మేధో హత్యలు part 5

This is Fifth part of Spy Suspense Thriller Novel . Written by Samrat. Very Gripping Novel. Un-pu-downable.

మేధో హత్యలు part 5

మేధో హత్యలు - 5

(స్పై సస్పెన్స్ థ్రిల్లర్)

విజయ్ హోటల్ కి చేరుతూనే కార్ పార్క్ చేసి వడి వడిగా నడుచుకుంటూ హోటల్ లోపలికి పోయాడు. ఒకరిద్దరు అతన్ని చూసారు, తడి బట్టలతో హడావుడిగా వెళ్తున్న అతన్ని చూసి ఎక్కడో పడి ఉంటాడు అనుకున్నారు. లిఫ్ట్ అవాయిడ్ చేసి మెట్ల మీదుగా తన గదికి వెళ్తున్న అతన్ని చూసి రిసెప్షన్ లో ఉన్న అమ్మాయి మెచ్చుకోలుగా చూసింది అతని వైపు. 

వారెవరి వైపూ చూడకుండా గబగబా మెట్లేక్కి తన గదికి చేరుకున్నాడు విజయ్. జూకీ ఉన్న కుర్చీ అతను పెట్టిన చోటినుంచి కొద్దిగా డిస్టర్బ్ అయినట్లే కనిపించింది. ఆమె అలా కుర్చీలో కూర్చునే నిద్ర పోయినట్లుంది. తలుపు తెరుచుకుని వచ్చిన అతని వైపు నిద్ర నిండిన కళ్ళతో చూసింది.

’హాయ్ జూకీ? ఎలా ఉన్నావు?’ అంటూ పలకరించాడు. నోటికి టేపు ఉంటే ఎలా మాట్లాడుతాను అన్నట్లు రుసరుస లాడుతూ చూసింది అతని వైపు.

’ఇప్పుడే వస్తాను’, అంటూ బాత్ రూమ్ లోకి వెళ్ళి తన తడి బట్టలు విడిచి తన వస్తువులను అక్కడే జాగ్రత్త పరిచి టవల్ తో బయటకు వచ్చాడు.

ఆకర్షణీయంగా కనిపిస్తున్న అతని వైపు కళ్ళార్పకుండా చూస్తున్న జూకీని పట్టించుకోకుండా ఒక కొత్త సూట్ వేసుకుని మళ్ళీ బాత్ రూమ్ లో దూరాడు. తన వస్తువులన్నీ అమర్చుకున్నాక స్టెయిల్ గా బయటికి వచ్చాడు.

జూకీ నోటికి అంటించిన టేప్ ని మెల్లగా తొలగించాడు. అయినా ఆమెకు మంట పెట్టినట్లుంది ’ఔచ్..’ అంది కీచుగా.

’సారీ నిన్ను ఇలా కట్టేసినందుకు’ అంటూ ఆమె కట్లు తొలగించాడు.

’నన్ను వదిలేయ్ ఇంక’ అంది జూకీ కోపంగా.

’వదిలేస్తాను. ముందు వాష్ రూమ్ కి వెళ్ళి ఫ్రెషప్ అవ్వు. నీ కాళ్ళపైన, చేతులపైన చల్లటి నీరు బాగా వేసుకో. బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవుతుంది. బాగుంటుంది. నువ్వు త్వరగా తయారయి వస్తే నీ బాయ్ ఫ్రెండ్ ని కలుద్దాము’ అన్నాడు విజయ్.

’నా  బాయ్‍ఫ్రెండ్ ఈ టైమ్ లో నిద్రపోతుంటాడు. లేట్ గా లేస్తాడు’ అంది జూకీ,తన మణికట్ల పైన ఎర్రగా కనిపిస్తున్న రోప్ మార్క్స్ పైన ఊదుకుంటూ.

’ఈ ఒక్కరోజు కాస్త ముందుగానే లేస్తాడు లే! నేనున్నాగా, లేపడానికి’ అన్నాడు పెద్దగా నవ్వుతూ.

అదోలా చూస్తూ బాత్ రూమ్ లోకి వెళ్ళి తీరికగా బయటకి వచ్చింది. అప్పటికే కాఫీ ఆర్డర్ ఇచ్చాడు విజయ్. తన కప్ ఖాళీ చేసి ఆమె కోసం వెయిట్ చేస్తూ కూర్చున్నాడు. 

బయటకు వచ్చిన జూకీకి కాఫీ తాగమని చెప్పి, ఆ రోజు పేపర్ ని తిరగేస్తూ కూర్చున్నాడు.

టాప్ హెడ్ లైన్స్ లో పారిస్ లో రెండు రోజుల్లో జరగబోతున్న ఒక సైంటిఫిక్ కాన్ఫరెన్స్ గురించి రాసి ఉంది. ఆసక్తిగా దాన్ని ఆమూలాగ్రం చదివాడు. ఈ లోగా జూకీ ఏదేదో మాట్లాడుతూ కాఫీ తాగి, పక్కనే ఉన్న కుకీస్ ని కూడా ఖాళీ చేసేసింది.

తన బాయ్‍ఫ్రెండ్ తనపైన కోపం తెచ్చుకుంటాడని, ఇక తనతో బ్రేకప్ చెప్పినా ఆశ్చర్యం లేదని. అతను తనకు ఎన్నో గిఫ్టులు ఇస్తూ ఉండే వాడని. ఇప్పుడు విజయ్ తనకున్న ఒకే ఒక మంచి బాయ్‍ఫ్రెండ్ ని తనకు దూరం చేయబోతున్నాడని, చెప్పింది. ఏదో విధంగా విజయ్ ని ఆపడానికి ప్రయత్నిస్తూ, తన బాయ్ ఫ్రెండ్ స్నేహితులు మంచివాళ్ళు కారని, గొడవలకు వచ్చే టైప్ అని లేనిపోని గొడవలు ఎందుకు వదిలేయమని కూడా చెప్పింది.

ఒక్క మాట కూడా తన చెవిలో దూరనట్లు ఆమెను పట్టించుకోకుండా పేపర్ చదవడం ముగించి, ఆమె తాగడం, తినడం పూర్తి చేయగానే, ’పద వెళ్దాం’ అన్నాడు విజయ్.

అంతలో డోర్ బెల్ మోగింది. రూమ్ సర్వీస్ నుంచి ఎవరైనా వచ్చి ఉంటారు అనుకున్నాడు విజయ్. అయినా ఎందుకన్నా మంచిది అనుకుంటూ కోటు వెనక దాచుకున్న తన రూజర్ మార్క్ ని చేతిలోకి తీసుకుని తలుపు తెరిచాడు కొద్దిగా. 

ఎదురుగా కనబడింది కప్స్ తీసుకువెళ్ళడానికో, రూమ్ క్లీన్ చేయడానికో వచ్చిన రూమ్ సర్వీస్ వాళ్ళు కారు. తాజా గులాబి పువ్వులా అందంగా నవ్వుతూ, కళ్ళల్లో కాస్తంత పశ్చాత్తాపం, మరి కాస్త ’సారీ, నన్ను క్షమించవూ’ లాంటి చూపులతో అతన్నే చూస్తూ నుంచుని ఉన్న సుప్రియ! 

ఆమెను చూడగానే ’ సోఫీ’ అన్నాడు విజయ్ నమ్మలేనట్లు. చటుక్కున తన రూజర్ మార్క్ ని కోటు వెనకకి దాని యథాస్థానానికి తిరిగి నెట్టేస్తూ.

అతన్ని చూస్తూనే అందంగా నవ్వుతూ ’సారీ విజ్జీ. ,నిన్న రాత్రి నేను అలా అవుట్ బరస్ట్ అవకుండా ఉండాల్సింది. బిజినెస్ ట్రిప్ మీద వచ్చినట్లు నువ్వు ముందే చెప్పావు. నీ బిజినెస్ విషయం ఏమిటో తెలియకుండా నేనే ఏదేదో ఊహించుకుని నిన్ను బాధపెట్టాను. అయామ్ సారీ’ అంటూ గబుక్కున ముందుకి వచ్చి అతని మెడ చుట్టూ చేతులు వేసి అతన్ని గట్టిగా హగ్ చేసుకుంది.

ఆమె కౌగిలింతలో వెచ్చదనాన్ని, సౌఖ్యాన్ని అనుభవిస్తూ ఆమె నడుము చుట్టూ చేతిని వేసి తన వైపుకి లాక్కుని మరికాస్త టైట్ గా హత్తుకుందామని చేతులు చాస్తున్న వాడు కాస్తా అలాగే ఫ్రీజ్ అయిపోయాడు విజయ్.

అప్పటివరకూ ఎంతో వెచ్చగా అనిపించిన ఆమె సడెన్ గా ఐస్ కోల్డ్ గా మారి పోయినట్లు అనిపించింది. తన భుజాల మీదుగా గదిలోకి చూసిన సుప్రియకు ఏమి కనబడిందో అర్థం అయింది అతనికి.

సోఫాలో కాలు మీద కాలు వేసుకుని విలాసంగా చూస్తూ ఉన్న జూకీ, ఆమె ఎదురుగా ఉన్న ఖాళీ కాఫీ కప్పులు కనిపించి ఉంటాయి. పక్కనే నేల పైన పడేసి ఉన్న వెట్ టవల్, ఆ పక్కనే పడి ఉన్న తన బట్టలు కూడా కనబడే ఉంటాయి అనుకున్నాడు.

’ఛీ.. ఛీ..’ అంటూ అతన్ని వెనక్కి ఒక్క తోపు తోసేసి, అతని వైపు పరమ జుగుప్సాకరమైన వస్తువుని చూస్తున్నట్లు చూస్తూ వెనక్కి తిరిగింది సుప్రియ.

’సోఫీ, ఆగు, నేను నీకు వివరంగా చెప్పగలను’ అన్నాడు విజయ్. అతని గొంతు అతనికే నిరాశగా వినిపించింది. అతని మాటలు అతనే నమ్మలేకపోయాడు. రాత్రి తన పక్కన కనిపించిన అమ్మాయే తెల్లవారుతూనే మళ్ళీ తన గదిలో కాఫీ తాగింది అంటే మధ్యలో ఏమి జరిగిందని ఆమె ఊహిస్తుందో అర్థమయింది.

ఏమీ జరగలేదు అని ఆమెను నమ్మించడం ఎంత అసాధ్యమో కూడా అతనికి అర్థమయి అతని మనసంతా బాధగా అయిపోయింది.

జూకీని, మట్టిగొట్టుకుని పోయిన తన అదృష్టాన్ని నిందించుకుంటూ విసురుగా వెళ్తున్న సుప్రియ వైపు చూస్తూ ఉండిపోయాడు. అతని మాటలను పట్టించుకోకుండా వేగంగా వెళ్ళిపోయింది సుప్రియ.

పకపకా నవ్వింది జూకీ. ఆమె ఆనందం తను మరో స్త్రీ పైన గెలిచినందుకు కాదని, తనను ఇరకాటంలోకి నెట్టడం వల్ల కలిగిన ఆనందం అని అర్థం అయి పళ్ళునూరుతూ కోపంగా చూసాడు విజయ్ ఆమె వైపు. బలవంతాన తన నవ్వులను ఆపుకుంది జూకీ.

’ఊ.. లే ’ అని అరిచాడు విజయ్.

స్విఫ్ట్ లో అతనికి ఇవ్వబడ్డ శిక్షణ అతన్ని సుప్రియను మరిచిపొమ్మని, చేయాల్సిన పని మీద మీద దృష్టి నిలపమని హెచ్చరించింది. ఐపిఎస్ కి సెలెక్ట్ అయిన విజయ్ ని సీక్రెట్ సర్వీస్ వాళ్ళు స్విఫ్ట్ లో చేరడానికి ఎంపిక చేసుకుని అతనికి అన్ని రకాల శిక్షణలు ఇచ్చి తిరుగులేని నెంబర్ ఒన్ ఏజెంట్ గా మార్చారు. శక్తిలోనైనా యుక్తిలోనైనా అతని తర్వాతే వేరెవరైనా అన్న పేరు గడించాడు అతి తక్కువ కాలంలో.

తన ఎమోషన్స్ ని త్వరగానే కంట్రోల్ చేసుకోగలిగాడు విజయ్. 

ఒక సారి సూటిగా అతని కేసి చూసి భుజాలు ఎగరేసింది జూకీ, జరిగేదానిలో తనదేం భాద్యత లేదు అన్నట్లు.

ఇద్దరూ కార్ లో కూర్చుని జూకీ డ్రైవ్ చేస్తుండగా ఆమె బాయ్‍ఫ్రెండ్ డానీ ఉండే సోహో డిస్ట్రిక్ట్ వైపుకి బయల్దేరారు.

సోహో కాస్త చీప్ ఇళ్ళు, చీప్ బార్ లు ఉండే డిస్ట్రిక్ట్. ఎక్కువ మంది జులాయిగా తిరిగే వాళ్ళు, డబ్బు కోసం ఎలాంటి పని చేయడానికైనా సిద్ధంగా ఉండే వాళ్ళు ఎక్కువగా ఉండే ప్రాంతం. 

కార్ డ్రైవ్ చేస్తూ మళ్ళీ సొద మొదలఎట్టింది జూకీ. డానీకి తన నిద్ర ఎవరైనా డిస్టర్బ్ చేస్తే చాలా కోపం వస్తుంది అని మరీ మరీ చెప్పింది. విజయ్ విసుక్కున్నాడు ఆమెను.

ఏదో ఆలోచించుకుంటూ ఉండీపోయింది జూకీ. తన బాయ్ ఫ్రెండ్ కి ఏం చెప్పాలో ప్లాన్ చేసుకుంటున్నట్లుంది అనుకున్నాడు విజయ్. డానీకి కోపం వస్తే ముందు జూకీ మీదే వస్తుంది, తనని అతని ఇంటికి తీసుకువచ్చినందుకు అనుకుని సన్నగా నవ్వుకున్నాడు విజయ్.

డానీ అపార్ట్‍మెంట్ బయట కార్ పార్క్ చేసి ఇద్దరూ దిగి వెళ్ళారు లిఫ్ట్ దగ్గరకి. ఆ సమయంలో చడీ చప్పుడు లేకుండా ఉంది ఆ ఏరియా అంతా. అందరూ రాత్రుళ్ళు పనులు చేసి పగలు నిద్రపోయే వాళ్ళే ఇక్కడ అనుకున్నాడు విజయ్. వాళ్ళెవరినీ నిద్ర నుంచి లేపే ఉద్దేశం లేదు అతనికి. నడుము దగ్గర ఉన్న రూజర్ మార్క్ మదిలో మెదిలినా వెంటనే ఆలోచనని తుడిచేసాడు.

డానీ ఫ్లాట్ పెంట్ హౌస్ లో ఉంది. లిఫ్ట్ లో ఆఖరు ఫ్లోర్ వరకు వెళ్ళి అక్కడ న్ంచి మెట్లపైన వెళ్ళారు ఇద్దరూ. 

బెల్ కొట్టాడు విజయ్. రెండు మూడు సార్లు మోగినా లోపలి నుంచి ఎవరూ వాస్తున్న అలికిడి లేకపోతే జూకీతో చెప్పాడు. ’నువ్వూ ఎప్పుడూ ఎలా పిలుస్తావో ప్రేమగా, అలాగే పిలువు’ అంటూ ఆమె మెడ వెనుక చేతిని వేసి కొద్దిగా ఒత్తిడి పెట్టాడు. బెదురు చూపులతో అతన్ని చూసింది. అతని మొఖంలో కనబడే మృత్యువు ని చూసి అదురుకుంది. గొంతు సవరించుకుంటూ, ’బేబీ, నేనే వచ్చాను, తలుపు తియ్యి’ అంటూ గట్టిగా అరిచింది.

లోపల నుంచి ఏవో అస్పష్టమైన శబ్దాలు వినిపించాయి. ’రా బేబీ, బయట చలిగా ఉంది’ అంది తన యాక్ట్ ని పెర్‍ఫెక్ట్ గా చేస్తూ.

తన మొఖంలో ఎలాంటి మార్పు రానివ్వకుండా సీరియస్ గా ఉన్నాడు విజయ్.

తలుపు కొద్దిగా తెరుచుకుని చింపిరి జుత్తు నుదుటిపై పడుతున్న ఒక రఫ్ మొఖం బయటకు కనిపించింది. జూకీ ని చూసి ’ఏంటి ఇంత పొద్దున్నే...’ అంటూ పక్కనే ఉన్న విజయ్ కూడా కనబడేసరికి, ’ఎవరు?’ అంటూ ప్రశ్నించాడు.

’కస్టమర్’ అన్నాడు విజయ్ వెటకారంగా నవ్వుతూ.

తలుపు వెయ్యబోయాడు డానీ. విసురుగా దాన్ని నెట్టాడు విజయ్. తలుపు బార్లా తెరుచుకుంది. ముక్కుకి తలుపు తగిలి బొట బొట నెత్తురు కారింది డానీకి. గట్టిగా అరుస్తూ, తిట్లు లంకించుకున్నాడు డానీ.

’నాకు కొన్ని సమాధానాలు కావాలి? అవి చెప్పేస్తే, నేను ఏమీ చేయకుండా వెళ్ళిపోతాను, నువ్వు నీ గాళ్ ఫ్రెండ్, మీ నిద్రలు కంటిన్యూ చేయొచ్చు.

ఎర్రబడ్డ కళ్ళతో విజయ్ వైపు చూసాడు డానీ. 

’నేను ముందే చెప్పాను, డానీని నిద్ర లేపితే చాలా కోపం వస్తుంది అని. ఇతను వినలేదు. నన్ను బెదిరించి ఇక్కడకు తీసుకు వచ్చాడు’ అంటూ విజయ్ వైపు నుంచి డానీ వైపుకి వెళ్ళి నిల్చుంది జూకీ.

’అసలు వీడెవడు. నువ్వెందుకు వీడిని ఇక్కడకు తెచ్చావు’ అని గట్టిగా ఆమెను తిడుతూ విసురుగా విజయ్ వైపుకి దుమికాడు డానీ. విజయ్ ని సర్ప్రైజ్ చేయగలను అనుకున్నాడు కానీ, అటువంటి ప్రయత్నం ఏదో చేయకుండా వాడు లొంగడు అని సిద్ధంగా ఉన్న విజయ్ ఒక అడుగు పక్కకు వేసి, విసురుగా వస్తున్న డానీని నడుము దగ్గర పట్టుకుని అమాంతం ఎత్తి గోడ వైపు విసిరేసాడు.

తనకు ఏమయిందో తెలిసే లోగానే తలకిందులుగా వెళ్ళి గోడ పక్కన ఉన్న కబోర్డ్ దగ్గర పడిపోయాడు డానీ. తగిలిన దెబ్బలకంటే ఆశ్చర్యమే వాడిని ఎక్కువ బాధించినట్లుంది, విజయ్ వైపు ఒకసారి సూటిగా చూసి తన బెస్ట్ టెక్నిక్ వాడడానికి డిసైడ్ అయిపోయాడు వాడు. 

కబోర్డ్ లో ఉన్న బాటిల్ ఒకటి అందుకుని గోడకేసి కొట్టాడు దాన్ని. పొడవైన ఆ బాటిల్ అడుగు భాగం విరిగి దానిలోని ద్రవం బయటకు కారిపోయింది. డానీ చేతిలో మిగిలిన బాటిల్ పదునైన అంచులతీ రౌండ్ గా ఉన్న రంపపు ఆయుధం లా మారిపోయింది. గాలిలో కలిసిన ఆల్కహాల్ వాసన పీల్చి మరింతగా తన క్రోధాన్ని పెంచుకున్నాడు డానీ. కుడి చేతిలో సీసా ఆయుధాన్ని పట్టుకుని కాలరుద్రుడిలా విజయ్ వైపు ఒక్కో అడుగు నిదానంగా వెయ్యడం మొదలు పెట్టాడు.

’డానీ, నాకు సమాధానాలు ఇస్తే చాలు. రాయల్ డాక్స్ లో నాపైన ఎటాక్ చేసిన వాళ్ళు ఎవరు? ఎక్కడ ఉంటారు?’ అన్నాడు విజయ్ శాంతంగా. కళ్ళు మాత్రం తీక్షణంగా డానీని చూస్తున్నాయి. గదిలో ఒక మూల ఉన్న జూకీ భయంతో వణికి పోతూ ఉంది. డానీని ఆ ఫోజు లో అంతకు ముందు ఒకటి రెండు సార్లు చూసింది ఆమె. తన ప్రత్యర్ధులపై ఆఖరు అస్త్రంగా అది వాడుతుంటాడు. డానీ. దాన్ని తప్పించుకున్న వాళ్ళు అంతవరకూ ఎవరూ లేరు. కొద్ది క్షణాలలో గది నిందా రక్తం ఏరులై పారుతుందని ఆమెకు అనిపించినట్లుంది, కనులు వెడల్పుగా అయి భయంతో గోడకు అతుక్కు పోయి నుంచుంది.

డానీ ఆయుధం చూస్తూనే గుర్తుపట్టాడు విజయ్ అతని ఓల్డ్ బార్ రూమ్ టెక్నిక్ ని. యాక్యురేట్ గా డీల్ చేస్తే ఆ బాటిల్ మామూలు కత్తి కంటే వంద రెట్లు ప్రమాదకారిగా పనిచేస్తుంది.. ప్రత్యర్థి శరీరంలో సాఫ్ట్ గా ఉండే అబ్డామెన్ ని ఎటాక్ చేసి ఇంటర్నల్ ఆర్గాన్స్ ని ఛిన్నాభిన్నం చేసి బాధాకరమైన మరణాన్ని ఇచ్చే టెక్నిక్ అది. 

కాల్౮ఇక్యులేటెడ్ గా కదులుతున్న డానీ వైపు చూస్తూ ఒక సారి జూకీ వైపు దృష్టి సారించాడు విజయ్. ఆ కాస్త వ్యవధిని ఉపయోగించుకుంటూ వేగంగా దూసుకువచ్చాడు డానీ. విజయ్ కి మూడడుగుల దూరంలోకి వచ్చేసి ఎడమ చేత్తో అతని మొఖం వైపుకి పంచ్ విసిరాడు. 

ఆ పంచ్ ని అడ్డుకోవడానికి విజయ్ తన కుడి చేతిని ఎత్తి బ్లాక్ చేసుకుంటే వెంటనే తన కుడి చేతిలోని బాటిల్ ఆయుధాన్ని అతని అబ్డామెన్ మీద దారుణంగా ప్రయోగిస్తాడు డానీ.

వెబక్కి జంప్ చేసాడు విజయ్. వెనక్ ఉన్న బెడ్ కాళ్ళకు అడ్దువచ్చి వెల్లకిలా బెడ్ మీద పడిపోయాడు. వికటంగా నవ్వుతూ బాటిల్ ముందుకు చాచిదూసుకువచ్చాడు డానీ.

పడిన చోటే ఉండి ఉంటే బాటిలో తో విజయ్ కడుపుని ఎటాక్ చేసేవాడు డానీ. కానీ మెరుపుకంటే వేగంగా కదిలాడు విజయ్. వెనక్కి పిల్లి మొగ్గ వేసి బెడ్ కి అటువైపు లాండ్ అయ్యాడు. తప్పించుకున్న విజయ్ ని చూసీ ఆ గేమ్ ని ఎంజా చేస్తున్న వాడిలా పిచ్చిగా నవ్వుతూ బెడ్ చుట్టూ తిరిగి రాబోయాడు డానీ. 

ఆ చిన్న గది లో అటూ ఇటూ పరిగెత్తడాణికి చోటే లేదు. రూజర్ మార్క్ తీస్తే ఒక్క బుల్లెట్ సరిపోతుంది డానీని హతం చేయడానికి. కానీ విజయ్ కి సమాధానాలు దొరకవు. ఎలాగైనా వాడీని ప్రాణాలతో పట్టుకోవాలని అనుకున్నాడు విజయ్. పూర్తిగా కాకపోయినా మాట్లాడడానికి అవసరమున్నంత ప్రాణం మిగిలినా చాలు వాడిలో అనుకున్నాడు విజయ్. మంచం పైకి ఎక్కి డానీ కి అందకుండా ఖాళీగా ఉన్న చోటికి వెళ్ళిపోయాడు. పక్కనే ఉన్న చెక్క కుర్చీని ఎత్తి పట్టుకున్నాడు రెండు చేతులతో.

’రా రా, పిరికి వాడిలా పారిపోకు’ అంటూ కవ్వించాడు డానీ.

దానికోసమే వాడు ఎదురు చూస్తున్నాడు అని తెలుసు విజయ్ కి. తను కూర్చి ఎత్తి వాడీని దానితో కొట్టడాణికి చూస్తే దానినుంచి తప్పించుకుని తన మీద దాడి చేస్తాడు. కూర్చితో వాడిని కొట్టడానికి ప్రయత్నించి విఫలమయ్యాక తను మళ్ళీ డిఫెన్సివ్ పొజిషన్ తీసుకునే లోగానే వాడు తనని ఖతమ్ చేసేయగలడు.

ముందు కుర్చీ ఎత్తి డానీ కోరినట్లుగానే ఎటాక్ చేయబోతునట్లు భ్రమ కలిగించాడు విజయ్. వాడిరెండు చేతులూ ఎడం ఎడంగా పెట్టుకుని విజయ్ కూర్చీని స్వింగ్ చేయడం కోసం చూస్తున్న తరుణంలో ఒక్కసారిగా కుర్చీ తన ఎదుటకు దించి కుర్చీ కాళ్ళను డానీ వైపు ఉంచి తన తలను భుజాలను కూర్చీకి ఆనించి డానీ వైపు దూసుకు వెళ్ళిపోయాడు విజయ్.

ఊహించని ఆ ఎటాక్ ని తప్పించుకుందామని వెనక్కి దూకాడు డానీ తత్తరపడుతూ. కానీ కుర్చీతో సహా తన బరువంతా ఉపయోగిస్తూ విజయ్ వేగంగా దూసుకువెళ్ళేసరికి తప్పించుకోలేకపొయాడు.

డానీని కూర్ఛితోగోడాకేసి గుద్దే సరికి ఆ ఉధృతి కి ఫ్లాట్ గోడలు ఒక్కసారిగా కంపించాయి. గిన్నెలు అటూ ఇటూ దొర్లాయి. డానీ గొంతు నుంచి ఒక్క కేక కూడా రాలేదు. కుర్చీ కాళ్ళలో ఒకటి అతని గొంతులోకి దిగబడి పోయింది. మరొకటి ఛాతీ కింద. మిగిలిన కాళ్ళు అతని శరీరాన్ని గోడకు అదిమి పెట్టేసాయి.

భీభత్సమైన ఆ దృశ్యాన్ని చూసి జూకీ వణికిపోతూ నేలమీద కూలబడిపోయి, ’చంపేసావు, డానీని చంపేసావు’ అంటూ హిస్టీరిక్ గా అరవడం మొదలు పెట్టింది.

’ఛుప్’ అంటూ గట్టిగా అదిలించాడు ఆమెను. ’అతను నన్ను చంపడాంనికి చూసాడు. నువ్వే చూసావుగా. నేనో? అతనో? ఒక్కరే మిగలాలి అన్నట్లు దాడి చేశాడు. నాది కేవలం ఆత్మరక్షణ ప్రయత్నం’ అంటూ డానీ దగ్గరకు వెళ్ళి చూసాడు. చేతిలో బాటిల్ జారిపోయి ఉంది. కళ్ళు ఆశ్చర్యంతో పెద్దగా తెరిచి ఉన్నాయి. ఊపిరి ఆడటం లేదు. కుర్చీని రిలీజ్ చేయగానే, గోడ వెంబడి జారుతూ ఫ్లోర్ మీద పడింది డానీ బాడి. 

రాయల్ డాక్స్ లో తనపైన దాడి చేసిన వారి గురించి ప్రస్తావించగానే అతని కనులలో కనబడిన కోపం లో, ఆశ కూడా కనిపించింది విజయ్ కి. యాధృచ్చికంగా తనపైన జూకీని ప్రయోగించడం వరకు మాత్రమే డానీ ప్రమేయం పరిమితం కాలేదని, అతనికి ఇంకా లోతైన సంబంధం ఉంది అని ఊహించాడు విజయ్. అందుకే తాను అంతం చేసి ఆ క్రెడిట్ తను తీసుకోవడాణికి డిసైడ్ అయ్యాడు అని అర్థం అయింది. అలా కకపోతే తనతో ఏవో మాట్లాడీ పంపించేసి ఉండేవాడు అనుకుంటూ, అతని రూమ్ లో వెతికాడు. అతని వంటి మీడ నైట్ డ్రెస్ మాత్రమే ఉంది. బెడ్ పక్కన ఉన్న హేంగర్ కి అతని బట్టలు వేలాడ దీశి ఉన్నాయి. అవి వెతికాడు. ఏవో పనికి రాని కాగితాలు, ఒక విజిటింగ్ కార్డ్ కనిపించింది. ఆ కార్డ్ పైన పేరు చూడగానే ఆశ్చర్యంతో సన్నగా ఈల వేసాడు విజయ్. ఆ కార్డుని తన కోట్ జేబులోకి తోసుకుంటూ జూకీ వైపు చూసాడు.

’ఇక్కడే ఉంటే నువ్వు పోలీసులకు చాలా సమాధానాలు చెప్పు కోవాలి. గప్ చుప్ గా నా తో వచ్చెయ్. సిటీ లోకి వెళ్ళాక నీ దారి నీది, నా దారి నాది’ అన్నాడు. 

అతని వైపు బ్లాంక్ గా చూసింది జూకీ.

ఆమెను వెంటబెట్టుకుని బయటకు నడిచాడు విజయ్.

కార్ తనే డ్రైవ్ చేస్తూ, తన పొజిషన్ ని ఒకసారి సింహావలోకనం చేసుకున్నాడు. కోటు జేబు లో ఉన్న కార్డ్ లోని పేరు ఆ రోజు ఉదయమే అతను చూసాడు న్యూస్ పేపర్ లో. దాని గురించి కొన్ని వివరాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మొదట తన మకాం హోటల్ నుంచి వెంటనే మార్చాలి అనుకున్నాడు. కార్ ని వేగంగా పోనిచ్చాడు.

* * *