ఐ హేట్ టియర్స్

It is a family story, written by Mani Vadlamani. మంచం మీద పడుకున్న ధీర కి కళ్ళ ముందు తనే కనిపిస్తున్నాడు. జ్ఞాపకాలు మర్చిపోవడం సాధ్యమా !అన్నీ అమూల్యమైన క్షణాలే. ముఖ్యంగా ఆ నవ్వు ముఖమంతా పా కి చల్లని వెన్నెలా అనిపిస్తుంది. ఆలోచనల మధ్య మాగన్నుగా నిద్ర పట్టింది.

ఐ హేట్ టియర్స్

హెట్  టియర్స్  (  I hate tears)

వయస్సు ఎంత ఉంటుందో  తెలియదు  గాని మనిషి  నిండుగా  హుందాగా  ఉంది  కానీ చూస్తుంటే  ఏదో తెలియని ,అంతు పట్టని భావం  కలిగింది. మెట్లు  ఎక్కి రావడం వల్ల కొద్దిగా ఆయాస పడుతోంది.కూడా

మోహన్ రావు  పక్కగా  బెంచ్ మీద  కూర్చుంటూ, బాగ్  లోంచి  వాటర్  బాటిల్  తీసుకొని  రెండు మూడు  గుటకలు తాగి  బాటిల్ మూత పెడుతూ మంచి  నీళ్ళు లేకపోతె  మటుకు  ఉండలేను అంకుల్అంటూ బాగ్ లో పెట్టుకుంది.

చర్యనంతా నిశితంగా  చూస్తున్న మోహన్ రావు ని చూసి   సిగ్గు పడుతూ నవ్వింది.వెంటనే  హయ్ అంకుల్  నాపేరు  ధీర, సాఫ్ట్ వేర్  ఇంజనీర్  ని , కలకత్తా  నుంచి వచ్చాను’ . అని గల గలా  నాన్ స్టాప్  మాట్లేడేస్తోంది

అమ్మాయి మాటలు  వింటూ  ఉండిపోయిన  మోహన్ రావు కి  కాలమే తెలియలేదు .

“అప్పుడు గుర్తుకొచ్చింది. యా మీరు  తో పాటు   బస్సు లో వచ్చారు కదా! ఒక్కరే  వచ్చారా”,

 “అవును,   నేను ఒంటరినే , ఇక చివరి వరకు  ఒంటరి తనం  మోస్తూ బ్రతకాలి” అన్నాడు .

మాటలు  అర్ధం  అయి  కానట్లు  ఉన్నాయి. అది గమనించి మోహన్ రావు   అవునమ్మా ఒంటరిగా  వచ్చాను  బిజీ  లైఫ్ బోర్ కొట్టినప్పు డల్లా  ఇలా  ఇదిగో  ఇలా  తిరుగుతూ ఉంటాను. మాటు  మేఘాలయ కి రావనిపించింది.. చూసావుగా  ఇక్కడ కొండలని తాకుతూ  ఉన్న  మేఘాలు ,పచ్చని పొలాలు ,హాయిగా ,ప్రశాంతంగా  ఉంది . అందుకే  వచ్చాను షిల్లాంగ్  కి’ ,బై ది వే  నా పేరు  మోహన్ రావు ,రిటైర్డ్  బ్యాంకు ఆఫీసర్ని  అని  అన్నారు .

కాలం ఒక మర్మం. అన్ని మర్మాలకూ అది ఒడి. సర్వానుభవాల మూలం.

ఆలోచనలలో  ములిగి పోయిన ధీర ,  అటు ఇటు చూస్తూ  ఇంకా అక్క ,బావ రాలేదింటి   చాలాసేపయింది  వెళ్లి  అనుకుంది.

తన పక్కనే కూర్చున్న మోహన్ రావు  మాట మాట మాట్లాడుతూ   ఎవరెవరు  వచ్చారు  నీతో  అని అడిగాడు.

అక్క ,బావ  వచ్చారు. వాళ్ళు కలకత్తాలోనే   ఉంటారు,   అడగకుండానే చెప్పింది.

కొంచెము సేపు అయ్యాక  ధీర అక్క,బావ  వచ్చారు. ఇక  రోజుకి  చూడాల్సిన వి అయి పోయాయి.  అని గైడ్  వచ్చి  చెప్పగానే . అందరూ . బస్సు  ఎక్కారు.

మరునాడు ప్రోగ్రాం  గురుంచి   చెప్పి  పోద్దేన్నే రెడీ ఉండమని  చెప్పి  హోటల్ దగ్గర  దింపెసాడు. 

మోహన్ రావు  తనకు ఇచ్చిన  రూమ్ లోకి వెళ్ళిపోయాడు.

ధీర,వాళ్ళ అక్క ,బావ పిల్లలు,  అక్కడే ఉన్న  రెస్టారెంట్  లోకి వెళ్లి డిన్నర్ చేసి  గదుల్లోకి వెళ్ళిపోయారు.

మంచం  మీద పడుకున్న  ధీర కి  కళ్ళ  ముందు  తనే కనిపిస్తున్నాడు. జ్ఞాపకాలు  మర్చిపోవడం   సాధ్యమా !అన్నీ అమూల్యమైన క్షణాలే. ముఖ్యంగా  నవ్వు  ముఖమంతా పా కి  చల్లని వెన్నెలా అనిపిస్తుంది. ఆలోచనల మధ్య మాగన్నుగా  నిద్ర పట్టింది. 

తుపాకుల మోత,బూట్ల టకటక చప్పుళ్ళు....యేవో అరపులు.  హటాత్తుగా  తెలివి వచ్చింది. 

పక్కనే పడుకున్న అక్క  కూతురు,కొడుకు లకు  తెలివి రాకుండా  మెల్లగా లేచింది. అప్పుడు 

i hate tears,ధీరా !తన  మాటలు  చెవిలో చెబుతున్నట్లుగా  అనిపించింది. మాటలి ని పదే పదే  మననం చేసుకుంది.

అక్కడ ఉన్న టేబుల్ మీద  హ్యాండ్ బాగ్  జిప్ తీసి  లోపలి అరలో దాచుకున్న ఉత్తరాన్ని తీసి మళ్ళి చదువు కుంది

అంతే   మండుతున్న మనస్సు చల్లబడింది. వెంటనే   హాయిగా,   నిశ్చింతగా  నిద్రపోయింది.

**

మరునాడు  ఉదయమే  అందరూ  చిరపుంజీ  కి బయలుదేరారు. మొదటగా  అక్కడ ప్రసిద్దమయిన  సెవెన్ సిస్టర్ ఫాల్స్  కి వెళ్లారు. చుట్టురా కొండలు, వాటి అంచులను  తాకుతూ  మేఘ మాలికలు , మధ్యలో  జలపాతాలు

అద్భుతమైన దృశ్యం .ఇంకా అక్కడ పూర్తి  వ్యాపారత్మక ధోరణి  రాలేదు . వాటర్ ఫాల్స్  గురుంచి  కధలు కధలుగా  చెప్పుకుంటారు. జలపాతలని చూడటానికి  అద్దెకిచ్చే  బైనాక్యులర్స్ కూడా ఉన్నాయి.. అవి చూస్తూ  మోహన్ రావు రావు  అనుకున్నారు  కీట్స్ అన్నట్లు   A THING of beauty is a joy forever. 

కాని  ఇవేమీ  తన  లోపల ఉండే బాధను  మాత్రం  తీయలేక పోతున్నాయి. ఒంటరి తనం వేధిస్తోంది 

ఆయనకీ కొంచెము దూరం లో  ధీర  వాళ్ళ ఫ్యామిలీ  కూడా ఉన్నారు.

నిన్నటి నుంచి   ధీర  ఆయన నే  గమనిస్తూ  నే  ఉంది. ఏదో పోగుట్టుకున్నట్లు,దిగులుగా నిరాసక్తంగా  ఉంటున్నారు.  పక్కనే పక్కనే ఉన్న కూడా   మనుషుల మధ్య  ఎంత దూరం  ఉంటుందో. ఆయన బాధ ఏంటో  తెలుసుకుంటే ,కాస్త  ప్రేమని అభిమానం పంచె ప్రయత్నం  చేస్తే. పోయేదేం లేదు కదా అనిపించింది

అక్కడ నుంచి బయలుదేరి  దగ్గరలోనే ఉన్న  ఇంకొ ఫాల్స్ కి వెళ్లారు  అది చాల  కిందకి ఉంటుంది. ఎక్కడం దిగడం కూడా కష్టమే .

అందుకని మోహనరావు పైన ఉండిపోయారు.ధీర వాళ్ళ వాళ్లతో వెళుతున్నదల్లా వెనక్కి  చూసి  ఆయన ఉండిపోవడం  గమనించి . “నేను అంకుల్ కి తోడుగా ఉంటా మీరు వెళ్ళండిఅని చెప్పి వెనక్కి వచ్చేసింది.

ధీర  కి అవకాశం  చిక్కింది  మోహన్ రావు  గారి తో  మాట్లాడటానికి

బాగ్ లోంచి కొన్ని తినుబండారాలు తీసి ఇస్తూ,అసలే మాటకారేమో ఆయన్ని మాటల్లోకి దించింది.

అప్పుడు  తెలిసిన విషయం  ఏమిటంటే  మధ్యనే  ఆయన భార్య పోయింది. ఇద్దరుపిల్లలు  బయట దేశాలలోఉన్నారు. ఈయనకి అక్కడ వెళ్లి ఉన్నా తోచటం లేదు. ఓపిక ఉన్నంత వరకు  ఇలా ప్రదేశాలు చూడాలని అనుకుంటున్నారు. అసలు అప్పుడప్పుడు  చనిపోవాలనిపిస్తుంది అనగానేఅంకుల్  మీరు పెద్దవారు,జీవితం లో అన్నీ చవి చూసినవారు  మీరే ఇలా అనుకుంటే కొంతమంది  అప్పుడే జీవితం మొదలు పెట్టిన  వాళ్ళకి  ఇలాంటి విషాదాలు ఎదురు పడితే  మరి వాళ్ళు దాన్ని ఎలా తీసుకోవాలి అనంగానే

దానికి ఆయన  అమ్మా చెప్పడానికి  అన్ని బావుంటాయి. అనుభవించే వాళ్ళకి  తెలుస్తుంది  కష్టం,ఒంటరితనం అన్నీఅనగానే.

అంకుల్ నిజమే  మీ మాట ని ఒప్పుకుంటాను. అయినా trauma నించి బయటపడే  పరిస్థితులను  ఎదురుకున్న  youngsters చాలామందే ఉన్నారు.

అబ్బే నేను నమ్మనమ్మా అనేసాడు.

కొంచెము సేపు ఇద్దరి మధ్య  వాగిద్వాలు నడిచాయి

చివరగా ఎందుకమ్మా ముసలాడిని  నమ్మించడానికి  ప్రయత్నం  చేస్తున్నావు,,వదిలెయ్యి అన్నాడు

సరే వదిలేస్తాను కానీ  ఇది చదవండి, అనితన బాగ్ లోంచి ఒక  ఉత్తరం తీసి  ఇచ్చింది . ఆయన ముందు మొహమాట పడ్డారు. పర్వాలేదు అంకుల్ చదవండి , అని బలవంతం  చేసింది.

ఇంగ్లీష్  లో  ఉన్న వాక్యాలు చదవ సాగారు.

డార్లింగ్ ధీరా!

తిట్టుకోకు  ఉత్తరంలో స్వీట్ నధింగ్స్ లేవు.

జీవితం ఎప్పుడు  ఎలా మలుపులు తిరుగుతుందో  తెలియదు. పైగా  నువ్వు చాలా సెల్ఫ్ కాన్ఫిడెన్సు,డేరింగ్ నేచర్ ఉన్న దానివి,treckiing,mountneering  కూడా వెళ్ళావని  తెలిసి  నిన్ను చాలా ఇష్టపడ్డాను. అలాగే ఒక  ఆర్మీ వ్యక్తిని పెళ్లి చేసుకోవడాని కి  ఇష్టపడ్డావంటనే  నువ్వెంటో అర్ధమయింది.

నీకు నువ్వే బలానివి,ఎవ్వరి ఓదార్పు కోసము ఎదురు చూడకు.నిజమే ఒక మనిషి  సాన్నిహిత్యాన్నిమర్చ్చిపోలేవు , జ్ఞాపకాలతో  నీ కళ్ళు చెమరుస్తూనే ఉంటాయి. కానీ  నివు తెలుసుకోవల్సినది ఒకటి ఉంది. మనిషి ఎప్పుడూ ఒంటరిగానే  వస్తారు ,వెళతారు. ఒకళ్ళు ముందు మరొకళ్ళు వెనుక ,కాని జీవితం మటుకు  ఆగకూడదు.ఊపిరి ఉన్నత వరకు సాగాలి ,ఇదంతా ఎందుకు రాస్తున్నాను అంటే  రేపు పొద్దున్న నాకేదయినా కావచ్చు.,ఒక ఆర్మీ ఆఫీసర్  భార్యగా నువ్వుకూడా    అంతే ధైర్య సాహసాల తో జీవించాలి. దేన్నయినా ఎదుర్కునేలా ఉండాలి.  అసలు నీ పేరు లొనే ఉంది  ధైర్యం . అర్ధమయిందా . మళ్ళి  చెబుతున్నాను.  హెట్  టియర్స్ .  ఎప్పటికీ   నీ  సూర్య

ఉత్తరం  మడిచి ఇస్తూ   మీ భర్త ఆర్మీ ఆఫీస్ రా  అని అన్నారు .అవును  అని తల ఊపింది. ఎక్కడ  ఉండేది ,ఆయన ,నువ్వేమో  కలకత్తా  లో జాబ్ కదా,

అనేసరికి, ధీర  వెంటనే  తను అక్కడ ఉన్నారు  అంటూ  ఆకాశం వైపు చూపించింది. పైగా  సూర్యుడు  ఆకాశం లోనే ఉండేది అంది.

వాట్ ,”అని గట్టిగా అరిచాడు, నిశబ్ద వాతావరణం  లో అతని  గొంతు ప్రతిధ్వనించింది. నిండా జీవితాన్ని అనుభవించ నే  లేదు  ,అప్పుడే  ఆమె జీవితం లో ఇంత విషాదమా? అనుకుంటూ  ధీర వైపు జాలిగా  చూసాడు.

వద్దు  అంకుల్  అలా జాలిగా చూడకండి. నేను  చాల ధైర్యంగా ఉన్నాను.అవును  ఆయన  దేశం  కోసం  తన ప్రాణాలని అర్పించారు. రెండేళ్ళక్రితం  సరిహద్దు లో జరిగిన శత్రువుల  దాడిలో  మరణించారు .   అందుకు  నేను గర్వపడుతున్నాను . అలా ఉండమని   నా భర్త  ముందే చెప్పాడు. ఒకళ్లకోసం జీవితం ఆగకూడదు .ముందుకు సాగి పోతూఉండాలి. అదే పాటిస్తున్నాను.  సో   హెట్  టియర్స్ అంటూ  హాయిగా  నవ్వింది  

ఇంత చిన్న వయసులో  విషాదాన్ని మోస్తూ  ఇంత ధైర్యంగా ఉండటం  పిల్లకి ఎలా సాధ్యమయింది అనుకుంటూ,ఆమె దగ్గరగా వెళ్లి  గాడ్ బ్లెస్స్ మై చైల్డ్  అన్నాడు  ఎమోషనల్ గా

“ఓహ్ అంకుల్ ఇదే వద్దు,ప్లీజ్  నాతో  నార్మల్  గానే ఉండండి. నాకు  జాలి నచ్చదు” అంది మొహమాటం లేకుండా ఓకే ఓకే  అలాగే  నువ్వు  నా టీచర్  వి సరేనా” అన్నాడు

“ఎస్ మై బాయ్”   అంటూ  ఫక్కున నవ్వేసింది

పరిచయం వయసు ఒక రోజే ,కానే బంధం ఎప్పటి నుంచో ఉన్నట్లుగా ఉంది  అనుకున్నాడు మోహన్ రావు ఇంతలోధీర  అక్క ,బావ పిల్లలు  వచ్చారు.

వీళ్ళని చూస్తూ ,మిమ్మలిని కూడా  మార్చేసిందా! మా ధీర అంటూ  వాళ్ళందరూ సరదాగా కబుర్లు చెప్పుకుంటూ ముందు నడిచి వెళుతున్నారు.

ఒక్క సారిగా  వాతావరణం  మనస్సు కూడా సందడిగా ,చైతన్యం గా  మారిపోయింది.

జీవితం అంటే ఖేదం, మోదం, సుఖం, విజయం, అపజయం లాంటి ద్వంద్వ భావనలు కనిపించినా, దాన్ని ఆనందమయం చేసుకోవాలి. సంపూర్ణంగా జీవించేవిధంగా జీవితాన్ని శిల్పించుకోవాలి.. జీవన ప్రవాహం  సాగుతూనే ఉండాలి .

ఆమెనే  చూస్తున్న మోహనరావు అనుకున్నాడు .అవును  నిజంగానే  ఆమె ధీర ,ఆమె ఎప్పుడూ ఇదే ఉత్సాహంతో  ఉండాలి. ఒక రకంగా  ఆమె తనకి గురువు. ఏంతో విలువైన జీవితం గురుంచి తెలియచెప్పింది. ఆమె మాటలతో  తన లోపల ఉండే శూన్యం పటాపంచలైంది.మార్గం బోధపడింది. తన భార్య మొదలుపెట్టిన  ఎన్నో మంచి  పనులను  పూర్తి చేయాలి . అనుకుంటూ ఉత్సాహంగా  లేచి ధీర వాళ్ళ వెనకాలే  నడవ   సాగాడు    .

                                                             ****