ప్రేమ ప్రహసనం-వీరేశ్వర రావు మూల
"ఏయ్ వెంకూ ఏం చేస్తున్నావ్?" అంటూ హడావిడిగా వెంకట్ రూమ్లోకి వచ్చింది మాధురి.
"అలాగే పిలవవద్దని నీడు లక్షసార్లు చెప్పాను. మానవు కదా !" చిరు కోపంగా అన్నాడు వెంకట్.
"లక్ష కాదు వెయ్యి ఒకటి."
"చాల్లే లెక్కలు! ఈ వేళ మన ప్రోగ్రాం "ఏమిటి?" అన్నాడు వెంకట్ మాధురి దగ్గరకు వడ్డీ వస్తూ.
"ఆ! ఆ! దూరం! మన సంగతి మా ఇంట్లో తెలిసింది. ఎవడు వాడు అని నిలదీశారు" అంది మాధురి,
"చెప్పకపోయావా, శ్రీశ్రీ మన్మథ నమానులు వెంకట్ గారు నన్ను ఘోరంగా ప్రేమించారు అని" అన్నాడు నవ్వుతూ వెంకట్,
"నువ్వు కాన్వెంట్ అవడంతో తెలుగును కైమా చేస్తున్నావు. రేపోసారి వచ్చి మా నాన్నతో మాట్లాడు."
"అలాగే మాధురీ వస్తాను. ఆహా నిన్ను చూస్తుంటే ఆ ! స్మిత లాంటి కళ్ళు. జయమాలిని లాంటి ఒళ్ళు.... ..." వర్ణన మొదలు పెట్టాడు వెంకట్.
"దిక్కు మాలిన తెలుగు సినిమాలు చూసి చెడిపోతున్నావ్! తెలుగు కావ్యాలు చదువు తెలుస్తుంది ఎలా వర్ణించాలో."
"ఎప్పుడూ కాలేజీలో తెలుగు క్లాసు అబ్సెంటే కదా! శ్రీనాథు డెవడో బాగా వర్ణించాట్ట. లైబ్రరీ మీద "పడి చదవాలి" అన్నాడు విచారంగా వెంకటే
"అన్ని చేద్దువు గానీ రేవు మా నాన్నని కలు" అంది మాధురి వెళ్ళడానికి సిద్ధ మవుతూ.
"మరీ ఈ లోపులో టిఫిన్ ఇవ్వవా” అని వంగి ముద్దు పెట్టుకోబోయాడు వెంకట్.
"అన్నీ బంద్" అంటూ లేడిలా పరిగెత్తింది. 'మాధురి.
మాధురి వెంకటికి సిటీ బస్సులో కనిపించి హృదయాన్ని తీయగా బాధ పెట్టింది. అలా సిటీ బస్సులో మొదలయిన పరిచయం ప్రణయంగా మారింది.
******.
"ఏమిటీ, మా అమ్మాయిని ప్రేమించావా? హు!" అంటూ మీసం దువ్వుతూ అడిగారు. మాధురి తండ్రి నరసింహం. ఆయన వ్యాయామం చేసిన శరీరంతో అపర కోడి రామ్మూర్తిలా ఉండి చూపరులకు కించిత్తు భయం కలుగచేసేవారు.
వెంకటికి ఆయనను చూడగానే కొంచెం వణుకు బయల్దేరింది.
"అ అ…. అవునండి" అన్నాడు వెంకట్.
"ఏమిటి నత్తా, అలా అంటావు?"
"కా... కా... కాదండి.”
అని "కుర్రాడు నన్ను చూసి భయపడుతున్నాడు." గర్వంగా మీసం నరసింహంగారు. దువ్వుకున్నారు
ఆయన వెంకట్ని కూర్చోపెట్టి అతను చేసే ఉద్యోగం, జీతం, ప్రమోషన్ ఛాన్సులు, గోత్రం, బంధు మిత్రుల గురించి, కట్నం గురించి ఇలా అరగంట సేపు వెంకట్ని ఉక్కిరి బిక్కిరి చేసి చివరికి ఇలా అన్నారు-
"నువ్వు నాకు నచ్చావు. కాని ఒక కండిషన్. ఈ కాలం కుర్రాళ్ళకి యోగాసనాల ప్రాముఖ్యం గురించి
అసలు బొత్తిగా తెలియదోయ్. యోగాసనాలు ఎలా వెయ్యాలంటే..."
తీశాడు నరసింహం. 30 నిమిషాల కాసెట్.
ఫట్... ఫట్... ధన్... ధన్...
"సో నువ్వు శీర్షాసనంలో పర్ఫెక్ట్ అయినప్పుడే నా కూతుర్ని నీ కిచ్చి పెళ్ళి చేస్తాను. తెలిసిందా? ఈ లోపులో అమ్మాయితో మాట్లాడ్డం కాని, ఇంకేమైనా కాని కుదరవు" అన్నాడు నరసింహం.
'ఇదెక్కడి మామగారురా నాయనా. రాజుల కాలం నాటి వాడిలా ఉన్నాడు! అని మనసులో అనుకొని “ట్రై చేస్తానండి" అని చెప్పి బయటికి వచ్చాడు.
********
వెంకట్ 'యోగాసనాలు' పుస్తకం కొని ప్రాక్టీసు మొదలు పెట్టాడు.
సరిగ్గా అప్పుడే వచ్చాడు. వెంకట్ ఫ్రెండ్ నాటకాల రాయుడు వామనరావు.
"ఏరా నాయనా గుమ్మడి కాయలా ఉండేవాడివి. పొట్లకాయలా తయారయావు.
ఏమిటి సంగతీ?"
అంటూ పలకరించాడు. వామనరావు.
"ఏం చెప్పనురా? ప్రేమలో పడ్డాను. అబ్బా నడుం విరిగింది" అంటూ శీర్షాసనం ప్రాక్టీసులు పెట్టిన నడుం బాధ తలుచుకుంటూ,
"పోరా, వెధవ జోకులూ నువ్వూనూ! ప్రేమాకి నడుం నెప్పికీ సంబంధం ఏమిటి? ఏదైనా ద్రవం సంగతి చూడు" అన్నాడు వామనరావు కుర్చీ కూర్చుంటూ,
"నే నిక్కడ చస్తుంటే నీకు జోకుల్లా ఉన్నాయిరా"
"ఏమయిందిరా?"
జరిగిన సంగతి వివరంగా చెప్పాడు వెంకట్ "మీ మామగారు ఈ శతాబ్ధం వాడు కాదురోయ్."
"నా లైఫ్ ఇంతేరా. శీర్షాసనం రాదు. మాధు దక్కదు. దేవదాసునైపోతా, పోతే కుక్కని, మందు బాటిల్ని చూడు" అన్నాడు విచారంగా వెంకట్
"కుక్కంటే గుర్తు కొచ్చింది మా వీధిలో గజ్జి కుక్క ఉంది. కావలిస్తే తీసుకొస్తా."
"ఏలాగైనా ఈ కష్టం గట్టెక్కేలా చూడు. మా పెళ్ళికి మందు పార్టీ నీకు" అన్నాడు వెంకట వామనరావును ఊరిస్తూ.
"చెప్తా. ద్రవం సంగతీ?"
"నిమిషంలో బోర్నవిటా తెస్తా. ఈ లోపులో ఏదైనా ఆలోచించు." వెంకట్ బోర్నవిటా కలుపుతున్నాడు. వామనరావు ఆలోచిస్తున్నాడు. బోర్నవిటా త్రాగి మళ్ళీ ఆలోచించడం మొదలు పెట్టాడు వామనరావు.
"యురేకా" అంటూ పెద్దగా అరిచి గాల్లోకి గెంతాడు వామనరావు, పైన సీలింగు తగిలి బొప్పి కట్టింది.
"అంత సంతోషం ఎందుకు చెప్పు? చెప్పరా ప్లాన్" అన్నాడు వెంకట్ మొహం చింకి చాటంత చేసుకొని,
ఆ ప్లాన్ వెంకట్ చెవిలో ఊదాడు. వామనరావు.
"మాధురికి చెప్పు. లేకపోతే పడుతుంది" అన్నాడు నామనరావు. కంగారు
**********
వెంకట్ నరసింహం గారింట్లో ఉన్నాడు. "శీర్షాసనం వచ్చిందా?" అడిగాడు నరసింహం. 'వచ్చింది' అని మనసులో అనుకొని పైకి "కిరిపిషివ" అన్నాడు.
"అదేమిటి?" అన్నాడు నరసింహం..
"మరుకత."
"ఇదెక్కడి భాషరా నాయనా? అన్నాడు. నరసింహం.
"మలికిరివ"
"కొంప తీసి విశాఖపట్నం నుంచి రాలేదు. కదా?" అనుమానంగా అన్నాడు నరసింహం.
సరిగ్గా అదే సమయంలో మెడలో స్టెతస్కోవుతో డాక్టరు వేషంలో నరసింహం ఇంటికి వచ్చాడు. వామనరావు.
"వెంకట్ ఉన్నాడా?" అన్నాడు రాగానే.
"మీ రెవరండీ?" అన్నాడు నరసింహం.
"నేను వెంకట్ ఫ్రెండ్ నండి. ఈ మధ్య వింతగా మాట్లాడుతున్నాడు. చెక్ చేయడానికి వచ్చాను."
"మరకట”
'చాల్లే వెధవ నటనా నువ్వూనూ! మనసులో అనుకున్నాడు వామనరావు.
మాధురికి నవ్వు ఆగటంలేదు. నరసింహం కంగారు పడుతున్నాడు.
"ఏడి ప్రాబ్లమ్ కనుక్కుంటానండి. మీరు కంగారు పడకండి" అన్నాడు వామనరావు:
"అదేదో చూడు నాయనా!" కొంపతీసి మంచి అల్లుడు జారిపోడు కదా అని భయం పట్టుకుంది. నరసింహానికి.
వెంకట్, వామనరావు వెళ్ళిపోయారు.
***********
"వెంకట్ ని స్టడీ చేశానండి. ఈ మధ్య శీర్షాసనం వేయడం వల్ల మెదడులో పైరిన్ ఎంజైము ఎక్కువ అయి వింత ధోరణిలో మాట్లాడటం' వచ్చింది. శీర్షాసనం మానేస్తే కాని జబ్బు-తగ్గదు." గంభీరంగా అన్నాడు వామనరావు.
"శీర్షాసనం వల్ల జబ్బులా-పైరిన్ ఎంజైమా ఎప్పుడూ వినలేదే !" ఆశ్చర్యపోయాడు. నరసింహం.
"ఏమిటి నాన్నా నీ చాదస్తం? డాక్టర్లు ఈ మధ్యలో ఎన్నో కొత్త విషయాలు కనిపెడుతున్నారు. అందులో ఇది ఉండవచ్చు. ఈ కండిషన్ తీసేయి." అంది మాధురి.
“మీరు త్వరగా వెంకటి కి మాధుని ఇచ్చి పెళ్ళి చేయండి. పెళ్ళి చేస్తే ఇంకా త్వరగా మన లోకంలోకి వస్తాడు. లేకపోతే మంచివాడిని పోగొట్టుకోవాల్సి వస్తుంది. రేపోమాపో వాడి పేరెంట్స్ వస్తున్నారు."
అదరగొట్టేశాడు వామనరావు, బెదిరిపోయాడు నరసింహం.
వెంకట్, మాధురిల పెళ్ళి వైభవంగా జరిగింది.
ఆ రోజు. వామనరావు, వెంకట్, మాధురి సరదాగా మాట్లాడుకుంటున్నారు.
"మంచి సహాయం చేశారు. మంచి నాటకం ఆడి మా నాన్నను అదరగొట్టేశారు" అంది మాధురి వామనరావుతో.
"నాటకాల పోటీలో ఫస్టు ప్రైజులు కొట్టినవాణ్ణి. ఆ మాత్రం చేయలేనా?" అన్నాడు వామనరావు.
"మొత్తానికి కథ సుఖాంతం" అన్నాడు. వెంకట్.
"ఆ?" అంటూ నోరు తెరిచి శవాసనం వేశాడు, కిటికీ పక్క నుంచి వారి మాటలు విన్న నరసింహం.
సమాప్తం