*****
*ఇదేం న్యాయం*
===========
(మినీ కథ)
రచన ::
బుద్ధవరపు కామేశ్వరరావు
హైదరాబాద్.
"నేను ఉదయం లేవగానే గదులన్నీ ఊడ్చేస్తాను"
"నేను ఊడ్చను"
"తర్వాత వంటింట్లో అంట్లు తోమేస్తాను"
"నేను తోమను"
"మా నలుగురికి టిఫిన్ రెడీ చేసేస్తాను"
"నేను చేయను"
"బట్టలు వాషింగ్ మెషిన్ లో వేసేస్తాను"
"నేను వేయను"
"తర్వాత అందరికీ భోజనం వండేస్తాను"
"నేను వండను"
"అందరికీ కేరేజీలు సర్దేస్తాను"
"నేను సర్దను"
"అందరి బట్టలు ఎండలో ఆరబెట్టేస్తా"
"నేను పెట్టను"
"ఆఫీసు నుంచి రాగానే ఆ బట్టలన్నీ తీసేస్తా"
"నేను తీయను"
"మళ్ళీ రాత్రి భోజనాల ఏర్పాట్లు చూస్తాను"
"నేను చూడను"
"నువ్వు నిజంగా అదృష్టవంతురాలివే చెల్లాయ్, అన్ని పనులు చేసే భర్త దొరికాడు"
"ఔను, అది నిజమే! నీదే దురదృష్టం. నీకు
అలాంటి భార్య దొరకలేదురా అన్నాయ్"
"ప్చ్..."
***** **శుభం** *****
(నేను రాసిన ఈ హాస్య కథ హాస్యానందం మాస పత్రిక నిర్వహించిన ముళ్ళపూడి సింగిల్ పేజీ హాస్య కథల పోటీలో బహుమతి పొంది జూన్ 2021లో ప్రచురితమైనది)