కె. వి. సుమలత

కవిత్వం, కథా రచన, నవలా రచయిత

స్వీయ పరిచయం

పేరు కైకాల వెంకట సుమలత
భర్త పేరు కైకాల వెంకటేశ్వరరావు
నివాసం గుడివాడ

ఈనాడు, సాక్షి, ప్రజాశక్తి, వార్త, వెలుగు దర్వాజా, నమస్తే తెలంగాణా, స్వాతి, రవళి, సృజన క్రాంతి, సాహో, సాహితీ కిరణం, విశాఖసంస్కృతి, రమ్యభారతి మొదలగు పత్రికలలో రెండువందలకు చేరువగా సామాజిక కథలు, నూట యాభైకి పైగా కవితలు మరియు శతాధిక బాలల కథలు ప్రచురించబడ్డాయి. అనేక కథలు బహుమతులకు నోచుకున్నాయి. 2023 జూలైలో *సుమ సౌరభాలు* అనే కథల సంపుటి వెలువడింది. నవచేతన వారి నుండి 2024 నవంబర్ లో *అభినందన* 2025 మే నెలలో ఎమెస్కో వారి సాహితీ ప్రచురణల నుండి *అసలైన బహుమతి* అనే బాలల పుస్తకాలు వెలువడ్డాయి. 2025 నవంబర్ నెలలో సురవరపు ప్రతాపరెడ్డి గారి ఆర్థిక సహాయంతో *ఆనందం హాసిస్తే* అనే సామాజిక కథల సంపుటి, 2025 డిసెంబర్ నెలలో తపస్వి మనోహరం వారి నుండి *హాస విలాసాలు* అనే హాస్య కథల సంపుటి వెలువడ్డాయి. ప్రస్తుతం మరో రెండు బాలల కథలు, ఒక సామాజిక కథల సంపుటి పుస్తక రూపంలోకి వచ్చేందుకు పరిశీలనలో ఉన్నాయి. నేను వ్రాసే కథైనా, కవితైనా సమాజానికి హితవు కలిగించేదిగా ఉండాలనుకుంటాను. అనంతమైన సాహితీ సింధువులో నేను ఎగసిపడే కెరటాన్ని!...
📖 0 కథలు
📚 0 పుస్తకాలు
✍️ 0 రచనలు

సహరి కథలు

నా పుస్తకాలు

ఇతర రచనలు

ఇంకా రచనలు లేవు