చూడండి; వీడు! నిజంగా వీడితో వేగలేక చచ్చిపోతున్నాను. వేలెడంత లేడు! అన్నీ వెధవ పనులే..." అని మంద్రం కంటే కొంచెం ఎక్కువ స్థాయిలో మా ఆవిడ పలుకులు వినపడేటప్పటికి నాకు చదువుతున్న పేపర్లోనించి బయటికి చూడక తప్పలేదు.
బిక్కమొహం వేసుకుని మా ఆవిడ పక్కన నుంచున్న పుత్రరత్నాన్ని చూస్తే జులేసింది. సమర్థించాలనిపించింది.
"ఏమైందే? అయినా వెధవ పనులు చెయ్యటానికి వయసుతో సంబంధం ఏముంది? ఆ మాటకొస్తే పేపర్లో అన్నీ వెధవ పనులే, ఈ స్కాము, ఆ స్కాము అంటూ..."
మా పదేళ్ళ బుజ్జిగాడు నన్ను మెచ్చు కోలుగా చూసి, నా వెనక్కొచ్చి నిలబడ్డాడు.
"ఏమైందా? పక్కింటి భాస్కరం గారిని అడగండి, చెప్తారు. మన గోడ మీదెక్కి వాళ్ళ జామకాయలు కోస్తుంటే ఆయన చూశాట్ట. వాళ్ళ సంగతి తెలుసుగా! బయట బట్టలారేస్తుంటే పిలిచి మరీ నిలేసింది వాళ్ళావిడ. మీరు వీడికి గట్టిగా బుద్ధి చెప్పండి. పెద్దదేదో అడుగుతోంది. నేను దాని సంగతి చూస్తాను" అంటూ ఓ పెద్ద బాధ్యత నాకప్పగించింది.
"ఏరా? నిజమేనా?" ఏదో బాధ్యత నెరవేరుద్దామని అడగటమే తప్ప నాకు వాడి మొహం చూస్తే కోప్పడాలనిపించ లేదు.
"అవును. అయినా చాలా కాయ లున్నాయి. చెట్టు కింద ఎన్ని కాయలు పాడైపోయి కింద పడ్డాయో చూడు డాడీ" అన్నాడు.
ఓరినీ, రీజన్స్ మాట్లాడుతున్నాడు. అదే చిన్నప్పుడు మా నాన్న ఎదట మాట్లాడా అంటే ఎంత భయపడేవాడ్ని?
"అయితే మాత్రం? నాకు చెప్తేడండి; వీడు! నిజంగా వీడితో వేగలేక చచ్చిపోతున్నాను. వేలెడంత లేడు! అన్నీ వెధవ పనులే..." అని మంద్రం కంటే కొంచెం ఎక్కువ స్థాయిలో మా ఆవిడ పలుకులు వినపడేటప్పటికి నాకు చదువుతున్న పేపర్లోనించి బయటికి చూడక తప్పలేదు.
బిక్కమొహం వేసుకుని మా ఆవిడ పక్కన నుంచున్న పుత్రరత్నాన్ని చూస్తే జులేసింది. సమర్థించాలనిపించింది.
"ఏమైందే? అయినా వెధవ పనులు చెయ్యటానికి వయసుతో సంబంధం ఏముంది? ఆ మాటకొస్తే పేపర్లో అన్నీ వెధవ పనులే, ఈ స్కాము, ఆ స్కాము అంటూ..."
మా పదేళ్ళ బుజ్జిగాడు నన్ను మెచ్చు కోలుగా చూసి, నా వెనక్కొచ్చి నిలబడ్డాడు.
"ఏమైందా? పక్కింటి భాస్కరం గారిని అడగండి, చెప్తారు. మన గోడ మీదెక్కి వాళ్ళ జామకాయలు కోస్తుంటే ఆయన చూశాట్ట. వాళ్ళ సంగతి తెలుసుగా! బయట బట్టలారేస్తుంటే పిలిచి మరీ నిలేసింది వాళ్ళావిడ. మీరు వీడికి గట్టిగా బుద్ధి చెప్పండి. పెద్దదేదో అడుగుతోంది. నేను దాని సంగతి చూస్తాను" అంటూ ఓ పెద్ద బాధ్యత నాకప్పగించింది.
"ఏరా? నిజమేనా?" ఏదో బాధ్యత నెరవేరుద్దామని అడగటమే తప్ప నాకు వాడి మొహం చూస్తే కోప్పడాలనిపించ లేదు.
"అవును. అయినా చాలా కాయ లున్నాయి. చెట్టు కింద ఎన్ని కాయలు పాడైపోయి కింద పడ్డాయో చూడు డాడీ" అన్నాడు.
ఓరినీ, రీజన్స్ మాట్లాడుతున్నాడు. అదే చిన్నప్పుడు మా నాన్న ఎదట మాట్లాడా అంటే ఎంత భయపడేవాడ్ని?
"అయితే మాత్రం? నాకు చెప్తే కొనిపెట్టనూ? దొంగతనం చేస్తావా?” కోపంగా అన్నాను.
"ఇలాంటి వాటిని దొంగతనం అనరు, సాహనం అంటారని అక్క చెప్పింది."
ఇదొకత్తి మధ్యన. దానికన్నీ తెలుసని దాని ఉద్దేశ్యం. వీడేమో "అక్క పలుకు, వేదవాక్కు" బ్రాండు తమ్ముడు.
అంతటితో ఆపకుండా నన్నూ, నా చేతిలో ఉన్న పేపర్నీ నిరసనగా చూసి "సువ్విలాంటివి చేసుండవులే నాన్నా" అన్నాడు. నేను డాడీ అనమంటానని నా మీద కోప మొచ్చినప్పుడు ప్రతీకార (సంకల్పిత చర్యగా "నాన్నా "అంటాడు వెధవ.
దీంతో నాకు నా బాల్యం గుర్తొచ్చింది. తోటల్లో మామిడికాయలు దొంగతనంగా కోసిన రోజులూ, పరిగెత్తుతుంటే పడిపోవటం, తోటమాలి పట్టుకోటం, అన్నీ గుర్తొచ్చాయి.
"సరేలే, ఇంకెప్పుడూ ఇలా చెయ్యకు వెళ్ళు" అని వాడ్ని పంపించి మళ్ళీ నా బాల్యం నెమరేసుకున్నాను
మళ్ళీ మా ఆవిడ, ఈసారి పుత్రికా రత్నంతో మళ్ళీ ఏం ముంచుకొచ్చిందో?
"ఇది ఎక్స్ కర్షన్కి వెళ్తానంటే సరే నన్నారటగా?" ముద్దాయిని నిలదీస్తున్నట్టు అడిగింది.
"అవునూ," అన్నాను.
"ఏంటవునూ? ఏ ఊరు పడితే ఊరు, ఎక్కడ పడితే అక్కడ ఉండటం, భోజనం అదీ సరిగ్గా ఉంటుందో లేదో? అదీగాక మెదడు వాపు వ్యాధి వాళ్ళు రోజూ మైకులో అరుస్తున్నారు. వచ్చే నెలలో పరీక్షలు. ఇవేవీ ఆలోచించకుండా అదేదో సినిమాలోలాగా కూతురడింగింది కదా అని సరే అంటమే? వీల్లేదని చెప్పండి" అంది. అని, "పనిమనిషికి అంట్లేసి వస్తాను" అంటూ వెళ్ళిపోయింది.
"నిజంగా వీల్లేదంటావా డాడీ"
యుధ్ధానికి సిద్ధం అవుతూ అడిగింది గారాల పట్టి,
"అవును" క్లుప్తంగా జవాబిచ్చాననుకున్నాను.
"అంటే టూర్కి వెళ్ళమనా? వద్దనా?" అనుమానంగా అడిగింది మా అమ్మాయి.
"వద్దని" అన్నాను.
"ఛీ! ఈ పెద్దవాళ్ళిప్పుడూ ఇంతే. ఒకటి చెప్తారు, మళ్ళీ మాట మీద నిలబడరు" కోపంగా అని ఎగబీలుస్తూ వెళ్ళిపోయింది మా అమ్మాయి.
అసంతృప్తిగా ఉండేటప్పటికి ఏం తోచక కిటికీ లోంచి బయటికి చూశాను. పండు జాంకాయొకటి పక్కింటి వాళ్ళ కాంపవుండ్లో నోరూరిస్తూ కనపడింది.
ఇంతలో "కాఫీ అయ్యగారూ" అని పనిమనిషి కాఫీ ఇచ్చేటప్పటికి తీసుకున్నాను. పాతికేళ్ళుంటాయో ఉండవో, పదిళ్ళలో పని చేసి ఇంటిల్లిపాదినీ పోషిస్తుంది. నాకీ అమ్మా యిని ఎప్పుడు చూసినా జాలేస్తుంది. సరే పనిమనిషి వెళ్లిపోవడంతో మళ్ళీ జాంచెట్టు మీద దృష్టి సారించాను.
మళ్ళీ మళ్ళీ చిన్నప్పటి దొంగతనం గుర్తు రావడం మొదలెట్టింది. ఇంక లాభం లేదు. ఏదో ఒకటి చెయ్యాలి, మెల్లిగా బయటికీ నడిచాను. ఎవరూ చూడట్లేదు కదా! కాయ చాలా దగ్గర్లోనే ఉంది. గోడకంటే కొంచెమే ఎత్తు, ఒక్క గెంతు గెంతి కాయ అందుకున్నాను.
అటూ ఇటూ చూసి నా గదిలోకి వెళ్ళిపోయాను. తీరా చూస్తే కుర్చీలో కూర్చుని మా అమ్మాయి నా వంకే విజయ గర్వంతో చూస్తోంది. "ఆఁ ఊఁ, ఏవుంది? జాంకాయ కోశాను" అన్నాను.
"నాకు తెలుసులే. బుజ్జిగాడు కోస్తే కోప్పడి, ఇంత పెద్దవాడివి, నువ్వు కోస్తావా? అమ్మతో చెప్పేస్తా డాడీ, అసలైతే చెప్పేదాన్ని కాదు. పంపిస్తానని టూర్కి పంపిచట్లేదుగా, అందుకే"అంది.
"కానీ ఆరోగ్యం, అదీ పాడైతే ఎలాగే?" అన్నాను.
“ఏం ఫరవాలేదు. అందుకే మా దగ్గర అంత డబ్బు తీసుకుంటున్నారు. మంచి హోటల్స్, మంచి సూపర్ డీలక్స్ బస్, అన్నీ ఉన్నాయి" అంది.
"సరే చూద్దాముండు" అన్నాను మా ఆవిడకి భయపడుతూ,
ఇంతలో మా ఆవిడొచ్చే సింది. కాకపోతే
కోపంగా లేదు. కంగారుగా, హడావుడిగా ఉంది.
వస్తూనే "ఫోవే. మీ నాన్నగారితో డబ్బు విషయం మాట్లాడాలి" అంది.
మా అమ్మాయి వెళ్తూ, వెళ్తూ చూపుడు వేలు చూపించి, హెచ్చరించింది!
"ఏమిటే?" అన్నాను.
"మరీ, మరీ.... మీరు నవ్వ కూడదు
మళ్ళీ" అంది.
"సరే చెప్పు" అన్నాను ఉత్సుకతని అణచుకుంటూ,
"మరీ, పక్కింటి వాళ్ళ చెట్టు..."
"ఆ.."
"ఓ పండుకాయ చూసి నోరూరి, స్టూలెక్కి కోసేశాను" అంది.
పెద్దగా నవ్వాను.
"నాకిలాంటి విషయాలు చెప్నవే! ఎందుకు చెప్తున్నావు? అందులో ఇంత పెద్ద రహస్యం?" అన్నాను నవ్వుతూనే.
"పని మనుషులు నస పెడితేనే గాని సరిగా పని చెయ్యరని నిన్న ఓ చెంచా కనపడక పోతే దాన్ని నానా మాటలూ అన్నాను.'
"అంటే?" అర్థం కాక అడిగాను.
"ఇవాళ నేను కాయ కోసేటప్పుడు అది చూసినట్టుంది. దొడ్లోనే ఉంది. నేనిలా ఉండి దాన్ని తిట్టానని కోప మొచ్చిందో ఏమో? అసహ్యంగా చూసి, "ఇవాళ్లితో మీ ఇంట్లో పని మానేస్తున్నా నమ్మగారూ అంది."
నాకు నవ్వాలో ఏడవాలో అర్ధం కాలేదు. "మరి నువ్వేం చేశావు?" అన్నాను.
"అయ్యగారితో చెప్పి వెళ్ళమన్నాను. వస్తుంది."
"సరే పంపించు" అన్నానే గాని మళ్ళీ పనిమనిషి వేట మొదలెట్టాలా దేవుడా అన్న భయం నాలోనే ఉంది.
ఇంతలో “అయ్యగారూ" అని రాములమ్మ కంఠం వినబడింది.
"ఎందుకు మానేస్తున్నావు రాములమ్మా? నిన్న అమ్మగారు కోప్పడిందనా?" అడిగాను ఏం తెలీనట్టు.
పత్రిక
ఉగాది ప్రత్యేక సంచిక
"లేదండి. అదీ...'
“చెప్పు" ప్రోత్సహించాను.
"అదీ, పండు కాయొకటి కనబడితే నోరూరి చిన్న బాబులా కోసేశానండీ. పక్కనే కొంచెం దూరంలో అమ్మగారు నావంకె చూస్తున్నారు. నిన్న చెంచా కనబడ లేదు, ఇవాళ కాయ దొంగిలిస్తున్నానని తిట్టి పన్లోంచి పంపిస్తారని, నేనే వెళ్ళిపోతానన్నా" దిగులుగా అంది.
ఇప్పటికి నాకు విషయం బోధపడింది. ఇద్దరూ ఒకర్నొకరు చూడకుండా కాయలు కోపేశారు!
"సరే, నేనమ్మగారితో మాట్లాడతాను. నువ్వేం మానేయక్కర్లేదు" తీర్పు ఇచ్చి, భుజం మీద తుండు దులిపాను. అప్పుడు మా ఇంటికి నేనే రాజునన్న భావన కలిగింది.
మా ఆవిడ్ని, అమ్మాయినీ పిలిచాను. పిలిచి, "రాములమ్మ మామూలుగానే పన్లోకొస్తుంది. అలాగే దీని ఎక్స్ కర్షన్కి బట్టలు సర్దు." ధైర్యంగా చెప్పాను.
"అదేంటీ, వద్దను కున్నాంగా?" అడ్డుపుల్ల.
"నేను వాళ్ళ టీచర్స్ నీ వాళ్ళని కను క్కున్నాను. ఏం భయం లేదు."
"ఏవిటో" అంది మా ఆవిడ అహనంగా,
"ఏవిటా? రాములమ్మ నడుగు. చిట్టికి చెప్తుంది" అస్త్రం సంధించాను.
"వెళ్ళనివ్వండి. బానే ఉందన్నారుగా? మళ్ళీ రాములమ్మేవిటి మధ్య?"
చిట్టి "మా డాడీ మంచి డాడీ" అని, ఆరాధనగా చూసి వెళ్ళి పోయింది.
అప్పుడాలోచించాను. అందరూ జాం కాయ లెందుకు కోశారా అని! అర్థమైంది...
మేం దొంగిలిచాలనుకున్నది జాం కాయల్ని కాదు - వెళ్ళిపోయిన, తిరిగిరాని మా బాల్యాన్ని!!