'నెచ్చెలి కథా కవితల పోటీ 2023' లో తృతీయ బహుమతి పొందిన కథ
*గంటగడిస్తే చాలు*
అవును నెలరోజులుక్రితమూ ఇలాగే అయింది. కానీ ఏంచేయటం? పనిమానలేని పరిస్థితి. అయ్యపోయినప్పుడు... వారంరోజులు సెలవడిగితే సేటు. "వారంరోజులా? మూడురోజులుండి వచ్చేయ్ "అన్నాడు.
మరి వెళ్ళినాక అమ్మఏడుపు చూడలేక, ఇంకోరోజు ఉండాల్సివచ్చే! మరి తిరిగి పనిలోకి వచ్చాక ....సేటుముకంచూడాలీ!
ముఖంమీద పేలాలు వేగటం అంటే ఏమిటో
ప్రత్యక్షంగా చూసి, ఇరక్తిపుట్టింది.
హ్హు... ఇరక్తి... ఎవరిమీద ఇరక్తి? దేనికి ఇరక్తి? ఉద్యోగంమీద ఇరక్తిపడితే ఎలా?
ఈమాట ఇక్కడ ఎవరితోనైనా అంటే "ఇరక్తికాదే విరక్తి" అని నవ్వుతారు.
అచ్చరం ఏదైనా బావం ఓటేగా !
"ఏమ్మా!ఈచీర విప్పిచూపించు " కష్టమర్ మాటలకు ఆలోచనల్లోంచి ,బయటికి వచ్చి,
చీరను చూపించి,
"చూడండి!ఈచీర మీకు ఎంత అందంగా ఉంటుందో! ఈ నీలం చీరకు నీలం
సెల్ఫ్ ప్రింట్ అంచు కొత్త పాషన్....
చక్కగా ఉన్నది "
అని తన మీదవేసుకుని చూపించి, అవతల ఆవిడమీద వేసి, అద్దం దగ్గరకు తీసుకువెళ్ళి,"అబ్బ! సూపర్ గాఉన్నారండీ
"ప్యాక్ చేయనా!" అంది.
"వద్దు!ఇంకోటిచూపించమ్మా!"
ఉస్సురంటూ మళ్ళీ ఇంకోచీర తీసి చూపించింది.
కానీ 'సుక్కి' మనసు మనసులో లేదు.
ఎడమవైపు ఉన్న టాయిలెట్ మీదేఉంది.
ఆడవాళ్ళ కష్టాలుఎవరికి అర్ధంఅవుతాయి?
బేరం సాగుతూనే ఉంది. చీరెలు గుట్టలుగుట్టలుగా తీయిస్తున్నారు.భుజంమీద పెట్టుకుని చూసి "ఇంకో మోడల్ చూపించు...అదిగో...
ఆ పచ్చచీర... కాదు... దానిపక్కది... దానిపైది... " ఇలా అడుగుతూనే ఉన్నారు.
పక్క కౌంటర్ వైపుచూసి...
"శైలక్కా !కొంచెం బేరంచూసుకుంటావా?
నేను ఇప్పుడే వత్తా ప్లీజక్కా" అని దీనంగా అడిగింది.
"నాకాడే నుంచునీ, నుంచునీ కాళ్ళుగుంజు కొత్తన్నాయి. నీదీ నేనేడసూసేదీ " అని
కొత్త కష్టమర్స్ వస్తే డ్రస్సులు చూపించటంలో దూరిపోయింది.
తలతిప్పిచూసింది.
చెన్నై షాపింగ్ మాల్ ,పట్టపగలు కూడా షాప్ నిండా లైట్లతో రకరకాల ...పూలగుత్తులతో చూపరులకు ఆకర్షణీయంగా అలంకరింపబడింది.
మెట్లెక్కివచ్చేవాళ్ళకి, మెట్లమీద పొడవునా
బంతిపూలదండలు పరిచారు.
గోడకి చెన్నై అనేఅక్షరాలు గులాబీపూలతో
డిజైన్ చేసి అమర్చి అందులో రంగురంగుల
డియోడ్స్ బిగించారు.
కానీ సుక్కి ముఖంలో మాత్రం,ఆ కాంతులేవీ కనిపించక కళావిహీనంగా ఉంది.
ప్రతినిమిషానికీ వెనుదిరిగి చూసుకుంటోంది.
కాళ్ళుగుంజేస్తున్నాయ్.
షాప్ లో స్టూళ్ళు అస్సలు ఉండనివ్వరు.
కష్టమర్స్ ని వదిలేసి, కూర్చుని ముచ్చట్లు పెడతారనో, ఏమో!
రోజల్లా ఆడైనా, మగైనా నిలబడే ఉండాలి.
మగవాళ్ళయితే, ఎలాగోలా నిలబడగలరేమో! ఆడవాళ్లకి కొన్నిసమస్యలుంటాయి.
ఆలోచిస్తూ ఎదురుగా చూసింది సుక్కి.
అవతల కౌంటర్ కి, ఎదురుగా, ఓబులేసు
ఇటేచూస్తున్నాడు.
ఓబులేసు, ఈమథ్యనే షాపింగ్ మాల్ లో చేరాడు సూపర్ వైజర్ గా.... సన్నగా, బక్కపలచగా, కొద్దిగా నెరిసిన గెడ్డం.
అందరికీ ఉన్నట్లే అతనికీ ఏదో కష్టం ఉన్నదని చెప్పుకుంటున్నారు.
ముగ్గురు ఆడపిల్లలు. మగపిల్లవాడికోసమనీ, చివరి ఆడపిల్లను కని, ఇకవల్లకాదని, ఆపాడట. కానీబాధ్యతలు తప్పదుగా!
సదువులు చెప్పించకపోయినా బట్టా పొట్టా
కోసమైనా కష్టపడాలిగా!
అంతకుముందు అతనికి ఉద్దోగమే లేదా?
ఉంటే ఎందుకుమానేసాడో! ఈడకి ఎందుకు
వచ్చాడో? తనకనవసరమే గానీ,వచ్చిన
దగ్గరనుంచి, అందరిమీదా,నిఘాఉంచాడు
ఎవరుఎటువెళ్ళినా, ఆరాతీస్తున్నాడు.
సేఠుకు చాడీలు చెబుతాడేమోనని అందరూ భయపడుతున్నారు.
ఆమధ్య అంతే జరిగింది.అవతలి కౌంటర్ లో డబ్బులు లెక్కసూసే మిషన్ కాడి
ఆడమనిషి
ఆమడిసి పేరుతనకి సరిగాతెలీదు.
మధ్యలో....తలనొప్పి, అలసట వల్ల టీతాగటానికి వెళ్ళివచ్చిందిట.
పోయేటప్పుడు, చెప్పాలిగా! అసలే డబ్బులతో పనాయే!వెంటనే సేఠుకాడికి, వార్త జేరవేసాడు ఓబులేసు.సేఠు రియాక్షన్
చూడాలీ !ఛెడామడా తిట్టేసాడు ఆమనిషిని
మరి తనమీదా ఫిర్యాదీ సేస్తే?
అనారోగ్యపు అత్త,పనికి సరిగాపోని భర్త, ఇద్దరు పసిపిల్లలు కళ్ళముందు మెదిలారు.
ఈ భర్తలతో మాసెడ్డచిరాకు. ఆడదాని సంపాదనకు అలవాటుపడిన మగాడు, ఇంట్లోఖాళీగా కూచుని భార్యను యేపుకు తింటమేతప్ప ఏపనికీ ఆసరాకు రాడు.
పెళ్ళైన ఏడాది బాగుంటాయేమో ఏజంటలైనా! మరుసంవత్సరం రణరంగంలో యుధ్దవీరులేనయం వీళ్ళకన్నా.... బాహాబాహీ.... ముష్టాముష్టీ
అందరివీనా? అనుకుని... ఆ... 'అందరివీ అంతే... డబ్బున్నోళ్ళకి డబ్బుతగాదాలు .
అవిలేనోళ్ళకి.... సొమ్ముసంపాదించలేకపోయామే అని సిగపట్లు.... ప్చ్.... నిట్టూర్చి....
మెున్నటికి మెున్న పిల్లోడికి,జోరం వస్తే...
చేతిలో పైకం లేకపోయే!అర్ధరాత్రి ఏంజేయాల? సేఠు ఆసమయంలో ఉండడుగా! తెల్లవార్లు జాగారం చేసి,
పక్కింటి లచ్చుమమ్మ పెద్దమ్మ తనింట్లో
ఉన్న కొన్ని దినుసులతోనే కషాయం కాచిస్తే, తాపించి, ఎలాగోలా జోరం తగ్గిందనిపించింది. తగ్గకపోతే?
అత్తకీ దగ్గు తగ్గకపాయె వారం వారం మందులు తేవాలనాయె.
"ఏడనుండి తెత్తావే సుక్కీ...నన్ను ఇలావదిలేయి. నా కడుపున పుట్టినోడికి లేని, ఆదరణ నీకెందుకే? " అంటది.
పాక అదిరిపోయేటట్లు
పగులూ రాత్రీ దగ్గుతాఉంటే
సూత్తా సూత్తా ఎలా వదిలేసేదీ
ఇన్నిరోజులూ ఇలాగే జరగవు. డబ్బుతోనే పని. అందుకే ఇన్ని పాట్లు ....
మళ్ళీ,ఆలోచల్లోంచి బయటికి వచ్చి....
కాసేపుటాయిలెట్ లోకిపోయివస్తే ఏమవుద్దీ?
ఈకాస్తకే పనిలోంచి తీసేస్తారా? ఓపదినిమిషాలేగా! ఎలావెళ్ళేది? బేరంమీదబేరమాయె.
మళ్ళీ ఇంకోబేరం...కాస్త వెసులుబాటు దొరికితే బాగుండు. పనిపూర్తి చేసుకురావచ్చు. ప్రతీ ఆడదానికీ ప్రతీనెలా ఉండే సమస్యే ఇది. కానీ ఆడదానిబాధ ఆడదానికే అర్థంకాదే!?నాపీపాడ్ మార్చుకురావాలి. చుట్టూజనం.
నెలసరి ఎక్కువెక్కువవుతోంది. పొద్దుననగా వచ్చింది. కిందకి కారిపోతే? అమ్మో!
మళ్ళీ వెనుదిరిగి చూసుకుంది.
గంటగంటకూ, అలా బాతురూంలోకి తిరగాలంటే,సేఠు ఏమంటాడో? ఈ ఉద్దోగంలో ఉన్న తనేనా?
ఏ ఉద్దోగంలోని, ఆడవారైనా, ఇదేసమస్యలో ఉంటారుగా!
మరి ఎలా ఈ సమస్యను ఎదుర్కుంటారో? పరిష్కరించుకుంటారో?
అన్ని ఉద్దోగాలూ ఇలాఉండవుగా!
సైన్స్ పెరిగింది, టెక్నాలజీపెరిగింది.
కానీ... సమస్యను ఎదుర్కునేవే గానీ!
సమస్యను తప్పించేవికావుగా!
బయటినుండి చూస్తే ధగధగాయమానంగా మెరిసిపోయే... ఇలాంటి భవనాలవెనుక,
వయ్యారంగా నిలబడి ఆకర్షించే షోకోసులో బొమ్మల వెనుకా.... నాలాంటి వెలిసిపోయిన.... బొమ్మలూ ఉంటాయ్.
అవి పాణంలేని బొమ్మలు. గంటకోచీర మార్చుకుని నిలబడి, అందాలు విరబూస్తాయి. తనలాంటి, బాధలతో బంధాలతో, రంగు వెలుస్తున్న బొమ్మలు ,
ఇందులో.... రంగురంగుబట్టలు... ఎదురుగాఉన్నా...అవన్నీ బయటివారికోసమే అనేటట్లుగా.... నిర్వేదం గా నిలబడాలి.... స్థితప్రఙ్ఞులు అనే మాట
ఇక్కడే కనబడుతుందేమో!
మళ్ళీ ఆలోచనల్లోంచి బయటికి వచ్చింది.
అయ్యో! బాతురూంలోకి వెళ్ళటం లేటయ్యేసరికి, కడుపులో నొప్పి మెుదలవుతోంది.ఏంచేయాలీ?
కదలాలంటే కారిపోయి అందరిముందూ అభాసుపాలైతే? ఎంతఅవమానం?
క్రితం నెల సెలవురోజుకాబట్టి, ఇంట్లోనే చాపమీద పొర్లుతూ,గంటగంటకూ,
మార్చుకుంటూ,పరమాత్మునికెరుక.
ఈఉద్దోగంలో, పూలమ్మ తీసుకువచ్చి,చేర్పించింది.పూలమ్మ ఈ నగరానికి వచ్చి ఐదేండ్లయింది. అంతకుముందు కూసుమంచి పక్కన పల్లెటూరిలో ఉండేది.చాలా బీదోళ్ళు.
పెళ్ళయి అత్తగారింటికి ఈసిటీకి వచ్చాక ,
కొన్నాళ్ళు ఇళ్ళల్లో పాచిపనిచేసింది.
గిట్టుబాటు కాక, ఇలాగే....
తనూ ఓ షాపింగ్ మాల్ లో నౌకరీకి కుదిరి, డబ్బులు సేతిలో గలగలలాడుతుంటే సోకులునేర్చి, తనతో నేస్తం సేసినప్పుడు
ఈ మాల్ లో తనను కుదిర్చి, తను ఏమైపోయిందో మళ్ళీ కనబడలా!
అందరిబతుకులూ అంతే గాలివాటుకు కొట్టుకొచ్చి ,అలాంటి గాలివాలుకే ఎండాకుల్లా ఎగిరిపోయి, మళ్ళీ ఎక్కడో ఆగుతాయి.
చీరలు మడతేసి రాక్ లో పెడుతూ,కొంచెం
ఒళ్ళుతూలితే నిలదొక్కుకుని,మళ్ళీ స్ప్రహలోకి వచ్చి....ఆడపుట్టుక అంటేనే రోతకదూ! కానీ సృష్టికి మూలమూ ఇదేగా!
ఇరవై సంపత్సరాలు వచ్చినా, ఆ మల్లమ్మ పెద్దమడిసి కాకపోతే, దానికి 'మాసకమ్మ'
అనిముద్రవేసి, పెళ్ళి పెటాకులు లేని,
'మోడు' అని ఇంట్లోవాళ్ళూ, బయటోళ్ళూ, రోజూ ఏడిపిస్తుండిరి.
ఆమె 'గోస' తనతో చెప్పుకుని బాధపడతాఉంటే, ఆటైంలో మాత్రం తానే
అద్రుష్ట మంతురాలినని అనిపిస్తది.
కానీ ఇలాటి టైం లో ఆడదానిగా పుట్టేకన్నా,
రాయీ,రప్పగా పుడితే మేలౌనుగందా !
అనిపిస్తదాయె. ఏమోలే ఓకట్టం. ఓసుకం.
కష్టం, సుఖం అన్నీ ఆడదానికే పెట్టాడాయె! ఆదేవుడు. ప్చ్...
ఇలాంటి సమయంలో పూర్వకాలంలో
రెస్ట్ పేరుతోనో, మడి కోసమో మూడురోజులు బయట కూర్చోబెట్టేవారు.
ఎక్కడోదూరంగా పాకలో కూర్చోబెట్టేసేవారుట. కానీ అప్పుడు
కూడా.... గేదెలకాడ బాగుచేయటాలూ, పొలంకాడికిపోయి గడ్డికోసుకు రావటాలూ, చాలా పనులుండేవి ఆడోళ్ళకి.
ఇక ఇంకెక్కడి రెస్ట్?.
ఆలోచనలు కందిరీగలల్లే చుట్టుకునే స్టేజ్ దాటి, ఆలోచనా రాహిత్యం ఏర్పడి కళ్ళు తిరుగుతున్నాయి.నిలబడలేక స్ప్రహ కోల్పోతున్న సమయంలో, కేకలు వినబడుతున్నాయి.
బయట విద్యుద్దీపాల స్టాండ్ కి కరెంట్ వైర్లు
షార్ట్ సర్క్యూట్ అయి మంటలు రేగుతున్నాయని, బయటివారు లోపలికి పరుగెత్తుకువచ్చి, చెప్పారు.
పట్టపగలు ఎలాజరిగిందబ్బా అనే ప్రశ్నకి తావులేదు. షాపింగ్ మాల్లో బయటి షోకేసులో బొమ్మలపై లైట్లు ...అందంగా వెలుగుతూనే ఉంటాయి.
అరుపులకు అందరూ అటుపరుగెత్తారు.
ఓబులేసు కూడా, ఏమయిందోనని చూడ్డానికి పోయాడు.
అంతే! గభాలున హ్యాండ్ బ్యాగ్ తీసుకుని బాత్ రూమ్ కి పరుగెత్తింది. బయటి హడావిడి సర్ధుమణిగింది.
సుక్కి ఆరాటం ఈగంటకి సర్దుకుంది.
ఎన్నాళ్ళిలా, ఈగంటగడిస్తే చాలనుకుంటూ... ఎన్నాళ్ళయినా
ఆడదానిగా ఉంటే ఇంతే !...
నిట్టూరుస్తూ అనుకుందిసుక్కమ్మ.
-------------------
హామీపత్రం.... కథ నా స్వీయరచన దేనికీ అనుకరణగానీ అనువాదం గానీ అనుసరణ గానీ కాదు .ఇది ఏ ఇతర మీడియా లోనూ చేర్చబడలేదు. ఎక్కడా ప్రచురించబడలేదు. పరిశీలనకూ లేదు అని హామీ ఇస్తున్నాను.
భాగవతుల భారతి ,
ఇం.నెం ~15-9-380.
రోడ్ నెం ~8
చెన్నై షాపింగ్ మాల్ దగ్గర ,
కవిరాజనగర్,
ఖమ్మం.
507002.
ఫోన్ .8121712950
Bhagavathula Bharathi
*రచయిత్రి పరిచయ వాక్యాలు*.....
పేరు... భాగవతుల భారతి
ఊరు... ఖమ్మం .
భర్త... శ్రీనివాస్ గారు.
భారతి ఎన్నో రచనలు చేసారు.పద్యాలూ,కవితలూ,కథలూ,
నవలలూ,వ్రాసారు.అన్నీ పలుపత్రికలలో, ఫ్రైజ్ మనీ తో కూడిన బహుమతులు గెలుచుకున్నాయి.
30-10-2022 న రవీంద్రభారతిలో ఉత్తమ రచయిత్రిగా సన్మానం....
2023 లో స్వాతి అనిల్ అవార్డ్ నవలలపోటీ లో *హృదయరవళి* నవల
సాధారణ ప్రచురణకు ఎంపిక కావటం రచయిత్రిగా మరిచిపోలేని అనుభూతులు.
అలాగే నెచ్చెలి వారు కథను ఆదరిస్తారని...
ఆశీర్వదిస్తారనీ,ఆశిస్తున్నారు. ధన్యవాదాలు అండీ.

భారతి ఎన్నో రచనలు చేసారు.పద్