ఆకాశ వీధుల్లో
5.4.2053.
భూమి జనాభాతో కిటకిటలాడిపోవడంతో ప్రజలు నివశించడానికి భూమి చాలక చంద్రుడి మీద, అంగారకుడి మీద ప్లాట్లు నిర్మించుకున్నారు. రాకపోకలు అన్నీ రాకెట్లో మీద జరుగుతున్నాయి. ఆక్సిజన్ సిలెండర్ తప్పనిసరి అయ్యింది. ఇంధనం కొరత కూడా ఎక్కువ అయ్యింది. ఆ రోజు చంద్రోదయం అయ్యింది. రాకేష్ నిద్రనుండి లేవగానే అడిగాడు. మూన్ మీద ఫ్లాట్ ఉంది రాకేష్ కి.
"మమ్మీ ఈరోజు మన రాకెట్ ప్యూయల్ తో రెడీగా ఉందా?"
"ఎక్కడ ఉంది? మీ నాన్న దాని మీద ఎర్త్ మీదకి వెళ్ళారు. కోర్టు గొడవలు తెముల్చుకోవడానికి రెండు కాంతి సంవత్సరాల క్రితం వెళ్ళారు. ఇంకా రాలేదు" అని చెప్పింది నిర్మల,
"అందరూ ఇక్కడికి వచ్చి స్థిరపడినా ఈయన ఇంకా భూమో భూమో అంటూ ప్రాకులాడుతారు ?" అంటూ గొణుక్కున్నాడు. రాకేష్
రాకేష్ 'చంద్ర' యూనివర్సి టీలో కంప్యూటర్స్ ఇంజనీరింగ్ చదివాడు.
ఆ రోజు కంప్యూ టర్ ఇంజనీర్ ఉద్యో గానికి ఇంటర్వ్యూ శాట్రన్ గ్రహం మీద! రాకెట్ లేదని కంగా రుపడుతున్నాడు. తన స్నేహితుడు నికిల్ కీ ఫోన్ చేసాడు.
నికిల్ వెళ్ళేటప్పుడు తనను పిక్ అప్ చేసుకోమని.
రాకేష్, నిఖిల్ మరికొందరు ఇతర గ్రహవాసులు అందరూ కలిసి ఒకే రాకెట్లో శాట్రన్ మీదకి బయలుదేరారు.
నిఖిల్ అన్నాడు "మన ముత్తాతలు భూమిని వదల్లేదు. మనం గ్రహాలు తిరుగుతున్నాం
ఉద్యో గాల కోసం"
"ఏం చేస్తాం కాలమహిమ" అన్నాడు రాకేష్! నెప్ట్యూన్ నుండి వచ్చినవాడు చాలా
కాన్ఫిడెంట్ గా ఉన్నాడు.
ఎందుకంటే అతని దగ్గర బృహస్పతి
రికమండేషన్ లెటర్ ఉంది.
. రాకేష్ తన టాలెంట్ని నమ్ము కున్నాడు. అందరూ అంతరిక్షవాసుల సూటుల్లో ఉన్నారు. రాకెట్ రోదసీలోకి దూసుకుపోతోంది! రాకెట్ బయటికి చూస్తే ఒక ముసలాయన వలయంలో తిరుగుతున్నాడు. ఏమిటా అని
ఆశ్చర్యపోయాడు రాకేష్,
"అతను రియల్ ఎస్టేట్ ఏజెంట్! రాకెట్లో వస్తున్నాడు ఎర్త్ నుండి. మూన్ దగ్గరకి వచ్చే ముందు రాకెట్ చెడిపోయింది. రాకెట్ నుండి జారిపోయి గుర్వాత్వాకర్షణ శక్తి లేకపోవడంతో ఎర్త్ మీద పదకుండా అలా వలయంలో తిరుగుతున్నాడు!" చెప్పాడు నిఖిల్.
రాకేట్ శాట్రన్ గ్రహం చేరుకుంది.
కంప్యూటర్ స్క్రీన్ మీద ఒక పేరు వస్తోంది. నెప్ట్యూన్ క్యాండిటేట్ గర్వంగా వెళ్ళి
తలదించుకొని వచ్చాడు. రాకేష్ ఇంటర్వ్యూలో సరిగా జవాబులు ఇచ్చాడు.
ఇంటర్వ్యూలో బోర్డు కూడా సంతృప్తి చెందింది.
ఉద్యోగం రావచ్చు అన్నట్లు రాకేష్ అమ్మకి మొబైల్ మెసేజ్ ఇచ్చాడు.
చివరికి 'అరుంధతి' తార నుండి వచ్చిన క్యాండిడేటికి ఉద్యోగం వచ్చింది.
తెలిసిన విషయం ఏమిటంటే అరుంధతి క్యాండిలేట్ ఎక్కువగా రమారమి నూరు కేజీల బంగారం, ఇంకా యురేనియం ఇంధనం లంచం గా ఇచ్చాడు ఆ పోస్టుకి.
రాకేష్ విషయం తెలిసి కోపంతో ముఖం ఎర్రబడింది.
"రా వీళ్ళ సంగతి తేలుద్దాం" అని లోపలికి వెళ్ళబోతే నిఖిల్ ఆపాడు!
"ఎందుకు గొడవ? ఎర్త్ లో కూడా ఇప్పుడు అవకాశాలు మెరుగు అయ్యాయట. అక్కడ ట్రై చేద్దాం" అన్నాడు.
"ఛీ ఛీ ఆ ఎర్త్లో లాగే ఇక్కడ కూడా లంచాలు, రికమండేషన్లుతో వస్తున్నాయా ఉద్యో గాలు! ఇక్కడ కూడా అవినీతా?" ఇంటర్వ్యూ బోర్డు లో రాకేష్ అరిచాడు!
"అలా కాదు. మీ ఎర్త్ వాళ్ళే ఇక్కడ ఫ్లాట్లు కొని మీ ఎర్త్ బుద్దులు మాకు అలవాటు చేసారు" అని చెప్పాడు శాట్రన్ వాసి, బోర్డు డైరక్టర్!
"ఇంటర్వ్యూ బోర్డ్ డౌన్ డౌన్' అంటూ పెద్దగా నినాదాలు చేస్తూ గొడవ చేసాడు రాకేష్!
ఇద్దరు మర మనుషులు వచ్చి రాకేష్ ని రోదసీలోకి గెంటేసారు!
'అ!' అని అరిచాడు.
''ఏవింటా కేకలు, కలవరింతలు, ఇంటర్వ్యూ ఉంది ఈవాళ. ఇడ్లీతిని వెళ్లు" అంటూ రాకేష్ నిర్మల నిద్ర లేపడంతో ఈ లోకంలోకి వచ్చాడు రాకేష్
"ఎక్కడ ఉన్నాను?" అడిగాడు.
"మీ నాన్న కట్టిన ఇంటిలో, పంజాగుట్టలో"
"పంజాగుట్టా, అంగారక గ్రహం కాదా?"
"ఒక బాల్చీ నీళ్ళు నెత్తిమీద గుమ్మరిస్తే అన్ని గ్రహాలు వదుల్తాయి" అంటూ వంటింట్లోకి నడిచింది నిర్మల.
తన కలకు నవ్వుకున్నాడు రాకేష్!