నేను కొంచెం తడబడ్డాను. “అంటే సార్…సారీ” అంటూ నీళ్లు నమ్మిలాను.
“చూడండి సూర్యకాంత్, ఇది గవర్నమెంట్ ఆఫీస్ కావచ్చు!!!కానీ నేను చాలా స్ట్రిక్ట్గానే ఉంటాను నా ఉద్యోగుల పట్ల, ఏదో నెలకు ఒకటి రెండు సార్లు ఇలా అయితే పర్వాలేదు కానీ, మీరు ఆల్మోస్ట్ రోజు లేటుగానే వస్తున్నారు. అటు కొన్నిసార్లు సాయంకాలం కూడా ఎర్లీగా వెళ్ళిపోతున్నారు! ఇలా ఉంటే మీరు మీ వర్క్ ను ఎలా సక్రమంగా చేయగలరు చెప్పండి?” అన్నాడు గిరీష్ సీరియస్ గా
“సారీ సార్..ఇక ముందు అలా జరగకుండా చూసుకుంటాను!” అన్నాను నేను ఇబ్బంది పడుతూ అలా ఈరోజు హడావిడిగా సైకిల్ లో వెళుతున్న నాకు రెండు రోజులు ముందు సంగతి గుర్తు వచ్చింది. కరెక్ట్ గా 10:00 ఆఫీస్ చేరుకొని ‘హమ్మయ్య’ అనుకుంటూ సీట్లో కూర్చున్నాను. పక్కన ఉన్న గోకుల్ పలకరించాడు “ఏమండీ సూర్యకాంత్ గారు! త్వరగా వచ్చేశారు?” అన్నాడు
“లేకపోతే హాఫ్ డే రియల్ వేస్తాడేమోనని భయం రా బాబూ!!” అన్నాను జేబులోని రుమాలు తీసి చెమటలు తుడుచుకుంటూ..
“అబ్బో భలే భయపడ్డావే?”అన్నాడు గోకుల్ నవ్వుతూ నేను నవ్వేశాను. ఇంతలో బాస్ ఇటువైపు రావడం చూసి పనిచేయడం ప్రారంభించాము.
టైం పదకొండు అవుతుండగా గోకుల్ నిదానంగా కదిపాడు “టీ తాగుదామా?” అని “ సరే..రా!” అంటూ ఇద్దరు ఆఫీస్ బయట ఉన్న టీ కొట్టుకి వెళ్ళాము. అక్కడ టీ తాగుతూ “ఏంటో మీ చాలీచాలని జీతాలు ఎక్కడ పడ్డ గొంగళి అక్కడే ఉంది రెండేళ్లుగా!” అన్నాను
“ఏమైందిరా కాంతూ” అన్నాడు గోకుల్ నా భుజం మీద చేయి వేస్తూ. “అయ్యేదేముందిరా! ఎప్పుడూ ఉండేదే,బారెడు సంసారం, పెరుగుతున్న మనుషులు మరియు ఖర్చులు, మరి పెరగనది నా జీతం ఒక్కటే” అన్నాను నేను వేదాంత ధోరణిలో.
“అయినా మీ తమ్ముడు రాఘవ కూడా సంపాదిస్తున్నాడు కదా?” అన్నాడు
“కానీ ఏదో ఖర్చులు, పైగా పెళ్లీడుకొచ్చిన చెల్లెలు, వచ్చే రెండు నెలల్లో బాబును కూడా స్కూల్లో వేయాలి” అన్నాను సాలోచనగా.
“అయినా నీ భార్య చదువుకుంది, తనను ప్రైవేటు ఉద్యోగానికి పంపవచ్చు కదా! ఎందుకంటే మీ పిల్లల ఖర్చులకు అయినా తన జీతం ఉపయోగపడుతుందిగా!” అన్నాడు గోకుల్
“పంపొచ్చు, కానీ ఆడవాళ్లు ఎందుకు లేరా ఉద్యోగానికి!” అంటూ నసిగాను.
“ఏ కాలంలో ఉన్నావురా? ఇంకా ఆడవాళ్లు ఎప్పటినుంచో ఉద్యోగాలు చేస్తున్నారు!! మన ఆఫీస్ లోనే 30% ఆడవాళ్లు ఉద్యోగస్తులుగా ఉన్నారు. నువ్వేమో ఏదో పాతకాలం మనుషులాగా మనిషి లాగా మాట్లాడుతున్నావు” అన్నాడు గోకుల్ ఆశ్చర్యంగా “అలా కాదురా,అని పైకి అని వెంటనే నా మనసులో నేను మగవారిని అని గుర్తొచ్చింది. ‘ఒకవేళ నేను శైలజను జాబ్ కి పంపిస్తే తను నాపై ఆధారపకాయ పడాల్సిన అవసరం ఉండదు కదా!! అప్పుడు తను పుట్టింటికి డబ్బులు చేరవేస్తే లేదా నేనే అవసరం లేదనుకుంటే నువ్వేంటో నేను అంతే అనుకుంటే?అంటూ మనసు పరిపరి విధాలుగా ఆలోచన చేస్తుంది’.
“ఇంక వెళదాం 20 నిమిషాలు అయింది” అని గోకుల్ అనేసరికి నేను వర్తమానానికి వచ్చి “సరే వెళ్దాం”అన్నాను. ఆఫీస్ కి వెళ్లి మా పనుల్లో తనమునకలయ్యాము. అలా సాయంత్రం ఐదు గంటలు అయింది ఫైల్స్ అన్ని మూసి, బ్యాగ్స్ సర్దుకుని బయలుదేరుదాం అని లేచాను.
“సూర్యకాంత్ సార్” అన్న పిలుపుకి ఆగాను. వేగంగా ప్యూన్ నా దగ్గరకు వచ్చి “సార్ మిమ్మల్ని అర్జెంటుగా బాస్ పిలుస్తున్నారు” అన్నాడు
‘ఇదేంటి, బయలుదేరేటప్పుడు నన్ను పిలుస్తున్నారు’ అనుకొని, “సరే పద” అంటూ ఫీల్ తో పాటు బాస్ దగ్గరకు వెళ్ళాను. అక్కడ బాస్ చాలా తీవ్రంగా ఒక ఫైల్ ని చదువుతున్నారు నేను “సార్” అని డోర్ దగ్గర నిలబడ్డాను.
“సూర్యకాంత్ గారూ.. రండి కూర్చోండి!” అని ఆహ్వానించాడు.
‘ఏమైంది!! విచిత్రంగా బయలుదేరే సమయంలో పిలిచి మరీ కూర్చోమంటున్నాడు’ అనుకుంటూ కుర్చీలో కూర్చున్నాను.
“సత్తయ్యా ,(ప్యూన్ పేరు), రెండు టీలు నాలుగు సమోసాలు తీసుకురా” అన్నాడు గిరీష్ డబ్బులు ఇస్తూ ఇప్పుడు ఇతను నాతో ఎందుకు టీ తాగాలనుకుంటున్నాడు? నేను ఇంటికి వెళ్ళాలి కదా బహుశా నాతో కఠినంగా వ్యవహరించాడు కదా, అందువల్ల నాతో సయోధ్య కుదుర్చుకోవాలి అనుకుంటున్నాడా?’ అని నేను అనుకుంటూండగా “సూర్యకాంత్” అని నన్ను గట్టిగా పిలిచాడు గిరీష్
“ఆ చెప్పండి సార్!!”అన్నాను నేను ధీమాగా.
“మీరు ఎందుకు ఇలా చేశారో అర్థం కావడం లేదు!” అన్నాడు నా వైపు తీక్షణంగా చూస్తూ.
“దేని గురించి సార్?” అన్నాను నేను ఆలోచిస్తూ
“ఇది చూడండి, బడ్జెట్ ఫైల్” అంటూ నాకు ఫైల్ ని అందించాడు. అది తీసుకొని చూశాను, నేనే దాన్ని తయారు చేశాను స్టాప్ సాలరీలు, ఆఫీస్ కి కొనాల్సిన కొత్త సామాగ్రి, పాత వస్తువుల రిపేర్లు కలిగి ఉంటుంది. “ఏమైంది సార్?” అన్నాను నేను
“పోయినసారి బడ్జెట్ ఫైల్ ని చూశారా?దాంతో దీన్ని కంపేర్ చేశారా?” అన్నాడు.
వీడేంటి ఇలా పట్టుకున్నాడు!! ఆల్రెడీ నేను ఇంటికి వెళ్లే హడావిడిలో ఉంటే, ఇప్పటికే ఐదున్నరకి కావొస్తోంది. ఇంతవరకూ ఎప్పుడు ఇంత సేపు ఆఫీసులో లేను, ఎప్పుడూ నాలుగున్నరకే దుకాణం కట్టేస్తాను!! నేనేదో ఇతను తిట్టాడని 5:00కు వరకూ ఉంటే, ఇలా కూర్చోబెడుతున్నాడు. ఈపాటికి, ఇంటికి చేరి కాఫీ తాగుతూ టీవీ చూస్తుంటేవాడిని అనుకుంటుండగా… “సూర్యకాంత్ మాట్లాడండి!” అనడిగాడు. “సార్ చూడలేదు” అన్నాను నేను
“ఎలా కంపేర్ చేయకుండా బడ్జెట్ వేస్తారు మీరు? ఒకసారి అట్లీస్ట్ లాస్ట్ ఇయర్ది చూసి ఉంటే ఈ బ్లండర్ జరిగి ఉండేది కాదు!” అని తల పట్టుకున్నాడు గిరీష్. “బ్లండరా” అన్నాను నేను
అంతలో ప్యూన్ టీ, సమోసాలు తెచ్చాడు.
“టీ తాగండి” అన్నాడు గిరీష్ తను గ్లాసు తను ఒక గ్లాస్ అందుకుంటూ
“నేను టీ తాగుతుండంగా.. మీరు ఈసారి బడ్జెట్లో మన కొత్త బిల్డింగ్ కన్స్ట్రక్షన్ మెటీరియల్, వర్కర్ సాలరీస్ అవేమీ యాడ్ చేయలేదు. దానివల్ల లాస్ట్ ఇయర్ బడ్జెట్ ఫిగర్స్ ఆల్మోస్ట్ మళ్ళీ రిపీట్ అయ్యాయి!! ఇంత పెద్ద మిస్టేక్ మీరు ఎలా చేశారు అనేది నాకు ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది?” అని ఆపాడు.
అవును నేను ఎందుకు ఈ విషయాన్ని మిస్ చేశాను!! అది న్యూ బిల్డింగ్ ఆల్మోస్ట్ రెండు కోట్ల బడ్జెట్. దాన్ని ఈ ఇయర్ కలపకపోవడం వల్ల ఈ ఫైల్ పెద్ద బ్లండర్ అనుకుని ఆ రోజు సాయంకాలం 3:30 కు స్టార్ట్ చేసి నాలుగున్నర లోపల ఎలా చేశానని గుర్తొచ్చింది.
“సరే సార్ ఐ యాం రియల్లీ సారీ! చాలా పెద్ద పొరపాటు జరిగింది, రేపు తప్పనిసరిగా మిస్టేక్స్ లేకుండా నేను కరెక్ట్ ఫైల్ ఇస్తాము” అన్నాను నేను నొచ్చుకుంటూ.
“వ్వాట్!! రేపా?” అన్నాడు ఆశ్చర్యంగా
ఓ రేపు పూర్తి చేస్తానంటే హ్యాపీగా ఫీల్ అవుతున్నాడేమో అనుకొని ‘ఇవన్నీ నాకు చాలా చిన్న విషయాలు ఈజీగా చేసేస్తాను’ అని అనుకొని ధీమాగా “అవును సార్, రేపు కచ్చితంగా అయిపోతుంది” అన్నాను “వ్యాట్.. రేపు మార్నింగ్ ఇది హెడ్ ఆఫీస్ కి చేరాలి అంటే ఇప్పుడు ఇది పూర్తవ్వాలి!!”
“ సార్ ఇప్పుడు ఆఫీస్ అయిపోయింది కదా!!” అన్నాను నేను.
“ఆఫీస్ అవర్స్ అయిపోయిందా? అది 10 టు ఫైవ్ వర్క్ చేసే వాళ్ళకి!! మీరు మొన్నటి వరకు లేటుగా వచ్చి, త్వరగా ఇంటికి వెళ్లి పోయేవారు కదా!! అయినా ఇంత పెద్ద తప్పు చేసి ఆఫీసు అవర్స్ గురించి మాట్లాడుతున్నారు ఏంటి?” అన్నాడు గిరీష్ నన్ను చూసి నవ్వుతూ!! అది కోపాన్ని అణిచిపెట్టి తెచ్చుకున్న నవ్వు. ‘తన బాస్ లక్షణాన్ని చూపిస్తున్నాడు వీడు’ అనుకొని నేను లేని నవ్వు తెచ్చుకొని “సరే సార్ ఇప్పుడే చేస్తాను!!” అని ఫైల్స్ తీసుకొని నా సీటుకి వస్తుండగా.. “డోంట్ వర్రీ సూర్యకాంత్!! నేను ఆఫీసులోనే ఉంటాను నాకు కూడా వేరే వర్క్ ఉంది హెల్ప్ కావాలంటే అడగండి” అన్నాడు తన ఫైల్స్ ముందు వేసుకుంటూ.
‘నా ఖర్మరా!’అనుకొని “సరే సార్ తప్పకుండా అంటూ నా సీట్ కి వెళ్లి ఫైల్స్ ఓపెన్ చేసి రీవర్క్ చేయసాగాను” అలా చేస్తుండగా మధ్యలో ఆకలితో కడుపు మాడే సరికి, టైం చూడగా 7:30 అవుతోంది!!చిరాకుగా కుర్చీలో అటు ఇటు కదిలాను, ‘ఇంకా ఎంత లేదన్నా గంట పని ఉంది! ఒకపక్క ఆకలికి కడుపు మాడిపోతుంది!!బయట తిందామా అంటే 20 రూపాయలన్నా అవుతుంది, ఎందుకు డబ్బులు ఖర్చు చేయడం! నా దగ్గర ఇంకా వంద రూపాయలు మిగిలి ఉంది, ఈ నెలకు ఇంకా నాలుగు రోజులు ఉంది, దీనితోనే సర్దాలి, ఇంట్లోకి కూరగాయలు కూడా కొన్ని తీసుకోవాలి’ అనుకుంటున్నాగా గిరీష్ వచ్చాడు నా దగ్గరికి.
“ఏంటి సూర్యకాంత్! ఎంత వరకు వచ్చింది వర్క్?” అని అడిగాడు.
“ఆ సార్ ఇంకొక అరగంట పడుతుంది” అన్నాను నేను అసలు విషయాన్ని దాస్తూ. అతను నా ఫైల్ తీక్షణంగా ఒక రెండు నిమిషాలు చూశాడు. అతనికి విషయం అర్థమైంది .
“సూర్యకాంత్ గారు ఒక పది నిమిషాల్లో డిన్నర్ చేసి వద్దాం” అన్నాడు
నేను ఇబ్బంది పడటం గమనించి “మీరు ఆలోచించకండి!! కొన్నిసార్లు స్టాఫ్ అత్యవసర పరిస్థితిలో ఇలా ఆఫీసులో ఉండాల్సి వస్తే వాళ్లకు డిన్నర్ కయ్యే ఖర్చు సెపరేట్గా క్లయిమ్ చేసుకోవచ్చు,అది బడ్జెట్లో భాగమే” అన్నాడు చిరునవ్వుతో.
‘అవును అనుకుని హుషారుగా లేస్తూ “సరే సార్ వెళ్దాం” అన్నాను నేను.
ఆఫీస్ కి ఎదురుగా ఉన్న హోటల్ కి వెళ్దామంటే, నన్ను వారించి తన బైక్లో కొంత దూరంలో ఉన్న హోటల్ కి తీసుకెళ్లాడు గిరీష్. ఆ హోటల్ చూడ్డానికి చాలా పెద్దదిగా ఉంది మరియు కాస్ట్లీ గా కూడా అనిపించింది.
నేను కొంత ఆశ్చర్యానికి లోనయ్యాను. ఇక్కడికి ఇంత పెద్ద హోటల్ కి నన్ను తీసుకువచ్చాడేమిటి? అంత అవసరమేముంది? ఎంతైనా అతని బాస్, నేను సాధారణ ఉద్యోగి. అలా ఇతనితో కలిసి ఎంత పెద్ద హోటల్ కి రావడం సబబేనా అని అనిపించింది!!
సూర్యకాంత్ నా భార్యను ఉద్యోగానికి పంపుతాడా? సూర్యకాంత్ వర్క్ లో ఎందుకు అంత పెద్ద బ్లండర్ చేశాడు?
గిరీష్ ఎందుకు సూర్యకాంత్ ను ఇంత పెద్ద హోటల్ కి తీసుకొని వచ్చాడు?
ఈ ప్రశ్నలన్నింటికీ జవాబులు వచ్చే ఎపిసోడ్స్ లో తెలుసుకోండి