ఆన్ లైన్ చదువులు - 1

Dr Desineni Venkateswara Rao is an Educational Psychologist and Counsellor. He wrote about Tips for effective learning in the On line Classes.

ఆన్ లైన్ చదువులు - 1

 

ఆన్‍లైన్ క్లాసులు. విద్యార్థులకు కొన్ని చిట్కాలు

 

కరోనా కాలం లో ప్రపంచ వ్యాప్తంగా ఆన్ లైన్ లో నేర్చుకోవటం దాదాపుగా అనివార్యం అయిపొయింది. బడి పిల్లల చదువులే కాదు,డాన్స్,మ్యూజిక్,యోగ ఇలా సమస్తం ఆన్ లైన్ బాట పట్టాయి.ఏదో ఒక రూపం లో ఆన్ లైన్ లో చదువుకోవటం పిల్లలకు తప్పనిసరిపోయింది. ఇది అటు టీచర్స్ ఇటు పేరెంట్స్ భాద్యత ను మరింతగా పెంచిందనే చెప్పాలి.  ఈ పరిస్థితులలో ఓ వైపు పిల్లలకు ఆన్ లైన్ చదువు కు అవసరమైన సామాగ్రి(కంప్యూటర్, స్మార్ట్ ఫోన్,మైక్రో ఫోన్ మొ ) సమకూర్చటం తో పాటు మరో వైపు పిల్లలు ఈ ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ ను చదువుకోసమే సద్వినియోగం చేసుకునేలా    చదువుపై ద్రుష్టి సారించేలా ప్రత్యేక శ్రద్ద పెట్టాల్సిన అవసరం అలాగే ప్రత్యేకమైన పద్ధతులు పాటించాల్సిన అవసరం ఎంతయినా ఉన్నది. ఈ దిశగా మనో విజ్ఞాన శాస్త్రవేత్తలు పలు సూచనలు చేస్తున్నారు. అందులో కొన్ని ముఖ్యమైన సూచనలు పాఠకుల కోసం ప్రత్యేకంగా....

చాల మంది పిల్లలు ఏదో ఒక రూపంలో ఆన్ లైన్ చదువుకు అలవాటు పడుతున్నారు. అది స్కూల్ లేదా కాలేజ్ లు నిర్వహించే ఆన్ లైన్ తరగతులు కావచ్చు లేదా ఏదయినా ప్రత్యేక కోచింగ్ తరగతులు కావచ్చు. అయితే శారీరకంగా, మానసికంగా ఇబ్బంది తలెత్త కూడదంటే తప్పని సరిగా అటు పిల్లలు ఇటు తల్లి తండ్రులు కొన్ని జాగ్రత్తలు తీసుకోవటం అవసరం. ప్రత్యేకించి వెన్నెముక,మెడ ,కన్ను,చెవి విషయం లో క్రింది జాగ్రత్తలు అవసరం.

౧)కంటికి,కంప్యూటర్ స్క్రీన్ కు మధ్య  ఒక అడుగు దూరం ఉండేలా చూసుకోవాలి.

౨) కంప్యూటర్ స్క్రీన్ ను చూసేటప్పుడు ౨౦ డిగ్రీల కోణంలో కన్ను కిందికి చూసేలా అమరిక ఉండాలి.

౩)కాంతి చాలా ఎక్కువగా  స్క్రీన్ ఫై పడకుండా తగు మోతాదులో ఉండేలా చూసుకోవాలి

౪) ఫోన్ వంటి చిన్న స్క్రీన్ కంటే కంప్యూటర్ స్క్రీన్ కు ప్రాధాన్యత ఇవ్వాలి.

౫)కంటి ఫై ఒత్తిడిని తగ్గించాలంటే ౨౦-౨౦-౨౦ నియమం పాటించాలి. ప్రతి ౨౦ నిమిషాలకు ఒక సారి  విరామం తీసుకొని  కనీసం ౨౦ అడుగుల దూరం లోని ఏదయినా వస్తువును కనీసం ౨౦ సెకండ్ల పాటు చూస్తే కంటిపై స్క్రీన్ ఒత్తిడిని తగ్గించవచ్చు

౬)ఇయర్ ఫోన్స్ కంటే హెడ్ ఫోన్ వాడటం మంచిది

౭)ఆన్ లైన్ లో పాఠాలు వినేటపుడు కాస్త బోర్ అనిపించగానే పిల్లలు తమకిష్టమైన కంప్యూటర్ గేమ్స్ లేదా ఇతర ఆసక్తికరమైన విషయాల వైపు మళ్లే ప్రమాదముంది. అలా జరగ కూడదంటే తల్లిదండ్రులు ఓ కంట కనిపెట్టటమే గాక టీచర్స్ కూడా పిల్లలను ఈ విషయం లో తరచు గా ఎడ్యుకేట్ చేయాలి.

౮)తాము చెప్పే పాఠాలు పిల్లలలో ఆసక్తిని ని కలిగిస్తున్నాయా లేదా అనేది టీచర్స్ నిరంతరం చెక్ చేసుకోవాలి.

౯)ఆన్ లైన్ భోదన అనేది కొన్ని ప్రత్యేక నైపుణ్యాల తో కూడినదనే విషయాన్నీ గుర్తించి టీచర్స్ కూడా అవసరమైన నైపుణ్యాలను పెంచుకోవాలి.

౧౦)పిల్లలు ఆన్ లైన్ లో ఉన్నపుడు అటు టీచర్స్ ఇటు పేరెంట్స్ ఇలా పలు జాగ్రత్తలు తీసుకోవటం తప్పనిసరి.

మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే పిల్లలను కేవలం అకాడమిక్ విషయాలకే పరిమితం చేయకుండా కొన్ని ముఖ్యమైన నైపుణ్యాలను కరోనా కాలం లో నేర్చుకునేలా చూడాలి. చదువుల్లో బాగా రాణించాలంటే అవసరమైన స్టడీ స్కిల్స్, మెమరీ ని పెంచుకునే పద్ధతులు, భావోద్వేగాలను నియంత్రించుకోవటం, మూర్తిమత్వ వికాసం వంటి అంశాలపై, సాఫ్ట్ స్కిల్స్ మరియు లైఫ్ స్కిల్స్ ఫై నిపుణులైన సైకాలజిస్ట్ ల చే ఆన్ లైన్ లో శిక్షణ ఇప్పించటం మంచిది. ఇలాంటి నైపుణ్యాలు పిల్లలు జీవితాంతం వెన్నంటి ఉంటూ భావి జీవితం లో మంచి విజయాలను అందిస్తాయి. ఒక రకంగా చెప్పాలంటే నిత్య జీవితానికి ఎంతో ఉపయోగ పడే పలు విషయాలను నేర్చుకోవటానికి ఇదే మంచి తరుణం.ఆన్ లైన్ లో పిల్లలకు అకాడమిక్ తరగతుల ను నిర్వహించటం దాదాపుగా అనివార్యమని చాలా మంది నిర్ణయానికి వచ్చారు. అయితే అదే సమయం లో పిల్లల ఫై సిలబస్ ఒత్తిడి తక్కువగా ఉండాలని, స్క్రీన్ టైం వీలయినంత తక్కువగా ఉండాలని చాలా మంది కోరుకుంటున్నారు. ఈ అవకాశం సద్వినియోగం చేసుకొని రెగ్యులర్ అకడెమిక్స్ తో పటు ఇలాంటి నైపుణ్యాలను నేర్చుకోవటం ఎంతో  ఉపయోగకరం.

ఆన్ లైన్ లో ఇలా అకాడమిక్ విషయాలతో పాటు జీవన నైపుణ్యాలపై ద్రుష్టి పెట్టటం వల్ల  సమయాన్ని సద్వినియోగం చేసుకోవటం, వాయిదా మనస్తత్వం నుంచి బయట పడటం,క్రమ శిక్షణ తో శ్రద్దగా చదువుకోవటం వంటి లక్షణాలు పిల్లలలో ఏర్పడి తల్లి తండ్రులపై ఒత్తిడి తగ్గుతుంది.

డాక్టర్ దేశినేని వెంకటేశ్వర రావు

ఎడ్యుకేషనల్ సైకాలజిస్ట్ మరియు రచయిత.