*****
అప్పు @ A టు Z
============
(మినీ హాస్య కథ)
రచన ::
బుద్ధవరపు కామేశ్వరరావు
హైదరాబాద్
"Aవడ్రా నువ్వు! నాకు ఫోన్ చేసావ్?" ఫోన్లో అరిచాడు ఆనందరావు
"Bడ్డా! అరవకు నేనే అప్పారావుని నేను అడిగిన వెయ్యి రూపాయల అప్పు గురించి చేసా”
"Cగ్గు లేదూ! అలా అప్పు అడగడానికి!"
"Dప్ప మీద రెండు పీకుతా అలా మాట్లాడితే! డబ్బులు ఎప్పుడిస్తావ్ చెప్పు!"
"Eప్పుడయితే అప్పు ఇవ్వలేను."
"Fపటికి ఇస్తావో పోని అది అయినా చెప్పు"
"Gడ్డులా తగులుకున్నావురా! ఇవ్వకపోతే ఏం చేస్తావ్?"
"Hచరిస్తే వదిలిపెడతా అనుకుంటున్నావా?"
"Iతే ఏం చేస్తావుట?"
"Jల్లకాయ కొట్టి మరీ అప్పు తీసుకుంటా”
"Kవలం వంద రూపాయల కోసం ఇంత హంగామా చేస్తావా?”
"Lవయ్యా పెద్ద చెప్పొచ్చావ్! అప్పు ఇస్తావా? ఇవ్వవా?”
"Mత గింజుకున్నా ఇవ్వను. ఏం చేస్తావో చేస్కో!”
"Nతకయినా తెగించి నీ దగ్గర అప్పు తీసుకుంటా!"
"Oరీ అప్రాచ్యుడా! `స్నేహానికి నువ్విచ్చే విలువ ఇదేనా?"
"Pచ్చి పిచ్చి డైలాగులు చెప్పకు, అప్పు గురించి చెప్పు”
“Qట్ గా, స్మార్ట్ గా ఉండే మిలిట్రీ వాడివి. ఇలా ఎలా అయిపోయావురా?..."
"Rనూరయినా, నూరు అరయినా నేనిలాగే ఉంటా! చచ్చినా మారను"
"S నువ్వు అలాగే ఉండు... కానీ నన్ను అప్పు అడగకు"
"Tస్యూ పేపర్లా వాడేసి వదిలేయడం కాదురా స్నేహమంటే!"
"U ఫూల్! నిన్ను ఎన్నిసార్లు ఆదుకోలేదురా ఆపదల్లో ఉంటే!"
"Vనడానికి బాగానే ఉంటాయి నువ్వు చెప్పే కబుర్లు. ముందు నా అప్పు గురించి చెప్పు"
"W డబ్ల్యు డబ్ల్యు వరల్డ్ బ్యాంక్ డాట్ కామ్ లో ట్రై చెయ్యి నీకు అప్పు దొరుకుతుంది"
"X సర్వీస్ మేన్ ని అన్న గౌరవం కూడా లేకుండా ఏమిట్రా ఆ మాటలు?"
"Yజ్గా ఆలోచించి, నీకు చచ్చినా అప్పు ఇవ్వకూడదని నిర్ణయించుకున్నానురా"
"Zచర్లలో జీళ్ళు అమ్ముకోవడం బెటర్, నిన్ను అప్పు అడుక్కోవడం కన్నా అని, నేనూ నిర్ణయించుకున్నారా! ఫోన్ పెట్టెయ్!"
***** **శుభం** *****
(నేను రాసిన ఈ హాస్యకథ ఏప్రిల్ 2014 హాస్యానందం మాసపత్రికలో ప్రచురితమైనది)