సందిగ్ద సంధ్య

ఆంధ్రభూమి • 01 Apr 1994 • 👁 16 views
స్వప్నసీమలు దాటి సుషుప్తి కరిగి జాగృతి ప్రారంభమయ్యాక లేతపచ్చ ఆకు మీద జారిపోతున్న మంచు ముత్యం 'ప్రియా నా జీవితం కొద్ది క్షణాల్లో భూస్థాపితం కాబోతు న్నది! ఈ లోగా నా ద్వారా నీకు ఆనందం కలిగితే ఈ చిన్న జన్మకు అదే చాలు'.

* * *

సాధారణంగా పెళ్ళయినవాళ్లల్లో ఒకళ్ల లో ఒకళ్లు కరిగి 'అద్వైతమే' ఆనందంగా బ్రతుకుతూ....

ఆమె నాట్యానికి మురిసి మువ్వల రవళిలో ఒక మువ్వగా మారాలని భావించాడు.

ఆమె నాట్యానికి అతను హాజరై, అభిమానిగా మారి భర్తగా మారి ఆమెతో స్వర్గ సౌఖ్యాలు పంచుకోవడానికి సమాయత్త మవుతుండగా-

ఆమె భుజంమీద చెయ్యి వేసినపుడు.. ‘వద్దండి! డాన్స్ చేసి అలిసిపోయాను!!'

ఊహించని ఆశాభంగము!

లేచి వెన్నెల్లోకి వచ్చాడు.

వెన్నెల ఇలాంటి కథలు చాలా చూసి ఉంటుంది.

శేఖర్ ఆలోచిస్తున్నాడు. 'ఇదేమిటి? నాట్యాన్ని అభిమానించి పెళ్లిచేసుకున్న మాట వాస్తవమే! ఆమెకి డాన్సే జీవితం' అన్న వాస్తవం అతను జీర్ణించుకోలేకపోతున్నాడు.

హాల్లోకి వచ్చాడు.


టేబిల్ మీద నటరాజ విగ్రహం నవ్వులు నాట్యమయూరి, నటరాజు వారసి నవ్వులు
చిందిస్తోంది.

భార్యకి ఇచ్చిన బిరుదులూ,
షీల్డులూ...

ఇవేమి తనకి తృప్తినియ్యవా? అవున తను నాట్యం చెయ్యడం లేదుకదా!

ఎక్కడో చదివిన జ్ఞాపకం.

'భార్య తెలివితేటలకన్న మగాడు అమా యకత్వాన్ని ఎక్కువ ఇష్టపడతాడు'

...

తొలిసారి 'మేఘన'ను అభినందించడానికి వెళ్లినపుడు—

ఆమె చిరునవ్వు...

ఇంకా గుండెల్లో ఉంది! భావుకత్వం ఒకటే మనిషిని బ్రతికించదని
ఆరు నెలలు కాపురం చేసాక అర్ధమయ్యింది!

కలిసి గడిపిన సందర్భాలు తక్కువ...

నాట్యం.. నాట్యం.. ఆ 'పదం' వినీవినీ విసుగు వస్తోంది!

కొద్దికాలం సర్దుకోమంటుంది!

ఇతరుల ఆనందం కోసం నాట్యం చేసే ఆమె నా కోసం మాత్రం ఒక్క ప్రోగ్రాం వదులుకోదు!

తను మాత్రం వెర్రివాడిలా...

ఆమె కోసం...

ఎన్నో సాయంత్రాలు...
ముఖ్యమైన విషయాల్ని వదిలి..

.. "స్నేహితుల్ని వదిలి..." "" "

ఈ మధ్యే ఓ స్నేహితుడు అన్నాడు-“ఏరా శేఖర్ ఎలా నడుస్తోంది దాంపత్యం"

"ఇంకేం నడుస్తుంది? ఆవిడ ఎప్పుడూ ప్రదర్శనలే! స్టేజీమీద!" ఎవరో అన్నారు.

గొల్లున నవ్వులు... నవ్వులు... వ్యంగ్యం గా... సూటిగా గుండెల్లో గుచ్చుకుంటూ.. చేతిలో గ్లాసు జారి కింద పడి బద్దలైంది!


మేఘన లేచింది.

"అయ్యో గ్లాస్ బ్రద్దలైందా? రెస్టు తీసుకోండి పడుకొని" అంది మేఘన! ముక్కలు ఏరుతూ...

“గ్లాసు కాదు. హృదయం బద్దలైంది” ఆవేశాన్ని అణచుకుంటూ అన్నాడు శేఖర్.

'యు నాటీ ! సినిమా డైలాగ్స్ ఎందుకు?-' అని నవ్వి.. పడుకుంది...

********** *

శేఖర్.. మేఘన పెదవుల్ని మూస్తున్నప్పుడు... 'ఎప్పుడూ అదే కోరికా.. రేపు రెండు ప్రోగ్రాములు... నా ప్రతిష్టకి సంబంధించినవి' అంది మేఘన!

"కేవలం ఆ కోరికే అయితే దానికి అంగడి అందాలు ఉన్నాయి".

"ఉంటాయి.. వెళ్లండి.. ఆ మాత్రం దానికి నాతో పెళ్లి ఎందుకు! మీకు కళ అంటే తెలియదు. కళాకారులకు సహకరించడం తెలియదు... పగలు వండి రాత్రి మీ కోరిక తీర్చే మామూలు ఆడదాన్ని చేసుకో వాల్సింది... కళ సంగతి మీకు తెలియదు... కళ ఒక తపస్సండి. కళాకారుడు రస సృష్టిలో ప్రపంచాన్ని మర్చిపోతాడు..

'భర్తతో సహా...! నేను నోరు జారానని అంటావుగాని ఆత్మ పరిశీలన చేసుకో. కొంచెం నా కోసం సమయం వెచ్చించడం తప్పయిందా. నేను భర్త కోరని విపరీతమైన కోరిక కోరలేదే సహజమయినదే... సౌందర్య... సహితమే! అన్నాడు శేఖర్.

మేఘనతో సహజీవనం కష్టమయి శేఖర్
కుమిలిపోని రోజు లేదు.
ఎక్కువ అయ్యింది'

శేఖర్ తో గడుపుతున్నది చాలా తక్కువ సమయం అయింది.

పెళ్లయ్యాక సమస్యలు ఈ రకంగా వస్తాయని అతను ఊహించలేదు!

ప్రేమ గుడ్డిది..! అని ప్రపంచానికి తెలిసేలా గట్టిగా అరవాలనిపించింది.

***************


మేఘన శేఖర్ ల పెళ్లిరోజు

సాయంత్రం సినిమాకి టికెట్స్ తెచ్చా డు శేఖర్.. కానీ మేఘన అభిమాని ఆమె జీవితచరిత్ర పుస్తకం వ్రాస్తానని ఇంటర్ వ్యూ గురించి వచ్చాడు.

ఇంటర్యూ లేటయిపోవడం, టిక్కె ట్స్ పనికిరాకుండా పోయాయి. శేఖర్ కళ్లు అరుణవర్ణం దాల్చాయి.

"నీకు కావలసింది భర్త కాదు. కాపలావాడు.
నన్ను ఎందుకు? ఒక జర్మన్ షెపర్డ్ డాగ్ ని కొనుక్కో..." గట్టిగా అరిచాడు.

' సారీ డార్లింగ్ అంది...' మేఘన...

ఆమె మాటలు వినిపించుకోలేదు. వెళ్లి పోయాడు.. ఆమె జీవితం లోంచి

శేఖర్, మేఘన లు విడాకులు తీసుకున్నారు.

*********''

ప్రేమ స్త్రీ, పురుషుల మధ్య మాత్ర మే పరిమితం కాదు. విశ్వవ్యాప్తం.. ప్రేమ ఇవ్వడం గురించి ఆలోచించలేదు ఇన్నాళ్లు... ఇవ్వడంలో ఉన్న ఆనందం... తీసుకోవడం లో లేదని.. ప్రేమని ఇవ్వడానికే వెళ్లాడు..

ఎం.ఎ. సైకాలజీ చేసిన శేఖర్ ఇన్స్టి ట్యూట్ ఫర్ మెంటల్లీ హాండీకాప్డ్ చిల్డ్రన కి సేవలందించాడు...

తృప్తి.. ఇతరుల పెదవుల మీదకి నవ్వు తెప్పించి తను నవ్వుతూ... ఎంత ఆనందం! పిల్లల స్వచ్ఛమైన నవ్వుచూసి మేఘనను సైతం అతను మర్చిపోయాడు...

'జీన్స్ ' చేసిన గాయాల్ని ప్రేమతో మాన్పుతున్నాడు.

* * ***********

పదేళ్లు గడిచిన తర్వాత...

మేఘన

వచ్చింది.

శేఖర్ పనిచేస్తున్న ఇనిస్టిట్యూట్ కి..
ప్రిన్సిపాల్ని కలుసుకుంది.

ప్రిన్సిపాల్ ఆమెను చూడగానే!

'మేఘవా... ఇన్నాళ్ల తర్వాత..."

అతను ఆశ్చర్యపోయాడు.

మేఘన కూర్చుంది.

'చెప్పు మేఘనా.. సంగతులు..'

'శేఖర్ నమ్న క్షమించు..' అంది మేఘన అశ్రునయనాలతో!

'క్షమించడమా... ఆ రోజు నేను తొందరపడ్డాను. నెమ్మదిగా ఓపిక పట్టవలసింది. . ప్రేమ, కామం కలిసి వరదలా వస్తాయి.


'లేదు శేఖర్ తప్పునాది.. చప్పట్లు, కీర్తి ఇదే జీవితం అనుకున్నాను. కానీ నన్ను గుండెల్లో పెట్టి చూసుకొనే తోడు.. అదే పోయింది'.

అక్కడ మేఘనతో ఒక చిన్నపిల్ల ఉంది.

ఎటో చూస్తోంది!

'ఈ పిల్ల?' అంటూ ఆగిపోయాడు !

'నా పిల్లే.. మెంటల్లే రిటార్టెడ్' అంది మేఘన. 'నిన్ను బాధపెట్టినందుకు దేవుడు వేసిన శిక్ష'
మేఘనా... అని చలించిపోయాడు..

శేఖర్....

'నీతో విడాకులు తీసుకున్నాక రిటైర్డ్ మేజర్ని పెళ్లి చేసుకున్నా.. అతనితో ఈ పాప..'

'పాప పేరు ఏమిటి?'

‘శ్యామల’

'అరే మా అమ్మ పేరు అది' అన్నాడు
శేఖర్ ఉద్వేగంగా.

'కావాలనే పెట్టుకున్నాను' అంది మేఘన


'మేఘనా.. గతం గురించి చింతించకు.
నీ పిల్లని బాగు చేసే బాధ్యత నాది.
మామూలు పిల్లవాడు ఒక నెలలో నేర్చుకు న్న విషయం.. మానసికంగా ఎదగని చైల్డ్
ఆరు నెలలు తీసుకుంటాడు..'

శేఖర్ శ్యామలని ప్రేమగా అందుకున్నాడు.

చాలా కాలం తర్వాత మేఘనకి తేలికగా
ఉంది మనస్సు!

'శేఖర్ నా మీద కోపం లేదా?' అడిగింది
మేఘన!

'ఉంది. శ్యామలని తొందరగా
తీసుకురా నందుకు!'

మేఘన గలగలా నవ్వింది!

శేఖర్ హాయిగా ఊపిరి పీల్చుకున్నాడు. ఫీజుకట్టి మేఘన వెడుతున్నప్పుడు శేఖర్ అడిగాడు..

'నువ్వు ఇప్పుడు?'

'డాన్స్ స్కూల్ నడుపుతున్నా..'

శేఖర్ దగ్గరుండి మేఘనకు ఇనిస్టిట్యూ ట్ చూపించాడు. పిల్లల్లో అభివృద్ధి అధ్యాపకుల కృషి అదీ.. శేఖర్ని మెచ్చుకుంది మేఘన!

మేఘన వెడుతూ శేఖర్ని అడిగింది..

'మళ్లీ పెళ్లయ్యిందా?'

'ఆ ఒక్కటీ అడక్కు' అని నవ్వేశాడు. మేఘన వెళ్లిపోయింది.

మేఘనా! ఐదేళ్ల క్రితం ఆలోచన ఉండేది.. ఇప్పుడు అది చిన్న ఆలోచనలా కనిపిస్తోంది, ఇప్పుడు నా బాధ్యత ముందు.
కాదు ప్రేమ ముందు అనుకున్నాడు ఇనిస్టిట్యూట్, తృప్తిగా చూస్తూ...

సమాప్తం




'