మార్ఫింగ్
"సుజ్జీ... ఆకలి దంచేస్తోంది. తొందరగా భోజనం వడ్డించు..." అంటూ గుమ్మంలో అడుగుపెడుతున్న వేంకటేశ్వర రావుని చూసి ఫక్కున నవ్వింది సుజాత.
"బాగానే ఉంది సంబడం. వీధిలోనే వడ్డించమంటారా ఏమిటి. ముందు ఫ్రెష్ అయి రండి. ఈలోగా గుమ్మడి వడియాలు వేయిస్తాను." అంటూ వంటింట్లో దూరిందామె.
భర్త భోజనప్రియత్వం తనకు తెలియనిదేమీ కాదు. ఆకలైతే చాలు.. చిన్నపిల్లాడి కంటే అధ్వాన్నం... అని అనుకుంటూ ముసిముసిగా నవ్వుకుంది సుజాత.
***************
"అబ్బ... నీ చేతి వంట... ఘుమఘుమలతో నాలో ఆకలి మరింత ప్రజ్వలింపజేస్తోంది సుజ్జీ..." అంటూ భర్త అన్నంలో బీరకాయ పప్పు వేసి కలుపుతుండగా అందులో నెయ్యి వేసింది సుజాత.
పెద్ద అన్నం ముద్దను తీసుకుని వేంకటేశ్వర రావు తన కళ్ళకు అద్దుకుని, నోట్లో పెట్టుకోబోతుండగా ఫోన్ రింగ్ అయింది.
"ఎవరో చూడు సుజ్జీ..." అని భర్త అంటూ ఉండగనే
"ప్రవీణ్ అండీ...." అంటూ ఫోన్ ను వేంకటేశ్వరరావుకిచ్చింది సుజాత.
ఫోన్ తీసుకుని, '...హలో..." అన్నాడతను.
"హా...! అవునా...అయ్యో ప్రవీణా.." అంటూ కండ్లు పెద్దగా తెరిచి డైనింగ్ టేబుల్ ముందు కుర్చీలో అలాగే తల వాల్చేసాడు వెంకటేశ్వరరావు.
"ఏమండీ....ఏమయిందండీ" అంటూ పెద్దగా అరుస్తూ, ఒక్క అంగలో భర్తను సమీపించింది సుజాత!
అతని మొహం మీద నీళ్లు చల్లి ఏమైందండీ అని అడిగింది కంగారుగా.
నేను అర్జెంటుగా వెళ్లాలి అని చెప్పి చెయ్యి కడుక్కొని హడావిడిగా బయటకు వెళ్ళిపోయాడు వెంకటేశ్వరరావు.
కార్ డ్రైవ్ చేస్తూనే తన ఫ్రెండ్ ఏసిపి విక్రమ్ కు కాల్ చేశాడు వెంకటేశ్వరరావు.
***************
హాస్టల్ రూంలో కూర్చుని లాప్టాప్ లో ప్రాజెక్టు వర్క్ చేసుకుoటున్నాడు ప్రవీణ్. పేరుకు హాస్టల్ రూమ్ కానీ ఫైవ్ స్టార్ హోటల్ గదికి ఎమీ తీసిపోదు.
"హాయ్"అని మెసేజ్ తళుక్కుమoది స్క్రీన్ పైన
ఈ కొత్త నెంబర్ ఎవరిదో అనుకుని,
ప్రొఫైల్ ఓపెన్ చేసి చూసాడు, అందమైన అమ్మాయి ఫోటో ఉంది.
సరే మనం కూడా హాయ్ అంటే పోలేదా అనుకుని,
" హాయ్ " అని మెసేజ్ పెట్టాడు.
వెంటనే “హూ ఇస్ థిస్" అని రిప్లై వచ్చింది.
"ఐయామ్ ప్రవీణ్ బీటెక్ ఫైనల్ ఇయర్" అని మెసేజ్ పెట్టాడు.
"సో వాట్, నాకెందుకు మెసేజ్ చేశారు.”
“హలో మేడం, ఫస్ట్ మెసేజ్ మీదే ఉంది, ఒకసారి చూసుకోండి. నేను రిప్లై ఇచ్చాను అంతే.” అని మెసేజ్ పెట్టాడు.
“సారీ, నేను మా ఫ్రెండ్ కి మెసేజ్ చేయబోయి, బై మిస్టేక్ మీ నెంబర్ కి రాంగ్ మెసేజ్ చేశాను.” అని మెసేజ్ పెట్టింది.
“ఇట్స్ ఓకే, యువర్ గుడ్ నేమ్ ప్లీజ్.” అన్నాడు,
“అయామ్ ప్రీతిసింగ్, పంజాబీ, హైదరాబాద్ లో సెటిల్ అయ్యాము,
నేను కూడా ఇంజనీరింగ్ స్టూడెంట్ ని.” అని రిప్లై చేసింది,
“ఓహ్! మాది హైదరాబాద్, డాడ్ బిజినెస్ మాన్ ” అని రిప్లై ఇచ్చాడు.
“ ఓహ్l బాగా డబ్బున్న వాళ్లు అన్నమాటే,” అంది ప్రీతి,
“'హా! ఉన్న మాటే” అన్నాడు ప్రవీణ్,
“ఓహ్ , అనుకోకుండా మీతో చాటింగ్ చేయడం చాలా హ్యాపీగా ఉంది బై, అని చాటింగ్ ఆఫ్ చేసింది ప్రీతి,
కాసేపు రిలాక్స్ అయ్యి మళ్లీ వర్క్ మొదలు పెట్టాడు ప్రవీణ్.
..................
“గుడ్ మార్నింగ్” అని ప్రీతి మెసేజ్ చూసి,
“హాయ్ ప్రీతి గుడ్ మార్నింగ్ ఇంత పొద్దున్నే లేచారా?” అని అడిగాడు,
“ జాగింగ్కి కూడా వెళ్లి వచ్చాను.” అంది
“ నేను ఇప్పుడే జిమ్ కి వెళ్తున్నాను.వచ్చిన తర్వాత మీతో చాట్ చేస్తాను 'బై’” అని చెప్పి జిమ్ కి టైం అవటంతో వెళ్ళిపోయాడు.
జిమ్ నుంచి వచ్చిన తర్వాత, ప్రీతి ఆన్లైన్ లో వుండటం గమనించి మెసేజ్ చేసాడు.
ప్రీతి కూడా చాట్ చేయటం మొదలుపెట్టింది.
ప్రీతితో చాటింగ్ దినచర్యలో భాగమైపోయింది.
గుడ్ మార్నింగ్, గుడ్ నైట్ లతోపాటు లవ్ యు, లవ్ యు టూ,
లవ్ ఎమోజిలు పంపిచుకుంటు ప్రేమలోకంలో తేలిపోయారు,
“నిన్ను చూడాలని ఉంది నీ ఫొటోస్ పంపించు.” అంది ప్రీతి,
“ఫొటోస్ ఎందుకు హైదరాబాదే కదా నీ కాలేజ్ కి వస్తాను డైరెక్ట్ గా కలుద్దాం.” అన్నాడు.
“మా వాళ్ళు చాలా స్ట్రిక్ట్,
ఎవరైనా మనల్ని చూస్తే చాలా గొడవలు అయిపోతాయి.” అంది ప్రీతి,
“నీ వాయిస్ అయినా వినాలని వుంది,
ఫోన్లో డైరెక్ట్ గా మాట్లాడుకుందాం.” అన్నాడు.
మాది ఉమ్మడి కుటుంబం, వర్క్ చేసుకుంటున్నట్లు నీతో చాటింగ్ చేస్తున్నాను ఫోన్లో మాట్లాడితే కనిపెట్టేస్తారు, అంది ప్రీతి.
“ఓకే నా ఫొటోస్ పెడుతున్నాను. నువ్వు కూడా నీ ఫొటోస్ సెండ్ చెయ్యి” అని కొన్ని ఫొటోస్ అప్లోడ్ చేశాడు ప్రవీణ్,
"యు ఆర్ సో హ్యాండ్సమ్ అండ్ స్వీట్" అని
స్క్రీన్ మొత్తం ముద్దుల ఏమోజి లతో నింపేసింది,
………….
హఠాత్తుగా ప్రీతి నుoచి మెసేజ్ రావటం ఆగిపోయాయి,
తను ఎన్ని మెసేజ్ లు పెట్టినా,
అమెకు చేరినట్లు, చూసినట్లు కనిపించటం లేదు,
ఆమెకు ఏమైందో అని కంగారు పడ్డాడు.
ఆమె పేరు తప్ప వివరాలు ఏమీ తెలియదు, ఆమె మెసేజ్ కోసం ఎదురు చూస్తూ దిగులుగా వుండేవాడు.
ఒక రోజు ప్రవీణ్ మెయిల్ కి కొన్ని ఫొటోస్ వచ్చాయి, ఫొటోస్ చూసి షాక్ అయ్యాడు.
తను ఎవరో అమ్మాయితో నగ్నంగా ఉన్న ఫోటోలు,
అమ్మాయి మొహం కనిపించడంలేదు తన మొహం మాత్రమే స్పష్టంగా కనపడుతుంది.
తను ప్రియకు పంపిన ఫోటోలు మార్ఫింగ్ చేసినట్లు స్పష్టంగా తెలుస్తోంది.
కంగారుగా ఎక్కడనుంచి వచ్చాయి అని మెయిల్ చెక్ చేశాడు అన్నోన్ నంబర్ ఇతర వివరాలు తెలియలేదు,
ఫొటోస్ ఎవరన్నా చూస్తే పరువుపోతు0ది. ఇప్పుడు ఏమీ చేయాలి అని తలపట్టుకుని కూర్చున్నాడు,
గంట తరువాత మళ్ళీ మెసేజ్ వచ్చింది
కంగారుగా ఓపెన్ చేసి చూసాడు,
“రేపు ఉదయం పదిగంటలకు మీ హాస్టల్ ముందు వైట్ కలర్ కార్ ఉంటుంది,
ఐదు లక్షల క్యాష్ బ్యాగ్ కార్ డిక్కిలో పెట్టి వెళ్ళిపో. నీ ఫోన్ హ్యాక్ చేసాము, ఎవరికైనా చెపితే, ఫోటోలు ఇంటర్నెట్లో అప్లోడ్ చేస్తాము. మీ ఫ్రెండ్స్ బంధువులకు పంపుతాం, నువ్వు అమ్మాయిలతో లవ్ చాటింగ్, కూడా బయటపెడతాము, నీ పరువు నీ ఇంటి పరువు మొత్తం పోతుంది. “ అని ఉంది.
‘తన దగ్గర అంత క్యాష్ లేదు, నాన్నని అడగలేను ఇప్పుడు ఎలా? ఇవక పోతే తన పరువు, కుటుంబ పరువు పోతుంది.
పరువు పోతే నాన్నా అమ్మ బతకరు,
ముక్కు మొహం తెలియని వారితో చాటింగ్ చేయటం నాది బుద్ది తక్కువ.’ తల పట్టుకుని కూర్చున్నాడు.ఏం చేయాలో తెలియలేదు.
“నీ శృంగార లీలల వీడియో వైరల్ అవుతుంది జాగ్రత్త. “ అని గంట గంటకు డబ్బు కోసం రిమైండింగ్ మెసేజ్ లు రావటంతో టెన్షన్ పెరిగిపోయింది ప్రవీణ్ కు.
తన దగ్గర అంత క్యాష్ లేదు, నాన్నని అడగలేను, కళ్ళు తిరిగినట్లు అయ్యింది,
……………
ఉదయం తొమ్మిది;
“ఇంకో గంటలో కార్ హాస్టల్ ముందు వుంటుంది క్యాష్ బ్యాగ్ కార్ డిక్కీలో పెట్టేసి వెళ్ళిపో. లేదంటే తెలుసు కదా ఏం జరుగుతుందో, పది గంటలకు ఒక్క నిమిషం లేట్ అయిన నీ ఫొటోస్ వైరల్ అయిపోతాయి జాగ్రత్త.” అని మళ్లి మెసేజ్ వచ్చింది.
తన దగ్గర అంత డబ్బులు లేవు ఈ విషయంలో నాన్నను అడగలేడు.
ఫొటోస్ వైరల్ అయితే కుటుంబo పరువు పోతుంది.
నేను చనిపోవటమే దీనికి పరిష్కారం, అనుకుని మొబైల్ తీసుకుని అమ్మ ,నాన్న నన్ను క్షమించండి అని మెసేజ్ పెట్టాడు,
లుంగీ తీసుకుని బెడ్ పైకి ఎక్కి ఫ్యాన్కు కట్టి తన మెడకు తగిలించుకున్నాడు.
అప్పుడే రూమ్ కి వచ్చిన ఫ్రెండ్ రాజు తలుపులు కొట్టి, ఎంతకు తీయక పోయేసరికి కిటికీ లోపల నుంచి చూసాడు.
ఊరి బిగించుకుoటున్న ప్రవీణ్ ని చూసి అందరిని పిలిచాడు,
అందరు వచ్చి తలుపులు బద్దలుకొట్టి రక్షించారు.
…………..
అభిషేక్ తండ్రి ఆదిత్య హుటాహుటిన కాలేజ్ కి వచ్చాడు,
ఇలాంటి పని ఎందుకు చేశావు? కొంచెం ఆలస్యం అయితే నువ్వు మాకు దక్కేవాడివి కాదు, అప్పుడు మేము బ్రతికి ఉన్న శవాలం అన్నాడు కన్నీళ్లు పెట్టుకుని.
“సారీ నాన్న” అన్నాడు అభిషేక్ తండ్రి వైపు చూడలేక తలదించుకొని.
“అసలు ఏమి జరిగింది? ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నావు.“ అని అడిగాడు,
ఆన్లైన్ లో తనతో అమ్మాయి చాటింగ్, ప్రేమ, తరువాత ఎవరో తనని డబ్బులు కోసం బెదిరించి ఫొటోస్ బయటపెట్టి తన పరువు తీస్తానని బెదిరిస్తున్నారని చెప్పాడు.
“లీవ్ పెట్టు ఇంటికి వెళ్దాం అమ్మ నీకోసం ఎదురు చూస్తుంది. “ అని చెప్పి కొడుకుని తీసుకుని బయలుదేరాడు ఆదిత్య.
………………
తన ఫ్రెండ్ ఏసీపీ ప్రతాప్ కి ఫోన్ చేశాడు ఆదిత్య.
“హలో ఏసిపి ప్రతాప్ హియర్” అన్నాడు,అవతల ప్రతాప్ ఫోన్ లిఫ్ట్ చేసి.
“ప్రతాప్, ఐ యాం ఆదిత్య” అన్నాడు.
“ఆదిత్య, హౌ ఆర్ యు ఎన్నాళ్లకు గుర్తొచ్చాను.“ అన్నాడు ప్రతాప్.
“ప్రతాప్, చిన్న సమస్య ఈవినింగ్ ఒకసారి ఇంటికి రాగలవా నీతో మాట్లాడాలి. “ అన్నారు ఆదిత్య,
“ఓకే వదిన, పిల్లల్ని కూడా చూసి చాలా కాలమైంది వస్తాను. “ అన్నాడు.
…………………
“ప్రతాప్, రా రా” అని ఆహ్వానించాడు, లోపలికి వస్తున్న ప్రతాప్ను చూసి ఆదిత్య,
“నువ్వు రమ్మన్నావంటే, ఏదో పెద్ద విషయమే అయ్యుంటుంది ఏం జరిగింది. “ అని అడిగాడు ప్రతాప్
ఫోటో మార్ఫింగ్ గురించి, అభిషేక్ ఆత్మహత్యా ప్రయత్నం గురించి చెప్పాడు,
అది విని నిట్టూర్చాడు ప్రతాప్,
“ఈ మధ్యకాలంలోఫొటోలను మార్ఫింగ్ చేసి బ్లాక్ మెయిల్ చేయటం ఎక్కువైంది,”
“వందలాదిగా ఫొటోలను చాలా మంది సోషల్ మీడియాలో పోస్టు చేస్తు వుంటారు. దానితో ఫోటో మార్ఫింగ్లకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి, ఐడెంటిటీ థెఫ్ట్ ద్వారా బాధితుని ఫొటోలు దొంగిలించి వాటిని మార్ఫింగ్ ద్వారా ఇంటర్నెట్/సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో అప్‌లోడ్ చేస్తామని బ్లాక్ మెయిల్ చేస్తూ డబ్బును దోచుకోవడం వంటివి సైబర్ నేరాలకు పాల్పడుతున్నారు.”
“ఇప్పుడేం చేద్దాం?” అన్నాడు ఆదిత్య తల దించుకుని కూర్చుని ఏమన్నా కొడుకుని చూస్తూ.
“డోంట్ వర్రీ, వాళ్ల సంగతి నేను చూసుకుంటాను.” ఆన్నాడు.
సుజాత తెచ్చిన కాఫీ తాగుతూ ఆదిత్య, సుజాత, అభిషేక్ తో కాసేపు మాట్లాడి,
అభి నువ్వేం భయపడకు ఇలాంటి వారికి ఎలా బుద్ధి చెప్పాలో నాకు తెలుసు,
అని అతని భుజం తట్టి వెళ్ళిపోయాడు ఏసిపి విక్రమ్,
...........................
నాలుగు రోజులకు తరువాత.
“ఆదిత్య, సైబర్ నేరగాళ్ల ముఠా దొరికిoది. అని చెప్పాడు ఏసిపి విక్రమ్.
థాంక్యూ ప్రతాప్ ఇంత ఫాస్ట్ గా ఎలా సాధించావు అన్నారు. ఇంటికి వచ్చిన ప్రతాప్ తో,
అభి చాటింగ్, ఫొటోస్ ద్వారా తీగ లాగితే డొoకంతా కదిలింది,
దీని వెనక పెద్ద ముఠానే ఉంది,
“అమ్మాయిల పేరుతో అబ్బాయిలకు, అబ్బాయిల పేరుతో అమ్మాయిలకు మెసేజ్ చేసి, చాటింగ్ చేస్తూ మోసం చేస్తున్నారు.
బాధితులను లక్ష్యంగా చేసుకోవడo కొసం వందల్లో వాట్సాప్ నంబర్‌లను ఉపయోగిస్తున్నట్లు విచారణలో తేలింది.” అన్నాడు ఏసిపి విక్రమ్.
“అన్నయ్య, అమాయకంగా కాలేజ్ పిల్లలు వీళ్ళ వలలో చిక్కుకుని బలవుతున్నారు. అదృష్టం బాగుండి అభి మాకు దక్కాడు.” అంది సుజాత కళ్లనీళ్లతో
“విక్రమ్, సైబర్ నేరాల గురించి కాలేజ్ అమ్మాయిలకు అబ్బాయిలకు చైతన్యం, అవగాహన కల్పిస్తే బాగుంటుంది.” అన్నాడు ఆదిత్య.
“కరెక్ట్ గా చెప్పావు, కాలేజ్ పిల్లలే కాదు పెద్దవాళ్ళు కూడా వీళ్ళ భారిన పడుతున్నారు.” అన్నాడు విక్రమ్.
“అంకుల్ నాలా ఇంకెవరు మోసపోకూడదు. ప్రతి కాలేజీలో అవేర్‌నెస్ వీక్ ఏర్పాటుచేసి సైబర్ మోసాలపై అవగాహన కల్పిద్దాం.” అన్నాడు అభిషేక్.
“గుడ్ ఐడియా అభి అలాగే చేద్దాం.” అన్నాడు ఏసిపి విక్రమ్.
………………
ఆదిత్య, సుజాత, అభి లతో పాటు ఏసీపి విక్రమ్ కొందరు పోలీసులతో కలిసి ప్రతి శనివారం కాలేజీల్లో సైబర్ మోసాలపై చైతన్య పరిచేందుకు అవగాహన సదస్సు నిర్వహించారు.
“సైబర్ నేరాలపై విద్యార్థినులు అవగాహన పెంచుకోవాలి,
మహిళలే కాదు, మగవారు కూడా ఈ సైబర్ మోసాల బారిన పడుతున్నారు.
సైబర్ నేరస్తుల నుంచి మన డేటా లేదా ఐడెంటిటీ థెఫ్ట్ కాకుండా సోషల్ మీడియా అకౌంట్స్‌కు స్ట్రాంగ్ పాస్‌వర్డ్స్ ఉంచుకోవాలి, సైబర్ నేరాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.” అని చెప్పాడు ఏసిపి విక్రమ్.
హాలంతా కరతాళధ్వనులతో మారుమోగిపోయింది.
………శుభం………
✍️అంజనీ దేవి శనగల