సంపద_సంరక్షణ _ సమాజ బాధ్యత రచన : జీడిగుంట నరసింహ మూర్తి (26/7/2026 విశాలాంధ్ర ఆదివారం అనుబంధంలో నా కథ ) “ ఇంట్లో వంట చేసుకోలేకపోతున్నానని రోజూ పోరుతున్నావుగా . ఈ అమ్మాయి మాకు దూరం బంధువు అవుతుంది. కావలసిన వాళ్ళు ఎవరూ లే

ఈనాడు దినపత్రిక • 01 Oct 2026 • 👁 9 views
సంపద_సంరక్షణ _ సమాజ బాధ్యత                      రచన : జీడిగుంట నరసింహ మూర్తి    (26/7/2026 విశాలాంధ్ర ఆదివారం అనుబంధంలో నా కథ )            “ ఇంట్లో వంట చేసుకోలేకపోతున్నానని రోజూ పోరుతున్నావుగా . ఈ అమ్మాయి మాకు దూరం బంధువు అవుతుంది.  కావలసిన వాళ్ళు ఎవరూ లే
సంపద _ సంరక్షణ _ సమాజ బాధ్యత

( ఈనాడు దినపత్రిక 1/10/2026 మకరందం శీర్షికలో ప్రచురతం)
మన పురాణాల్లో కుబేరుడికి ఎంతో విశిష్ట స్థానం ఉంది ఆయనను ధనాధిపతి యక్షరాజు, ఉత్తర దిక్పాలకుడు అంటూ కీర్తిస్తారు. గౌరవిస్తారు. రామాయణ భారతాల్లో ఆయన పాత్ర మహోన్నతంగా దర్శనమిస్తుంది . కుబేరుడు ధనాన్ని కూడబెట్టడంతో పాటు సంపదను సంరక్షించి, సక్రమంగా వినియోగించాల్సిన బాధ్యతనీ గుర్తు చేస్తాడు.
సంపదకు అధిపతి అయిన కుబేరుడు త్రిమూర్తుల్లా సృష్టి ,స్థితి ,లయకారుడు కాదు. దేవతా వ్యవస్థలో ఒక బాధ్యతను నిర్వహించే దైవ శక్తి .ఆయన పాత్ర సంపదను కాపాడటం, దాని సరైన ప్రవాహాన్ని నిర్దేశించటం. ఒక పౌరాణిక కథను అనుసరించి, వెంకటేశ్వర స్వామి వివాహం సందర్భంగా కుబేరుడు వద్ద కొంత సొమ్ము అప్పు తీసుకున్నాడు. ఈ కథలో గంభీరమైన సందేశం ఉంది. 'సంపదను అవసరానికి వినియోగించాలి. దాన్ని భద్రప రచడం మాత్రమే లక్ష్యం కాదు. అదే సమయంలో అప్పు అనేది బాధ్యతతో కూడింది. తిరిగి చెల్లించాల్సిన నైతికత తప్పనిసరిగా ఉంది ' అని సూచిస్తుంది .
కుబేరుడు దాతృత్వానికి ప్రతీక కాకపోయినప్పటికీ సంపాదన సముచితంగా వినియోగించాలని దయచేసి చేస్తాడు .ఆయన ధనాన్ని సంరక్షిస్తాడు .అదే సమయంలో అవసరానికి అందుబాటులో ఉంచుతాడు అంటే కేవలం ధనాగారాన్ని నింపి, గర్వించే స్వభావం కాదు. సంపదను బాధ్యతగా భావిస్తాడు .ఆధునిక సమాజంలో కోటేశ్వరులను కుబేరుడుతో పోల్చడం చూస్తుంటాం .వారు అపారంగా ధనం ఆర్జిస్తున్నారు . కానీ ఆ సంపద సమాజానికి ఎంతవరకు ఉపయోగపడుతొంది ? వ్యక్తిగత ప్రతిష్ట, సౌఖ్యాలు, విలాసాలకు మాత్రమే వినియోగిస్తే అది కుబేర తత్వానికి విరుద్ధం ,ఆ సంపద విద్య, వైద్యం, పేదల సంక్షేమం, సృజనాత్మక అభివృద్ధి ,తదితర అంశాలకు వినియోగిస్తే అప్పుడు వారు ఆధునిక కుబేరులు అనిపించుకుంటారు. ఈ నేపథ్యంలో ధనాన్ని మూడు దిశలలో వినియోగించటం సమస్యతో అని పెద్దలు తెలియజేశారు .మొదట వ్యక్తిగత అవసరాలు, కుటుంబ భద్రత కోసం ,రెండోది భవిష్యత్తు కోసం పొదుపు పెట్టుబడుల రూపంలో, మూడోది సమాజానికి తిరిగి ఇచ్చే విధంగా దాతృత్వం, విద్య,వైద్య పర్యావరణ పరిరక్షణ వంటి కార్యక్రమాలు. ఇవీ ధనానికి అసలైన విలువ తెస్తాయి . అవసరార్థం అప్పు ఇవ్వడం కూడా ఒక సేవే .కానీ అది బాధ్యతతో కూడి ఉండాలి. లాభార్జన లక్ష్యం కాకుండా ఎదుగుదలకు దోహదపడేలాగా ఉండాలి.
ఇలా డబ్బు ఒక సాధనంగా మారినప్పుడు అది సమాజాన్ని అభివృద్ధి దిశగా నడిపిస్తుంది. ధనార్జన గొప్ప విషయం కాదు దాన్ని ఎలా వినియోగిస్తున్నామనే ఎలా నిర్వహిస్తున్నామనే దాన్లోనే మన విలువ ఉంటుంది ,సంపద మనల్ని గర్వంలోకి నెట్టకుండా బాధ్యతలు వైపు నడిపిస్తేనే అది శ్రేయస్సుకు దారితీస్తుందని కుబేరుని కథ ప్రబోధిస్తుంది ఒక్క మాటలో చెప్పాలంటే కుబేరుడు బాధ్యతను గుర్తుచేసే దేవుడు
_ జీడిగుంట నరసింహమూర్తి