Sahari Weekly 15-03-2024

Sahari Latest Weekly dated 15-03-2024

Sahari Weekly 15-03-2024
Sahari Latest Weekly
Sahari Weekly 15-03-2024
Sahari Weekly 15-03-2024
Sahari Weekly 15-03-2024

కథా కమామీషు 15.03.2024

 

1.      దేవుడు రాసిన ‘ఆవు’ కథ : ఇంట్లో ఇబ్బందులు రావటంతో అతడు తన దగ్గర ఉన్న ఆవును అమ్మటానికి సంతకు తోలుకెళ్లాడు. అయితే ఆరోజు కార్పోరేటర్ల ఎలక్షన్లు ఉండటంతో, సంత అంతా ఎన్నికల హడావుడిలో మునిగిపోయి ఉంది. జనమంతా నాయకులు ఇచ్చే డబ్బుకోసం, మందు కోసం ఆరాటపడుతున్నారు. దాంతో అతని ఆవును కొనటానికి ఎవరూ ముందుకు రాలేదు. ఒకపక్క ఎండ విపరీతంగా కాస్తుండటంతో అతడు తను తెచ్చుకున్న నీళ్ళతో సేదతీరాడు. ఆ ఆవుకు కూడా గొంతు ఎండిపోతుండటంతో తనకు కూడా తన యజమాని నీళ్ళు తాగిస్తాడేమోనని ఎదురుచూసింది. కానీ అతనికి అసలు ఆ ధ్యాసే కలగలేదు. ఎంతకూ బేరాలు రాకపోవటంతో అతడు తన ఆవును పక్క ఊరి సంతకు తోలుకెళ్లాలని అనుకున్నాడు. ఆ ఊరి ఒక మోతుబరి గురించిన ఒక వార్త తెలిసి అందరూ వెళ్తుండగా, అతడు కూడా ఆ ఊరికి బయల్దేరాడు. దాహంతో నాలుక అల్లార్చుకుపోతుండగా ఆ ఆవు కూడా అతనివెంట నడవక తప్పింది కాదు. ఆ తర్వాత ఏం జరిగింది? ఆ ఆవు దాహం తీరిందా? అది అమ్ముడుపోయిందా? తటవర్తి భారతి స్మారక కథల పోటీలో ద్వితీయ బహుమతి పొందిన నల్లపాటి సురేంద్ర కథ ‘దేవుడు రాసిన ‘ఆవు’ కథ’ తప్పక చదవండి.   

 

2.      రారండోయ్ వేడుక చూద్దాం : అతనికి పిసినారి అన్న పేరుంది. డబ్బు దగ్గర ఎంతో నిక్కచ్చిగా అట్లాంటి ఆ మనిషి కొడుకు, తాను ప్రేమించిన అమ్మాయిని కాణీ కట్నం లేకుండా పెళ్లి చేసుకుంటానని భీష్మించుకుని కూర్చోవటంతో, అతనికి తన కూతురి పెళ్లి ఎలా చెయ్యాలో అర్థం కాలేదు. కూతురికి కట్నం తీసుకోని వరుడు దొరకటం కష్టం. కాబట్టి ఏం చేయాలా అన్న ఆలోచనలో పడ్డాడు. చివరికి ఒక గొప్ప ఆలోచన వచ్చింది. కుటుంబ సభ్యులందరినీ కూర్చోబెట్టి, తనకొచ్చిన గొప్ప ఐడియాని వాళ్ళకి వివరించాడు. అది విని అందరూ సరేనంటూ తలలూపారు. తాను వేసుకున్న పథకం ప్రకారం, పెళ్లి పిలుపులకు తన బంధువులందరి ఇళ్లకూ తానే స్వయంగా వెళ్ళి, శుభలేఖతో పాటు ఆ ఇంటి ముత్తైదులకు పట్టు చీర ఇవ్వటం మొదలుపెట్టాడు. అసలే పిసినారి, ఆపైన కట్నం రాని కొడుకు పెళ్లి. మరి అతడు అందరికీ పట్టు చీరలు ఇవ్వటంలో ఉన్న అంతరార్థం ఎండీటీ? బొరుసు చంద్రరావు ఉగాది కామెడీ కథల పోటీలో సాధారణ ప్రచురణకు స్వీకరించబడిన డా. యం. సుగుణారావు కథ ‘రారండోయ్ వేడుక చూద్దాం’ ఈవారం సహరి వీక్లీలో తప్పక చదవండి.      

 

3.      తొలి తృప్తి : కొత్తగా పెళ్లై, తొలిరాత్రి సంబరానికి ముస్తాబవుతున్న నవ వధువును ఆమె స్నేహితురాళ్ళు తమ సరదా మాటలతో ఆట పట్టించటం మొదలుపెట్టారు. ‘పెళ్లి ఉదయమే అయిపోవటంతో మధ్యాహ్నం రెస్ట్ తీసుకుని, రాత్రికల్లా రెడీ అవ్వటం దీని అదృష్టం’ అంటూ ఒక స్నేహితురాలు ఆ పెళ్ళికూతుర్ని ఆటపట్టించింది. అయితే ఆ అమ్మాయి పెళ్ళికి తొందర పడుతుండంటూ అందరూ ఆమెతో హాస్యమాడారు. అప్పుడే అక్కడికి వచ్చిన పెళ్ళికూతురు పిన్ని, వాళ్ళతో కొద్దిసేపు సరదాగా మాట్లాడాక, వాళ్ళామెతో ఆ అమ్మాయి పెళ్లి గురించి ఆగలేకపోతుందంటూ చెప్పారు. దానికా అమ్మాయి తానేమీ పెళ్ళికి తొందరపడటం లేదనీ, పెళ్లయ్యాక పొందే ఆనందం జన్మకి ఒకసారే వస్తుందని చెప్పింది. అది విన్న పెళ్ళికూతురు పిన్ని ఉలిక్కిపడి, వెంటనే తన ఉలికిపాటును కప్పిపుచ్చుకుంది. ఆమె ఎందుకలా ఉలిక్కిపడింది? గతంలో ఆమెకెదురైన అనుభవం ఏమిటి? సరస కథల పోటీలో సాధారణ ప్రచురణకు స్వీకరించబడిన పి. వి. రామశర్మ కథ తొలి తృప్తి తప్పక చదవండి.       

 

4.      తెలివైన కోడలు : పుట్టింట్లో ఆమె ఎంతో గారాబంగా పెరిగింది. అలాంటి ఆమెకు ఒక్కసారిగా పనిమనిషి తమ ఇంట్లో పని మానేసేసరికి ఆమె చికాకు కలిగింది. ఇంటిపని  వంటపని ఒక్కతే చేసుకోవటానికి చాలా ఇబ్బంది పడిపోయింది. ఏం చేయాలే తెలియని స్థితిలో కొట్టుమిట్టాడుతుంటే ఒక స్నేహితురాలు వచ్చి, ఫోన్ చేస్తే పనిమనిషిని పంపే యాప్ లు వచ్చాయనీ, వాటిలో బుక్ చేసుకుంటే, పనిమనిషిని వాళ్ళు ఇంటికి పంపుతారని చెప్పింది. దాంతో ఆమె వాళ్ళ ఫోన్ నెంబర్ తీసుకుని, వాళ్ళకు ఫోన్ చేసింది. అయితే వాళ్ళు పనిమనిషికి రెండు రకాల ఆప్షన్స్ ఉన్నాయనీ, పని చేయటానికి తీసుకునే సమయాన్ని బట్టి, లేకపోతే ఇల్లు, గిన్నెలు, బట్టల లెక్కని బట్టి పేమెంట్ ఉంటుందని చెప్పారు. అలా మాట్లాడినందుకే సర్వీస్ ఛార్జీలు వసూలు కూడా చేశారు. వాళ్ళు పంపిన పనిమనిషిని చూస్తే ఏ సినిమా హీరోయినో లేక వాంపో అన్నట్లుగా అనిపించింది. ఆ వచ్చిన పనిమినిషి చెప్పిన షరతులు విని, ఆమెకు మూర్ఛ వచ్చినంత పనైంది. ఆ పనిమనిషి ఏం మాట్లాడింది?  బొరుసు చంద్రరావు ఉగాది కామెడీ కథల పోటీలో సాధారణ ప్రచురణకు స్వీకరించబడిన శింగరాజు శ్రీనివాసరావు కథ ‘తెలివైన కోడలు’ చదవండి. 

 

5.      ద్రోహి : ఆ ఇద్దరూ పేరుమోసిన తోడుదొంగలు. ఎన్నో దొంగతనాలు, దోపిడీలు చేశారు. ఆ ఇద్దరిలో ఒకడు చిన్న చిన్న దొంగతనాలతో విసిగిపోయాడు. అందుకే పేరుమోసిన వ్యక్తుల పిల్లలను కిడ్నాప్ చేస్తే, తాము డిమాండ్ చేసినంత డబ్బులు ఇస్తారని ఐడియా వేశాడు. ఒకవేళ తాము అడిగిన డబ్బు ఇవ్వకపోతే, ఆ కిడ్నాప్ చేయబడ్డ పిల్లలని చంపేద్దామని చెప్పాడు.  అయితే దానికి రెండోవాడు ఒప్పుకోలేదు. అది తమకు అలవాటు లేని పని అనీ, పైగా హంతకుడిగా మారటం తనకు ఇష్టం లేదనీ, ఒకవేళ పోలీసులకి దొరికితే ఇక తప్పించుకోవటం కష్టమనీ చెప్పాడు. కానీ మొదటివాడు అతనికి నచ్చజెప్పి, పిల్లలని కిడ్నాప్ చెయ్యటానికి ఒప్పించాడు. చివరికి ఒక డాక్టరమ్మ కూతురిని కిడ్నాప్ చేశారు. అయితే గతంలో ఆ డాక్టరమ్మ తన తల్లికి ఫ్రీగా వైద్యం చేసి ఉండటంతో ఆ రెండవవాడు, ఆ అమ్మాయిని వదిలేయమంటూ మొదటివాడితో తగువు పెట్టుకున్నాడు. కానీ వాడు ఒప్పుకోలేదు. అప్పుడా రెండోవాడు ఏం చేశాడు? బొమ్మకు కథ పోటీ - 9 లో బహుమతి పొందిన డి. వి. డి. ప్రసాద్ కథ ‘ద్రోహి’ చదవండి.    

  

6.      ఈ పాపం ఎవరిది? : హత్య జరిగినట్టుగా కానిస్టేబుల్ చెప్పగానే ఆ ఎస్సై, ఆ స్పాట్ కి బయల్దేరాడు. అక్కడ ఇరవై ఏళ్ల యువతి మూడు కత్తిపోట్లకు గురై మరణించినట్లు గ్రహించాడు. హత్యకు గురైన ఆ అమ్మాయి కళ్ళలో ఆశ్చర్యంతో తెరుచుకుని ఉండటం గమనించాడు. ఆమె ఆ ఇంటి ఔట్ హౌస్ లో  తండ్రితో కలిసి అద్దెకు ఉంటుందని తెలుసుకున్నాడు. ఆమె ఫోన్ కాల్ లిస్ట్ లో ఆ ఇంటి యజమాని కొడుకు పేరుతో సహా మరో ఇద్దరు యువకుల పేర్లు కూడా కనిపించాయి. ఇల్లంతా క్షుణ్ణంగా పరిశీలించాడు. ఇంట్లోకి రావటానికి ఒకే ద్వారం ఉండటంతో, ఎవరో ఆమెకు బాగా తెలిసిన వ్యక్తే ఆ హత్య చేశాడని గ్రహించాడు. ఆ ఇంటి యజమానిని పిలిపించాడా ఎస్సై. ఆ యజమాని చెప్పినదాని ప్రకారం ఆ ఇంట్లో యజమాని, అతని భార్య, కొడుకు, కూతుర్లు ఉంటారని తెలుసుకున్నాడు. ఆ అమ్మాయి చాలా చలాకీగా ఉంటుందనీ, ఆమె తండ్రి ఆమెకు సంబంధం మాట్లాడటానికి వేరే ఊరు వెళ్లాడనీ తెలిసింది. అందరినీ విచారించి వెళ్తుండగా, ఆ ఔట్ హౌస్ దగ్గరున్న చెట్టు దగ్గర ఆతనికొక కాగితం దొరికింది. ఆ కాగితం ఏమిటి? దాని ఆధారంగా అతడా హత్యా రహస్యాన్ని ఛేదించాడా? సంకు విఠల్ ప్రసాద్ కొసమెరుపు కథల పోటీలో సాధారణ ప్రచురణకు స్వీకరించబడిన పారుపల్లి అజయ్ కుమార్ కథ ‘ఈ పాపం ఎవరిది?’ ఈవారం సహరిలో చదవండి.