుందా ముసల్ది…” పళ్లు కొరుకుతూ అన్నాడు ఓంకార్‍.

వీళ్లిద్దరూ ఆమె సామాను 41 నెంబర్బర్త్దగ్గరకు చచ్చిన శవాన్ని ఈడ్చుకు వచ్చినట్లు తెచ్చేసరికి అప్పటికే సీట్లో పడుకున్న ఒక వ్యక్తిని బెదరగొట్టి దూరంగా తరిమి, రండ్రా పిల్లలు మీ నెంబర్లెంత? అంది ఆమె.

తమ టిక్కెట్తీసి చూసుకుని, మిడిల్బెర్తూ, అప్పర్బెర్తూ…” అంటూ ఆమె సీటు మీద ఉన్న బెర్తులను చూపించారు.     

కూర్చోండిరా…” అప్పుడే రిలీజ్అయిన ఐఫోన్సగం రేటుకు ఆఫర్చేస్తున్నట్లు పక్కన చోటు చూపిస్తూ అంది బామ్మ.

మీరు పడుకోరా? అనుమానంగా అడిగాడు తేజ.

తొందరేముంది? అయినా రాత్రి పూట నిద్ర ఎక్కడ పట్టి ఛస్తుంది?

అంటే పగలు మాత్రమే పక్కవాళ్లకి ప్రశాంతతనిస్తారా? అమాయకంగా అడిగాడు ఓంకార్‍. ఇప్పుడతను నేల చూపుల నింద నుండి తప్పించుకోవటానికి తల పైకి ఎత్తి పట్టి నడుస్తున్నాడు. 

వీడికి కాస్త వెటకారం ఎక్కువ అనుకుంటానే అయినా అలా కళ్లు నెత్తి మీదకు తెచ్చుకుంటే బొక్కబోర్లా పడతావ్‍. తల ఎత్తి నడుస్తున్న అతన్ని చూసి అంది.

ఠక్కున తల మామూలుగా దించాడు ఓంకార్‍.

వాడి మాటలు పట్టించుకోకండి. మొహమాటంగా అన్నాడు తేజ.

పెళ్లయిందా? అడిగింది బామ్మ ఇద్దరి వేపూ చూస్తూ.

అవలేదు అన్నట్లు జమిలిగా తల అడ్డంగా ఊపారు వారు.

ఇప్పట్నుండే నోటి దూల తగ్గించుకో. లేకపోతే ఆరు నెలలకి మించి అమ్మాయీ నిన్ను భరించదు.

ఇంత సహాయం చేస్తే కృతజ్ఞత అన్నది లేకుండా ఇలా శాపం పెడతారా? ఏడుపు గొంతుతో అన్నాడు ఓంకార్‍.

శాపం కాదురా పిచ్చి సన్నాసీ. లోక జ్ఞానం నేర్పుతున్నాను. లోకం ఎట్టా ఉంది? రోజూ ఎంత మందిని చూస్తున్నాను అమ్మాయిలు మునుపట్లా లేరురా. అణిగిమణిగి ఉండటం ఇప్పట్నుండే ప్రాక్టీస్చెయ్యకపోతే నీ గతి అధోగతే... అని ఉన్నమాట చెప్తున్నాను.

ఏంటి మీరు జోస్యం కూడా చెప్తారా?

నీ ఫ్యూచర్చెప్పటానికి జోస్యం చెప్పటం తెలియనవసరం లేదు. వాలం లేకపోయినా నీ వాలకం చూసి చెప్పొచ్చు వాలి వారసుడివని.

ఆమె చెప్పింది ఏంటో సరిగ్గా అర్ధం కాక పోయినా మాటల్లో ఆమెను ఓడించటం అసాధ్యం అని డిసైడ్అయ్యారు వారు.  

ఇంతలో ఇంకో పాసెంజర్ఎక్కడ ఎక్కాడో అప్పుడే వచ్చాడు. భారీ కాయంతో ఆపసోపాలు పడుతూ వచ్చి బెర్తు నాది…” అన్నాడు బామ్మ లోవర్బెర్తు వైపు వేలు పెట్టి చూపిస్తూ.

గజగజ వణకుతూ ఎదురుగా నిలబడ్డ మేకపిల్లని సావకాశంగా చూసే పులిలా అతన్ని కింద నుండి పైదాకా తేరిపార చూసింది బామ్మ. నీదయితే రేపు ఇంటికెళ్ళేటపుడు పట్టుకుపోరా అబ్బీ…” అని ఒక జోకు జోకి తేజ, ఓంకార్వైపు తిరిగి కన్ను కొట్టింది.

కిసుక్కున నవ్వారు వారు.

నా దగ్గర రిజర్వేషన్ఉంది. అవమానంగా అన్నాడు ఆ పాసెంజర్తన టికెట్పర్సులో నుండి తీస్తూ.

మడిచి…” అని కాస్త గ్యాప్ఇచ్చి, పర్సులో పెట్టుకో. టికెట్నా దగ్గరా ఉంది. కాళ్లు రెండూ పైకెత్తి బెర్తు మీద బాసింపట్టు వేస్తూ అంది.

ముక్కు పుటాల నుండి వేడి ఆవిర్లు వస్తుంటే, కాలకేయుల కిలికి భాషలో కొన్ని తిట్లు తనని తాను తిట్టుకుని, అందరికీ అర్ధమయ్యే భాషలో ఇప్పుడే టి.సి.ని తీసుకు వస్తాను…” అని వార్నింగ్ఇచ్చి వెళ్ళి పోయాడతను.

అబ్బాయిలూ! మీరు పక్కన ఉండటం మంచిదయింది. లేకపోతే నన్ను ఒంటరిదాన్ని చేసి బెర్తు మీద నుండి లేపేసినా లేపేశేవాడు…”

రామేశ్వరంలో శివలింగం అన్నా కదులుతుందేమో గానీ నువ్వు బెర్తు మీద నుండి కదులతావటే. అని మనసులో అనుకుని, నేను వెళ్లి పడుకుంటున్నాను. తన అప్పర్బెర్తు వైపు చూస్తూ అన్నాడు ఓంకార్‍.

పూరీలు తింటావా? అడిగింది బామ్మ వాడిని పైకి ఎక్కనీయకుండా టెంప్ట్చేయటానికి అన్నట్లు.

ఇప్పుడా. అయినా మేము మస్తాన్హోటల్లో మటన్బిర్యానీ తిని వచ్చాం. గర్వంగా అన్నాడు ఓంకార్‍.

అయితే పెరుగన్నం తిను.

బిర్యానీ తిని పెరుగన్నం తినకుండా ఎలా ఉంటాం? అది కూడా తిన్నాం?

పోనీ అరిశెలు టేస్ట్చేస్తావా?

బామ్మా! ఇప్పుడు టైము ఒంటి గంట అవుతోంది. అయినా అరిశెలు కావాలంటే ఇదుగో మా వీపుల మీద ఉన్న బస్తాల నిండా అవే ఉన్నాయి. మా బతుకులకి పెళ్లి యోగం ఎలాగూ లేదని మేము కూడా డిసైడ్అయ్యాము. అందుకే నోరు కూడా కట్టుకుని బతకటం ఎందుకని, ఇంట్లో వాళ్లు ఇచ్చినవి ఇచ్చినట్లు మూట కట్టుకుని బయలుదేరాం. అతను ఒక అడుగు పైకి లేపి పై బెర్తు ఎక్కటానికి ప్రిపేరవుతూ అన్నాడు.

సరే వెళ్లు…” అంటూ ఉడక పెట్టిన వేరుశెనక్కాయలు బెర్తు మధ్యలో వొంపింది. పి.సి.సర్కార్మ్యాజిక్షోలో కళ్లు మూసి తెరిచే లోపు ప్రత్యక్షమయిన పావురాల్లా ఇంతలో వేరుశెనక్కాయలు ఆవిడ చేతిలోకి ఎలా వచ్చాయీ ఇద్దరికీ అర్ధం కాలేదు.

కమ్మటి వాసన కంపార్టుమెంటంతా వ్యాపించింది.

గాల్లోకి లేపిన కాలును ఏం చేయలో అర్ధం కాలేదు ఓంకార్కి.

అతని సందిగ్ధం గమనించి, పైకి వెళ్తానన్నావుగా, వెళ్లూ... అంది కొంటెగా.

పళ్లు కొరికి, రెండు గుప్పిళ్ల కాయలు ఆపళంగా ఒడిసిపట్టి లాఘవంగా పై బెర్తు మీదకు ఒక్క జంపు చేసి వెళ్లి పోయాడు ఓంకార్‍.

నేను చెప్పలా వాలి వారసుడని…” అంది బామ్మ.

 (ఇంకా వుంది)