ఎనుగంటి వేణుగోపాల్

Storyteller

ఎనుగంటి వేణుగోపాల్ (రచయిత)గురించి
9440236055
anugantigopal@gmail.com
___________________________________
బాల్యం:
ఎనుగంటి రాజమల్లయ్య(Rtd.Teacher)
గంగమ్మల చివరి సంతానం.
ఎనుగంటి వేణుగోపాల్ 27.12.1965 లో
పుట్టింది_పెరిగింది జగిత్యాలజిల్లా కేంద్రంలో.‌
వయసు:60 సంవత్సరాలు
విద్యాభ్యాసం:
మాస్టర్ డిగ్రీలు(తెలుగు,సోషియాలజీ),
బియస్సీ(యం.పీ.సీ),బీఈడీ,విద్వాన్ డిగ్రీ(హిందీ)
ఉద్యోగం:
ప్రభుత్వ ఉపాధ్యాయుడు(ఎస్సే ఫిజికల్ సైన్స్)
ప్రభుత్వఉన్నత(నూతన)పాఠశాల జగిత్యాల
సాహిత్యం:
మొత్తం కథలు:
*200 పైచిలుకు కథలు అన్ని దిన వార పక్ష మాస
పత్రికల్లో వచ్చాయి.కన్నడం,ఆంగ్లంలోకి కొన్ని
కథలు అనువదించబడ్డాయి.
మొత్తం నవలలు:
*10 నవలలు
అచ్చు పుస్తకాలు (13):
1)'వేణుగాన శతకం'
*నీతిదాయకమైన పద్యాలు.
2)'అమ్మ నాన్న పిల్లలు'(ఆంధ్రభూమి దినపత్రిక)
*పిల్లల పట్ల తల్లిదండ్రులు వ్యవహరించాల్సిన
బాధ్యతపై వ్యాసాలు.
3)'విజయానికి అన్నీమెట్లే'(ఆంధ్రభూమి దినపత్రిక)
*వ్యక్తిత్వ వికాస వ్యాసాలు.
4)'అమ్మా నాన్న'(పేరెంట్స్ కాన్సెప్ట్ కథలసంపుటి)
5)గోపాలం(హాస్య కథల సంపుటి)
6)నవరసభరితం(నవరసాలపై ఏ భాషలో రాని
సరికొత్త ప్రయోగం చేయబడిన కథల సంపుటి) 2
7)నాలుగు పుటలు(కథల సంపుటి),
8)నా మినీకథలు(సింగిల్ కాన్సెప్ట్ కథలసంపుటి)
9)'ఎనుగంటి కాలం కథలు'(మైక్రో కథలసంపుటి)
10)'బుజ్జిగాడి బెంగ'(చిన్నారుల సైకలాజికల్
కథల సంపుటి)
11)'వైవిద్య కథలు'(విలక్షణ కథల సంపుటి)
12)'నాలుగు మెతుకులు'(మానసిక సంఘర్షణల
కథలసంపుటి)
నవలలు:
1)'అవని'(ఆంధ్రభూమి మాస పత్రిక సీరియల్)
*ఇతర గ్రహం నుంచి భూగ్రహం వైపు వచ్చిన
ఏలియన్ యవ్వనం దాటని ఒక 60 ఏళ్ల పడితి
పై ప్రేమలో పడితే?కథాంశంతో వచ్చిన సైంటిఫిక్
ఫిక్షన్ నవల.
2)'ట్వింకిల్ ట్వింకిల్ వండర్ స్టార్'(సంచిక తెలుగు
డైనమిక్ వెబ్ పత్రిక సీరియల్)
*చిన్న పిల్లవాడికి అతీంద్రియ శక్తులు వచ్చి,
అతడు ఎక్కడ కాలు మోపితే అక్కడ జరిగిన
సంఘటనలు గుర్తుకు వస్తే ఎలాంటి
పరిణామాలు ఎదురవుతాయి?అనే విభిన్న
కాన్సెప్ట్ తో రాయబడిన నవల.
3)'అలా పెళ్లికార్డు ప్రింటయింది'(ఉషా పక్ష పత్రిక
సీరియల్ )
*వయసు మీద పడినా ఇంకా పెళ్లి కాని ఒక
ఆబ్బాయి పెళ్లి కోసం పడే పాట్ల హాస్య
సంఘటనల సమాహారపు కామెడీ నవల)
4)'ఆమె-అతడు-ఆవిడ'(స్వాతి అనిల్ అవార్డు
_50 వేలరూపాయల బహుమతి నవల)
*ఒక పేద రైతు కుటుంబంలో పుట్టిన
మారుమూల గ్రామంలోని ఒక అబ్బాయి కష్టపడి
చదువుకొని,ఏ విధంగా ఎదిగి సమాజానికి
ఉపయుక్తంగా మారాడన్న స్ఫూర్తిదాయక
కథాంశం.
5)'ఆముక్తమాల్యద'(ఉషా పక్ష పత్రిక నవలల
పోటీలో _50 వేలరూపాయల బహుమతి నవల)
*కెరీర్ పై దృష్టి పెట్టిన ఒక అమ్మాయిని ప్రేమ
పేరుతో ఒక అబ్బాయి వెంటపడి జీవితాన్ని
డిస్టర్బ్ చేయడంతో ఆమె ఎదుర్కొన్న మానసిక
సంఘర్షణ,గాయపడిన మహిళల పక్షాన నిలబడి
ఆమె చూపిన పరిష్కార మార్గం ఇతివృతం.
6)'హరిప్రియ'(ఉషా అంతర్జాల వార పత్రిక
సస్పెన్స్ థ్రిల్లర్ సీరియల్)
*పెళ్లయిన ఒక మగాడికి అపరిచితుల నుండి
ప్రేమలేఖల పేరుతో ఉత్తరాలు వస్తుంటే..ఆ
సమస్యను అతడు దాన్ని ఏ విధంగా
ఎదుర్కొన్నాడనే సస్పెన్స్ కథనం.
7)'మన రాజమల్లయ్య మాస్టారు'(స్వాతి మాస
పత్రిక నవల)
*విద్యా వ్యవస్థపై ఎక్కుపెట్టబడిన అస్త్రం ఒక
మాస్టారు.ఆయన ఏ విధంగా ప్రక్షాళనం చేసి
పిల్లలని చదువుపై మళ్ళించాడనే వైవిద్య
కథాంశం.
8)మలయజ(నవల)
*మోసపోయి చీకటి సామ్రాజ్యంలోకి నెట్టబడిన
ఒక నిస్సహాయ అబల దుర్మార్గంపై ఒంటరిగా
చేసిన తిరుగుబాటు.
9)'తనయ'(నవల)
"ఒక 13 ఏళ్ల అమ్మాయి రజస్వల అయ్యాక
ఇంటా బయట,పాఠశాలలో ఎదుర్కొన్న భౌతిక
పరమైన'మగ'చూపుల దాడులపై ఆ చిన్నారి
పడిన మానసిక సంఘర్షణ,వ్యక్తిగత పోరాట
విభిన్న ఇతివృత్తం.
10) ఆకాశ వేట(అడుగడుగున అబ్బుర పరిచే
సైన్స్ ఫిక్షన్ నవల)
*గ్రహాంతరవాసులు భూగ్రహవాసులను
తమ లోకవాసులుగా మార్చుకోవడానికి
భూగ్రహంపైకి వచ్చినప్పుడు...మేధావి అయిన
ఒక యువ సైంటిస్ట్ వాళ్ల వ్యూహాన్ని ఏ విధంగా
తిప్పి కొట్టాడనే వినూత్న కథాంశం.

ఎం.ఫిల్: "ఎనుగంటి వేణుగోపాల్ కథలు"అనే
శీర్షికతో ఒక విద్యార్థి ఎం.ఫిల్.పట్టా సాధించాడు.
సాహిత్య బహుమతులు:
*కథలకు,నవలలకు అనేక బహుమతులు
వచ్చాయి.
పురస్కారాలు:
*ప్రభుత్వం నుండి అలాగే సాహిత్యసంస్థల నుండి
సన్మానాలు సత్కారాలు,బిరుదులు.
*#"
📖 0 రచనలు
📚 0 పుస్తకాలు
✍️ 0 ఇతర రచనలు
👥 0 Followers

సహరి రచనలు

నా పుస్తకాలు

ఇతర రచనలు

ఇంకా ఇతర రచనలు జోడించాలి

📚

Follow This Author

రచయితలను Follow చేయడానికి Login లేదా Free Registration అవసరం.

🎁 ప్రత్యేక స్వాగత బహుమతి

మీరు సహరిలో మొదటిసారి ఏ రచయితనైనా అనుసరిస్తే

✅ 7 రోజుల ప్రీమియం యాక్సెస్
📖 సహరి వారపత్రిక అన్ని సంచికలు
📘 సహరి మాసపత్రిక అన్ని సంచికలు
👧 బాలసహరి అన్ని సంచికలు

💳 కార్డు వివరాలు అవసరం లేదు
🆓 ఉచిత సభ్యత్వ నమోదు సరిపోతుంది
Login Register Free