నన్ద త్రినాథరావు

Short Story Writer

నమస్తే! నా పేరు నన్ద త్రినాథ రావు. నివాసం విశాఖపట్నం. వృత్తి రీత్యా బీహార్ లో ఉంటున్నాను. 2002 లో బాలమిత్ర లో అచ్చయ్యిన ఒక చిన్న బాలల కథతో నా సాహితీ ప్రయాణం మొదలైంది. ఆ తర్వాత దాదాపు వందకు పైగా బాలల కథలు అన్ని ప్రముఖ బాలల పత్రికల్లో ప్రచురింపబడ్డాయి. ఇప్పటికీ పడుతున్నాయి. రచయిత మిత్రులు శ్రీ కాండ్రేగుల శ్రీనివాస రావు, శ్రీ శ్రీచరణ్ మిత్ర గార్లు నన్ను సోషల్ స్టోరీస్ వ్రాయమని ప్రోత్సహించారు. దాంతో 2018 లో నా మొదటి సాంఘిక కథ “ప్రేమేవ జయతే!” వ్రాసాను. అది ‘సుకథ’ లో పబ్లిష్ అయ్యింది. ఆ తర్వాత వరుసగా పెద్ద కథలు వ్రాస్తూ ఉన్నాను. ఇప్పటి వరకు దాదాపు 85 కథలు అన్ని ఆన్లైన్/ఆఫ్లైన్ పత్రికల్లో ప్రచురణ అయ్యాయి. 30 కథలకు బహుమతులు వచ్చాయి. నా రచయిత మిత్రులు శ్రీ తిరుక్కోవుళ్లూరు శ్రీనివాసరావు, శ్రీ సి.హెచ్.నాగార్జున శర్మ, శ్రీ కొరికాన ఆనంద్ గార్లు. నన్నుకథా రచయితగా ప్రోత్సహించి, సాహితీ శిల్పి గా మలచిన శ్రీ గొర్లి శ్రీనివాసరావు గారికి, సత్యవేణి మేడం గారికి, సహరి టీమ్ వారందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.
📖 0 కథలు
📚 0 పుస్తకాలు
✍️ 0 రచనలు

సహరి కథలు

నా పుస్తకాలు

ఇతర రచనలు

ఇంకా రచనలు లేవు