+91 9553678686

రచయితలకు, రచయిత్రులకు సుస్వాగతం!
        చక్కటి కథలు, కవితలు, నవలలు, వ్యాసాలు మీ నుంచి కోరుతున్నాము.
        పాఠకులకు అత్యంత నాణ్యమైన రచనలను అందించడంలో మీ కృషి అమూల్యం. ప్రచురించిన ప్రతి రచనకు పారితోషికం ఉంటుంది. ఈ పారితోషికం మీ  రచన ప్రచురించిన తర్వాత నెల మొదటి వారంలో చెల్లించబడుతుంది. 
        మీ ప్రతి రచన కు చివరగా మీ పేరు, చిరునామాలతో పాటుగా మీ బాంక్ అకౌంట్ వివరాలను కూడా ఇవ్వండి.
        సహరి సమగ్ర వారపత్రికలో ప్రచురింపబడే రచనలు ఇదివరకు ఎక్కడా ప్రచురింపబడి ఉండకూడదు. ముద్రణలో కానీ, వెబ్ లో కానీ, సోషల్ మీడియాలలో కానీ ఆ రచన ఇదివరకు ఎక్కడ ప్రచురింపబడలేదని హామీ ఇవ్వాల్సి ఉంటుంది. మీ స్వంత రచన అని, దేనికి అనుసరణ గానీ అనువాదం గానీ కాదని కూడా మీ హామీ పత్రంలో రాయాలి.
        మీ రచనలు వీలైనంతవరకు యూనికోడ్ లో పంపండి. కంప్యూటర్ లో టైప్ చేయనివాళ్ళు చేతిరాతలోనే రాసే వారు తమ రచనలను స్పష్టమైన ఫొటో తీసి మాకు మైల్ చేయవచ్చు.మైల్ చేయడానికి ఇబ్బంది ఉన్న వారు తమ రచనలను వాట్సప్ ద్వారా కూడా పంపవచ్చు. వాట్సప్ నెంబర్ 9553678686
         మీ రచనలను పంపవలసిన మైల్ ఐడి sahari.telugu@gmail.com