నమస్తే!
భాష పదికాలాల పాటు నిలవాలి అంటే ఆ భాషలో సాహిత్యం వెలువడుతూనే ఉండాలి. రాసే వాళ్ళే కాదు చదివే వాళ్ళు కూడా కావాలి. ఇప్పటి వరకు తెలుగులో ఎన్నో పత్రికలు వెలువడ్డాయి. కొన్ని నిలిచాయి, కొన్ని తెరమరుగయ్యాయి. కానీ ఇప్పుడు కోవిడ్ 19 మహమ్మారి దెబ్బకు ప్రింటులో వస్తున్న చాలా పత్రికలు కనుమరుగయ్యే ప్రమాదంలో పడ్డాయి. అవి మళ్ళీ నిలదొక్కుకుని రెట్టించిన ఉత్సాహంతో మళ్ళి అందుబాటులోకి రావాలని అందరూ కోరుకుంటున్నారు.
నేటి కాలానుగుణంగా పాఠకులు అంతర్జాలంలో కథలు చదవడానికి సుముఖంగా వున్నారు. కానీ కథలు, సీరియళ్లు, విద్య, వైద్య వంటి అనేక రంగాల గురించి, మహిళలకు, పిల్లలకు, పెద్దలకు చదువుకోవడానికి కావలసిన నాణ్యమైన రచనలు ఒకే చోట దొరికే సావకాశం లేదు. ఆ లోటుని భర్తీ చేస్తూ మీ ముందుకి వస్తుంది సహరి ఆన్ లైన్ వీక్లీ.
ఇది అంతర్జాలంలో తొలి తెలుగు వీక్లీ. మీ అందరి అభిమానం సంపాదించుకోవాలనే ఆశతో అన్ని విధాలా తయారయి మీ ముందుకు త్వరలో రాబోతుంది. మీ ఆశీస్సులు ఆకాంక్షిస్తుంది మీ సహరి. మీరు ఇచ్చే ప్రోత్సాహంతో తెలుగు పాఠకులకు, రచయితలకు కూడా అందుబాటులో ఉండే చక్కటి సమగ్ర వార పత్రిక గా నిలిచి సదా ప్రకాశించాలని కోరుతూ వుంది మీ సహరి. ఆదరిస్తారు కదూ!
మీ
సహరి
అంతర్జాలంలో తొలి సమగ్ర తెలుగు వీక్లీ