శత సంచికోత్సవం

శత సంచికోత్సవం ఉచితం గా చదవండి

శత సంచికోత్సవం

శత సంచికోత్సవం

ఈ మాట గతవారం వారపత్రికను సిద్ధం చేస్తున్నప్పుడు అనుకోలేదు. కానీ ఈ వారం పుస్తకం పని మొదలు పెట్టగానే 100 అంకె కనిపించి మనసు పులకరించిపోయింది. ఇది నిజంగా సెలెబ్రేట్ చేసుకోవాల్సిన సందర్భం అనుకున్నాము. దానికి మొదటి కారణం  సహరి పాఠక మహాశయులు అయిన మీరే!

మీరు సహరి చదువుతున్నారు. ఆదరిస్తున్నారు. అభిమానిస్తున్నారు. అందుకు మీకు శతకోటి ధన్యవాదాలు.

అలాగే రచయితలు, రచయిత్రులు కూడాను. వారు తమ మేలైన రచనలను సహరికి పంపుతున్నారు. మీ అందరి ఆదరాభిమానాలు ఇలాగే సహరికి అందించాలని మనసారా కోరుకుంటూ మీరు అందించిన ఈ విజయానికి మీ అందరికీ ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాము. అలాగే మా ఆర్టిస్టులకు, కార్టూనిస్టులకు, వ్యాస రచయితలకు, కవులకూ కూడా ధన్యవాదాలు. 

ప్రతి పుస్తకం సర్వాంగ సుందరంగా తయారయి, మీకు అందించడానికి మా డిజైనర్స్, టెక్నికల్ స్టాఫ్ అహర్నిశలు కష్టపడుతున్నారు. వారందరిదీ ఈ విజయం. వారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు.

ఈ వారం పుస్తకం మీ బంధు మిత్రులతో పంచుకోవడానికి వీలుగా ఉచితంగా అందుబాటులో ఉంటుంది.

రండి ఈ విజయాన్ని అందరం సెలబ్రేట్ చేసుకుందాము. 

 

గొర్లి శ్రీనివాస రావు   

పసుపులేటి సత్య శ్రీనివాస్