+91 9553678686

నేటి యువతీ యువకులే భారత దేశ సౌభాగ్యం. వారికి అవసరమైన వివరాలను అందచేసే ప్రయత్నం చేస్తున్నాము. విద్యా, వ్యాపార, ఉద్యోగ రంగాలలోని అవకాశాలను, సరికొత్త పంథాలను విశ్లేషించి చక్కటి నిర్ణయాలను తీసుకోవడానికి ఉపకరించే సమాచారం మీకు అందిస్తాము ఇక్కడ. ఈ వారం యువలో ఈ వర్గంలో వచ్చే వ్యాసాల గురించిన వివరాలు ఇక్కడ ఉంటాయి.

అవినీతి తంత్రం

ఆ నాడు విష్ణుశర్మ రాజకుమారులను విద్యావంతులుగా చేయడానికి చెప్పిన పంచ తంత్రం లాగా ఈ నాడు విద్యావంతులైన యువకులలో నీతి నియమాలను పాదు కొలిపే రచన అవినీతి తంత్రం. మొండెపు ప్రసాద్ తన అనితర సాధ్యమైన శైలిలో సులభగ్రాహ్యంగా ఎన్నో విషయాలను మన యువతకు అందిస్తున్నారు. ప్రారంభ సంచిక నుంచి మొదలవుతున్న ఈ ధారావాహికను ప్రతి వారం చదవండి. ఆలోచించండి. ఆచరించండి. సివిల్స్ పరీక్షలలో ఎథిక్స్ పేపర్ కి కూడా ఇవి ఉపయోగపడతాయి.