వీళ్ళేప్పుడూ ఇంతే?

ఆంధ్రభూమి • 15 Sep 2005 • 👁 14 views
వీళ్ళెప్పుడూ ఇంతే!-కధ


వంచనా ప్రొడక్షన్స్ 'దగాకి లోకం దాసోహం' అను మా నూతన చిత్రంలో నటించుటకు నూతన నటీనటులు కావలెను. నాటకానుభవం, లోకానుభవం లేకపోవడమే అర్హత. సంప్రదించవలసిన చిరునామా: వంచనా ప్రొడక్షన్స్, చీట్ నగర్, 55-000 000.

పత్రికలో హాస్యంగా రాసిన పేరడీ ప్రకటన చూసి నవ్వినా నా జీవితంలో అటువంటి సంఘటన జరుగుతుందనుకోలేదు.

*********

అసలు సాహితీ సభలంటే నాకు చిరాకు. ఎందుకంటే అక్కడ సాహిత్యానికి సంబంధించినవాళ్ల కంటే మిగతా రంగాలవాళ్లు ఎక్కువగా హాజరవుతారు. మన కాలాన్ని కిళ్లీలా నమిలేస్తారు. అయినా ఒకోసారి మొహమాటంతో ఇరుక్కుపోతాను. ఆ సమయంలో ఏ కథో, కవితో
రాసు కున్న తృప్తి వుంటుంది కదా అనుకుంటాను. ఫ్రెండ్ పుస్త కావిష్కరణ అంటే తప్పనిసరి పరిస్థితిలో వెళ్లాను. వేదిక మీద 'పరస్పర భజన' టీం ఎలాగూ వుంది. సాహిత్యానికి సంబంధించని డాక్టర్ ముఖ్య అతిథిగా వున్నాడు. నా ఫ్రెండ్ పుస్తకం గురించి పొగిడారు.

ఒకాయన లేచి "చెప్పవలసింది కృష్ణమూర్తి చెప్పాడు. అయినా రెండు ముక్కలు మాట్లాడతాను" అంటూ అవ లీలగా ఇరవై నిమిషాలు నమిలేశాడు. అదిగో అప్పుడు పరిచయమయ్యాడు నాకు టీవీ సీరియల్ నిర్మాత, దర్శ కుడు వామనరావు. త్వరలో తాను 'హాస్యసంజీవిని' అనే కార్యక్రమం తయారుచేస్తున్నానని, దానికి క్రొత్త
రచయితలు కావాలనీ
, 'టాలెంట్ సెర్చ్' చేస్తున్నానని, హాస్యం మచ్చుకైనా కనిపించని ఈ రోజుల్లో హాస్యాన్ని జంథ్యాలలా బ్రతికించడానికి కంకణం (చేతికి లేదు, వాచీ వుంది) కట్టుకున్నానని చెప్పాడు.

నేనొక కాన్సెప్ట్ చెప్పాను. చాలా బాగుందని డిస్కషన్ కి రమ్మన్నాడు.

**********

రాత్రి సినిమా, టీవీ రచయితగా మారినట్లు బోలెడు ఈస్ట్మన్ కలర్ కలలు. మర్నాడు వామనరావుని బంజా రాహిల్స్ లో కలిసాను. . మనిషి సెల్‌ఫోన్ లో ఎవరితోనో మాట్లా డుతున్నాడు.

“రండి రైటర్ గారూ !" అన్నాడు.

వామనరావు ప్రక్కన కూర్చున్న ఆయన "రైటర్ అంటున్నావు. ఈయన పోలీస్ స్టేషన్లో పనిచేస్తాడా?" అన్నాడు.

"కాదు. ఆ రైటర్ కథలు రాస్తాడు. చూశావా? ఇదే హాస్యమంటే! హాహా.." అని పగలబడి నవ్వాడు వామన రావు.

అందులో అంత పగలబడి నవ్వడానికి ఏముందో నాకర్ధం కాలేదు.

సరే నా కథను అటువైపు ఇటువైపు పెనం మీద అట్లు తిరగేసినట్లు తిరగేసి చివరలో అన్నాడు.
"స్క్రీన్ ప్లే గురించి కొంచెం మార్పులు, చేర్పులు చెయ్యాలి."

"చెయ్యండి" అన్నాను భయంగా ఏం చేస్తాడో అని.

"హీరోకి ఇద్దరు హీరోయిన్లను పెట్టాలి."

"కథకి అవసరం లేదు కదా! పైగా కథలో హీరో భార్య మధ్యలో పుట్టింటికి పోతుంది" అన్నాను నేను.

"అదే ట్విస్ట్! అక్కడే రెండో అమ్మాయి ఎంటరవుతుంది!" అన్నాడు వామనరావు నవ్వుతూ.

"అవును. నా కథకి పోయేకాలం ఎంటరవు తుంది!" అనుకున్నాను లోపల. వామనరావు అడిగాడెప్పుడు.

"జనార్ధనం అదో టీవీ సీరియల్ 'సాగే పెళ్లి'లో హీరో ఎన్ని పెళ్లిళ్లు చేసుకున్నాడు?" "ఎపిసోడికి ఒక పెళ్లి చెప్పున ఇప్పటికి రెండు వందల.." ఇంకా జనార్దనం లెక్కపెడుతూ వున్నాడు.

"సరే. మన కథలో పాముందా?" అడి గాడు.

"పాము ఎందుకండీ? గ్యాస్ పెరిగినందుకు మన హీరో సాయంత్రం రోడ్డుప్రక్క పుల్లలు ఏరుకొచ్చి వంట చేస్తున్నట్లు చూపిస్తాం. హాస్యంగా వుంటుంది" అన్నాను. "నా బొందలా వుంటుంది. పాముంటే తప్ప సీరియల్ని ఆడవాళ్లు చూడరు. పాముని ఇరి కించి కథ మారుస్తారా?" అడిగాడు.

అప్పుడు అర్ధమయ్యింది నాకు- స్క్రీన్ ప్లే
లేదా చిత్రానువాదం అంటే చిత్రప్రముఖులు చిత్ర విచి త్రంగా కథను చేసే 'చిత్రవధ'కు పెట్టుకొనే ముద్దుపేరని. "మళ్లీ కలుస్తాను" అని వామనరావు దగ్గర సెలవు తీసుకున్నాను.

**********

టీవీ రచయితగా నా పేరు కనిపిస్తుందనగానే ఆ వచ్చే డబ్బుతో తనకు బంగారు గొలుసు అంటూ పట్టుపట్టింది. శ్రీమతి.

"ఎప్పుడు వస్తుంది హాస్యసంజీవిని" అని అడిగింది. ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేసి నిద్రపోయింది శ్రీమతి.

***********

మళ్లీ వామనరావుతో ఈ సుందర్రావు స్టోరీ డిస్కషన్. మూలం చెడకుండా కొన్ని మార్పులు చేశాను.

"ఈ మార్పులు చాలవండీ. ఇంకా చెయ్యాలి" అన్నాడు. నాకర్ధం కాలేదు.

అప్పుడు మాకు టీవీ తెచ్చే కుర్రాడు వచ్చాడు.

అతనొక విషయం చెప్పాడు. "హీరోని మధ్యలో కుక్క కరుస్తుంది. అప్పుడు రక్తం పోతుంది. బ్లడ్ బ్యాంక్లో రక్తం వుండదు. వీధిలో కుక్క వెడుతుంటే దాన్ని పట్టు కొచ్చి కుక్క రక్తం హీరోకి ఎక్కిస్తారు. కుక్కలా అరు స్తాడు హీరో. ఎలా వుంది?" అన్నాడు చాయ్ కుర్రాడు.

"ఎక్సలెంట్. అదిరిపోయింది హ్యూమర్" అంటూ వామనరావు చాయ్ కుర్రాడిని ముద్దు పెట్టుకొని ఈ సీన్ తప్పకుండా హాస్యసంజీవినిలో పెడతా" అన్నాడు.

"అదేమిటి? చాయ్ తెచ్చే కుర్రాడు చెప్పిన పాయింట్ బాగుందా? నేను రాసింది నచ్చలేదా?
కధ చర్చల్లో చాయ్ కుర్రాడు, సఫాయి సత్తెమ్మ. వీళ్లు వుందారా?” అని కోపంగా అడిగాను.

"కారెవరూ టీవీ కథకు అనర్హం" అంటూ శ్రీశ్రీని అనుకరించి వామనరావు, "స్క్రీన్ ప్లే గురించి తెలియనివాళ్లు రచయితలంటూ మా ప్రాణాలు తీస్తారు" అంటూ విసు క్కున్నాడు.

నేను నిరుత్సాహంగా ఇంటిదారి పట్టాను. పెట్రోలు ఖర్చు మూడు వందలయ్యింది.

తర్వాత వామనరావుని కలవడం మానేశాను ఏ రకంగా నా కథని కుళ్లపాడుస్తాడేమోనని. మార్పులు చేసి ఎలా వుందంటాడు? ఏం చెప్పను? పాయసం లో పిడకలు కలిపి ఎలా వుంది అంటే ఏం చెప్పను?

ఆరోజు రాత్రి నా భార్య చెప్పింది.
"మీ హాస్యసంజీవిని
మధ్యాహ్నం 2.30కి వచ్చింది." అని "వచ్చిందా?" ఆశ్చర్యంగా అడిగాను.

"టైటిల్స్ లో కథ, మాటలు, పాటలు, బొమ్మలు, మేకప్, ప్రొడక్షన్, పోస్ట్ ప్రొడక్షన్, లైటింగ్, ఎడిటింగ్, అండ్ దర్శకత్వ పర్యవేక్షణ.. ఇలా చాంతాడు లిస్టు వచ్చి చివర్లో 'వామనరావు' అని పేరు వచ్చిందట. తరు వాత ఎపిసోడ్ చివర కథాసహకారం అని నలభై పేర్లు వచ్చి, ఇరవై నాలుగో పేరు నా పేరు 'సుందర్రావు' అని వచ్చిందట. పేర్లు చదవలేక విసుగు వచ్చిందని నా భార్య చెప్పింది. అప్పటి నుండి 'టాలెంట్ సెర్చ్' కాదు, 'టాలెంట్ హంట్' చేసే టీవీ, సినిమా వాళ్ల జోలికి పోకుండా బుద్ధిగా కథలు రాసు కుంటున్నాను.