బంధం
ఆ లెటర్ ఎన్నిసార్లు చదివాడో చంద్రం . కాత్యాయని వ్యగ్యంగా అంది . ’ ఇంకా ఏమన్నా మర్చిపోయాడా మీ అన్న . అంతా పంచుకుని వెళ్ళాడుగా ... ఈ ఇల్లు గుర్తొచ్చింది కాబోలు పంచుకుందుకు ..’ అని .
బంధం
- జాస్తి రమాదేవి
ప్రియమైన తమ్ముడు చంద్రానికి అన్నయ్య సూర్యం దీవించి వ్రాయునది . ఇక్కడంతా క్షేమం . అక్కడ నువ్వు
మరదలు కాత్యాయని , పిల్లలు అందరూ క్షేమంగా ఉన్నారని తలుస్తున్నాను . నీతో చాలా విషయాలు మాట్లా
డాలి . ఈ వారంలో ఊరికి వస్తాను .వచ్చాక మాట్లాడుకుందాం . ఉంటాను మరి... ఇట్లు అన్నయ్య సూర్యం ’
ఆ లెటర్ ఎన్నిసార్లు చదివాడో చంద్రం . కాత్యాయని వ్యగ్యంగా అంది . ’ ఇంకా ఏమన్నా మర్చిపోయాడా
మీ అన్న . అంతా పంచుకుని వెళ్ళాడుగా ... ఈ ఇల్లు గుర్తొచ్చింది కాబోలు పంచుకుందుకు ..’ అని .
చంద్రం మనస్సు చివుక్కుమంది . ఇన్నాళ్ళకి అన్నయ్య ఉత్తరం రాసాడు . సంతోషించాల్నిన విషయాన్ని కూడ
సంసయించాల్సి వస్తోంది .
అన్నయ్య అంటే తనకెంతో ఇష్టం . అన్నయ్య తనను వొదిలి వెళుతుంటే కాళ్ళావేళ్ళా పడ్డాడు .
" మొత్తం నువ్వే తీసుకో అన్నయ్యా ! నేను నీ దగ్గర పాలేరు నైనా పర్లేదు . నీకు తోచింది ఇవ్వు అంతే గాని
నన్ను వొదిలి వెళ్ళొద్దని " బ్రతిమాలాడు . అన్నయ్య విదిలించుకుని వెళ్ళి పోయాడు . పుట్టుకతో వచ్చిన
బంధాన్ని తెంచుకుని అత్తగారి ఊరు వెళ్ళిపోయాడు .చాలా సార్లు తనెళ్ళి ఇంటికి వచ్చెయ్యమని అడిగాడు.
రానన్నాడు . అక్కడ వాళ్ళ మర్యాద నచ్చక తను ఇంక వెళ్ళడం మానుకున్నాడు . ఎప్పుడైనా బంధువుల ఇళ్ల
లో జరిగే శుభ కార్యాల్లో కల్సినా అన్నయ్య తనూ పొడిపొడి మాటలు తప్ప పెద్దగా మాట్లాడుకున్నది లేదు .
నాన్న అన్న ఒకే ఒక్క మాట పట్టుకుని తన చెయ్యి వొదిలించుకుని దూరంగా వెళ్ళిపోయాడు .
’ ఏరా పెద్దోడా ! చిన్నోడికి నోట్లో నాలుక లేదని , నువ్వు ఎంతంటే అంత అంటున్నాడని వాడిని పాలేరు లా
చూడొద్దురా ! ’ అన్నాడు నాన్న .
అంతే అన్నయ్య అన్నం తినడం మానేసి అలిగి పడుకున్నాడు . వదిన రెచ్చగొట్టింది . పుట్టింటికి దారి మళ్ళిం
చింది . అన్నయ్య ఆస్తి పంపకాలన్నాడు . ఎందరు చెప్పినా వినలేదు . అన్న అలా మారిపోతాడని అనుకోలేదు
ఇన్నాళ్ళకి వస్తానని ఉత్తరం రాసాడు . ఈ ఉత్తరానికి ఆంతర్యం ఏంటో అర్ధం కావడం లేదు . కాత్యాయని
అన్నట్టు ఈ ఇంటి కోసమా ! అమ్మానాన్నలు తన దగ్గర ఉండటంతో వారికి వచ్చిన ఆస్తిని తను అనుభవించా
డు . వారి మరణాంతరం సగం ఆస్తి పంచి అన్నయ్యకి ఇచ్చేసాడు . ఇల్లు మాత్రం మనందరి గుర్తుగా నేను
ఉంచుకుంటానని , కావాలంటే రేటు కట్టి ఇస్తానని , అంటే వొద్దులే అన్నాడు అన్నయ్య . ఇప్పుడు మళ్ళీ ఆశ
పుట్టి ఉంటుందా ? రకరకాల ఆలోచనలు చంద్రాన్ని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి . కాత్యయనితో , ’ ఏం జరిగినా
అన్నయ్యని బాధ పెట్టొద్దని ’ హెచ్చరించాడు .
’ తనూ నీ లాగే తనూ నాకు బావేలే ’ నవ్విందామె .
పుట్టినప్పటినుంచీ అన్నయ్య మాట వినిపిస్తే చాలు ఏడ్చేవాడు ఊరు కునే వాడంట తను . అన్నయ్య బైటికి
వెళ్ళిరాగానే , వేలు అందిస్తే చాలు , గబుక్కున పట్టుకునేవాడంట . బడికి వెళ్ళి రా గానే తనని వొడిలో కూర్చో
బెట్టుకుని బడిలో విన్న పాఠాలు , పద్యాలు , ఆటలు అన్నీ చెప్పేవాడంట అన్నయ్య . చక్కిలిగిలి పెట్టకపోయి
నా , పకపకా నవ్వేవాడంట తను . అడుగులు తన వేలు పట్టుకొనే నేర్చుకున్నాడంట . అన్న చెయ్యి వొదిలేవా
డు కాదంట తను . బడిలో వేసాక తన పక్కన అన్నయ్య ఉండాలని ఏడుస్తుంటే మధ్య మధ్యలో అన్నయ్యని
పిలిపించేవారంట మేస్టారు . తన కోసం నిమ్మతొనల మిఠాయి కొని పెట్టి ఏడవొద్దు అనేవాడు . ఓ సారి ఊరి
లో హరికథా కాలక్షేపం జరుగుంటే , అన్నయ్య పక్కన కనిపించలేదని బాగా ఏడ్చాడు తను . అంతా రసా
బాస అయిపోయింది .దాసు గారు కాస్సేపు కథ చెప్పడం ఆపేసారు . ఇంటికి వచ్చాక అన్నయ్య బాగా కోప
గించుకున్నాడు . ’ ఇంక వీళ్ళి నాతో పాటు ఎక్కడికీ తీసుకెళ్ళను ’ అన్నాడు .
అన్నయ్య పక్కనే పడుకునేవాడు తను . మధ్య రాత్రిలో అన్న కనబడ లేదని ఇల్లంతా వెతుక్కునేవాడు .
’ వోరి బాబోయ్ ! పాస్ పోసుకోడానికి కూడా పోనివ్వ వా ! ’ అంటూ విసుక్కున్నా తన దారి తనదే ....హైస్కూల్
కి వెళ్ళాక అన్నయ్య చాలా మారిపోయాడు . తనెప్పుడు చెయ్యి పట్టుకోవాలనుకున్నా విసుక్కునేవాడు .
’ ఏరా ! చెయ్యి పట్టుకోకుండా నడవలేవా ! ’ అనేవాడు .
" నువ్వే అలవాటు చేసి ఇప్పుడు నువ్వే కోప్పడతావేంటిరా ! పట్టుకొనీ తమ్ముడేగా ..." అనేది అమ్మ .
’ ప్రతి చోటికి చెయ్యి పట్టుకుని తోకలా వస్తుంటే చిరాగ్గా ఉంటోంది నాకు . ’ అన్నయ్య ఎందుకు అలా
అన్నా , తనకి ప్రేమగా అన్నీ కొని ఇచ్చేవాడు .
ఊళ్ళో అందరూ అన్నయ్యని , తననీ రామలక్ష్మణులు అనేవారు . అమ్మ ప్రతి రోజూ దిష్టి తీసేది .
హైస్కూల్ చదువు తో అన్నయ్య చదువు మానేసి నాన్నకి వ్యవసాయం లో తోడయ్యాడు . అన్న దారే
తనదీను స్కూల్ చదువు తో తనూ మానేసి , అన్నతో తనూ పొలానికి వెళ్ళేవాడు . నాన్న అప్పుడప్పుడు కోప్పడేవాడు .
’ నువ్వు కాస్త నీ కాళ్ళమీద నిలబడ్డం నేర్చుకోరా ! ఎన్నాళ్ళు అన్న కాళ్ళమీద నలబడతావు ? ’ అనేవాడు .
తనదేం పట్టించుకోలేదు . అన్న దగ్గరుంటే చాలు అంతే .
అన్నయ్య జీవితంలో కి వదిన వచ్చాక కొంచెం దూరం ఏర్పడింది . పిల్లలు పుట్టాక ఆ దూరం మరింత పెరిగి
నా , అన్న దగ్గరే ఉంన్నాడనే ధైర్యం ఉండేది . మేనమామ కూతురు కాత్యయనితో పెళ్ళయ్యింది తనకి .
చిన్నగా అగ్గి రాజుకోడం మొదలయ్యింది . తన భర్త పాలేరు కాదని కాత్యాయని మాట తూలింది . నాన్నా అదే
అనేసరికి అన్నయ్య పట్టుదలకు పోయాడు . ఆస్తి మూడు ముక్కలయ్యింది . పిల్లల పెళ్ళిళ్ళప్పుడు అందరూ
వచ్చారు . అమ్మానాన్నలు పోయినప్పుడు వచ్చారు . మళ్ళీ పంపకాలు జరిగాయి . చిన్నప్పటి ప్రేమంతా అన్న
లో ఏమయిపోయిందో మళ్ళీ కనబడలేదు . పరాయి ఇంటికి వచ్చినట్టుండి వెళ్ళాడు . ఏడాది ఏటిమాసికాల
ప్పుడైనా కలుస్తామనుకున్నా కుదరలేదు . ఎవరి ఇళ్ళల్లో వాళ్ళు చేసుకున్నారు .
పిల్లలకి పిల్లలు పుట్టి .... చాలా మార్పులు వచ్చేసాయి . మళ్ళీ ఇన్నాళ్ళకి ....ముపై ఏళ్ళ తర్వాత అన్నయ్య
తనని ’ తమ్ముడూ ! ’ అని సంబోదిస్తూ ఉత్రరం రాసాడు . ఈ వారంలో వస్తానన్నాడు .
ఆత్రంగా ఎదురు చూస్తున్నాడు అన్న కోసం చంద్రం .
ఆరో రోజు సూర్యం గుమ్మంలో నిలబడి ’ చంద్రం ! ’ అని పిలిచాడు .
పరుగు లాంటి నడకతో బైటికొచ్చాడు చంద్రం . అన్నని గట్టిగా కౌగలించుకోవాలని ఉన్నా మోమాటంతో ఆగి
పోయాడు . ’ రా అన్నయ్యా ! ఆరోగ్యం బాగుంటుందా ! వదినా , పిల్లలు ఎలా ఉన్నారు ? ’ గబగబా అడిగాడు.
కాత్యాయని కాళ్ళు కడుక్కుందుకు నీళ్ళు అందించింది . ’ పెద్ద బావా ! బాగున్నావా ! ’ అనడిగింది .
’ ఆ ... ’ అన్నాడు సూర్యం . ఉచిత మర్యాదలు పూర్తయ్యాయి . ఏం మాట్లాడుకోవాలో ఇద్దరికీ అర్ధం కావడం
లేదు . తన ముందు మాట్లాడుకోడానికి ఇబ్బంది పడుతున్నారని అనుకుంది కాత్యాయని .
" కాస్సేపు అలా పొలం వైపు వెళ్ళి రండి ... నేనీలోపల వంట పూర్తి చేస్తాను ." అంది .
చంద్రం గొడుగు తీసుకుని " పదన్నయ్యా ! నువ్వు మన పొలం చూసి చాన్నాళ్ళయ్యింది కదా ! " అంటూ లేవ
దీసాడు . ఇద్దరూ పొలం వైపు నడిచారు . సూర్యం దారిలో ఏం మాట్లాడలేదు . ఎదురొచ్చిన వాళ్ళకి
అన్నయ్య వచ్చాడు పొలం చూద్దామని వెళుతున్నాము . అని చెప్తున్నా డు చంద్రం . అన్న పక్కన నడుస్తుంటే
ఏదో కొత్తగా బలం వచ్చినట్టుగా అన్పిస్తోంది . పొలం రాగానే ఆగారు ఇద్దరూ . సూర్యం కళ్ళతో పొలమంతా
కలియజూసాడు . పొలం దగ్గరున్న పెద్ద వేప చెట్టు కింద ఉన్న రాతి బండని చూపించాడు చంద్రం .
" అన్నయ్యా ! ఈ బండ గుర్తుందా ? నాన్న తాటి ముంజెలు కొట్టి తెస్తే , నాకు తినడం రాదని నువ్వే వేలుతో
తీసి తినిపించేవాడివి . ఇక్కడే చాలా సార్లు నాన్న కూర్చునే వాడు . నాకింకా ఈ బండమీద నాన్నా , నువ్వు
కూర్చున్న ట్టే ఉంటుంది . " బండమీద చేత్తో తాకుతూ అన్నాడు చంద్రం .
" వెళదాం రా ! అలసటగా ఉంది ". అన్నాడు సూర్యం .
తిరిగి వస్తున్నప్పుడు చేను మధ్యలో ఉన్న మంచెను చూపించి చెప్పాడు చంద్రం " అన్నయ్యా ! ఈ మంచె
మీద నిలబడి నాకు ’వడిసెల ’ ఎలా తిప్పి వొదలాలో నేర్పావు నువ్వు ."
సూర్యం తలూపి ముందుకు నడిచాడు . దారిలో సూర్యం ’ ఓ సారి మనం చదివిన బడి దగ్గరికి
తీసుకెళ్ళరా ! ’ అడిగాడు .
" మనం చదివిన బడి పడిపోయిందన్నయ్యా ! గవర్నమెంట్ వారు పక్కా బిల్డింగ్ కట్టించారు . హైస్కూలు
కూడా చేర్చారిప్పుడు . " అంటూ స్కూల్ వైపు తీసుకెళ్ళాడు చంద్రం .
స్కూల్ జరుగుతూ ఉంది . ఐదు నిముషాలు చూసి వెనక్కి తిరిగారు .
" చంద్రం ! స్కూల్ ముందు ఓ ముసలమ్మ రెండు గాజు సీసాల్లో ’ తాటి తాండ్ర ’ నిమ్మ తొనల మిఠాయి
అమ్మేది గుర్తుందా !" అడిగాడు సూర్యం .
" నాకోసం నిమ్మ తొనలు కొనిచ్చేవాడివి కదన్నయ్యా ! "
" ఓ రోజు ఆ ముసలమ్మ చచ్చిపోయింది . ఎవ్వరూ ఆమె కోసం రాలేదేంట్రా ! ఎవరూ లేరంటావా ? "
" ఏమో అన్నయ్యా ! " అన్నాడు చంద్రం .
" ఊళ్ళో వాళ్ళే తీసుకెళ్ళి దానం చేసేరు ... ఎవ్వరూ లేకుండా ఎవ్వరూ ఉండరు కదా ! ఆవిడే తన వాళ్ళని
వొదిలేసి ఉంటుందంటావా ! "
ఎన్నో జ్ఞాపకాలను వొదిలేసి అన్నయ్య ఆ ముసలమ్మ గురించి అన్న ఎందుకు మాట్లాడుతున్నాడో చిత్రంగా
అనిపించింది .
" పనిలో పని రామాలయానికి కూడా వెళదాం రా ! " సూర్యం అడిగాడు .
అన్నని అనుసరించాడు చంద్రం . ఎవరో అర్చన చేయించుకుంటున్నారు . పూజారి పలకరింపుగా నవ్వాడు .
" అన్నయ్య పేరున అర్చన చేయండి " అంటున్న చంద్రాన్ని వారించాడు సూర్యం . ’ రేపు వద్దాం లే... పద ’ అంటూ హారతి తీసుకుని , పళ్ళెంలో పది రూపాయల నోటు వేసాడు సూర్యం . అక్కడున్న మండపం దగ్గర
కాస్సేపు నిలబడ్డాడు .
" ఇక్కడే కదరా ! హరికథలూ , పురాణ కాలక్షేపాలు జరిగేవి . అర్ధం కాక పోయినా అర్ధరాత్రి వరకూ , దుప్పట్లు
కప్పుకొని కూర్చునేవాళ్ళం . " అన్నాడు సూర్యం .
’ ఇక్కడే నువ్వు కనబడ లేదని గుక్క పెట్టి ఏడ్చానన్నయ్యా ! ’ అని అన్నయ్యకి గుర్తు చెయ్యాలని ఉన్నా
మళ్ళీ అన్నయ్య ఏమంటాడోనని ఊరుకున్నాడు చంద్రం .
ఇద్దరూ ఇల్లు చేశారు . కాత్యాయని బావగారికి ఇష్టమైన గుత్తి వంకాయ కూర చేసి , పప్పుచారు చేసి ,
వడియాలు వేయించింది . గడ్డపెరుగు ముందు , నెయ్యి . వడ్డించ బోతుంటే ’ నాకు మజ్జిగనన్నం చాలు .
ఇవన్నీ తింటే అరగవు . ప్రయాణం కదా ! " అంటూ మజ్జిగ అన్నం తిన్నాడు సూర్యం . కాత్యాయని ఏదో
అనబోయింది కానీ భర్త వైపు చూసి ఆగిపోయింది .
ఇద్దరూ భోజనాలు ముగిచారు . వసారాలో మంచం ఉంటే నడుం వాల్చాడు సూర్యం . టేబుల్ ఫేన్
పెట్టి , కాస్త దూరంగా తనూ మంచం వేసుకున్నాడు చంద్రం .
" ఇలా వచ్చి కాస్సేపు కూర్చో చంద్రం ! " అన్నాడు సూర్యం .
దేవుడు వరమిచ్చినట్టు గబుక్కున అన్న పక్కలో కూర్చున్నాడు చంద్రం . అలసటగా కళ్ళు మూసుకున్నా
డు సూర్యం . చంద్రం ఆలోచిస్తున్నాడు . ’ అన్నయ్య ఏదో మాడ్లాడాలను కుని , మాట్లాడలేక పోతున్నాడా ?
పోనీ తనే అడగాలంటే అన్నయ్య ఏం బాధపడతాడో ! ఏం వినాల్సి వస్తుందో అనే భయం ఓ పక్క .....
కాస్సేపటికి సన్నగా గురగ వినిపించింది . సూర్యం నిద్ర పోయాడు .
చంద్రం అన్నని చూస్తూ కూర్చున్నాడు . ఎన్నాళ్ళు అయిపోయింది . ఇలా అన్నకి దగ్గరగా కూర్చుని చూసి ...
బంధువుల పెళ్ళిళ్ళప్పుడు తను బయలు దేరుతుంటే , కాత్యాయని వారించేది . ’ వోపిక లేనప్పుడు ఎందుకు
వెళ్ళడం పిల్లల్ని వెళ్ళమని చెప్పొచ్చు గా ..’ అని . తనే బయలు దేరడానికి కారణం . అన్నయ్య వస్తే కనిపిస్తా
డని . అన్నయ్యకి బదులు ,అన్నయ్య కొడుకులు రమణ , రాఘవ కనిపిస్తే ఎంత నిరాశగా ఉండేదో ...
’ అన్నయ్య ఎలా ఉన్నాడు రా ’! అనడిగితే , ’ బాగానే ఉన్నాడు బాబాయ్ ! ’ అంటారు . రాకపోకలు లేని
బంధం . మాటలు పొసగవు , పోగడవు . చూడాలని ఉన్నా ఏమంటాడోనని భయం . కాలం దొర్లి పోయింది .
సూర్యం మెలుకువ వచ్చినట్టుగా కదిలాడు . చంద్రం లేచి నిలుచున్నాడు . కాత్యాయని లోపల ఏదో తయా
రు చేస్తోంది . పొద్దున్న ఎవరో జున్ను పాలు తెచ్చిస్తే వండి ఉంచింది . చల్లారితే బాగుంటుందని .
సూర్యం లేచి మొహం కడుక్కున్నాడు . కాత్యాయని గారెలు ,అల్లం పచ్చడి , జున్నూ తెచ్చి బావగారి ముందు
పెట్టింది . ’ కాస్త కాఫీ ఇవ్వు కాత్యాయనీ ! ’ అన్నాడు సూర్యం .
కోపంగా అవన్నీ పట్టుకెళ్ళి వంటగది గట్టుమీద పడేసింది . ’ వయసు మీద పడుతోందని అన్నయ్య భయ
పడుతున్నట్టున్నాడు ’ భార్య కి సర్ది చెప్పాడు చంద్రం . కాఫీ తాగి , చొక్కా వేసుకుని , ’ ఇంక నేను బయలు
దేరుతానురా ! ’ అన్నాడు సూర్యం .
చంద్రం తెల్ల బోయాడు . " రెండు రోజులు ఉండొచ్చు కదన్నయ్యా ! " అని ప్రాధేయ పడ్డాడు .
" లేదురా ! నాకు చాలా పన్లున్నాయి . " అన్నాడు .
" పన్లు పిల్లలు చూసుకుంటారులే అన్నయ్యా ! "
" మన పన్లు మనమే చూసుకోవాలి ... అక్కడి వరకూ వస్తావా ! " అన్నాడు సూర్యం .
అన్న వెంట నడిచాడు చంద్రం . ఇద్దరూ బారంగా నడుస్తున్నారు . దారిలో ఎవరెవరో అన్నదమ్ముల్ని
పలకరించారు . బస్ ఇంకా రాలేదు . ధైర్యం చేసి చటుక్కున అన్న చెయ్యి పట్టుకున్నాడు చంద్రం .
సూర్యం మాట్లాడలేదు . తమ్ముడి వైపు చూసాడు . తన చేతిలో ఉన్న తమ్ముడి చేతిని చూసాడు . అంతలో
బస్ వచ్చి ఆగింది . తమ్ముడి చేతిని చిన్న గా వొదిలించుకుని , బస్ ఎక్కి సీట్లో కూర్చున్నాడు సూర్యం .
మళ్ళీ దూరం అయిపోతున్న అన్న ని చూస్తూ చెయ్యి ఊపాడు చంద్రం . సూర్యం తమ్ముడ్ని చూసాడు.
’ జాగ్రత్తగా వెళ్ళు ..’ అన్నాడు . బస్ దుమ్ము రేపు కుంటూ వెళ్ళిపోయింది .
’ అసలు అన్నయ్య ఎందుకు వచ్చినట్టు ! ’ అన్నది ప్రశ్నగా మిగిలింది చంద్రానికి . అన్న ఫోన్ చేస్తాడనీ ,
మళ్ళీ ఉత్తరం రాస్తాడని చాలా రోజులు ఎదురు చూసాడు చంద్రం .
నిద్ర మంచం దిగక ముందే ఫోన్ మోగడంతో పిల్లలు చేసుంటారు , అనుకుంటూ ’ హలో ! ’ అన్నాడు.
" బాబాయ్ ! నేను రమణని మాట్లాతున్నాను . రాత్రి నాన్న జరిగి పోయాడు . "
" ఎలా జరిగింది రా ! " కంగారుగా అడిగాడు చంద్రం .
" నీరసంగా ఉందని పెందలాడే పడుకున్నాడు . నిద్రలోనే ....."
చంద్రం ఆసరాగా కాత్యాయని చెయ్యి పట్టుకున్నాడు . ’ అన్నయ్య వెళ్ళిపోయాడు .’
దుఃఖాన్ని దిగమింగుతూ , పిల్లలకి ఫోన్లు చేసాడు .
" ఏదో మనసు మార్చుకొని వచ్చాడను కున్నాను గానీ , ఆఖరి చూపులకోసం వచ్చాడని అస్సలు అనుకో
లేదు " అంటూ కళ్ళు తుడుచుకుంది కాత్యాయని .
’ అన్నయ్య ఎందుకు వచ్చినట్టు ’ అన్న ప్రశ్న కి జవాబు దొరికింది చంద్రానికి . ’ ఈ లోకంలో ఏదీ శాశ్వతం గా
ఉండిపోదు . మన పన్లు మనం చేసుకుంటూ ముందుకు పోవాలి ’ అని అన్నయ్య తనకి చెప్పకనే ధైర్యం
చెప్పి తిరిగి రాలేని లోకానికి శాశ్వతంగా వెళ్ళిపోయాడు .
ఆఖరిసారి అన్నతో కల్సి , శ్మశానం వరకూ తోడుగా వెళ్ళాలని , భార్యని తీసుకుని బయలుదేరాడు
చంద్రం .
సూర్యుడు ఎప్పటిలాగే మేఘాల పై పెత్తనం చెలాయిస్తూ ఉదయించడానికి రెడీ అయిపోయాడు . *