కథ కంచికి

ఈనాడు దినపత్రిక • 30 Jul 2026 • 👁 5 views
కథ కంచికి
మన సంస్కృతిలో సామెతలు జాతీయాలు అనేకం అవి అమూల్యం అమోఘం వాటిలో అనుభవ సారమే కాదు నిగూఢార్థం కూడా దాగి ఉంటుంది అలాంటిదే కథ కంచికి మనం ఇంటికి అనేది తాతయ్య లేదా అమ్మమ్మ కథ చెప్పడం ముగిశాక ఇలా ఎందుకుంటారో చాలామందికి తెలియదు ఇది కేవలం ముగింపు సూచక కాదు ఆధ్యాత్మికతతో ముడిపడిన సంస్కృత ప్రతీక . తమిళనాడు లోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కాంచీపురమే కంచి. ఏకాంబరేశ్వర,
వరదరాజ పెరుమాళ్ కామాక్షి అమ్మవారి ఆలయం ఇలా అనేక ఆలయాలలో ఆధ్యాత్మిక వైభవానికి నిలువెత్తు సాక్ష్యమైన కాంచీ పురాన్ని మోక్షపురీగా భావిస్తారు పురాణ కాలంలో కధకులు హరిదాసులు గ్రామాలు తిరుగుతూ పౌరాణిక కథలను దేవుని మహిమలను వినిపించేవారు ఆ కథలు భగవంతునీ తత్వాన్ని తెలియజేసి భక్తి వైపు మళ్ళించేవి. కథలన్నిటి మూలం దైవం కావడంతో కంచిలో సకల దేవతలు కొలువై ఉన్నారన్న విశ్వాసంతో అన్ని కథలు చివరికి కంచికే.చేరుతాయని భావన ఏర్పడింది.ఆ ఆ నమ్మకమే నానుడిగా మారి నేటికీ వినిపిస్తోంది.. ఈ భావం ఎంత బలంగా నాటుకుందంటే కథకి ఈ వాక్యమే ముగింపు అయింది. ప్రతి కథ ప్రతి వాక్యం దైవం వద్దకే చేరుతుందనే సంకేతం అందిస్తుంది. ఇది చివర కాదు. జీవితం ఆధ్యాత్మికతతోనే ముగిస్తుందనే సూచన. ఇందులోని లోతైన భావాన్ని గమనిస్తే ఇది మన జీవనానికి మార్గదర్శకం. మనం ఏ దిశగా నడిచినా దైవచింతనే గమ్యం .భౌతిక విజయాలు, పరాజయాలు అన్ని తాత్కాలికం .ఆత్మసాక్షాత్కారమే శాశ్వతం అనే పరమార్థం గోచరిస్తుంది కథల సారాన్ని వాటి తాత్వికతను మరిచిపోతున్న ఆధునిక కాలంలో కథ కంచికే అనే మాట ఆధ్యాత్మికతను అలవరుస్తుంది. ఎక్కడ ఆరంభమై ఏ మలుపులు తిరిగిన దైవ సన్నిదే పరమావధి అని బోధిస్తుంది .ఇది మన సంస్కృతిలో దాగిన తాత్విక సారాన్ని తెలియజేసి ఆదర్శ జీవనానికి దారి చూపే దీపస్తంభం.