కొరియర్
“తొలికోడి కూతలో ఏమున్నది? ”
“మరణించే రాత్రి మూలుగు ఉన్నది!”
మంచంమీదున్న నిరంజన్ కళ్ళు విప్పాడు. లేచి హడావిడిగా ఆఫీసుకు పోవడానికి నిరంజన్ కి ఉద్యోగం లేదు కాబట్టి ప్రయత్నం విరమించాడు. లేచి ముఖం కడుక్కుంటే కాఫీ తీసుకురావడానికి తల్లీ, భార్య లేరు కాబట్టి లేవడానికి ఇంకా ప్రయత్నం చేయలేదు. రోజు ఉన్న దినచర్యే ఇవాళ కూడా! లేచి అదీ ఏడున్నరకి! అరకిలోమీటరు నడిచి నాలుగు చక్రాల బండిలో రత్తమ్మ ఇచ్చిన టీ త్రాగి వస్తూ!
ఏముందీ క్రొత్తదనం? నిరుద్యోగి జీవితంలో!
"కర్మణ్యేవ అధికారస్తే". దానికి పేరడీలా
ఉద్యో గమునకు అప్లయి చేయుటయందు అధికారము కలదుగాని పొందుటయందు ఎవడునూ లేదు. అట్లని అప్లయి చేయుట మానరాదు. అని భావిస్తూ ఉంటాడు నిరంజన్!
నిరుద్యోగాన్ని హాస్యంగా మార్చుకొని బ్రతకడమేనా!
సమస్యలు! సమస్యలు!
నిరంజనికి ఒక విషయం అర్థమయ్యింది!
సమస్యలు పుట్టినపటి నుండి పోయేవరకూ ఉంటాయని.
సమస్య స్వరూపం మారుతుందిగాని స్వభావం మారదు! అని!
చిన్నప్పడు నిరంజన్కి బంతి కొనుక్కోవడం సమస్య. వాళ్ళ వాళ్ళ డబ్బులు ఇవ్వలేదు.
రమేష్ బంతిని దొంగిలించాడు. వాళ్ళ నాన్న వీవు మీద కొట్టాడు. తరువాత
తన చేతకానితనానికి బాధపడ్డాడు. నిరంజన్ కి అర్థమయ్యింది! వాన్న బంతిని కొనివ్వలేడని. !
"నాకు బంతి ఎందుకు?" అనుకున్నాడు.
తరువాత స్నేహితులు. బంతి ఆడుతుంటే చూడడం అలవాటు చేసుకున్నాడు. ఒకసారి రమేష్ జాలిపడి నిరంజన్ కి బంతి ఇచ్చాడు.
ఇది చిన్నప్పటి సంగతి.
నిరంజన్ ఎదిగాడు. శారీరకంగా! మానసికంగా! డిగ్రీ పూర్తి చేసాడు. ఉద్యోగం వస్తుందని కలలు కన్నాడు.
అది ఎండమావి అని త్వరలో తెలిసింది!
"కాలేజీ చదువు పనికిరాదని కాలేజీలో తెలిస్తే ఎంత బాగుండేది?" అని నిరంజన్ భావన!
"మా కాలంలో ఉద్యోగాలు త్వరగా దొరికేవి!" అన్నాడు నిరంజన్ వాన. ఆయన టీచర్ గా చేస్తు న్నాడు జిల్లాపరిషత్ లో పనిచేస్తున్నాడు.
"మీరు 1960 తర్వాత వుట్టివుంటే తెలిసేది. కాంపిటీషన్ అంటే" అన్నాడు విసుగ్గా నిరంజన్
అప్లికేషన్లు... పోస్టల్ ఆర్డర్లు... ఉద్యోగాలు... నిరాశ ని...విసిగి ప్రస్తుతం నిరంజసీ కాలానికి వదిలే శాడు జీవితా!.
నిరంజన్ ఏది పట్టించుకోకుండా బ్రతుకుతు న్నాడు. చుట్టుప్రక్కల వాళ్ళ వదల్లేదు. సంఘం ఒకటి ఉందిగా! పెద్దగా సహాయం చెయ్యకపోయినా సలహాలు పారేస్తుంది జీవితంలో అతి సులువై నది సలహా ఇవ్వడం. అతి కష్టమైనది ఆ సలహా మనం ఆచరించడం, ఒకతను నిరంజన్ దగ్గరికి వచ్చాడు. ఉద్యోగం, పిల్లని ఇస్తానని! పిల్ల మెల్లపిల్ల!" మామగారు ట్రాన్సోఫోర్ట్ కంపెనీలో పనిచేస్తున్నాడు! నిరంజన్ ఆత్మాభిమానం దెబ్బతింది! అవకాశాన్ని వద్దనుకున్నాడు. స్వశక్తిని నమ్ముకున్నాడు. నిరంజన్.
తల్లిదండ్రులు, మేనమామ తిట్టారు! "మంచి అవకాశాన్ని వదిలేశావని!"
"ఆత్మని తాకట్టు పెట్టె అవకాశాలు చాలా వస్తాయి" అన్నాడు నిరంజన్
నిరంజన్ తక్కువగా మాట్లాడుతాడు! వాళ్ళ ఏం మాట్లాడలేదు!
***
నిరంజన్ తెమలి రోడ్డు మీదకి వచ్చాడు. క్లాస్మేట్ శైలజ కనిపించింది. తనే పలకరించింది. .
నిరంజన్ నవ్వాడు. నవ్వులో జీవం ఉండదని తెలుసు.
"ఈ రోజు క్రొత్త సినిమా విడుదల అయింది. వస్తావా? ఛేంజిగా వుంటుంది" అంది శైలజ! ఆమె ఒంట్లో యవ్వనం పరవళ్ళు తొక్కుతోంది. శైలజ గలగలా మాట్లాడుతుంది. నవ్వుతూ, త్రుళ్ళుతూ ఉంటుంది. శైలజ నిరంజన్ పరిస్థితి తెలుసుకాబట్టి ఉద్యోగ విషయాలు మాట్లాడదు. నిరంజన్ కి ఉద్యోగం రావాలని దేవుళ్ళని ప్రార్థిస్తుంది. వస్తే నిరంజన్ని పెళ్ళాడాలని ఉద్దేశం.
నిరంజన్ శైలజా ఒక్కసారి చూసాడు. ఆ రోజు ఎందుకో శైలజ ఆకర్షణీయంగా కనిపించింది.
బొడ్డు క్రిందకి చీర కట్టింది. అది చూడగానే భజగోవింద శ్లోకం గుర్తుకు వచ్చింది. వాళ్ళ నాన్న చదివేది!
"నారీస్తన భరనాభీ దేశం! దృష్ట్వామాగావేశం" భజగోవింద శ్లోకాలు చదివినంత మాత్రాన బుద్ధులు మారతాయా? ఎవరికైనా!
అదేపనిగా అక్కడే దృష్టి వుంచడం సంస్కారం కాదని దృష్టి మరల్చి “నాకు కుదరదు" అన్నాడు! శైలజ వెళ్ళిపోయింది. వాళ్ళ వీధిలోనే ఉంటోంది. నిరంజన్లో యువకుడిగా ఉండవలసిన స్పందనలు ఉన్నాయి. స్పందనకి ముందు పులిలా నోరు తెరుచుకుని ఉన్న "ఆకలి" ఉంది.
నిరంజన్ జీవితంలో శిశిరం సాగుతోంది 'నిశి
కొరియర్ తెచ్చిన అతన్ని చూసింది. ఆశ్చర్యం! ఆనందం రెండూ కలిగాయి! "తీసుకుని సంతకం చెయ్యండి!" అన్నాడు నిరంజన్
"చేస్తా! నీ హృదయం మీద నా వలపు సంతకం -చేస్తా!" అనుకొంది శైలజ.
రాత్రి తోడు చేసుకుంటూ!
నిరంజన్ నక్షత్రాల్ని లెక్క పెడుతున్నాడు. ఇదే సమయంలో మరొకరు అయితే "సభక్ష తాల్ని" లెక్క పెడుతూ ఉంటారు.
"దండం పెట్టుకుని వెళ్ళు! ఉద్యోగం వస్తుంది!" అన్న అమ్మమాట. ఏ దేవుడిని నమ్మని సురేష్కి ఉద్యోగం వచ్చింది!
“ఎప్పటికైనా మంచిరోజులు వస్తాయిరా!" నాన్న ధైర్య వచనాలు!
"ఈసారి అప్లయి చెయ్యి" అన్న వెంకట్ మాటలు స్మృతిపథంలో తిరుగుతున్నాయి.
జీవితం పోరాటం! ఎక్కడ ఉన్నా తరుముతుంది! జీవితం నుండి ఎవడూ తపించుకోలేదు! ఎదురు చూపులు మాని పోరాటానికి అతను సిద్ధపడ్డాడు
కొత్త ఆలోచన ఆ రోజే రూపుదిద్దుకొంది.
*********
ఆ రోజు ఉదయం...
"కొరియర్" అన్న కేక విని! శైలజ అమ్మగారు "చూడు శైలజా ఎవరో పిలుస్తున్నారు" అంది. శైలజ ముందు గదిలోకి వచ్చింది.
కొరియర్ తెచ్చిన అతన్ని చూసింది. ఆశ్చర్యం! ఆనందం రెండూ కలిగాయి! "తీసుకుని సంతకం చెయ్యండి!" అన్నాడు నిరంజన్
"చేస్తా! నీ హృదయం మీద నా వలపు సంతకం చేస్తా!" అనుకొంది శైలజ.
సంతకం చేసి పెన్ను ఇవ్వలేదు శైలజ.
చెయ్యి పట్టుకొని పెన్ను లాక్కోబోయాడు. నిరంజన్ చెయ్యిని బలంగా లాగి కౌగిలిలో బిగించి నుదుటిమీద చుంబించింది శైలజ.
"నే కోరుకున్నది ఇదే! స్వశక్తిమీద
ఆధారపడడం!" అంది శైలజ చెవిలో, నిరంజన్ ఆనందంగా ఊపిరి పీల్చి, కోయిల గానాన్ని వింటూ బయటికి వచ్చాడు.
సమాప్తం