ఈ వారం కథా కమామీషూ

This week story teasers in sahari weekly

ఈ  వారం   కథా కమామీషూ
కథా కమామీషూ ఈ వారం

                                      కథా కమామీషు 17.06.2022 

 

1.    దీని భావమేమి తిరుమలేశా! : కొత్తగా విడుదలైన పాన్ ఇండియా సినిమాలో తాను స్వయంగా రాసి స్వరపరచిన తెలుగు పాటను తన వెబ్ సైట్ లోంచి కొంత రుసుము కత్తి డౌన్ లోడ్ చేసుకుని, ఆ పాటలోని సాహిత్యాన్ని పూర్తిగా కరెక్టుగా అర్థాన్ని రాశి పంపినవారికి హైదరాబాద్ బంజారాహిల్స్ లో ఒక విలాసవంతమైన డబుల్ బెడ్రూం ఫ్లాట్ బహుమతిగా ఇస్తానని ఆ సంగీత దర్శకుడు ప్రకటించటంతో జనమంతా తమ సన్నిహితులకు కూడా ఒకరికి తెలియకుండా మరొకరు రహస్యంగా ఆ పాటను డౌన్ లోడ్ చేసుకుని ముందుగా తామే విజేతలు కావాలని పోటీపడ్డారు. ఒక్కరోజులోనే దాన్ని డౌన్లోడ్ చేసుకున్నవారి సంఖ్య కోటి దాటింది. కానీ ఏ ఒక్కరూ ఆ పాటను వివరించలేకపోయారు. ఆ పాటలో ఎవరూ కనుక్కోలేనంత గొప్ప సాహిత్యం ఉందా? దాని అతడు ఎలా రాయగలిగాడు? బొరుసు చంద్రరావు స్మారక ఉగాది కథల పోటీలో ప్రత్యేక బహుమతి గెలుచుకున్న వై. సాయిబాబా హాస్య కథ ‘దీని భావమేమి తిరుమలేశా!’ తప్పక చదవండి.

 

2.     భలే పాప : రోజురోజుకీ తమ పాప వాలకం చూసి ఆ తల్లిదండ్రులు బెదిరిపోయారు. ఇక లాభం లేదని ఆ పాపను ఒక మంచి డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లారు. ‘చూడటానికి ఆ పాప మామూలుగానే ఉండటంతో, తన దగ్గరికి పాపని ఎందుకు తెచ్చారో’ అని ఆ డాక్టర్ ఆశ్చర్యపోయాడు. అయితే ఆ పాప పెద్ద ఆరిందాలాగా మాట్లాడటం, పెద్దవాళ్ళలాగా హూంకరిస్తూ, కళ్ళెగరేస్తూ అతన్ని కూడా బెదిరించటంతో ఆ డాక్టర్ హడలిపోయాడు. వయసుకు మించిన మాటలు, చేష్టలు చూసి, అనేక రకాల టెస్టులు చేయించాడు. ఆ టెస్ట్ రిపోర్ట్సన్నీ నార్మల్ గా ఉండటంతో పుట్టినప్పటినుంచి ఆమె అలవాట్లు అన్నీ అడిగి తెలుసుకున్నాడు. అయినా అతనికేమీ అర్థం కాలేదు. ఒక వారం రోజులపాటు ఆలోచించి, ఆలోచించి, మళ్ళీ ఆ తల్లిదండ్రులను కొన్ని ప్రశ్నలు వేసి, ఆ పాప అలా తయారవటానికి గల కారణాన్ని కనుక్కున్నాడు? ఆ కారణం ఏమిటి? అది తగ్గటానికి ఏవైనా మందులిచ్చాడా? చివరికి ఆ పాప మారిందా? కొసమెరుపు కథల పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన కె.కె.రఘునందన కథ ‘భలే పాప’ తప్పక చదవండి.    

 

3.   ఓ లేడీ టైలర్ : కొత్తగా పెళ్లైన అతడు ఉద్యోగ కారణంగా తన భార్యకు దూరంగా ఉండాల్సివచ్చింది. ఓ పనిమీద బయటికొచ్చిన అతడు, వడగండ్లతో కూడిన భారీ వర్షంలో చిక్కుకుపోయి, తప్పని పరిస్థితుల్లో అతడు ఒక ఇంట్లో చిక్కుకుపోయాడు. భర్త ఊరికి వెళ్లటంతో ఒంటరి అయిన ఒక అందమైన భామ ఆ ఇంట్లో ఉండటంతో అతని ఆలోచనలు పరిపరివిధాల పోయాయి. దానికితోడు ఆమె మాటలు, వాలకం కూడా తనను రెచ్చగొట్టినట్లే ఉండటంతో, ఎన్నాళ్లుగానో భార్యకు దూరంగా ఉన్న అతడు చొరవ తీసుకోవాలనుకున్నాడు. ఉన్నట్లుండి కరెంట్ పోవటంతో అతడు మెల్లిగా వెళ్ళి, మంచంమీద ఆమె పక్కనే పడుకున్నాడు. మనసులో ఏ మూలో కాస్త భయం ఉండటంతో, ఆమె ఏమాత్రం చొరవ చూపినా, తాను ముందుకుపోదామనుకుని ఆగాడు. ఈలోగా ఆమె అతని వైపు తిరిగి అతని గుండెల్లో తన తల దాచుకుంది. ఆ తర్వాత జరిగిన కథ ఏమిటి? ఆమె ఎందుకలా చేసింది? దానికి అతని ప్రతిక్రియ ఏమిటి? రాజేష్ ఖన్నా రాసిన మనసుకు హత్తుకునే కథ ఓ లేడీ టైలర్’ తప్పక చదవండి.

 

4.     వికసించే మనసులు : తల్లి చనిపోయి, తాగుబోతైన తండ్రి పట్టించుకోకపోవటంతో అతని ఆలనాపాలనా గాలికే ఎరుకైంది. ఆ సమయంలో అతన్ని ఒక మాస్టర్ ఆదుకున్నాడు. అతడు చదువుకోవటానికి సాయం చేయటానికి ముందుకొచ్చాడు. ఆ మాస్టర్ భార్య కూడా అందుకు సహకరించింది. ఊరకే డబ్బు తీసుకోవటం ఇష్టం లేని అతనితో తమ ఇంటిపనులు చేయించుకుని, అతని చదువుకు సంబంధించిన ఫీజులు ఆమె తన భర్తతో కట్టించటంతో అతడి చదువు సాఫీగా సాగిపోయింది.. కారణాంతరాలవల్ల ఆ భార్యాభర్తలు ఆ ఊరు వదిలి వెళ్లటంతో, అతనికీ, ఆ దంపతులకీ  మధ్య దూరం పెరిగిపోయింది. ఆ తర్వాత అతడు మంచి ఉద్యోగం సంపాదించుకుని, జీవితంలో స్థిరపడ్డాడు. ఆపైన అతని పెండ్లి కూడా అయింది. అయితే తన జీవితానికి ఒక చక్కని దారి చూపిన ఆ దంపతుల సాయానికి ప్రతిఫలంగా అతడు ఏమి చేశాడు? అనుకోకుండా వారికి కలిగిన మానసిక అశాంతిని అతడెలా దూరం చేశాడు? బి. వి. డి. ప్రసాదరావు రచించిన హృద్యమైన కథ ‘వికసించే మనసులు’ లో చదవండి.

 

5.    గురుదక్షిణ : విదేశాలనుంచి వచ్చిన ఒక మహానుభావుడు స్థాపించిన ఆశ్రమంలో ఉండటానికి అతనికి చోటు లభించింది. అక్కడ చెప్పబడే నీతికథలు, వ్యక్తిత్వ వికాస మెళకువలు వింటున్న అతనికి అందులోని తత్వం అంత తేలిగ్గా అర్థమవలేదు. అయినా ఆ మహానీయుని దగ్గర అతడు అనర్గళంగా ఆంగ్లంలో ఉపన్యసించగల శక్తిని సంపాదించుకున్నాడు. లండన్ నుంచి వచ్చిన ఒక కార్యకర్త అక్కడనుంచి తెచ్చిన ఒక చొక్కాను అతనికి బహూకరించాడు. సహజంగానే అందగాడైన అతడు ఆ చొక్కా వేసుకోవటంతో అందరూ దాన్ని ప్రశంసించారు. దాంతో అతడెంతో పొంగిపోయాడు. అతికష్టం మీద డిగ్రీ పూర్తిచేసిన అతనికి విశ్వవిద్యాలయంలో చదివే అవకాశం కూడా వచ్చింది. ఆశ్రమంలో బోధపడని తత్వం అతనికి విశ్వవిద్యాలయంలో ఒక ఉపన్యాసం ఇవ్వటానికి వెళ్ళినప్పుడు బోధపడింది. ఏమిటతనికి అర్థం కానీ ఆ తత్వం? టేకుమళ్ళ శ్రీకాంత్ రచించిన చక్కని కథ ‘ఉతకని చొక్కా’ తప్పక చదవండి. 

 

6.     సూర్యకాంతం వర్సెస్ రాజబాబు : చిన్నతనంనుంచే ఆమె మహా గయ్యాళిగా పెరిగింది. ఆమె తల్లిదండ్రులు అందుకు సంతోషించారే కానీ ఏనాడూ కించిత్తయినా బాధపడలేదు. పోనుపోను ఆమె గయ్యాళితనంతో పాటు, శరీరం కూడా భారీగా పెరిగిపోవటంతో ఆమెకు పెళ్లి సంబంధం కుదరటం కష్టమైంది. ఎట్టకేలకు ఒక బక్కపలచని వ్యక్తి, తనకు ఉద్యోగం ఇప్పిస్తే ఆమెను పెళ్లి చేసుకుంటానని ముందుకొచ్చాడు. ఆమె తల్లిదండ్రులు అతనికి ఉద్యోగం ఇప్పించి, పెళ్లి చేసేసి చేతులు దులుపుకున్నారు. ఆరోజునుంచి ఆ అర్భకుడు పడని బాధలు లేవు. ఇంటిపనులన్నీ చేసిమరీ అతడు ఆఫీసుకెళ్లాల్సివచ్చేది. ఆమెకు ఎదురాడటం అతని తరం కాలేదు. అయితే ఉన్నట్లుండి ఒకరోజు అతడు ఆమెకు ఎదురుతిరిగాడు. మాటకు మాట సమాధానం చెప్పాడు. దాంతో ఆమె అవాక్కయింది. అతనిలో ఆ మార్పుకు కారణం ఏమిటి? దాని పర్యవసానం ఏమిటి? ఆదోని బాషా గమ్మత్తైన కథ ‘సూర్యకాంతం వర్సెస్ రాజబాబు’ లో ఈవారం సహరిలో చదవండి.