+91 9553678686

తెలుగు నాట వివిధ సోషల్ మీడియా వేదికలపై సాహిత్య సమూహాలు ఏర్పడి ఉన్నాయి. మీ సమూహం గురించిన వివరాలను, ఆ ఫొటోలను పంపించండి. వాటి వివరాలను సహరి సమగ్ర వార పత్రిక ప్రచురిస్తుంది. మీరు వివరాలను పంపించవలసిన మైల్ ఐడి sahari.literarygroups@gmail.com

లేదా వాట్సప్ కూడా చేయవచ్చు. వాట్సప్ నెంబర్ 9553678686.

 

 

గ్రూప్ పేరు

 (గ్రూప్ లక్ష్యం)

అడ్మిన్ పేరు

సభ్యుల

 సంఖ్య

ఆథర్స్ అండ్ స్టోరీస్

(కథాభ్యాసం, నవలాభ్యాసం)

గొర్లి శ్రీనివాసరావు 98009196021

36

ప్రియమైన కథకులు (కథ సాహిత్యంపై చర్చలు)

శ్రీ  ఇందూరమణ  9951171696

250

ఉత్తరాంధ్ర రచయితల వేదిక

(సాహిత్యంలోని అన్ని ప్రక్రియలు)

శ్రీ  నారంశెట్టి ఉమామహేశ్వరరావు 8328642583

126

తపన సాహిత్య వేదిక

(సాహిత్యం)

శ్రీ సడ్లపల్లి చిందంబరరెడ్డి 9440073636

78

నేనూ.. నా సాహితీ మిత్రులు.

(సాహిత్యం)

 

శ్రీ శరత్ చంద్ర 9849241286

155

చారిత్రక కథారచన కార్యశాల

(చారిత్రక సాహిత్యం)

శ్రీ పాపినేని సాయి 9845034442

46

రంజని మిత్రులు

(రంజని కార్యక్రమాలు)

శ్రీమతి పద్మలతా జయరాం నందిరాజు 9492921383

67

సాహితీ వేత్తల వేదిక

శ్రీ పిళ్ళె విజయ్ 9490122229

202

తెలుగు కథల అభిమానులం

శ్రీ మురళి మంథా 9492925527

208

పడమటి గోదావరి కథకులు

శ్రీ వడలి రాథాకృష్ణ 9985336444

45

సాహిత్య సమాచార కలశం

(సాహిత్య సమాచారం కోసం)

శ్రీ వంశపూడి శ్రీనివాసరావు 8886425656

162

విశాఖసాహితి

ఘండికోట విశ్వనాథ 9966539518

118

అంతర్యామివ్యాస పీఠం (టెలిగ్రాం)

(అంతర్యామి వ్యాస కర్తల గ్రూప్)

బాలు 800801670

28

కణిక

(సాహిత్య సమాజ విద్య)

కణిక

143

“సుమధుర తెలుగు సాహిత్యం” అనే ఈ గ్రూప్ మిగతా సాహితీ సమూహాలకంటే భిన్నంగా ప్రత్యేకమై, గుడ్ మార్నింగ్,  గుడ్ ఈవెనింగ్ లు కాకుండా, కేవలం పుస్తకాలు, సాహిత్యము, తెలుగునాట వివిధ సాహితీ ప్రక్రియలపై చర్చిస్తూ ప్రపంచ వేదికలపై తన ప్రత్యేకతను చాటుకుంటోంది. 


కేవలం సాహిత్యాభిమానులు మాత్రమే సభ్యులుగా కలిగి, కొత్త సభ్యులను తమ ఆసక్తిని బట్టి గ్రూప్ లో చోటుకల్పిస్తూ, విసిగించే పోస్ట్ లు లేకుండా, ఊరికే చక్కర్లు కొట్టే ఫార్వర్డు మెసేజిలను నిషేధించి, ఎంతో సామరస్యంతో, సామాజికంగా జరిగే సంఘటనలపై తగువిధంగా స్పందిస్తూ, సభ్యులు తమలోతాము వారం వారం సమీక్షలపై , కవితల పై, వ్యాసరచన పోటీలు, వగైరా నిర్వహించుకుంటూ, వివిధ దేశాలలోని తెలుగువారు సభ్యులుగా, వివిధ వయసులవారు, వృత్తులవారు, కవులు, రచయితలు, విద్యార్థులు, ఎవరికెవరూ ప్రత్యక్షంగా పరిచయం లేకపోయినా,  తామెంతో ప్రేమతో, కేవలం ఆన్లైన్ స్నేహాలతో నిర్వహించుకునే గ్రూప్ ఈ “సుమధుర తెలుగు సాహిత్యం”.


అడపాదడపా సభ్యులు zoom వగైరాలలో కలుస్తుంటారు. ఈ గ్రూప్ లోని సభ్యులు ఇటీవల జూమ్ లో కలిసినప్పటి ఫొటో ఒకటీ, సభ్యులు శ్రీ రామం గారు “ప్రపంచ సాహితీ సదస్సు”లో పాల్గొని తెలుగు సాహిత్యం పై ఉపన్యసించినప్పటి యూట్యూబ్ వీడియో లింక్ ను , గ్రూప్ లింక్ కూడా ఇక్కడ ఇవ్వటమైనది.


గ్రూపు లింక్: 

https://chat.whatsapp.com/E0uOSILZ925Kn6glYPbcnK


ప్రపంచ సాహితీ సదస్సులో సభ్యులు పాల్గొన్న వీడియో లింక్: 

https://youtu.be/2wDkab3dEcg


తెలుగు సాహితీసేవలో వాట్సాప్ బృందాలు

 

ప్రస్తుతం ప్రపంచం అంతా కాలక్షేపం కోసం ప్రధానంగా వాట్సాప్‌పైనే ఆధారాపడి ఉందంటే అది అతిశయోక్తి కాబోదు. ఉదయం లేచింది నిదుర లేచింది మొదలు రాత్రి నిదురపోయేవరకూ వాట్సాప్ చూడనిదే కాలం గడిచినట్టే ఉండదెవరికీ.

ఇంతగా మన జీవితంలో భాగమైపోయిన వాట్సాప్‌లో అనేక బృందాలు పుట్టుకొచ్చాయి. వాటిలో తెలుగు సాహిత్యసేవలో తమ వంతు కృషి చేసున్న కొన్ని బృందాల గురించి ఇప్పుడు తెలుసుకుందామా?

 

 

ఆథర్స్ అండ్ స్టోరీస్:

తెలుగు కథకులను ఒకచోట చేర్చి రచనలపై చర్చలు, కథలపై సమీక్షలు జరుపుకునేందుకు వీలుగా ప్రముఖ రచయిత శ్రీ గొర్లి శ్రీనివాసరావు ఏర్పరిచిన బృందం ఇది. ఎందరో ప్రముఖరచయితలున్న ఈ బృందంలో నిత్యం అనేక ఆసక్తికరమైన చర్చలు, కథాభ్యాస కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి.

ఈ బృందంలో చేరడానికి సంప్రదించవలసిన ప్రధాన అడ్మిన్ శ్రీ గొర్లి శ్రీనివాసరావు గారి నంబర్: 9800919601

 

ప్రియమైన కథకులు:

శ్రీ ఇందు రమణ గారిచే నెలకొల్పబడిన ఈ బృందంలో దాదాపు 250 మంది కథకులు సభ్యులుగా ఉన్నారు. ఈ బృందంలో ప్రముఖ రచయితలతో పాటు ఔత్సాహిక రచయితలు కూడా చాలామంది ఉన్నారు. అంశాల వారీగా కథలను రాయించే ప్రక్రియ ఇక్కడ జరుగుతూ ఉంటుంది.

శ్రీ ఇందు రమణ గారు ప్రధాన అడ్మిన్ గా ఉన్న ఈ బృందంలో చేరేందుకు సంప్రదించవలసిన నంబర్: 9951171696 (ఇందు రమణ)

 

 

 

తెలుగు కథల అభిమానులు:

 

తెలుగు కథలపై మక్కువతో అందరికీ తెలుగు కథలను సులువుగా చదువుకునే వీలు కల్పించాలనే ఉద్దేశ్యంతో శ్రీ ఎం మురళీకృష్ణ గారు ఏర్పరిచిన బృందం తెలుగు కథల అభిమానులు. ఇందులో కథకులకంటే కథాభిమానులే ఎక్కువ. ఈ బృందంలో ప్రతిరోజూ కథలు ప్రచురింపబడి వాటిపై బృంద  సభ్యుల అభిప్రాయాలు, చర్చలు జరుగుతూ ఉంటాయి.

ఈ బృందంలో చేరేందుకు సంప్రదించవలసిన నంబర్: 9492925527

 

తెలుగు కవితా యజ్ఞము:

 

తెలుగుభాష మనుగడ కోల్పోకుండా భాషలో ఉన్న మాధుర్యాన్ని భావితరాలకు అందించే విధంగా  మన సంస్కృతి ఆచారాలు వ్యవహారాలు పండుగలు  విశిష్టతను తెలియజేయటం. ప్రధానంగా నవ్యకవులనుఉత్తేజపరచటం..పద్యకవిత్వాన్ని ప్రోత్సహించటం దోషాలను సవరించటం. భారత భాగవత రామాయణ కావ్యాలలోని పద్యాలను ఆస్వాదించటం‌ మొదలగునవి.

వచనకవితలు పద్యకవితలు నిరంతరాయంగా వ్రాయటం, సమీక్షించటం, భాషావ్యాకరణ సందేహములు నివృత్తి చేయటం, భాషా పదసంపత్తికై పదమంజ‌రి అను పోటి కార్యక్రమము పురాణం రామప్రసాదుగారిచే ప్రతిరోజూ రాత్రి 7-30 నుండి 8-30 చక్కగా నిర్వహించబడటం, పద్యాలలోని మాధుర్యాన్ని ఆస్వాదించుటకు పద్యపఠనం అను కార్యక్రము అడ్మిన్ మజ్జారి చెన్నకేశవులుగారిచే నిర్వహించబడుతుంది. ప్రతిరోజు ఒక ప్రసిద్ధ పద్యం ఇవ్వటం ఆ పద్యాన్ని సమూహసభ్యులు రసవత్తరంగా పఠించటం, ఆస్వాదించటం బహు చక్కగా నిర్వహించబడుతుంది. ఈ పద్యపఠనాన్ని గార రంగనాథంగారు సమీక్షిస్తుంటారు. భగవత్పురాణాలను పైడి నాగసుబ్బయ్యగారు ప్రతిరోజు ఒక భాగాన్ని అందించటం  చక్కగా జరుగుతోంది.

ఈ బృందంలో చేరడానికి సంప్రదించవలసిన నంబర్: 905237461 (శ్రీ మజ్జారి చెన్నకేశవులు, ప్రధాన అడ్మిన్)

 

 

 

ఉత్తరాంధ్ర రచయితల వేదిక:

 

తెలుగు భాష, తెలుగు సాహిత్య పరిరక్షణకు, సేవలకు ఉద్దేశించి ఉత్తరాంధ్ర జిల్లాలైన శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్టణం కవులు రచయితలతో ప్రారంభించిన వేదిక.ఈ వేదిక ప్రముఖ రచయిత శ్రీ నారంశెట్టి ఉమామహేశ్వరరావు గారు ప్రధాన అడ్మిన్ గా ఉన్నారు.

ఈ వేదిక  తెలుగు భాష ఉనికిని కాపాడి భవిష్యత్తు తరాలకు అందించడం లో ప్రముఖ పాత్ర వహిస్తున్నది. ఈ వేదికలో 126 మంది ప్రఖ్యాత సాహితీవేత్తలైన కవులు కవయిత్రులు రచయితలు రచయిత్రులు వారి వారి విభిన్న రచనలతో వైవిధ్యభరితమైన  సాహిత్య ప్రక్రియలతో ప్రతిఒక్కరూ ఇతరులకు స్ఫూర్తిని కలిగిస్తూ ఉండటం విశేషం.

ఈ బృందంలో చేరేందుకు సంప్రదించవలసిన నంబర్: 9490799203

 

పద్యభారతి:

 

తెలుగు పద్యరచనపై ఆసక్తి కలిగిన పద్యకవులందరినీ ఒక వేదికగా ప్రముఖ పద్యకవి శ్రీ చదలవాడ నరసింహం రావు గారు ఏర్పరిచిన బృందం ఇది. ఈ బృందంలో ప్రతిరోజూ అనేక సమస్యాపూరణలు, పద్యరచనపై చర్చలు, సూచనలు, జరుగుతూ ఉంటాయి.

ఈ బృందంలో చేరడానికి ఆసక్తి చూపేవారు సంప్రదించవలసిన నంబర్: 9849809565

(సేకరణ: శ్రీ రాజేష్ యాళ్ళ, డా. ఎం సుగుణరావు)