రసవద్గీత

చెలిమి • 21 Jul 1999 • 👁 15 views
రసవద్గీత
రసవద్గీత


పొద్దు పొడిచిన దగ్గర నుండి పొద్దుగూకేవరకూ పొద్దుపుచ్చడానికి ముద్దుల పద్దు వ్రాసుకుందామా మంత్రనగరి సరిహద్దు దగ్గర” అన్నారాయన పెళ్ళి కుదిరిన తర్వాత!

పెళ్లయ్యాక 'ఘంటసాల భగవద్గీత క్యాసెట్ తీసుకురండి' అంటే "ఎందుకు నీ పెదవులపై నేను రసవద్గీత రాస్తాను"గా అన్నారు! ఆయనతో పగలు రాకూడదు అనిపించే రాత్రి!

చెరువులో చిన్న గులకరాయి వేస్తే అంచెలంచెలుగా తరంగాలు ఎలా ఒడ్డుకు చేరుతాయో అలాగే ఆయన స్పర్శతో అనుభూతి అలలు మెదడుకు చేరేవి!

పగలు మాత్రం చేతులూరుకునేవా? మాటల పదును, చేతల చురుకుదనంతో ఊపిరి సలప నిచ్చేవారా!

సరసానికి సమయం ఏమిటని వంటగదిలో, స్నానాల గదిలో ఆఖరికి పూజగదిలో సైతం.....


మరిప్పుడీయనకి ఏమయ్యింది?

చేయివేస్తేచాలు అటు తిరిగి పడుకుంటున్నారు!

ఎంతో ఇదిగా దగ్గరకు చేరబోతే లేచి భగవద్గీత చదువుకుంటున్నారు!

నలభై ఏళ్లకే ముసలివాళ్ళం అయ్యామా?
అదే అడిగా!

'ఘటం పలకదే!'

వెనకా ముందూ చూసుకోకుండా ఇంట్లో ఎవరున్నారో
చూసుకోకుండా ఎన్ని చిలిపి పనులు చెయ్యలేదూ
ఎన్నిసార్లు ఆయన చిలిపి చేష్టలకి నేను సిగ్గుపడిపోలేదూ?
కాఫీ కప్పు అందిస్తే సరసం,
బాత్రూంలో టవల్ అందిస్తే సరసం,
భోజనం వడ్డిస్తే సరసం....

ఈ రసాస్వాదనంలో ఏళ్లు క్షణాలుగా గడిచి పోయాయి.

వెనక్కి తిరిగి చూసుకుంటే వేవిళ్ళూ, కాన్పులూ,పిల్లలూ

ఇప్పుడేగా నాకు మెనోపాజ్ కరుణించి బాధ్యతల
శరీరాన్ని వదిలి 'యువగంగ'లా తయారయ్యాను!

'ఏం చెయ్యాలబ్బా?'

ఈ మధ్య ఎక్కడ చూసినా సెక్సు కథలే! ఒళ్ళు మంచి 'సెక్సైటింగా' ఉంది. సెక్సైటింగ్ అంటే వడ్డెర చండీదాస్ గుర్తుకు వస్తాడు.

ఆ రోజు.... తొలిరాత్రి!

సిగ్గులన్ని మూటకట్టి చంద్రుడికి అప్పగించి,
లతలా నా శరీరం ఆయన్ని అల్లుకుపోతే, మేమిద్దరం ఖజురహో శిల్పంలా మారిపోతే, నరాల తీరాలలో రక్తం అలలుగా ఎగిసి ఎగిసి పడుతుంటే, తాకితే చాలు పగిలిపోతాయేమోనన్నట్లున్న నా అందాలను ఆయన పెదవులతో స్పృశిస్తే
హే భగవాన్ ఈ క్షణం ఇలా స్తంభించిపోనీ,
ఈ పారవశ్యం నన్ను అలుము కోనీ,
ఈ ఆనందం ఇలా మిగిలిపోనీ అని వేడు కుంటే...

రాత్రి జరిగిన శృంగార సాగరమధనం తాలూకు తీపి గుర్తులు వంటినిండా మిగిలిపోతే తెల్లవారుఝామున చూసుకుని నేను సిగ్గుల మొగ్గనైపోతే.. నా కాటుక
ముద్రలు, తిలకం గుర్తులు ఆయన మొహంపై ఉంటే చూసి మామగారు నవ్విన ఘటన ఎలా మరు పను? నేనెలా మరువను??

పోయిన ఏడాది...

ఇంట్లో పిల్లలు అడ్డుగా వున్నారని వాళ్ళని తాతగారింటికి పంపి, హడావుడిగా ఇద్దరం అరకు లోయకు లేట్ హనీమూన్ కు వెళ్ళలేదూ!

మూడు రోజులు మూడు క్షణాల్లా గడిచి పొలేదూ!

"ఇంత దూరం వచ్చాం కొండలూ కోనలు చూసి. వద్దాం' అంటే "నీలో లేని అందాలు ఆ కొండల్లో
ఏమున్నాయని" అనలేదూ!
తడిమి తడిమి, ముద్దాడి నా శరీరంపై ఆ కొండల్ని, కోనల్ని తరచి తరచి చూపిం చలేదూ!

మూడు రోజులు ఆకలిదప్పుల వంటి ఇహలోకపు బాధలేమైనా గుర్తున్నాయా?

అసలు ఒంటిమీద బట్టలు కొద్ది క్షణాలైనా నిలిచాయా? ఆయన మాట్లాడే ప్రతి మాటా, ఆయన చేసే ప్రతి చేష్టా నాలో స్పందనల్ని రేకెత్తి మైమరచి పోయేలా చేయలేదూ?

మరి ఏమయ్యిందీయనకిప్పుడు?

ఈ మధ్య మాటలు కూడా తక్కువైపోయాయి.

పత్రికలో పడ్డ శృంగార కథ ఒకటి చూపించి ఇది చదవరూ' అంటే ఆఫీసు పెండింగ్ వర్క్ వుంది నువ్వు చదువుకో అంటూ ఆ దిక్కుమాలిన లెక్కల్లో పడ్డారు.

విద్ర రాదే?

ఎలా వస్తుంది?

అలవాటు పడ్డ ప్రాణమాయే! పాత అలవాట్లు తొందరగా పోతాయా?

మంచం మీద ఎంత దొర్లినా కోరిక రేగుతుందే తప్ప చల్లారదే! కాంక్షా విరహపు జ్వాలలే!

పుస్తకం తెరిచినా అదే ధ్యాస. అక్షరాలు కనిపిస్తేనా? ఏవో దృశ్యాలు పుస్తకం నిండా మెదులు తున్నాయి.

సరిగ్గా ఆ సమయంలో నా ప్రాణ స్నేహితురాలు విమల గుర్తుకు వచ్చింది.

దాంతో ప్రాణం లేచి వచ్చింది!

మరుసటి రోజు అయన ఆఫీసుకు వెళ్ళిందే తరువాయి హడావుడిగా తయారై విమల ఇంటికి వెళ్లాను. అదృష్టవశాత్తు విమల ఇంట్లోనే ఉంది.

దాంతో నా బాధంతా ఏకరువు పెట్టాను. అంతా విని నింపాదిగా తలాడించింది.

'వాత్సాయనుడి సూత్రాలు' చదవలేదా అంది.

'ఆయన మనకేం చెప్పాడు?' అన్నాను

'మనకీ చెప్పాడు' అంటూ కొన్ని సూత్రాలు చెప్పింది.

అవి మర్నాటి నుండి అమలులో పెట్టాను.

*********'

పిల్లలిద్దర్నీ తాతగారింటికి పంపించాను. ఇది పథకంలో మొదటి భాగం!

ఆయన నిద్ర లేవకముందే అత్తరు వేసిన వేడినీళ్ళతో తలారా స్నానం చేసి, పంజాబీ డ్రస్ వేసుకుని ఆరీ ఆరని జుట్టుతో ఆయనకి ఇష్టమైన యాలకుల 'టీ' అందించాను.

ఆయన కనుబొమలు లేచాయి.

'గురుడు మారుతున్నాడు' అనుకున్నా.

ఆయన స్నానానికి వెళ్ళేటప్పుడు టవల్ అందించినప్పుడు ఆయన కళ్లల్లో మెరుపు,

'దారికి వస్తున్నాడు' అనుకున్నా.

ఆఫీసుకు వెళ్ళేటప్పుడు నావంక అదోలా చూసి నవ్వినప్పుడు 'పడ్డాడు గురుడు' అనుకున్నా.

మధ్యాహ్నం భోజనం అయ్యాక ఓ కునుకు తీసి సాయంత్రం మళ్ళీ స్నానం చేసి ఫారిన్ సెంటు ఒళ్ళంతా స్ప్రే చేసుకుని, పల్చటి రోజ్ కలర్ 'సీత్రూ'
నైటీ (విమల ఇచ్చింది) వేసుకున్నా! కావాలనే లోపల బ్రా కూడా వేసుకోలేదు. నా సొగసును ఒకసారి అద్దంలో చూసుకున్నా.

ఆయన పట్టించుకోవడం లేదు కానీ ఇంకొకడైతే చేతుల బలం పరీక్షించుకునే వాడే.

త్వరగా వంటచేసి ఆయనకోసం ఎదురు
చూస్తున్నా!

సాయంత్రం ఏడయ్యింది! రాలేదు! రాత్రి తొమ్మిదయ్యింది, రాలేదు!

పది గంటలకు కాబోలు ముక్కుకి మల్లెపూల పరిమళం సోకింది. లేచి చూస్తే పక్కనే ఆయన. ఎప్పుడొచ్చాడో- ఎర్ర లుంగీ కట్టుకుని నన్ను చూస్తూ పక్కనే కూర్చున్నారు.

కళ్లల్లో కాంక్ష!

'కమాన్ మాటలతో టైమ్ వేస్ట్ చెయ్యద్దు' అంటూ నన్ను అమాంతం ఎత్తుకుని, బెడ్రూంలోకి తీసుకు వెళ్లారు. 'ఎప్పుడొచ్చారు?' అన్నా ఆవలిస్తూ!

'ఈ రోజు మా ఆఫీసు బాస్ కి ట్రాన్స్ఫర్ అయ్యింది. పార్టీవల్ల లేట్ అయ్యింది. బాస్ తో పాటే టెన్షన్ కాస్తా వదిలిపోయింది' అన్నారు.

మాట పూర్తి కాకముందే నన్ను గట్టిగా వాటేసు కున్నారు.

"ఏంటి! ఈ రోజు కొత్తగా కనిపిస్తున్నావ్' అన్నారు.

నేను పెదవి విప్పలేదు.
కాదు ఆయన విప్పనివ్వలేదు. తన పెదవులతో నా పెదవుల్ని పట్టి కోరిక తీరేదాకా వదల్లేదు.

నా చేతి వేళ్ళు ఆయన జుట్టులోకి...

ఆయన చేతులు రెండూ నా చుట్టూ బిగుసుకు పోతున్నాయి.

తరువాత విచిత్రం జరిగింది! నేను పైన ఆయన కింద అయ్యాము

'ఇదేమిటి?' అన్నారు.

"పురుషాయితం! విమల చెప్పింది" అని నా పెదవులతో ఆయన పెదవులు మూసాను.

జరగబోయే సన్నివేశం చూడలేక...

చంద్రుడు తన ఇంటికి మబ్బుల తలుపులు మూసుకున్నాడు.

కొద్దిసేపటికే ఆయన తొలిరాత్రివారయ్యారు! ముచ్చటగా వేసుకున్న సిల్కు నైటీ బ్రతికి బట్టగా మిగల్లేదు.

ఆయన చేతివేళ్ళు ఎక్కడెక్కడో తడుముతుంటే... ఆయన వీపులో నా గోళ్ళు బలంగా దిగబడుతుంటే...

చీకటిలా పరుచుకున్న నా తలవెంట్రుకల్లో ఆయన ముఖం దాచుకుంటే...

మల్లెలు ఈర్ష్యపడి ముఖం మాడ్చుకుంటే..

ఒకటి ప్లస్ ఒకటి ఒకటిగా మారి...

అద్వైతమై, అవిశ్రాంతమై, అంబరమై, ఆనందమై అనుభూతిగా మారి హృదయంలోకి జారింది. ఆ రాత్రి
మా దేహాలు 'రసవద్గీత' గా మారాయి.

అమృతం చుక్కైనా వేలు!
మోహ కేంద్రాల విస్ఫోటనాల చివర అతని చేవ్రాలు!



END