వాడపల్లి పూర్ణ కామేశ్వరి
పదునైన కలంతో సమాజాన్ని చెక్కాలి
నోరి సుందరేశ్వరరావు, లలిత దంపతుల కుమార్తె పూర్ణ కామేశ్వరి. జన్మ స్థలం పిఠాపురం. దక్షిణ రైల్వేలో ప్రైవేట్ సెక్రెటరీగా పదవీ బాధ్యతలను నిర్వర్తిస్తున్న వీరి ప్రస్తుత నివాసం చెన్నై.
2003 నుండి దక్షిణ రైల్వే కార్యాలయం చెన్నైలో నిర్వహించే హిందీ భాషా వ్యాస రచనల పోటీలు, పుస్తక సమీక్ష పోటీలలో పాల్గొని అనేక పురస్కారాలు పొందడం జరిగింది. ఆంగ్లంలో కూడా చిన్నా పెద్దా వ్యాసాలూ, కథలూ వ్రాయడం ప్రవృత్తైంది. మాతృభాషలో వ్రాయాలనే ఆసక్తితో, 2020 తరువాత తెలుగులో వ్రాయడం ప్రారంభించి స్వల్పకాలంలోనే వీరి కథలు ప్రచురణకు ఎంపికవ్వడం, ఎన్నో బహుమతులు గెలవడంతో సాహితీ ప్రయాణం అలుపెరుగనిదిగా సాగింది.
2021 నుండి అనేక కథలకు బహుమతులు పొందడం, మరెన్నో కథలు ప్రచురణకు ఎంపికవ్వడం జరిగింది. ఇంత వరకూ నూట ఇరవైకు పైగా కథలు ప్రచురితమైయ్యాయి. లేఖిని సరసిజ, తపస్వి, తెలుగు తల్లి-కెనెడా, కథా మంజరి, విశాలాక్షి, సహరి, కథా వేదిక, రవళి, సాహో, ఉషా, సుమతి, నెచ్చెలి, గోతెలుగు.కామ్, మనతెలుగుకథలు.కామ్, పాలపిట్ట, సంచిక, సాహితీ కిరణం, జాగృతి, విశ్వశ్రీ సమాఖ్య మొదలగు ప్రఖ్యాతి గాంచిన సంస్థలు నిర్వహించిన అనేక పోటీలలో పాల్గొని అరవైకు పై చిలుకు బహుమతులు పొదడం జరిగింది.
మూడు నవలలు, అనేక కవితలు, వ్యాసాలు, గజళ్ళు ప్రచురితమైయ్యాయి.
మన తెలుగు కథలు.కామ్ లో వెబ్ సీరీస్ గా ఒక నవల ప్రచురితమవ్వగా, తపస్వి మనోహరం నిర్వహించిన పోటీల్లో వీరి నవలకు ప్రథమ బహుమతి లభించింది.
సామాజిక చైతన్యాన్ని స్పృశిచే రచనలు చేస్తూ తన సాహితీ పయనాన్ని కొనసాగించాలన్నదే వీరి అభిలాష.