మేధో హత్యలు part 15

This is Fifteenth part of Spy Suspense Thriller Novel. Written by Samrat. Medho Hatyalu is Very Gripping Novel. Un-put-downable.

మేధో హత్యలు part 15

మేధోహత్యలు 15

(స్పై సస్పెన్స్ థ్రిల్లర్)

దారిలో కనబడిన ఒక కాబ్ లో జ్యూరిచ్ కి చేరుకున్నాడు విజయ్. మొదలు పెట్టిన పని పూర్తి అవకుండా తిరిగి హోటెల్ కి వెళ్ళడం ఇష్టం లేక తిన్నగా జార్జి ఇంటికి దగ్గరలోని స్ట్రీట్ పేరు చెప్పి అక్కడ దిగాడు.

ఆ టైమ్ లో అక్కడక్కడా వెహికిల్స్ తప్ప నరసంచారం ఏఈ లేదు. జార్జ్ ఇంటి వరకు నడుచుకుంటూ వెళ్ళాడు. విజయ్. అంతకు ముందు వెళ్ళినట్లుగానే ఇంటి వెనక నున్న ఫ్రెంచ్ విండో ద్వారానే లోపలికి వెళ్ళాడు.

జార్జ్ స్టడీ లోని సీక్రెట్ డోర్ తెరుచుకుని అతని లాబ్ లోకి వెళ్ళాడు. అక్కడ పరిస్థితి భీభత్సంగా ఉంది. సీసాలు పగలగా నేల మీద ఒలికిన కెమికల్స్ ఫ్లోర్ పైన అట్టలు కట్టి ఉన్నాయి. వాటిని టచ్ చేయకుండా లోపల తిరిగాడు విజయ్. తనకు కావలసిన డాక్యుమెంట్స్, కలెక్ట్ చేసుకున్నాడు. అందులో ప్రెజరైజ్డ్ ఎయిర్ గన్ డ్రాయింగ్, దాన్ని మీనియేచర్ గా చేయడానికి సంబంధించిన డాక్యుమెంట్స్, డాక్టర్ ఆలిస్టర్ రీసెర్చ్ పేపర్లు, దాన్ని డెవలప్ చేస్తూ జార్జ్ చేసిన మార్పులకు సంబంధించిన వివరాలు ఉన్నాయి. తనకు కావలసిన వివరాలు అన్నీసేకరించి, అతని కంప్యూటర్ హార్డ్ డిస్కు కూడా ఎక్స్ట్రాక్ట్ చేసుకున్నాడు.

ఇక ఆ ఇంటి తో తనకు ఏమీ పని లేదు అనుకున్నాక ఆ ఇంట్లోని అలార్మ్స్ ని డిజేబుల్ చేసాడు. తర్వాత ఎలఎక్ట్రిక్ వైర్ కట్ చేసి స్పార్క్స్ వచ్చేలా చేసి ఇంటికి నిప్పంటించాడు. మెల్లమెల్లగా మంటలు ఒక వస్తువు నుంచి మరో వస్తువుకి పాకుతూ ఉంటే సంతృప్తిగా చూసి తను వచ్చిన దారినే బయటికి వెళ్ళిపోయాడు. అతను రెండో వీధిలోకి వెళ్ళేసరికి ఆక్శంలో పెద్ద పొగ, జనాలు అరుపులు వినిపించాయి. దారిలో కనబడిన కాబ్ తీసుకుని హోటల్ కి వెళ్ళిపోయి తన గదికి చేరుకున్నాడు విజయ్.

వెళ్తూనే బలబీర్ ని కాంటాక్ట్ చేసాడు. వెంటనే గదిలోని టివి స్క్రీన్ పై బల్బీర్ ప్రత్యక్షమయ్యాడు. ఫుల్ సూట్ లో ఆఫీ లో ఉన్నట్లు కనిపించిన బలబీర్ ని చూసి, ’ఓహ్ బాస్, టైమ్ ఎంతయింది?’ అన్నాడు విజయ్ కాజువల్ గా.

’ఇంత రాత్రి వేళ వరకు ఏం చేస్తున్నావు?’ అడిగాడు బలబీర్ సింగ్.

’జార్జ్ పని ఫినిష్ అయింది బాస్. వాడు ఉపయోగించే ఒక రకమైన ప్రోటీన్ వివరాలు, వాడు తయారు చేయించిన ఒక మీనియేచర్ ప్రజరైజ్డ్ గన్ వివరాలు మీకు ఇప్పుడే ఫార్వార్డ్ చేసాను’ అన్నాడు విజయ్.

తను చావు కి ఎంత దగ్గరగా వెళ్ళాడో, వెంట్రుక వాసిలో తను కూడా వెజెటబుల్ లా అయ్యే ప్రమాదం నుంచి ఎలా బయటపడ్డాడో చెప్పళేదు బలబీర్ కి.

’విజయ్, ఈ ఎసైన్ మెంట్ లో నువ్వు చాలా కష్టపడ్డావు. ఎటువంటి లీడ్స్ మేము నీకు ఇవ్వకపోయినా నువ్వొక్కడివే ఈ ఎసైన్‍మెంట్ ని సక్సెస్ చేసావు. అయామ్ ప్రౌడ్ ఆఫ్ యు. వెల్ డన్ మై బోయ్’ అన్నాడు బలబీర్.

ముద్దొచ్చినప్పుడే చంక ఎక్కమన్నారు మన పెద్దలు అని గుర్తుకి వచ్చింది విజయ్ కి. ’బాస్ నేను ఒక వారం లండన్ లో ఉండాలనుకుంటున్నాను. నాకు శలవు కావాలి’ అన్నాడు విజయ్.

’ఓ తప్పకుండా. నీ ట్రావెల్ ఎరేంజ్‍మెంట్స్ మనవాళ్ళు చేస్తారు. నువ్వు ఎక్కడ ఉంటావు? మన గ్రేట్ హైట్స్ లోనే కదా?’ అన్నాడు బలబీర్ సింగ్.

’బాస్ లండన్ లో నాకు నచ్చిన చోట ఉంటాను. ఒక వారం పాటు నేను ఎక్కడ ఉన్నాను, ఏం చేస్తున్నాను అని పట్టించుకోకండి’ అన్నాడు విజయ్.

’అదేంటి, నీకు నేను పెద్ద ట్రీట్ ఇవ్వాలి అనుకున్నాను. నాకు అక్కడ చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళు నీకోసం ఏమైనా చేస్తారు...’ అంటూ ఏదో చెప్పబోతున్న బలబీర్ సింగ్ కి స్మార్ట్ గా శల్యూట్ చేసి టివి ఆఫ్ చేసేసాడు.

రిసెప్షన్ కి ఫోన్ చేసి లండన్ కి ఫ్లైట్ బుక్ చేయమని చెప్ప షవర్ చేసుకోవడానికి వెళ్ళాడు.

***

లండన్ లో ఒక డీసెంట్ హోటల్ లో రూమ్ తీసుకుని దిగాడు విజయ్. లండన్ చేరినప్పటి నుంచి సుప్రియకి కాల్ చేయాలని చూస్తూనే ఉన్నాడు. కానీ ఆమె అతని కాల్ ని రిసీవ్ చేసుకోవడం లేదు. ఆమె ఆఫీస్ కి కాల్ చేసి ఆమెతో మాట్లాడాలని చెప్తే కూడా నో చెప్పింది. ఆమెకు చాలా మెసేజిలు కూడా పెట్టాడు. తనను కలుసుకోమని చాలా రిక్వెస్ట్ చేస్తూ ఎమోజీలు కూడా పెట్టాడు. తను ఆమె కోసమే వెయిట్ చేస్తూ ఉంటాను అని వేరే పని ఏదీ పని ఏమీ లేదని, తను బిజినెస్ పని మీద కాక, ఆమెను కలిసే పని మీదనే లండన్ వచ్చానని మెసేజి చేసాడు.

ఎన్ని మెసేజిలు పంపినా, ఆమె చదువుతుందో లేదో కూడా తెలియడం లేదు. అయితే తన నెంబర్ ఆమె బ్లాక్ చేయలేదని మాత్రం అర్థం అయింది విజయ్ కి. తను పంపే మెసేజిలు తనకు ఆమెకు చేరుతున్నాయి. కానీ తను వాటిని చదువుతుందో లేదో తెలియకుండా చదివేస్తుందేమో అని అనుమానం వచ్చింది విజయ్ కి. 

అందుకే ఆమెకు నచ్చేలా కొన్ని డయలాగ్స్ కూడా మెసేజిలు చేస్తూనే ఉన్నాడు గంట గంటకీ. 

జ్యూరిచ్ లో అతను ఉదయాన్నే ఫ్లైట్ కాచ్ చేయడానికి చెక్ అవుట్ చేసి రిసెప్షన్ లోకి వచ్చినప్పుడు అక్కడ లౌంజ్ లో ఒక దగ్గర ఒదిగి కూర్చుని ఉన్న ఎమిలీ గ్రెంటాలు కనిపించారు అతనికి.

  నేరుగా వాల్ల దగ్గరకు పోయి, ’హాయ్ ఎమిలీ, హాయ్ గ్రెంటా, ఎలా ఉన్నారు?’ అన్నాడు.

అతన్ని చూసి ఆనందంతో మొఖాలు ప్రకాశవంతమయ్యాయి ఆ తల్లీ కూతుళ్ళకు.

ఎవరూ ముఖపరిచయం లేని ఆ చోట ఎంత సేపటి నుంచి వెయిట్ చేస్తున్నారో తెలియదు. పాపం ఒంటరి తనం ఫీల్ అయి ఉంటారు అనుకున్నాడు విజయ్. అంతలో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ జాకొబ్ వచ్చాడు అక్కడికి. విజయ్ ని పలకరించి, ’సర్ ఎమిలీ, గ్రెంటాల గురించి మాకు ఇన్స్ట్రక్షన్స్ వచ్చాయి. వరి భద్రత గురించి మీరు ఏమీ ఆలోచించనక్కరలేదు’ అన్నాడు సాఫ్ట్ గా!

’చెప్పానుగా గ్రెంటా డాక్టర్ కావాలి’ అన్ణాడు విజయ్ చిన్నగా నవ్వుతూ.

’ష్యూర్ సర్. అది కూడా మాకు వచ్చిన ఇన్స్ట్రక్షన్స్ లో ఉంది’ అన్నాడు.

వారి మాటలు విన్న ఎమిలీకి, తాము అక్కదకు రావడాని వెనక విజయ్ ఉన్నాడని అర్థం అయింది. 

’థాంక్స్’ అంది విజయ్ తో.

’మనం ఫ్రెండ్స్. మన మధ్య థాంక్స్ ఉండవు. లవ్ యూ బోత్. టేక్ కేర్’ అంటూ శలవు తీసుకున్నాడు విజయ్.

ఆ సంఘటన ఒక సారి గుర్తుకి వచ్చింది. గ్రెంటా, ఎమిలీలు తన ప్రాణాలు కాపాడకపోయి ఉంటే ఏం జరిగేదో ఊహించడానికే భయం వేస్తుంది అనుకున్నాడు.

బలబీర్ సింగ్ కి తెలియకుండా ఇలా ఈ హోటల్ కి వచ్చి మంచి పని చేసాడు తను. అదే గనుక గ్రేట్ హైట్స్ కి వెళ్ళి ఉంటే తన ప్రతి అడుగుని మానిటర్ చేసి తన ప్రాణాలు కొరుక్కుతినేసే వాడు అనుకుని తనలో తనే నవ్వుకున్నాడు.

సుప్రియ ఇప్పుడు ఏమి చేస్తుంటుందో అనుకున్ణాడు సాయంత్రం నాలుగు అయ్యేసరికి. తన ఆఫీస్ అయిపోతే ఇప్పుడు బయల్దేరి తిన్నగా తన దగ్గరకి వచ్చేయవచ్చు. లేదా తన అపార్ట్‍మెంట్ కి వెళ్ళిపోతుందా?

అంతలో అతని ఫోన్ రింగ్ అయింది.

స్క్రీన్ పైన సుప్రియ పేరు చూసి, వెంటనే లిఫ్ట్ చేసాడు.

’సోఫీ, అన్నాడు గొంతు నిండా ప్రేమ నింపుకుని.

’ఎక్కడున్నావు?’ అంది కరుకుగా.

’చెప్పానుగా, నీ కోశం రూమ్ లోనే ఉన్నాను. నువ్వు నాకోసం తిరిగి, నేను నీ కోసం తిరిగితే కలుసుకోవడం ఆలస్యం అవుతుందని నా భయం. అందుకే ఒక్కరైనా కదలకుండా ఉండాలని ఈ ఆలోచన చేసాను’ అన్నాడు.

’గొప్ప పని చేసావు. అక్కడే ఉండు. నీతో తేల్చుకోవాలసిన విషయాలు చాలానే ఉన్నాయి’ అంది.

’డిన్నర్ కి ఎక్కడకు వెళ్దాము’ అన్నాడు విజయ్.

’అంత దూరం ఆలోచించకు. ముందు నేను నీతో బ్రేకప్ ఎందుకు కాకూడదో నన్ను కన్‍విన్స్ చేయడానికి ప్రయత్నించుదువుగాని. నాకు చెప్పాలనుకున్న కథలన్నీ సిద్ధం చేసి పెట్టుకో.’ అని కాల్ కట్ చేసేసింది.

ఉఫ్.... అంటూ నిట్టూర్చాడు విజయ్.

దేవుడు ఈ ఆడాళ్ళకు ఎందుకు ఇంత కఠినత్వాన్ని ఇచ్చాడు. అప్పుడే రోజ్ లాగా ఆహ్లాదంగా ఉంటారు. అప్పుడే గులాబి ముల్లు లాగా గుండెలను పొడుస్తారు. ఒక కంట కన్నీరు పెట్టిస్తూ మరో కంట ఆనందాన్ని అనుభవింపచేయడం వీళ్ళకి మాత్రమే  చాతనవుతుంది. మామూలోళ్ళు కాదు వీళ్ళు, అనుకుంటూ మొత్తం ఆడజాతినే ఒక కామెంట్ చేసుకున్నాడు మనసులోనే! బయటకు అనుకునే ధైర్యం చేయలేక!!

మరో అరగంటా ఆలోచనాతోనూ ఒక కప్ కాఫీతోనూ వెళ్ళదీసాడు. జార్జ్ మోడిఫై చేసిన ప్రోటీన్ వివరాలను అతను మరెవరిటోనో షేర్ చేసుకున్నాడా అని తనకు వచ్చిన అనుమానాన్ని బల బీర్ సింగ్ మెసేజ్ క్లియర్ చేసింది. తను {ఆర్వార్డ్ చేసిన డాక్యుమెంట్స్ చూసి బల బీర్ పంపిన మెసేజిలో, జార్జ్  కి మాక్స్ కి త్వరలోనే ఒక నెగోషియేషన్ జరగడానికి రంగం సిద్ధమయిందని, మాక్స్ బాస్ లు అతనికి ఆ పని అప్పచెప్పారని, అది నెరవేరేలోగానే విజయ్ జార్జ్ ని, మాక్స్ ని ఎలిమినేట్ చేయడం వల్ల ఆ విషయం అక్కడితో ముగిసి పోయిందని ఈ లోగా ఆ ప్రోటీన్ పైన రీసెర్చ్ చేయడానికి సైంటిస్టులు నడుము కట్టారని మెసేజ్ చేసాడు బలబీర్. 

సరిగ్గా అరగంట అవగానే, అతని డోర్ బెల్ మోగింది. చటుక్కున వెళ్ళి డోర్ తీసాడు. ఎదురుగా సుప్రియ ఉంది. తన ఆఫీస్ నుంచి నేరుగా హోటల్ కే వచ్చినట్లుంది. ఆమె యూనివర్సిటీకి వేసుకువెళ్ళే డ్రెస్ వేసుకుని ఉంది. కళ్ళు అతని వైపు చుర చుర కాల్చేసేలా ఉన్నాయి.

’లోపలికి రావచ్చా, ఇంకా ఎవరైనా ఉన్నారా? వాష్ రూమ్ లోనో, క్లోజెట్ లోనో...’ అంది గది ని కలియ చూస్తూ. వెళ్ళి వాష్ రూమ్ డోర్ కూడా ఓపెన్ చూసి లోపలకి ఒక చూపు విసిరి వచ్చి సోఫాలో కూర్చుంది.

’ఏమి తీసుకుంటావు సోఫీ’ అన్నాడు విజయ్.

’నీ సమాధానాలు. నీ ఎక్స్‍ప్లనేషన్‍లు. ముందు అవి తీసుకుని, తర్వాత ఏం చేయాలో నిర్ణయించుకుంటాను...’  అంది.

’సోఫీ నా జీవితంలోకి నువ్వు తప్ప మరో స్త్రీ రాదు. నన్ను నమ్ము. నా పనికి సంబందించినవరకు ఒక్కోసారి నేను లేడీస్ తో మ్ట్లాడ వచ్చు, బట్ అంతకు మించి ఏమీ ఉండదు, నన్ను నమ్ము, ప్లీజ్’ అన్నాడు దీనంగా చూస్తూ.

’కాఫీ తెప్పించు, నేణు ఫ్రెష్ అయి వస్తాను’ అంది ఆమె.

’అలాగే’, అని ఇంటర్ కామ్ లో రూమ్ సెర్వీస్ కి ఆర్డర్ చెపాడు ఒక పాట్ కాఫీ కావాలి అని. వాష్ రూమ్ లోకి వెళ్తున్న సుప్రియని వెనక నుంచి చూసి ఆమె తన ఎక్స్‍ప్లనేషన్‍ని అంగీకరించినట్లా, లేక తిరస్కరించినట్లా! అనుకున్నాడు.

కాఫీ వచ్చింది కానీ, వాష్ రూమ్ నుంచి సోఫీ రాలేదు.

బోయ్ కాఫీ పెట్టి సర్వ్ చేయనా అని అడిగితే వద్దు అని చెప్పి అతన్ని పంపాడు విజయ్.

ఆ బోయ్ వెళ్ళిన రెండు నిముషాలకు బయటకు వచ్చింది. తన బాగ్ లో వేరే డ్రెస్ పెట్టుకుని వచ్చినట్లుంది సుప్రియ, వాష్ రూమ్ లో షవర్ చేసి డ్రెస్ కూడా మార్చుకుని వచ్చింది. బ్లూ కలర్ డ్రెస్ లో దేవ కన్య లా మెరిసిపోతున్నా అమేను చూసి బొమ్మలా అయిపోయ్డు విజయ్.

’ఏయ్ ఏమిటి అలా చూస్తున్నావు?’ అంది సుప్రియ.

’బేబీ నువ్వు ఎంత బాగున్నావో చెప్పడానికి మాటలు లేవు నా దగ్గర’ అన్నాడు ఆమె వైపు ప్రామగా చూస్తూ.

చేతులు చాస్తూ అతని దగ్గరకి వచ్చేసింది సుప్రియ.

 ఆమెను హత్తుకుని ముద్దులలో ముంచేసాడు. ఆమె మొఖమంతా ముద్దులు పెడుతూ ఆమెను ఉక్కిరిబిక్కిరి చేసేసాడు. అతని ప్రేమ ఒక వరదలా పొంగి తనను తడిపేస్తూ ఉంటే కలిగిన పారవశ్యంలో మునిగి తేలుతూ ఆనందించింది సుప్రియ.

చివరగా ఆమె పెదవులను లిప్ లాక్ చేసి గట్టిగా హత్తుకున్నాడు. అంతవరకూ ఆమె ని తిట్టుకోవడం మరుపుకి వచ్చేసింది. ఆమె కోసం వేచి ఉండడం లోని బాధనూ అన్నిటినీ మరిచిపోయి ఆమె కౌగిలిలో గిలిగింతల్ని ఎంజాయ్ చేస్యసాగాడు.

కొంచెం సేపటికి, మేల్లగా అతని నుంచి విడివడి, ’కాఫీ ఇవ్వనా’ అంది సుప్రియ.

’ఊ..’ అన్నాడు విజయ్. 

వెళ్ళి కాఫీ పాట్ లోని కాఫీని కప్స్ లోకి వంపి షుగర్ క్యూబ్స్ తీసి అడిగింది, ’ఒకటా... రెండా...’ అని.

’రెండు.’ అన్నాడు విజయ్.

’ఏం ఒకటే అనొచ్చుగా’ అంది సీరియస్ గా చూస్తూ.

’నువ్వు షుగర్ క్యూబ్స్ గురించి అడిగావు అనుకున్నా’ అన్నాడు కన్నుగీటుతూ.

అంతలో డోర్ బెల్ మోగింది.

విజయ్ వైపు ప్రశ్నార్ధకంగా చూసింది.

తనకేమీ తెలియదన్నట్లు భుజాలు ఎగరేసి, తన కప్ లో స్పూన్ వేసి తిప్పుతూ డోర్ వైపు చేఉసాడు.

సుప్రియ వెళ్ళి తలుపు తీసేసారికి ఒక అందమైన యువతి, డోర్ తెరెవగానే, నవ్వుతూ లోపలికి రాబోయింది.

పక్కకి తప్పుకుని ’రెండోది వచ్చింది’ అంది సుప్రియ సీరియస్ గా.

కాఫీ కప్ టక్కున టీ పాయ్ మీద పెట్టి వచ్చిన యువతి వైపు చూసి, ’ఎవరు?’ అన్నాడు.

’ఓహ్, బలబీర్ చెప్పాడు మీరు లండన్ లో ఎంజాయ్ చేయాలనుకుంటున్నారని’ అంది ఆమె.

’ బలబీర్ ఎవరు? నాకు బలబీర్ ఎవరో తెలియదు. ప్లీజ్ ...’అంటూ చెయ్యి గది బయటికి చూపించాడు విజయ్.

’ఒన్ మినిట్. ఇది రూమె నెంబర్ ౧౨౦౯ కదా?’ అంది ఆమె.

’యెస్’ అన్నాడు విజయ్.

సుప్రియ టెన్నిస్ చూస్తున్న ప్రేక్శ్ఃఅకురాలిలా, ఆమె వైపు విజయ్ వైపు మార్చి మార్చి చూస్తూ ఉంది.

’మీ పేరు విఅజ్య్ కదా’ అంది ఆమె.

’అయితే, నేణు కరెక్ట్ ప్లేస్ కే వచ్చాను’ అంది ఆమె నవ్వుతూ.

’సోఫీ, హెల్ప్ మీ’ అన్నాడు విజయ్ సుప్రియ వైపు చూసి.

అప్పుడు మొదటి సారిగా సుప్రియ మొఖంలో కన్‍ఫ్యూజన్ మాయమయింది.

’మీరు ఆ బలబీర్‍తో మాట్లాడండి. డోంట్ డిస్టర్బ్ అజ్. ప్లీజ్’ అంది సుప్రియ.

’ఓకె’ అంటూ బయటకి వెళ్ళిపోయింది కొత్తగా వచ్చిన యువతి.

’డు నాట్ డిస్టర్బ్’ అనే బోర్డ్ డోర్ నాబ్ కి తగిలించి డోర్ లాక్ చేసాడు విజయ్.

’ఏంటి చెప్పు’ అంది సుప్రియ.

’పానకంలో పుడకల్లా వచ్చే ఈ అమ్మాయిలను పట్టించుకోకు సోఫీ. నాకు ఒక్కటే చాలు’ అంటూ ఆమెను హగ్ చేసుకున్నాడు’ విజయ్.

***