విన్నర్

Pratilipi • 👁 10 views
విన్నర్

పదవ తరగతి చదువుతున్న అర్జున్కు కిక్‌బాక్సింగ్ అంటే ప్రాణం. కలలో కూడా రింగ్లో బాక్సింగ్ ఆడుతున్నట్లే కలలుకంటూ ఉండేవాడు.
కానీ ఉదయం లేవడం బద్దకం. చివరి నిమిషంలో స్కూలుకు పరిగెత్తడం, ఫ్రెండ్స్‌తో ఆటలాడుతూ కాలం గడపడం అలవాటుపడ్డాడు.

ఫలితంగా సబ్జెక్టుల్లో ఫెయిల్ మార్కులు వచ్చాయి.

తండ్రి కొట్టాడని స్కూల్ గ్రౌండ్లో ఏడుస్తూ కూర్చున్న అర్జున్తో “ఏమైందని” అడిగాడు పి.టి మాస్టర్ కృష్ణదాస్.

“నాకు చనిపోవాలని ఉంది మాస్టర్.” అన్నాడు ఏడుస్తూ…

“అర్జున్! సమస్యకు చనిపోవడం పరిష్కారం కాదు! నువ్వేమిటో నిరూపించుకోవాలి, నీకు బాక్సింగ్ అంటే ఇష్టం, కానీ నీ లోపం ఏంటో చెప్పనా? సమయాన్ని వృధా చేయటం, నువ్వు గోల్ రీచ్ అవ్వాలంటే పట్టుదల, సమయపాలన తప్పనిసరి. కలలు కనేవాడు కాదు, క్రమశిక్షణతో నడిచినవాడే నిజమైన విన్నర్.” అని రాజాకు అర్థమయ్యేలా వివరంగా బోధించాడు కృష్ణదాస్.

ఆయన మాటలకు అర్జున్ లో ఆలోచన, పట్టుదల పెరిగాయి.

ఆరోజే బాక్సింగ్ క్లాస్‌లో చేరాడు.
చదువుకు, బాక్సింగ్ ప్రాక్టీస్‌కు కావాల్సిన ప్రణాళికను గూగుల్, యూట్యూబ్ సహాయంతో సిద్ధం చేసుకున్నాడు.
ఉదయం నాలుగుకే లేవడం, రన్నింగ్, బాక్సింగ్ ప్రాక్టీస్, మెడిటేషన్, స్కూల్కి వెళ్ళటం అన్నీ క్రమబద్ధంగా చేయటం మొదలుపెట్టాడు.

మొదట కష్టంగా అనిపించినా, కృష్ణ సార్ మాటలు గుర్తొచ్చి వెనుకడుగు వేయలేదు.

“కష్టం అలవాటైంది… అలవాటు ఆనందమైంది.”

సంవత్సరం తిరిగేసరికి బాక్సింగ్‌లో పట్టు సాధించాడు.
టెన్త్ పరీక్షలో కూడా మంచి మార్కులు సాధించాడు.

స్పోర్ట్స్‌డేలో మూడు రౌండ్లలో ప్రత్యర్థిని మట్టికరిపించాడు రాజా.

కృష్ణదాస్ ఇచ్చిన స్ఫూర్తితో అంతకంతకు ఎదుగుతూ దేశవిదేశాల్లో కూడా తన సత్తాచాటాడు అర్జున్.

~~~~~~~~~~~~~~~