పద్మలత జయరాం నందిరాజు

కథా రచయిత్రి

మనసును కదిలించే సంఘటనలు, భావాలను మనుషులతో కన్నా కాగితంతో పంచుకోవడం నాకిష్టం.



1994 మార్చి నెలలో మొట్టమొదటి కథ రూబీ అచ్చయింది. అప్పటి నుంచీ ఇప్పటి వరకూ చందమామ, బాలమిత్ర, స్వాతి సపరివార వార మరియు మాస పత్రికలు,
ఈనాడు, జాగృతి, ఆంధ్రప్రభ, ఆంధ్రభూమి, రవళి, గృహ శోభ సహరి, నవ్య,ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రదేశ్, పల్లకి, మన ఆరోగ్యం మొదలైన పత్రికలు, ఇతర అనేక వెబ్ మ్యాగజైన్స్ లో ప్రచురణ జరిగిన కథానికలు 300. ఆకాశవాణి లో ప్రసారం అయిన కథలు, నాటికలు 38. అచ్చయిన నవలలు 7. స్టేజ్ నాటికలు, రేడియో నాటికలు, రూపకాలు రచించడం, నటించడం కూడా జరుగుతోంది.

దాసుభాషితం , story tel app లలో నవలలు. కథలు చదివాను.

నేను ఆకాశవాణి B high graded drama కళాకారిణిని. 1988 నుంచీ చాలా రేడియో నాటిక లలో నటించాను.
దూరదర్శన్ లో సన్మార్గం శీర్షికన సబ్జెక్ట్ expert గా కొన్ని ప్రసంగాలు చేయడం జరిగింది.
ఈనాడు పత్రికకు అంతర్యామి వ్యాసాలు రాస్తున్నాను.
ఇప్పటికి ఒక నవల, 4 కథా సంకలనాలు ముద్రితమయ్యాయి.
రంజని సంస్థ నుంచి మొత్తం తొమ్మిది సార్లు బహుమతులు లభించాయి.
జాగృతి దీపావళి పోటీలలో2011 తృతీయ బహుమతి,
2012 లో ప్రథమ బహుమతి లభించాయి.
లేఖిని నుంచి మాతృ దేవోభవ పురస్కారం లభించింది.
స్వాతి సపరివార పత్రిక లో సాహసకథల పోటీలో ప్రథమ బహుమతి తో పాటు అనేక కథానికలు ప్రచురితమయ్యాయి.

వెల్చేరు కళా సమితి. భీమిలీ, మరియు బండికల్లు వెంకటేశ్వర్లు గారి స్మారక కథల పోటీలలో ప్రథమ బహుమతి లభించాయి.

వివిధ నాటికలకు బహుమతులు లభించాయి.

కథారవళి అమృతలత కథానికల పోటీ 2026లో ప్రథమ ఉత్తమకథగా కుదురు బాగుండాల అనే కథానిక ఎంపికైంది.




దాసుభాషితం , story tel app లలో నవలలు. కథలు చదివాను.
📖 1 రచనలు
📚 0 పుస్తకాలు
✍️ 0 ఇతర రచనలు
👥 1 Followers

సహరి రచనలు

WEEKLY General
కాకి- కోకిల

నా పుస్తకాలు

ఇతర రచనలు

ఇంకా ఇతర రచనలు జోడించాలి