నడుస్తున్న చరిత్ర- ఎం. వీరేశ్వర రావు
మంగపతి "ఏం బామ్మర్దీ, ఎక్కడికి పోయావు? కనపడ్డం మానేశావు?" నవ్వుతూ పలకరించాడు ప్రెసిడెంట్ (మాజీ)
"అదే బావా ఎన్నికలు కదా పదిహేను రోజుల్లో. గాలి ఎలా వుందో చూద్దామని వెళ్ళాను."
"ఎలా ఉందేటి?" అడిగాడు మంగపతి లంక పొగాకుచుట్ట నోట్లో పెట్టు కుంటూ.
"గాలి కొద్దిగా మారింది. రంగన్న
కొడుకు లేడూ. ఎస్.సి. వాడు పట్నంలో చదివి వచ్చాట్ట. ఊళ్ళో కుర్రాళ్ళని మధ్యవయసువాళ్ళని రెచ్చ గొడుతున్నాడు. మీరు ఇంతవరకూ ఏమీ చేయలేదట. గ్రాంట్లు భోంచేసార్ట. మీరు మళ్ళీ ప్రెసిడెంట్ అయితే
కూళ్ళ పాలెం ఎదుగుబొదుగు లేకుండా గొర్రె తోకలా ఉంటుందని ప్రచారం చేస్తున్నాడు."
"అలాగా? మరి ఎన్నికల టైములో డబ్బు, నాటుసారా ఇదంతా పెజా సేవ
కాదా నా డవుటు."
"అదెలా అవుతుందండి? తమరు ఈసారి జాగ్రత్త పడాలి."
"ఈసారి ఆయన అవ్వకపోవడమే మంచిది." అంది అప్పుడే అక్కడికి వచ్చి వాళ్ళమాటలు విన్న మంగపతి భార్య ఆదిలక్ష్మి.
"మవ్వు లోపలికి వెళ్ళవే. పెద్ద మనుషుల విషయాల్లో కలగచేసు కుంటాపు" గర్జించాడు. మంగపతి.
"హు" అంటూ ఆవిడ లోపలికి వెళ్ళింది.
"అయితే ఏం చేద్దామంటావు? "
"నువ్వే ఆలోచించు" అన్నాడు మంగపతి బామ్మర్ది.
********'
"ఈసారి ఎవరికీ వెయ్యద్దు అంటాడు ఓటు ఆ కుర్రాడు. అదెలా?" అన్నాడు ముసలి మసేను.
"నీకు తెల్వదా దాన్నే బాయ్కట్ దెబ్బతో ప్రభుత్వానికి తెలిసొస్తుంది " అన్నాడు ప్రక్కన ఉన్న వెంక ట్రావు.
మైకులో ఎవరివో మాటలు వినపడడం తో ఆటు తలత్రిప్పాడు వెంకట్రావు.
"మీరిలా ఎదుగు బొదుగు లేకుండా ఉండడానికి, నడవడానికి రోడ్డయినా లేకపోవడానికి కారణం ఎవరు?
ఆలో చించండి. ఈసారి ఎవరికీ వోటు వెయ్యద్దు. స్వార్ధ రాజకీయాలకి మీరు బలి కావద్దు" అంటూ ఉపన్యసిస్తున్నాడు రంగన్న కొడుకు అంటూ గంభీరంగా చైతన్య!
చప్పట్లు మ్రోగాయి.
"బావా బావా" హడావిడిగా వచ్చాడు. ప్రెసిడెంట్ బామ్మర్ది.
"ఏంది రోయ్""
"ఈ కొత్త విషయం విన్నావాః ఎవరికీ ఓటు వేయకుండా 'బాయ్కట్' చేయమంటున్నాడు రంగన్న కొడుకు.
"బాయ్ కాట్ అదేటి?"
"అంటే ప్రజలు ఎవరికి ఓటు వెయ్యరు ఎవరూ ప్రెసిడెంట్ కారు."
"లాభంలేదు. ఏదోటి వెయ్యాలి" అని లంకపోగాకు చుట్ట ముట్టించి దీర్ఘాలోచనలో పడ్డాడు మంగపతి.
ఎన్నికలు ఇంకా నాలుగురోజులు ఉన్నాయి.
ఆరోజు...
సూర్యుడు తన పనులు ముగించుకొని పశ్చిమాద్రికి జారిపోయాడు. సంధ్య కాంత నల్ల చీర కట్టుకుంటోంది.
సరిగ్గా అదే సమయంలో...
గూడెంలో వంద గుడిసెలు అగ్ని దేవుడికి ఆహుతి అయ్యాయి!
మర్నాడు ఉదయం-
ప్రెసిడెంట్ మంగపతి వచ్చి ఆందోళన వ్యక్తపరిచాడు. అగ్ని బాధితులను స్వయంగా ఓదార్చాడు. వెంటనే బాధితులకు గుడిసెలు వేసుకోవడానికి తలా అయిదువందల రూపాయలు సహాయం ప్రకటించాడు. మూడురోజులు వాళ్ళకి అన్న సంతర్పణ చేశాడు. ఇది జరిగినప్పుడు చైతన్య అర్జెంటు పనిమీద ఊరెళ్ళాడు.
ఎన్నికల తేదీ వచ్చింది. చైతన్య మాట ఎవరూ వినటంలేదు.
"నా మాట వినండి. మంగపతి నక్కజిత్తులు ఇవి. మీరు ఓటు "వెయ్యద్దు," అందరికీ చైతన్య
ఈ మాట చెప్తున్నాడు: ప్రజలు వినలేదు. విసుగెత్తిన చైతన్య "ఛీ" అనుకుంటూ కూళ్ళపాలెం వదిలి పట్నంవైపు పెడుతున్నాడు.
తిరుగులేని మెజారిటీతో మంగపతి ప్రెసిడెంట్ అయ్యాడు.
“బావా: నీ తెలివి అమోఘం. నువ్వు అసెంబ్లీ లో ఉండాల్సినోడివి అన్నాడు అభినందిస్తూ.
"అంతే కదా మరి" నవ్వు కుంటు న్నాడు మంగపతి.
అది తరతరాల ప్రజల అమాయకత్వాన్ని. అజ్ఞానాన్ని చూసి నవ్వుతున్నట్టుంది.
సమాప్తం