నాన్న యోగి(కవిత)
తపస్వి
• 21 Jun 2026
• 👁 15 views
శీర్షిక: నాన్న రచన: అంజనీ దేవి శనగల విశాఖపట్నం నాన్న! కన్నీటిని గుండెలోనే నొక్కినాడు’ కనుసన్నలతో కుటుంబాన్ని నడిపినాడు’ ప్రేమకు క్రమశిక్షణను జత చేసినాడు’ విచక్షణ, విలువలే కవచమని నేర్పినాడు! బాధ్యతల బరువుకు వెన్ను చూపనన్నాడు, కుటుంబ గౌరవ ప్రతిష్ఠలు ఆయుధమన్నాడు, తరతరాల స్ఫూర్తికి చిహ్నంగా మారినాడు, ఆశలను మౌనంగా దాచుకుని బాధ్యతలకై బ్రతికినాడు! బిడ్డల అవసరాలకు వారధిగా మారినాడు, సేదతీరుటకు నీడగా చెట్టై నిలిచినాడు, మబ్బులా వచ్చి వానచినుకై తడిపినాడు రెక్కలొచ్చిన బిడ్డలకు గగనమై నిలిచాడు! “మౌనం, త్యాగమే సాధనగా బతికిన యోగి — నాన్న!” ……………….. ఇది నా స్వీయ రచన అంజనీ దేవి శనగల, విశాఖపట్నం